← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పంచప్రాణములు paṃcaprāṇamulu

Original — తెలుగు
  1. ప్రాణో (అ)పానస్స మానశ్చోదాన వ్యానౌ చ వాయువః -

(ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము, అని వాయువులు అయిదు విధములు).

  1. ప్రాణాపానవ్యానోదాన సమనా భవత్య సౌ ప్రాణః |

స్వయమేవ వృత్తి భేదాత్ వికృతి భేదాత్ సువర్ణసలిలాది వత్ ||” (శ్రీశంకరః - వేదాంత చూడామణి)

(ప్రాణమనునదే శరీరములో చేయువృత్తి భేదమువలనను (పని భేదమువలనను), దానిలో మార్పుకలుగుటవలనను, ప్రాణమని, అపానమని, వ్యానమని, ఉదానమని, సమానమని అయిదు ప్రాణములుగాచెప్పబడుచున్నవి - బంగారము ఒకటే అనేక ఆభరణములుగా అగునట్లున్నూ, నీరు ఒకటే, బుడగవలె, కెరటమువలె, నురగవలె మార్పు చెందునట్లు ప్రాణము ఒకటే అయినను అయిదువిధములుగా మార్పు చెందుచున్నది).

  1. “ప్రాణ అద్యో హృది స్థానే అపానవస్తువు నర్గుదే |

సమానోనాభి దేశేతు ఉదానః కంఠమాశ్రితః |

వ్యాన సర్వేషు చాంగేషు వ్యాప్యతిష్టతి సర్వదా ||” (అమృతనాదోపనిహ్సత్)

(ప్రాణము హృదయమునందును, అపానము గుదమందును, సమానము నాభియందును, ఉదానముకంఠమునందు నుండును, వ్యానము శరీరములోని అన్ని అవయవములందును వ్యాపించియుండును).

  1. అపంచీ కృత సమష్టిరజో గుణాంసాత్ పంచ వృత్తి ప్రాణః సంభూతః. సప్రాణః క్రియా భేదాత్స్థాన భేదాచ్ఛ పంచవిధః. యస్య హృదయం స్థానం, క్షుత్పిపాసే క్రియాః న ప్రాణః యస్య గుదం స్థానంమూత్రి పురీష యోః అధోనయనం క్రియా, స అపానః. యస్య నాభిః స్థానం, భుక్తిపీతయోః, అన్నపానయోఃపాచన యోగ్య సమీకరణం క్రియా స సమానః, యస్య కంఠః స్థానం, శ్వాసః క్రియా స ఉదానః యస్యసర్వ శరీరం స్థానం అన్న పానాది రసస్య సర్వనాడీషు ప్రవేశనం క్రియా సవ్యానః –

(పంచీకృతముకాని, పంచభూతములయొక్క - అయిదు భూతములు వేఱు వేఱుగా విభజింపబడకముందు, అన్నియు కలిగియున్న వాటియొక్క - రజోగుణమువలన అయిదు వృత్తులు గల ప్రాణముపుట్టినది. ఆ ప్రాణము చేయు క్రియలలోని భేదమువలనను, శరీరములో చేయు పని భేదములవలనను,అయిదు విధములుగ నున్నది. హృదయమందుండి ఆకలిదప్పులు అను క్రియలు చేయునది ప్రాణము.గుదస్థానమందుండి మూత్రమును పురీషమును క్రిందకు పంపుట యను పనిచేయునది అపానము,నాభి (బొడ్డు) స్థానమందుండి తినిన అన్నమును, త్రాగిన నీరు మొదలగు పానీయములను బాగుగాపచనమగునట్లు చేయుపని చేయునది సమానము. కంఠస్థానమునందుండి, ఊపిరి తీయుట, విడుచుటపనిగా గలది ఉదానము. శరీరమంతటను స్థానముగా చేసుకొని, తినిన అన్నమును, త్రాగిన నీరును,(పానీయముయొక్క రసమును) అన్నినాడుల లోనికి ప్రవేశింపచేయుట అను పని గలది వ్యానము).

