← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పంచాత్మకం paṃcātmakaṃ

Original — తెలుగు
  1. పంచమహాభూత ప్రథానం, యద్వా, అవిద్యాస్మిత రాగద్వేషాభి నివేశాః పంచ, తదాత్మకం.

(పంచమహాభూతములుగలది - తానే అయినది ప్రథానము - ప్రకృతిః, లేక,అవిద్య, అస్మిత, రాగము,ద్వేషము, అభినివేశము అను అయిదు కలది - ఈ అయిదు తానే అయినవాడు).

  1. “సవా ఏష పురుషః పంచథా పంచాత్మా, యేన సర్వమిదం ప్రోతం పృధివీ చాం తరిక్షం చ,ద్యౌశ్చ, దిశశ్చాంతర్దిశశ్చ :

(నారాయణోపనిషత్)

(పృధివీ, అంతరిక్షము, ద్యౌః (ఆకాశము), దిక్కులు, అంతర్దిక్కులు - ఈ అయిదు విధములుగాపురుషుడు తానే అయినాడు. ఇతను ఈ ప్రపంచమునంతను పూర్తిగా వ్యాపించియున్నాడు).

  1. “భూతాత్మా చేంద్రియాత్మా చ ప్రథానాత్మా తథా భావాన్ |

ఆత్మాచ పరమాత్మాచ త్వమేకఃపంచథా స్థితః ||“. (ఇతి విష్ణుపురాణాత్)

(పంచభూతస్వరూపడవును, ఇంద్రియముల స్వరూపుడవును, ఇంద్రియములలోనుండి వాటి చేతవాటి పనులను చేయించువాడును, ప్రథానస్వరూపుడును, ఆత్మవును, పరమాత్మవును నీవే.ఇట్లు నీవొక్కడివే పంచవిధములుగ నున్నావు).

  1. “అన్నమయో భూతాత్మా, ప్రాణమయ ఇంద్రియాత్మా, మనోమయః సంకల్పాత్మా, విజ్ఞానమయః కాలాత్మా,ఆనందమయః లయాత్మా,” ఇతి సుబాలోపనిషత్.

(అన్నమయుడగు భూతాత్మగాను, ప్రాణమయుడగు ఇంద్రియాత్మగాను, మనోమయుడగు సంకల్పాత్మగాను, విజ్ఞానమయుడగు కాలత్మగాను, ఆనందమయుడగు లయాత్మగాను - ఇట్లు అయిదు విధములఆత్మగానున్నవాడు - పరమాత్మ).

  1. పరవ్యూహ, విభవాంతర్యామ్యర్భావతార లక్షణ భగచ్ఛాస్త్రోక్త ప్రకారేణ విభక్తః, పంచానాంప్రకృతి కాల త్రివిధ జీవనాం ఆత్మా ఇత్యర్థః

(శ్రీరంగరామానుజః)

(పరతత్వముగను, పరవాసుదేవుడగను, షష్టైశ్వర్యములుగల భగవంతుని విభవముగాను,ప్రతిదేహములోను అంతరాత్మగాను, అర్చన చేయుటకు ప్రతిమా రూపముగను - ఈ అయిదు రూపములుగున ఆత్మగను ఉన్నవాడు).

Transliteration
  1. paṃcamahābhūta prathānaṃ, yadvā, avidyāsmita rāgadvēṣābhi nivēśāḥ paṃca, tadātmakaṃ.

(paṃcamahābhūtamulugaladi - tānē ayinadi prathānamu - prakṛtiḥ, lēka,avidya, asmita, rāgamu,dvēṣamu, abhinivēśamu anu ayidu kaladi - ī ayidu tānē ayinavāḍu).

  1. “savā ēṣa puruṣaḥ paṃcathā paṃcātmā, yēna sarvamidaṃ prōtaṃ pṛdhivī cāṃ tarikṣaṃ ca,dyauśca, diśaścāṃtardiśaśca :

(nārāyaṇōpaniṣat)

(pṛdhivī, aṃtarikṣamu, dyauḥ (ākāśamu), dikkulu, aṃtardikkulu - ī ayidu vidhamulugāpuruṣuḍu tānē ayināḍu. itanu ī prapaṃcamunaṃtanu pūrtigā vyāpiṃciyunnāḍu).

  1. “bhūtātmā cēṃdriyātmā ca prathānātmā tathā bhāvān |

ātmāca paramātmāca tvamēkaḥpaṃcathā sthitaḥ ||“. (iti viṣṇupurāṇāt)

(paṃcabhūtasvarūpaḍavunu, iṃdriyamula svarūpuḍavunu, iṃdriyamulalōnuṃḍi vāṭi cētavāṭi panulanu cēyiṃcuvāḍunu, prathānasvarūpuḍunu, ātmavunu, paramātmavunu nīvē.iṭlu nīvokkaḍivē paṃcavidhamuluga nunnāvu).

  1. “annamayō bhūtātmā, prāṇamaya iṃdriyātmā, manōmayaḥ saṃkalpātmā, vijñānamayaḥ kālātmā,ānaṃdamayaḥ layātmā,” iti subālōpaniṣat.

(annamayuḍagu bhūtātmagānu, prāṇamayuḍagu iṃdriyātmagānu, manōmayuḍagu saṃkalpātmagānu, vijñānamayuḍagu kālatmagānu, ānaṃdamayuḍagu layātmagānu - iṭlu ayidu vidhamulaātmagānunnavāḍu - paramātma).

  1. paravyūha, vibhavāṃtaryāmyarbhāvatāra lakṣaṇa bhagacchāstrōkta prakārēṇa vibhaktaḥ, paṃcānāṃprakṛti kāla trividha jīvanāṃ ātmā ityarthaḥ

(śrīraṃgarāmānujaḥ)

(paratatvamuganu, paravāsudēvuḍaganu, ṣaṣṭaiśvaryamulugala bhagavaṃtuni vibhavamugānu,pratidēhamulōnu aṃtarātmagānu, arcana cēyuṭaku pratimā rūpamuganu - ī ayidu rūpamuluguna ātmaganu unnavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.