← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరం బ్రహ్మ paraṃ brahma

Original — తెలుగు
  1. “యస్మాచ్చ బృహతి బ్రుంహయతి చ సర్వం తస్మాదుచ్యతే పరం బ్రహ్మేతి” (శాండిల్యోపనిషత్)

(ఎవనివలన ఈ ప్రపంచమంతా పుట్టుచున్నదో, మరియు, లయమగుచున్నదో అదియే పరంబ్రహ్మ - పరం = ఉత్కృష్టమైనది;

బృంహణము = పెరుగుట - అంతము లేకుండ పెరుగునది - అదే ప్రపంచముగా మారుచున్నది. అందుచేత పరం బ్రహ్మ).

  1. స్వాతిరిక్తం గ్రసిత్వా స్వయమేవ సర్వోత్కర్షేణ వర్తతే ఇతి పరం. తద్రూపేణోప బృంహణాత్ పరం బ్రహ్మ.

(తనను తప్పించి మిగిలినవాటినన్నింటినీ గ్రసించి - మ్రింగివేసి - (తనలో లయము చేసుకొని, తను ఒక్కడే అన్నింటికంటె ఉత్కర్షముగా మిగిలియుండి, తిరిగి ఇదివరకువలె వృద్ధిబొందుట. (ప్రపంచముగా వృద్ధి పొందుట బట్టి ‘పరం బ్రహ్మ’ అని చెప్పబడుచున్నాడు).

  1. “స్వాజ్ఞ వికల్పితాత్ సర్వస్మాత్ పరం విలక్షణం యత్ సమ్యక్ బృంహయతి విజృంభతే తత్ పరం బ్రహ్మ”.

(తన ఆజ్ఞానుసారము తాను సృష్టించిన సమస్తమైన వాటికంటె ఉత్కృష్టమై, వాటికంటె విలక్షణమై - వేరై - ఉండుటవలన ’ పరం ’ అనిన్నీ, ఆ రీతిగానుండి బృంహణము పొందుటవలన - వృద్ధి పొందడమగుటవలన, సృష్టి చేయుటవలన - బ్రహ్మ అనిన్నీ - ఈ రెండు కారణములవలననూ ’ పర బ్రహ్మ ’ అని చెప్పబడుచున్నాడు).

  1. బృంహణము అనగా వృద్ధి పొందుట - “బృహత్వాత్ బృంహణత్వాద్వా బ్రహ్” - (తాను వృద్ధి పొందును, తానున్న వస్తువును వృద్ధిపొందింపచేయును. కనుక బ్రహ్మయని చెప్పబడెను - వృద్ధి పొందుట రెండు విధములు - ఒకటి రెండుగా అగుట; ఆ రెండులో నొక్కొక్కటి రెండగుట. ఈ ప్రకారము అనంతముగా వృద్ధి పొందుట. ఒక చెట్టు దాని కాయలలోని విత్తనములద్వారా అనేకమయిన చెట్లు అయినట్టు - రెండవ విధము ఎట్లనగా - ఒక చిన్నమొక్క ఒక మాహావృక్షముగా పెరుగుట. ఈ రెండు విధములుగానే ఈ ప్రపంచమంతా మొదటినుండి ఇప్పటివరకు - ఒక వస్తువులో నుండియే - పరబ్రహ్మలోనుండియే - ఇంత పెద్దదిగాను, ఇన్ని వస్తువులుగాను పెరిగినది. ఈ ప్రకారము పెరుగుటకు కారణము ప్రతివస్తువులోను భగవంతుడు సూక్ష్మాతి సూక్ష్మరూపముతోనుండి, దానిని వృద్ధిపొందింప చేయుటయే. ఈ రెండు విధముల వృద్ధి పొందించు శక్తిగలవాడగుట చేతనే - బృంహణము అను శక్తి గలవాడగుతచేతనే భగవంతునికి బ్రహ్మ అని పేరు వచ్చినది).

  2. అపరం బ్రహ్మేభ్యో హిరణ్యగర్భాదిభ్యః పరం సత్యజ్ఞానానంతానందాది రూపం. నిష్కలం, సర్వ దృశ్య వినిర్ముక్తం సర్వ ప్రత్యగ్రూపం బ్రహ్మ.