  1. ముఖ్య ప్రాణస్య వైశేషికం కార్యం యత్కారణం పంచ వృత్తిరయం వ్యపదిశ్యతే శ్రుతిషు - “ప్రాణోఅపానో వ్యాన ఉదాన స్సమానః” ఇతి. వృత్తి భేదశ్చాయం కార్య భేదాపేక్షః. ప్రాణః ప్రాగ్వృత్తి రుచ్చాసాది కర్మ. అపానో వాగ్వత్తి ర్నిశ్వాసాది కర్మ. వ్యానః తయోస్సంధౌ వర్తమానో వీర్యవత్కర్మ హేతుః,ఉదానః ఊర్థ్వవృత్తిః - ఉత్క్రాంత్యాది హేతుః సమానస్సర్వేష్వంగేషు యో అన్న రసాన్నయతీతి. ఏవంఅపానో వ్యాన ఉదాన స్సమానః “ఇతి. వృత్తి భేదశ్చాయం కార్య భేదాపేక్షః. ప్రాణః ప్రాగ్వృత్తి రుచ్చాసాది కర్మ. అపానో వాగ్వత్తి ర్నిశ్వాసాది కర్మ. వ్యానః తయోస్సంధౌ వర్తమానో వీర్యవత్కర్మ హేతుః,ఉదానః ఊర్థ్వవృత్తిః - ఉత్క్రాంత్యాది హేతుః సమానస్సర్వేష్వంగేషు యో అన్న రసాన్నయతీతి. ఏవంపంచ వృత్తిః ప్రాణాః మనోవత్ - యథా మనసః పంచ వృత్తయః ఏవం ప్రాస్యా పీత్యర్థః శ్రోత్రాదినిమిత్తాః శబ్దాది విషయాః మనసః పంచ వృత్తయః ప్రసిద్ధాః” (శ్రీశంకరః - బ్రహ్మసూత్ర భాష్యే)

“యథా మనః అనేక వృత్తఖ్యా సాధారణ వ్యాపారాపేక్షయా అనేకథా వ్యపదిశ్యతే. ఏవం ఉచ్ఛ్వాసనిశ్వాస సర్వ శరీర క్రియో త్కాంతాఖ్యాశ్చత్వారో వ్యాపారాః భక్షితాన్నాది రసానాం సమత్వేనసర్వాంగేషు నయనం పంచమో వ్యాపారః. తానపేక్ష్య పంచ వృత్తి ప్రాణో వ్యపదిశ్యతే. క్రమేణప్రాణాపానవ్యాన ఉదానః సమాన ఇతి. తద సాథారణ వ్యాపారాపేక్షయా జీవోపకరణత్వం మనోవదితి సిద్ధం.”

(ముఖ్యప్రాణముయొక్క విశేషకార్యములు పంచప్రాణములు. కారణమైన ప్రాణము అయిదు వృత్తులు(వ్యాపారములు) గలది అని శ్రుతి చెప్పుచున్నది. ప్రాణము, అపానము, వ్యానము ఉదానము,సమానము. ఈ ప్రాణము చేయు వృత్తిభేదమువలన దీని కార్యభేదములు కలుగు చున్నవి - ప్రాణముచేయు కర్మ ఉచ్ఛ్వాసము మొదలగునవి. అపానముయొక్క కర్మ నిశ్వాసము మొదలగునవి. ఈరెండింటి సంధియందు ఉండు వీర్యమును కలిగించునది వ్యానము. ఉదానము మీదకు పంపించుకర్మ చేయునది. - ప్రాణము శరీరమునుండి వదలివేయుటకు కారణమైనది. శరీరములోని అవయవములన్నింటిని అన్నరసమును వ్యాపింప చేయునది. పై ప్రకారము మనస్సునకు అయిదు వృత్తులుగలది. మనస్సునకు అయిదు వృత్తులు ఎట్లున్నవో ప్రాణమునకు కూడ అయిదు వృత్తులు ఉన్నవి.శ్రోతము మొదలగు ఇంద్రియములు శబ్దము మొదలగు విషయముల యడల ప్రవ్తించుట మనస్సు యొక్కఅయిదు వృత్తులు అగుటచేతనే. మనసు ఒకటే వృత్తి గలది. అనేక వృత్తులు గలిగియున్నట్లు ప్రాణముకూడా ఉచ్ఛ్వాస నిశ్వాసములు శరీరమంతట వ్యాపించుట, ఉత్క్రాంతి మొదలగు నాలుగు వ్యాపారములున్నూ - తినిన అన్నము మొదలగువాటి రసమును శరీరమంతటకు పంచిపెట్టుట అనునదిఅయిదవ వ్యాపారము గలది. వీటిని బట్టియే అయిదు వృత్తులు గలవని, ప్రాణము, అపానము, వ్యానము,ఉదానము, సమానము అని అయిదు విధములుగ చెప్పబడుచున్నది).

  1. గ్రామేష్వది కృతాన్ సమ్రాట్ విన్నియుంక్తే యథా పృథక్ |

ప్రాణో వృత్తీః స్వకీయాస్తః వినియుంక్తేతథా తథా ||“.

