సర, వ్యూహ, విభవ, అర్చ, అంతర్యామి తత్వములు. - ” భగవత్తత్త్వము (పరబ్రహ్మ తత్వము) ఈ అయిదు రూపములుగా నుండునని ఆగమములలో చెప్పబడినది. సత్యజ్ఞానానందము మొదలగు పదములచేత చెప్పబడిన సృష్టికారణమైన భగవంతుడు (పరబ్రహ్మ, నారాయణుడు) పైన చెప్పబడిన అయిదింటిలోను మొదటిదైన పరతత్వము. ఈ పరతత్వమే నాలుగువ్యూహములుగా మారినది - వాసుదేవ వ్యూహము, సంకర్షణ వ్యూహము, ప్రద్యుమ్న వ్యూహముఅనిరుద్ధ వ్యూహము వాసుదేవ వ్యూహము పరతత్వమే. అందుచేత అది పరవాసుదేవుడని చెప్పబడుచున్నది. ఈ వాసుదేవతత్వము భగవచ్చబ్దములో ఇమిడియున్న జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తితేజస్సులను శక్తులు గలది. ఈ పరవాసుదేవతత్వములోనుండి అవతారములు కలుగుచున్నవి. ఇవియే విభవమను మూడవతత్వము. పరబ్రహ్మను లేక పరవాసుదేవుని అర్చన చేయుటకు వీలుగానుండుటకు ఏ రూపముగనైనను, ఏ ద్రవ్యముతోనైనను (మట్టి, కర్ర, లోహము, కాగితము పైనవ్రాసిన బొమ్మను) పరతత్వమని ధ్యానించుటకు వీలుగా నుండునది. అర్చా వ్యూహము. పరబ్రహ్మఅన్నింటిలోను ఉండువాడు కనుక ఈ విధమగు అర్చన చెప్పబడినది. ఇంతకంటె తనలోనే అంతర్యామిగానుండు పరమాత్మ తత్వము అంతర్యామి తత్వము - భగవంతుని ఎవరు ఏ విధముగ ధ్యానముచేసిన ఆ ప్రకారముగనే ఆయా తత్వరూపుడుగానే అనుగ్రహించును –
” యే యథామాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం ||” (శ్రీమద్భగవద్గీత - - - )
sara, vyūha, vibhava, arca, aṃtaryāmi tatvamulu. - ” bhagavattattvamu (parabrahma tatvamu) ī ayidu rūpamulugā nuṃḍunani āgamamulalō ceppabaḍinadi. satyajñānānaṃdamu modalagu padamulacēta ceppabaḍina sṛṣṭikāraṇamaina bhagavaṃtuḍu (parabrahma, nārāyaṇuḍu) paina ceppabaḍina ayidiṃṭilōnu modaṭidaina paratatvamu. ī paratatvamē nāluguvyūhamulugā mārinadi - vāsudēva vyūhamu, saṃkarṣaṇa vyūhamu, pradyumna vyūhamuaniruddha vyūhamu vāsudēva vyūhamu paratatvamē. aṃducēta adi paravāsudēvuḍani ceppabaḍucunnadi. ī vāsudēvatatvamu bhagavaccabdamulō imiḍiyunna jñāna, bala, aiśvarya, vīrya, śaktitējassulanu śaktulu galadi. ī paravāsudēvatatvamulōnuṃḍi avatāramulu kalugucunnavi. iviyē vibhavamanu mūḍavatatvamu. parabrahmanu lēka paravāsudēvuni arcana cēyuṭaku vīlugānuṃḍuṭaku ē rūpamuganainanu, ē dravyamutōnainanu (maṭṭi, karra, lōhamu, kāgitamu painavrāsina bommanu) paratatvamani dhyāniṃcuṭaku vīlugā nuṃḍunadi. arcā vyūhamu. parabrahmaanniṃṭilōnu uṃḍuvāḍu kanuka ī vidhamagu arcana ceppabaḍinadi. iṃtakaṃṭe tanalōnē aṃtaryāmigānuṃḍu paramātma tatvamu aṃtaryāmi tatvamu - bhagavaṃtuni evaru ē vidhamuga dhyānamucēsina ā prakāramuganē āyā tatvarūpuḍugānē anugrahiṃcunu –
” yē yathāmāṃ prapadyaṃtē tāṃstadaiva bhajāmyahaṃ ||” (śrīmadbhagavadgīta - - - )
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.