← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పండితుడు paṃḍituḍu

Original — తెలుగు
  1. “యేషాం జ్ఞానేన నాశితం ఆత్మనః అజ్ఞానం తే పండితాః” (శ్రీశంకరః)

(తమయొక్క అజ్ఞానమును జ్ఞానముచేత నశింప చేసుకొనినవారు). పండితులు -

  1. “ఆత్మజ్ఞాః పండా ఆత్మ విషయా బుద్ధిః యేషాంతే హి పండితాః” (శ్రీశంకరః)

(పండా అనగా ఆత్మవిషయమైన బుద్ధి - ఆత్మకు సంబంధించిన బుద్ధి - అది కలవారు - పండితులు)

  1. “పండా, పరమశివజ్ఞానమస్తి యస్య స పండితః” ఇతి స్మృతేః-

(పరమశివును గుఱించి జ్ఞానము కలవాడు - పండితుడు).

  1. ఆత్మజ్ఞాః - “పాండిత్యం నిర్విద్యం” ఇతి శ్రుతేః - శాస్త్రజ్ఞాః; వివేకినః; నిపుణాః-

(పాండిత్యమనగా నిర్విద్యం అని శ్రుతి చెప్పుచున్నది. అందుచేత ఆత్మజ్ఞానముగలవారు - పరమవైరాగ్యము పొందినవారు - శాస్త్రము తెలిసినవారు - వివేకవంతులు, నిపుణులు).

  1. శాస్త్రతః తన్మహాత్మ్యాభిజ్ఞాః

(శాస్త్రముద్వారా భగవంతునియొక్క మహత్మ్యమును పూర్తిగా తెలిసినవారు).

  1. “ఆత్మ యాదాత్మ్య విదః” (శ్రీరామానుజః)

(ఆత్మ యొక్క యదార్థమును - ఉన్నది ఉన్నట్టుగా - తెలిసినవారు).

  1. పండిత శబ్దస్తు పరోక్ష జ్ఞాన వచనః - “పాండిత్యం ఆగమజ్ఞానం” ఇతి వచనాత్.

(పాండిత్యమనగా ఆగమమువలన కలుగు జ్ఞానము - అందుచేత పండితుడనగా పరోక్షజ్ఞానముకలవాడు)

  1. “బ్రాహ్మణే పుల్కసే స్తే నే బ్రహ్మాణ్యే (అ)ర్కే స్ఫులింగే |

అక్రూరకే క్రూరకే చైవ సమదౄక్పండితోమతః ||“. (శ్రీమద్భాగవతం - 11 - - )

(బ్రాహ్మణుని, బ్రాహ్మణునివలె నటించువాడిని, చండాలుని, దొంగని, సూర్యుని, అగ్నిని, క్రూరుని,మంచివానిని సమముగా చూచువాడు పండితుడు). (అందఱిలోను భగవంతుడున్నాడు కనుకఅందఱిని సమముగా చూచువాడు పండితుడు - బ్రహ్మజ్ఞానము కలవాడు కనుక).

  1. “మాతృ వత్పరదారేషు పరద్రవ్యేషు ల్ ఓష్టవత్ |

ఆత్మవత్సర్వ భూతేషు యః పశ్యతిస పండితః ||“.

(ఇతరుల భార్యలను తనను కన్న తల్లిగను, ఇతరుల ద్రవ్యములను - (ధనధాన్యములను) మట్టిబెడ్డవలెను, సమస్త భూతములను (జీవులను) ఆత్మగను - తనవలెను - చూచువాడు).

  1. “యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః |

జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాం తమహుః సంజితంబుధాః ||” (శ్రీమద్భగవద్గీత - 6 - 4 - 19)

(కర్మఫలము నాశించక ఎవడు తన పనులన్నియు చేయునో, జ్ఞానము కలవాడగుటచేత (బ్రహ్మజ్ఞానముకలవాడగుటచేత) కర్మములన్నింటిని జ్ఞానమను అగ్నిలో భస్మము చేసుకొనెనో, అట్టి వానిని పండితుడని బుధులు చెప్పుదురు).

  1. “యే పండితాః గురోః శ్రుత్వా వేదాంత విషయం పరం |

బ్రహ్మైక్యం యుక్తి భిర్మత్వా నిధి ధ్యాస్యనిరంతరం |

సాక్షాత్కృతాత్మ తత్వాస్తే నష్టా విద్యా మలాః బుధాః ||” (గీతాభావప్రకాశము - 2 - 94, 95)

(పనిషత్తులలో చెప్పబడిన పరబ్రహ్మ గుఱించి గురువు ద్వార విని, యుక్తిచేత బ్రహ్మ ఒక్కటే అనిఎల్లపుడు బ్రహ్మ నిష్టయందుండి, అవిద్యా మలమును నశింపచేసుకొని, ఆత్మ తత్వమును సాక్షాంత్కరించుకొనిన బుధులు జ్ఞానులు, పండితులు అని చెప్పబడుదురు).