(చక్రవర్తి పరిపాలించుటకు గ్రామములోనుండు అధికారులకు పనులను ఎట్లు నియమించునో, అట్లేముఖ్యప్రాణము వేరు వేరు వృత్తులను చేయుటకు ప్రాణములకు పంచిపెట్టును).

Transliteration
  1. prāṇō (a)pānassa mānaścōdāna vyānau ca vāyuvaḥ -

(prāṇamu, apānamu, samānamu, udānamu, vyānamu, ani vāyuvulu ayidu vidhamulu).

  1. prāṇāpānavyānōdāna samanā bhavatya sau prāṇaḥ |

svayamēva vṛtti bhēdāt vikṛti bhēdāt suvarṇasalilādi vat ||” (śrīśaṃkaraḥ - vēdāṃta cūḍāmaṇi)

(prāṇamanunadē śarīramulō cēyuvṛtti bhēdamuvalananu (pani bhēdamuvalananu), dānilō mārpukaluguṭavalananu, prāṇamani, apānamani, vyānamani, udānamani, samānamani ayidu prāṇamulugāceppabaḍucunnavi - baṃgāramu okaṭē anēka ābharaṇamulugā agunaṭlunnū, nīru okaṭē, buḍagavale, keraṭamuvale, nuragavale mārpu ceṃdunaṭlu prāṇamu okaṭē ayinanu ayiduvidhamulugā mārpu ceṃducunnadi).

  1. “prāṇa adyō hṛdi sthānē apānavastuvu nargudē |

samānōnābhi dēśētu udānaḥ kaṃṭhamāśritaḥ |

vyāna sarvēṣu cāṃgēṣu vyāpyatiṣṭati sarvadā ||” (amṛtanādōpanihsat)

(prāṇamu hṛdayamunaṃdunu, apānamu gudamaṃdunu, samānamu nābhiyaṃdunu, udānamukaṃṭhamunaṃdu nuṃḍunu, vyānamu śarīramulōni anni avayavamulaṃdunu vyāpiṃciyuṃḍunu).

  1. apaṃcī kṛta samaṣṭirajō guṇāṃsāt paṃca vṛtti prāṇaḥ saṃbhūtaḥ. saprāṇaḥ kriyā bhēdātsthāna bhēdāccha paṃcavidhaḥ. yasya hṛdayaṃ sthānaṃ, kṣutpipāsē kriyāḥ na prāṇaḥ yasya gudaṃ sthānaṃmūtri purīṣa yōḥ adhōnayanaṃ kriyā, sa apānaḥ. yasya nābhiḥ sthānaṃ, bhuktipītayōḥ, annapānayōḥpācana yōgya samīkaraṇaṃ kriyā sa samānaḥ, yasya kaṃṭhaḥ sthānaṃ, śvāsaḥ kriyā sa udānaḥ yasyasarva śarīraṃ sthānaṃ anna pānādi rasasya sarvanāḍīṣu pravēśanaṃ kriyā savyānaḥ –

(paṃcīkṛtamukāni, paṃcabhūtamulayokka - ayidu bhūtamulu vēṟu vēṟugā vibhajiṃpabaḍakamuṃdu, anniyu kaligiyunna vāṭiyokka - rajōguṇamuvalana ayidu vṛttulu gala prāṇamupuṭṭinadi. ā prāṇamu cēyu kriyalalōni bhēdamuvalananu, śarīramulō cēyu pani bhēdamulavalananu,ayidu vidhamuluga nunnadi. hṛdayamaṃduṃḍi ākalidappulu anu kriyalu cēyunadi prāṇamu.gudasthānamaṃduṃḍi mūtramunu purīṣamunu kriṃdaku paṃpuṭa yanu panicēyunadi apānamu,nābhi (boḍḍu) sthānamaṃduṃḍi tinina annamunu, trāgina nīru modalagu pānīyamulanu bāgugāpacanamagunaṭlu cēyupani cēyunadi samānamu. kaṃṭhasthānamunaṃduṃḍi, ūpiri tīyuṭa, viḍucuṭapanigā galadi udānamu. śarīramaṃtaṭanu sthānamugā cēsukoni, tinina annamunu, trāgina nīrunu,(pānīyamuyokka rasamunu) annināḍula lōniki pravēśiṃpacēyuṭa anu pani galadi vyānamu).

