(ఛాందోగ్యోపనిషత్)
(ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము, పంచమవేదము వేదముల సారము తెలియచేయు ఇతిహాస పురాణములు అధ్యయనము చేయుచున్నాను).
(వాజననేయ బ్రాహ్మణోపనిషత్తు)
(ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము ఇతిహాసపురాణములు ఆ మహాభూతముయొక్క (పరబ్రహ్మయొక్క నిశ్శ్వాసమే) వేదములవలె ఇతిహా - -
(ఇతిహాసములు, పురాణములు పంచమవేదమని చెప్పబడుచున్నవి.
(వేదములవలె ఇతిహాసపురాణములు కూడ బ్రహ్మయొక్క నాలుగుముఖములనుండి కలిగినవి. అందుచేత అవియును వేదమని చెప్పబడుచున్నవి).
వ. వేదవ్యాసుడు - - ఏకంబైనవేదంబు ఋగ్యజుస్సామాధర్వణంబులను నాలుగునామంబుల విభాగించి,ఇతిహాస పురాణంబులన్నియు పంచమ వేదంబని పల్కె (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 4 - 45)
“వేదాః ప్రతిష్టితా సర్వే పురాణాష్వేవ సర్వదా” (నారదీయము)
(వేదములన్నియు పురాణములందే ప్రతిష్టింపబడియున్నవి)
“వేదవన్నిశ్చలం మన్యే పురాణార్థం ద్విజోత్తమాః |
వేదాః ప్రతిష్టితా సర్వే పురాణే నాత్ర సంశయః ||“. (స్కాంద పురాణము)
(పురాణములలో చెప్పిన అర్థము వేదములో వలె నిశ్చలమైనది - సర్వకాలములందును వర్తించునది. వేదములన్నియు పురాణములలో ప్రతిష్టితమై యున్నవి. ఇందు గుఱుంచి సంశయము లేదు. అందుచేతనేపురాణములు పంచమవేదమని చెప్పబడుచున్నవి - వేదముల సారమే మహాభారతము).
(chāṃdōgyōpaniṣat)
(ṛgvēdamu, yajurvēdamu, sāmavēdamu, adharvaṇavēdamu, paṃcamavēdamu vēdamula sāramu teliyacēyu itihāsa purāṇamulu adhyayanamu cēyucunnānu).
(vājananēya brāhmaṇōpaniṣattu)
(ṛgvēdamu, yajurvēdamu, sāmavēdamu, adharvaṇavēdamu itihāsapurāṇamulu ā mahābhūtamuyokka (parabrahmayokka niśśvāsamē) vēdamulavale itihā - -
(itihāsamulu, purāṇamulu paṃcamavēdamani ceppabaḍucunnavi.
(vēdamulavale itihāsapurāṇamulu kūḍa brahmayokka nālugumukhamulanuṃḍi kaliginavi. aṃducēta aviyunu vēdamani ceppabaḍucunnavi).
va. vēdavyāsuḍu - - ēkaṃbainavēdaṃbu ṛgyajussāmādharvaṇaṃbulanu nālugunāmaṃbula vibhāgiṃci,itihāsa purāṇaṃbulanniyu paṃcama vēdaṃbani palke (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 4 - 45)
“vēdāḥ pratiṣṭitā sarvē purāṇāṣvēva sarvadā” (nāradīyamu)
(vēdamulanniyu purāṇamulaṃdē pratiṣṭiṃpabaḍiyunnavi)
“vēdavanniścalaṃ manyē purāṇārthaṃ dvijōttamāḥ |
vēdāḥ pratiṣṭitā sarvē purāṇē nātra saṃśayaḥ ||“. (skāṃda purāṇamu)
(purāṇamulalō ceppina arthamu vēdamulō vale niścalamainadi - sarvakālamulaṃdunu vartiṃcunadi. vēdamulanniyu purāṇamulalō pratiṣṭitamai yunnavi. iṃdu guṟuṃci saṃśayamu lēdu. aṃducētanēpurāṇamulu paṃcamavēdamani ceppabaḍucunnavi - vēdamula sāramē mahābhāratamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.