  1. “అశోచ్యా నన్వ శోచస్త్వం ప్రజ్ఞం వాదాం శ్చ భాషసే |

గతాసూ నగతాసూం శ్చ నాను శోచంతిపండితాః” (శ్రీమద్భగవద్గీత - 2 - 11)

“యథా స్వప్నే మృతో బంధుః జీవన్వా శో చ్యతాం గతః |

వ తన్నిమిత్తకో మోహో జాగరే(అ)ప్యనువర్తతే |

ఏవమజ్ఞాన జభ్రాంత్యా కల్పితా బంధవో మృతాః |

జీవం తో వా నతే బోధే శోకమోహప్రదాః సతాం |

దేహాదేర్నిశ్వరాత్మ త్వాన్నిత్య త్వా త్ప్రత్యగాత్మనః |

నశోచ్యాః ప్రాణినః సర్వేస్వాత్మ తత్వవిదాం సతాం |

ఏవం త్వం పండితో భూత్వా మాకార్షీః శోక మాంధ్య జం |

స్వాత్మ తత్వే సదా స్థైర్యం ప్రాప్నుహీత్యాశియో హరేః ||” (గీతాభావప్రకాశము - 2 - 98 to 101)

(కలలో ఒక బంధువు చనిపోయినను, జీవించియున్నను, అతని గురించి దుఃఖము పొందియున్నప్పటికీ తెలివి వచ్చినతర్వాత (మేలుకొన్న తర్వాత) అతని గుఱించి (చనిపోయెనని గాని,దుఃఖము పొందెననిగాని) మోహము పొందరు. ఆ ప్రకారముగానే అజ్ఞానముచేత కల్పించబడినబంధువులు చనిపోయినను, జీవించియున్నను వారి గుఱించి సత్పురుషులు - పండితులు - శోకమోహములను పొందరు. దేహముమొదలగునవి నశించునవి యగుటవలన, ప్రత్యగాత్మ (జీవుడు) నిత్యుడు అగుటవలననూ, సమస్తమైన ప్రాణులగుఱించి ఆత్మతత్వమును తెలిసిన సత్పురుషులు- పండితులు - శోకింపరు - ఈ ప్రకారం నీవుకూడా వారివలె పండితుడవయి అజ్ఞానాంధకారమువలన గలిగెడి శోకము పొందకుము - ఆత్మ తత్వమందే ఎల్లపుడూ స్థిరముగా నుండుము).

  1. “గావః పశ్యంతి గంధేన, వేదైః పశ్యంతి పండితాః |”.

(గోవులు వాసన బట్టి వస్తువును చూచును - పండితులు వేదములవలన - వేదములద్వారాకలిగిన జ్ఞానము వలన - చూచెదరు - తెలుసుకొనెదరు).

Transliteration
  1. “yēṣāṃ jñānēna nāśitaṃ ātmanaḥ ajñānaṃ tē paṃḍitāḥ” (śrīśaṃkaraḥ)

(tamayokka ajñānamunu jñānamucēta naśiṃpa cēsukoninavāru). paṃḍitulu -

  1. “ātmajñāḥ paṃḍā ātma viṣayā buddhiḥ yēṣāṃtē hi paṃḍitāḥ” (śrīśaṃkaraḥ)

(paṃḍā anagā ātmaviṣayamaina buddhi - ātmaku saṃbaṃdhiṃcina buddhi - adi kalavāru - paṃḍitulu)

  1. “paṃḍā, paramaśivajñānamasti yasya sa paṃḍitaḥ” iti smṛtēḥ-

(paramaśivunu guṟiṃci jñānamu kalavāḍu - paṃḍituḍu).

  1. ātmajñāḥ - “pāṃḍityaṃ nirvidyaṃ” iti śrutēḥ - śāstrajñāḥ; vivēkinaḥ; nipuṇāḥ-

(pāṃḍityamanagā nirvidyaṃ ani śruti ceppucunnadi. aṃducēta ātmajñānamugalavāru - paramavairāgyamu poṃdinavāru - śāstramu telisinavāru - vivēkavaṃtulu, nipuṇulu).

  1. śāstrataḥ tanmahātmyābhijñāḥ

(śāstramudvārā bhagavaṃtuniyokka mahatmyamunu pūrtigā telisinavāru).

  1. “ātma yādātmya vidaḥ” (śrīrāmānujaḥ)

(ātma yokka yadārthamunu - unnadi unnaṭṭugā - telisinavāru).

  1. paṃḍita śabdastu parōkṣa jñāna vacanaḥ - “pāṃḍityaṃ āgamajñānaṃ” iti vacanāt.