  1. mukhya prāṇasya vaiśēṣikaṃ kāryaṃ yatkāraṇaṃ paṃca vṛttirayaṃ vyapadiśyatē śrutiṣu - “prāṇōapānō vyāna udāna ssamānaḥ” iti. vṛtti bhēdaścāyaṃ kārya bhēdāpēkṣaḥ. prāṇaḥ prāgvṛtti ruccāsādi karma. apānō vāgvatti rniśvāsādi karma. vyānaḥ tayōssaṃdhau vartamānō vīryavatkarma hētuḥ,udānaḥ ūrthvavṛttiḥ - utkrāṃtyādi hētuḥ samānassarvēṣvaṃgēṣu yō anna rasānnayatīti. ēvaṃapānō vyāna udāna ssamānaḥ “iti. vṛtti bhēdaścāyaṃ kārya bhēdāpēkṣaḥ. prāṇaḥ prāgvṛtti ruccāsādi karma. apānō vāgvatti rniśvāsādi karma. vyānaḥ tayōssaṃdhau vartamānō vīryavatkarma hētuḥ,udānaḥ ūrthvavṛttiḥ - utkrāṃtyādi hētuḥ samānassarvēṣvaṃgēṣu yō anna rasānnayatīti. ēvaṃpaṃca vṛttiḥ prāṇāḥ manōvat - yathā manasaḥ paṃca vṛttayaḥ ēvaṃ prāsyā pītyarthaḥ śrōtrādinimittāḥ śabdādi viṣayāḥ manasaḥ paṃca vṛttayaḥ prasiddhāḥ” (śrīśaṃkaraḥ - brahmasūtra bhāṣyē)

“yathā manaḥ anēka vṛttakhyā sādhāraṇa vyāpārāpēkṣayā anēkathā vyapadiśyatē. ēvaṃ ucchvāsaniśvāsa sarva śarīra kriyō tkāṃtākhyāścatvārō vyāpārāḥ bhakṣitānnādi rasānāṃ samatvēnasarvāṃgēṣu nayanaṃ paṃcamō vyāpāraḥ. tānapēkṣya paṃca vṛtti prāṇō vyapadiśyatē. kramēṇaprāṇāpānavyāna udānaḥ samāna iti. tada sāthāraṇa vyāpārāpēkṣayā jīvōpakaraṇatvaṃ manōvaditi siddhaṃ.”

(mukhyaprāṇamuyokka viśēṣakāryamulu paṃcaprāṇamulu. kāraṇamaina prāṇamu ayidu vṛttulu(vyāpāramulu) galadi ani śruti ceppucunnadi. prāṇamu, apānamu, vyānamu udānamu,samānamu. ī prāṇamu cēyu vṛttibhēdamuvalana dīni kāryabhēdamulu kalugu cunnavi - prāṇamucēyu karma ucchvāsamu modalagunavi. apānamuyokka karma niśvāsamu modalagunavi. īreṃḍiṃṭi saṃdhiyaṃdu uṃḍu vīryamunu kaligiṃcunadi vyānamu. udānamu mīdaku paṃpiṃcukarma cēyunadi. - prāṇamu śarīramunuṃḍi vadalivēyuṭaku kāraṇamainadi. śarīramulōni avayavamulanniṃṭini annarasamunu vyāpiṃpa cēyunadi. pai prakāramu manassunaku ayidu vṛttulugaladi. manassunaku ayidu vṛttulu eṭlunnavō prāṇamunaku kūḍa ayidu vṛttulu unnavi.śrōtamu modalagu iṃdriyamulu śabdamu modalagu viṣayamula yaḍala pravtiṃcuṭa manassu yokkaayidu vṛttulu aguṭacētanē. manasu okaṭē vṛtti galadi. anēka vṛttulu galigiyunnaṭlu prāṇamukūḍā ucchvāsa niśvāsamulu śarīramaṃtaṭa vyāpiṃcuṭa, utkrāṃti modalagu nālugu vyāpāramulunnū - tinina annamu modalaguvāṭi rasamunu śarīramaṃtaṭaku paṃcipeṭṭuṭa anunadiayidava vyāpāramu galadi. vīṭini baṭṭiyē ayidu vṛttulu galavani, prāṇamu, apānamu, vyānamu,udānamu, samānamu ani ayidu vidhamuluga ceppabaḍucunnadi).

  1. grāmēṣvadi kṛtān samrāṭ vinniyuṃktē yathā pṛthak |

prāṇō vṛttīḥ svakīyāstaḥ viniyuṃktētathā tathā ||“.

(cakravarti paripāliṃcuṭaku grāmamulōnuṃḍu adhikārulaku panulanu eṭlu niyamiṃcunō, aṭlēmukhyaprāṇamu vēru vēru vṛttulanu cēyuṭaku prāṇamulaku paṃcipeṭṭunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.