దుష్కృతం (చెడ్డపని).
దుఃఖరూపం సంసారం; అనర్థరూపం; అనిష్టం; విషయాను భవరూపం పాపం; అజ్ఞానం, అవిద్య.
(దుఃఖరూపమైన సంసారము, అనర్థరూపము, ఇష్టముకానిది, విషయానుభవమే రూపముగాకలది; అజ్ఞానము, అవిద్య).
(బుద్ధికి - జ్ఞానమునకు, బ్రహ్మజ్ఞానమునకు ప్రతిబంధకమైనది - బ్రహ్మజ్ఞానము కలుగకుండచేయునది).
(పాపులను సంహరించుటలో పాపములేదు - పాపులను సంహరించిన పాపము కలుగదు). (శ్రీరాముడు రావణుని చంపుట పాపముకాదు)
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి ||“. (శ్రీమద్భగవద్గీత - 2 - 38)
(సుఖదుఃఖములను, లాభాలాభములను జయాపజయములను సమముగా చూచుచు - ఏది వచ్చినను లక్ష్యము చేయక - యుద్ధముచేయుటకు సన్నద్ధుడవగుము - నీవు చేయవలసిన ధర్మమును చేయుము - ఇట్లు చేసినందువలన నీకు పాపము కలుగదు).
బాపంగా నోపునట్టి పద్మాక్షునిపై
పాపము గలదని నుడివిన
పాపాత్ముని పాపమునకు బారముగలదే?“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. - 77)
(లోకములో రాజులు, మంత్రులు మొదలగువారి వినోదము కొఱకు వంశములో పరంపరగా వచ్చుచున్న దుర్ఘటమైన వ్యాపారమందు కుశలమైన మనస్సుగలవాడు. చాలాలోతు అయిన గొయ్యిమీద ఒక కత్తిని పెట్టి దానిలో వాడిగానున్న భాగముమీద నడవ వలసి యున్నపుడు ఇట్లు ఆలోచించును. “ఈ యగాధమైన గొయ్యిమీద ఉంచిన కత్తిలో వాడిగానున్న భాగముమీద గట్టిగా అడుగు వేసితినేని పాదము తెగిపోవును, తేలికగా అడుగువేసితినేని కాలుజారి గొయ్యిలో పడిపోవుదును.” అని విచారించును. ఈ ప్రకారముగానే పాపము చేయ బోవు పురుషుడు ఆలోచించవలెను - “నేను చేసిన పాపము ప్రకటించినయడల ఈ లోకమునన్ను నిందించును. అందుచేత చేసినపాపము ప్రకటించను, అట్లు చేసినయడల నరకము ప్రాప్తించును”. ఇట్లాలోచించి ఉభయ లోకములలోను భ్రష్టుడగుటకు కారణము మగుదునని పాపము చేయుటనుండి విరమించును).
duṣkṛtaṃ (ceḍḍapani).
duḥkharūpaṃ saṃsāraṃ; anartharūpaṃ; aniṣṭaṃ; viṣayānu bhavarūpaṃ pāpaṃ; ajñānaṃ, avidya.
(duḥkharūpamaina saṃsāramu, anartharūpamu, iṣṭamukānidi, viṣayānubhavamē rūpamugākaladi; ajñānamu, avidya).
(buddhiki - jñānamunaku, brahmajñānamunaku pratibaṃdhakamainadi - brahmajñānamu kalugakuṃḍacēyunadi).
(pāpulanu saṃhariṃcuṭalō pāpamulēdu - pāpulanu saṃhariṃcina pāpamu kalugadu). (śrīrāmuḍu rāvaṇuni caṃpuṭa pāpamukādu)
tatō yuddhāya yujyasva naivaṃ pāpamavāpsyasi ||“. (śrīmadbhagavadgīta - 2 - 38)
(sukhaduḥkhamulanu, lābhālābhamulanu jayāpajayamulanu samamugā cūcucu - ēdi vaccinanu lakṣyamu cēyaka - yuddhamucēyuṭaku sannaddhuḍavagumu - nīvu cēyavalasina dharmamunu cēyumu - iṭlu cēsinaṃduvalana nīku pāpamu kalugadu).
bāpaṃgā nōpunaṭṭi padmākṣunipai
pāpamu galadani nuḍivina
pāpātmuni pāpamunaku bāramugaladē?“. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. - 77)
(lōkamulō rājulu, maṃtrulu modalaguvāri vinōdamu koṟaku vaṃśamulō paraṃparagā vaccucunna durghaṭamaina vyāpāramaṃdu kuśalamaina manassugalavāḍu. cālālōtu ayina goyyimīda oka kattini peṭṭi dānilō vāḍigānunna bhāgamumīda naḍava valasi yunnapuḍu iṭlu ālōciṃcunu. “ī yagādhamaina goyyimīda uṃcina kattilō vāḍigānunna bhāgamumīda gaṭṭigā aḍugu vēsitinēni pādamu tegipōvunu, tēlikagā aḍuguvēsitinēni kālujāri goyyilō paḍipōvudunu.” ani vicāriṃcunu. ī prakāramugānē pāpamu cēya bōvu puruṣuḍu ālōciṃcavalenu - “nēnu cēsina pāpamu prakaṭiṃcinayaḍala ī lōkamunannu niṃdiṃcunu. aṃducēta cēsinapāpamu prakaṭiṃcanu, aṭlu cēsinayaḍala narakamu prāptiṃcunu”. iṭlālōciṃci ubhaya lōkamulalōnu bhraṣṭuḍaguṭaku kāraṇamu magudunani pāpamu cēyuṭanuṃḍi viramiṃcunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.