(pāṃḍityamanagā āgamamuvalana kalugu jñānamu - aṃducēta paṃḍituḍanagā parōkṣajñānamukalavāḍu)

  1. “brāhmaṇē pulkasē stē nē brahmāṇyē (a)rkē sphuliṃgē |

akrūrakē krūrakē caiva samadṝkpaṃḍitōmataḥ ||“. (śrīmadbhāgavataṃ - 11 - - )

(brāhmaṇuni, brāhmaṇunivale naṭiṃcuvāḍini, caṃḍāluni, doṃgani, sūryuni, agnini, krūruni,maṃcivānini samamugā cūcuvāḍu paṃḍituḍu). (aṃdaṟilōnu bhagavaṃtuḍunnāḍu kanukaaṃdaṟini samamugā cūcuvāḍu paṃḍituḍu - brahmajñānamu kalavāḍu kanuka).

  1. “mātṛ vatparadārēṣu paradravyēṣu l ōṣṭavat |

ātmavatsarva bhūtēṣu yaḥ paśyatisa paṃḍitaḥ ||“.

(itarula bhāryalanu tananu kanna talliganu, itarula dravyamulanu - (dhanadhānyamulanu) maṭṭibeḍḍavalenu, samasta bhūtamulanu (jīvulanu) ātmaganu - tanavalenu - cūcuvāḍu).

  1. “yasya sarvē samāraṃbhāḥ kāma saṃkalpa varjitāḥ |

jñānāgni dagdha karmāṇāṃ tamahuḥ saṃjitaṃbudhāḥ ||” (śrīmadbhagavadgīta - 6 - 4 - 19)

(karmaphalamu nāśiṃcaka evaḍu tana panulanniyu cēyunō, jñānamu kalavāḍaguṭacēta (brahmajñānamukalavāḍaguṭacēta) karmamulanniṃṭini jñānamanu agnilō bhasmamu cēsukonenō, aṭṭi vānini paṃḍituḍani budhulu ceppuduru).

  1. “yē paṃḍitāḥ gurōḥ śrutvā vēdāṃta viṣayaṃ paraṃ |

brahmaikyaṃ yukti bhirmatvā nidhi dhyāsyaniraṃtaraṃ |

sākṣātkṛtātma tatvāstē naṣṭā vidyā malāḥ budhāḥ ||” (gītābhāvaprakāśamu - 2 - 94, 95)

(paniṣattulalō ceppabaḍina parabrahma guṟiṃci guruvu dvāra vini, yukticēta brahma okkaṭē aniellapuḍu brahma niṣṭayaṃduṃḍi, avidyā malamunu naśiṃpacēsukoni, ātma tatvamunu sākṣāṃtkariṃcukonina budhulu jñānulu, paṃḍitulu ani ceppabaḍuduru).

  1. “aśōcyā nanva śōcastvaṃ prajñaṃ vādāṃ śca bhāṣasē |

gatāsū nagatāsūṃ śca nānu śōcaṃtipaṃḍitāḥ” (śrīmadbhagavadgīta - 2 - 11)

“yathā svapnē mṛtō baṃdhuḥ jīvanvā śō cyatāṃ gataḥ |

va tannimittakō mōhō jāgarē(a)pyanuvartatē |

ēvamajñāna jabhrāṃtyā kalpitā baṃdhavō mṛtāḥ |

jīvaṃ tō vā natē bōdhē śōkamōhapradāḥ satāṃ |

dēhādērniśvarātma tvānnitya tvā tpratyagātmanaḥ |

naśōcyāḥ prāṇinaḥ sarvēsvātma tatvavidāṃ satāṃ |

ēvaṃ tvaṃ paṃḍitō bhūtvā mākārṣīḥ śōka māṃdhya jaṃ |

svātma tatvē sadā sthairyaṃ prāpnuhītyāśiyō harēḥ ||” (gītābhāvaprakāśamu - 2 - 98 to 101)

(kalalō oka baṃdhuvu canipōyinanu, jīviṃciyunnanu, atani guriṃci duḥkhamu poṃdiyunnappaṭikī telivi vaccinatarvāta (mēlukonna tarvāta) atani guṟiṃci (canipōyenani gāni,duḥkhamu poṃdenanigāni) mōhamu poṃdaru. ā prakāramugānē ajñānamucēta kalpiṃcabaḍinabaṃdhuvulu canipōyinanu, jīviṃciyunnanu vāri guṟiṃci satpuruṣulu - paṃḍitulu - śōkamōhamulanu poṃdaru. dēhamumodalagunavi naśiṃcunavi yaguṭavalana, pratyagātma (jīvuḍu) nityuḍu aguṭavalananū, samastamaina prāṇulaguṟiṃci ātmatatvamunu telisina satpuruṣulu- paṃḍitulu - śōkiṃparu - ī prakāraṃ nīvukūḍā vārivale paṃḍituḍavayi ajñānāṃdhakāramuvalana galigeḍi śōkamu poṃdakumu - ātma tatvamaṃdē ellapuḍū sthiramugā nuṃḍumu).

  1. “gāvaḥ paśyaṃti gaṃdhēna, vēdaiḥ paśyaṃti paṃḍitāḥ |”.

(gōvulu vāsana baṭṭi vastuvunu cūcunu - paṃḍitulu vēdamulavalana - vēdamuladvārākaligina jñānamu valana - cūcedaru - telusukonedaru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.