← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరా parā

Original — తెలుగు
  1. “ప్రకృష్టా; ప్రకృతి, విశుద్ధా, ఆత్మభూతా, జీవభూతా” (శ్రీశంకరః)

(సర్వోత్కృష్టమైన పరాప్రకృతి; శుద్ధమైనది - కల్మషము లేని ప్రకృతి, జగత్తుకు ఆత్మ అయినది ; జీవరూపమైనది - చైతన్య శక్తి).

  1. క్షేత్రజ్ఞ లక్షణా; ప్రాణధారణ నిమిత్త భూతా,

(క్షేత్రము అనగా దేహము - అపరాప్రకృతి - దానిని తెలిసినవాడు, తెలిసి ఉపయోగించుకొనువాడు - భగవంతుడు, జీవుడు, ప్రాణమును ధరించు జీవరూపము - చైతన్య శక్తి).

  1. అపరాత్ విలక్షణా, తస్యాః భోక్తృత్వేన ప్రథాన భూతా, చేతన రూపా, యయా ఇదం అచేతనం కృత్స్నంజగత్ ధార్యతే - అంతః ప్రవిష్ట్వా.

(అపరాప్రకృతి కంటె వేరు లక్షణములు గలది; అపరాప్రకృతికి భోక్త యగుటవలన ప్రథానమైనది, చైతన్యమే రూపముగా గలది - చైతన్యమే అయినది - అచేతనమైన యీ జగత్తు అంతటిలోను ప్రవేశించి దానిని చైతన్య శక్తితో - చిచ్ఛక్తితో ధరించునది).

  1. “అపరేయం ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధిమే పరాం |

జీవభూతాం మహాబాహా య యేదం ధార్యతే జగత్ ||“. (శ్రీమద్భగవద్గీత - 7 - 5)

“ఇతోన్యాం ప్రకృతిం శుద్ధాం ప్రకృష్టాం చేతనాత్మకాం |

మమాత్మభూతా జానీహి పరాం క్షేత్రజ్ఞ ల్క్షణాం |

యయా క్షేత్రజ్ఞ రూపిణ్యా సర్వస్యాంతః ప్రవిష్టయా |

జగజ్జడమిదం సర్వం ధార్యతే విశారా తరం ||. (గీతాభావప్రకాశము - 7 - 35, 36)

(సంసార సంబంధము కలిగించునవియు, అందుచేతనే మలిన రూపము అయిన అపరాశక్తి కంటె - అపరాప్రకృతి కంటె వేరైనది, శుద్ధమైనది, ఉత్కృష్టమైనది, చైతన్యరూపమైనది , క్షేత్రరూపమైనది, నా ఆత్మరూపమైనది - ఆ శక్తి రూపములో నేనే అయినది అయిన నా పరాశక్తి అన్నింటిలోపల ప్రవేశించి ఈ సమస్త జగత్తును జగత్తులో ఉన్న అన్ని వస్తువులను ధరించునది).

Transliteration
  1. “prakṛṣṭā; prakṛti, viśuddhā, ātmabhūtā, jīvabhūtā” (śrīśaṃkaraḥ)

(sarvōtkṛṣṭamaina parāprakṛti; śuddhamainadi - kalmaṣamu lēni prakṛti, jagattuku ātma ayinadi ; jīvarūpamainadi - caitanya śakti).

  1. kṣētrajña lakṣaṇā; prāṇadhāraṇa nimitta bhūtā,

(kṣētramu anagā dēhamu - aparāprakṛti - dānini telisinavāḍu, telisi upayōgiṃcukonuvāḍu - bhagavaṃtuḍu, jīvuḍu, prāṇamunu dhariṃcu jīvarūpamu - caitanya śakti).

  1. aparāt vilakṣaṇā, tasyāḥ bhōktṛtvēna prathāna bhūtā, cētana rūpā, yayā idaṃ acētanaṃ kṛtsnaṃjagat dhāryatē - aṃtaḥ praviṣṭvā.

(aparāprakṛti kaṃṭe vēru lakṣaṇamulu galadi; aparāprakṛtiki bhōkta yaguṭavalana prathānamainadi, caitanyamē rūpamugā galadi - caitanyamē ayinadi - acētanamaina yī jagattu aṃtaṭilōnu pravēśiṃci dānini caitanya śaktitō - cicchaktitō dhariṃcunadi).

  1. “aparēyaṃ itastvanyāṃ prakṛtiṃ viddhimē parāṃ |

jīvabhūtāṃ mahābāhā ya yēdaṃ dhāryatē jagat ||“. (śrīmadbhagavadgīta - 7 - 5)

“itōnyāṃ prakṛtiṃ śuddhāṃ prakṛṣṭāṃ cētanātmakāṃ |

mamātmabhūtā jānīhi parāṃ kṣētrajña lkṣaṇāṃ |

yayā kṣētrajña rūpiṇyā sarvasyāṃtaḥ praviṣṭayā |

jagajjaḍamidaṃ sarvaṃ dhāryatē viśārā taraṃ ||. (gītābhāvaprakāśamu - 7 - 35, 36)

(saṃsāra saṃbaṃdhamu kaligiṃcunaviyu, aṃducētanē malina rūpamu ayina aparāśakti kaṃṭe - aparāprakṛti kaṃṭe vērainadi, śuddhamainadi, utkṛṣṭamainadi, caitanyarūpamainadi , kṣētrarūpamainadi, nā ātmarūpamainadi - ā śakti rūpamulō nēnē ayinadi ayina nā parāśakti anniṃṭilōpala pravēśiṃci ī samasta jagattunu jagattulō unna anni vastuvulanu dhariṃcunadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.