(అపర బ్రహ్మయని చెప్పబడు హిరణ్యగర్భుడు మొదలగు వారికంటె పరమైనది అయిన సత్యజ్ఞానానంతానందరూపమై, నిష్కలంకము - (ఏ విధమైన దోషము లేనిది), ప్రత్యగాత్మరూపము అయినది పరబ్రహ్మ, హిరణ్యగర్భుడు అను చతుర్ముఖుడు సృష్టి చేయును కనుక బ్రహ్మయని చెప్పబడుచున్నాడు అతని కంటె ఉత్కృష్టమైనవాడు కనుక ‘పరం బ్రహ్మ’ అని పరమాత్మ చెప్పబడుచున్నాడు).

Transliteration
  1. “yasmācca bṛhati bruṃhayati ca sarvaṃ tasmāducyatē paraṃ brahmēti” (śāṃḍilyōpaniṣat)

(evanivalana ī prapaṃcamaṃtā puṭṭucunnadō, mariyu, layamagucunnadō adiyē paraṃbrahma - paraṃ = utkṛṣṭamainadi;

bṛṃhaṇamu = peruguṭa - aṃtamu lēkuṃḍa perugunadi - adē prapaṃcamugā mārucunnadi. aṃducēta paraṃ brahma).

  1. svātiriktaṃ grasitvā svayamēva sarvōtkarṣēṇa vartatē iti paraṃ. tadrūpēṇōpa bṛṃhaṇāt paraṃ brahma.

(tananu tappiṃci migilinavāṭinanniṃṭinī grasiṃci - mriṃgivēsi - (tanalō layamu cēsukoni, tanu okkaḍē anniṃṭikaṃṭe utkarṣamugā migiliyuṃḍi, tirigi idivarakuvale vṛddhiboṃduṭa. (prapaṃcamugā vṛddhi poṃduṭa baṭṭi ‘paraṃ brahma’ ani ceppabaḍucunnāḍu).

  1. “svājña vikalpitāt sarvasmāt paraṃ vilakṣaṇaṃ yat samyak bṛṃhayati vijṛṃbhatē tat paraṃ brahma”.

(tana ājñānusāramu tānu sṛṣṭiṃcina samastamaina vāṭikaṃṭe utkṛṣṭamai, vāṭikaṃṭe vilakṣaṇamai - vērai - uṃḍuṭavalana ’ paraṃ ’ aninnī, ā rītigānuṃḍi bṛṃhaṇamu poṃduṭavalana - vṛddhi poṃdaḍamaguṭavalana, sṛṣṭi cēyuṭavalana - brahma aninnī - ī reṃḍu kāraṇamulavalananū ’ para brahma ’ ani ceppabaḍucunnāḍu).

  1. bṛṃhaṇamu anagā vṛddhi poṃduṭa - “bṛhatvāt bṛṃhaṇatvādvā brah” - (tānu vṛddhi poṃdunu, tānunna vastuvunu vṛddhipoṃdiṃpacēyunu. kanuka brahmayani ceppabaḍenu - vṛddhi poṃduṭa reṃḍu vidhamulu - okaṭi reṃḍugā aguṭa; ā reṃḍulō nokkokkaṭi reṃḍaguṭa. ī prakāramu anaṃtamugā vṛddhi poṃduṭa. oka ceṭṭu dāni kāyalalōni vittanamuladvārā anēkamayina ceṭlu ayinaṭṭu - reṃḍava vidhamu eṭlanagā - oka cinnamokka oka māhāvṛkṣamugā peruguṭa. ī reṃḍu vidhamulugānē ī prapaṃcamaṃtā modaṭinuṃḍi ippaṭivaraku - oka vastuvulō nuṃḍiyē - parabrahmalōnuṃḍiyē - iṃta peddadigānu, inni vastuvulugānu periginadi. ī prakāramu peruguṭaku kāraṇamu prativastuvulōnu bhagavaṃtuḍu sūkṣmāti sūkṣmarūpamutōnuṃḍi, dānini vṛddhipoṃdiṃpa cēyuṭayē. ī reṃḍu vidhamula vṛddhi poṃdiṃcu śaktigalavāḍaguṭa cētanē - bṛṃhaṇamu anu śakti galavāḍagutacētanē bhagavaṃtuniki brahma ani pēru vaccinadi).

  2. aparaṃ brahmēbhyō hiraṇyagarbhādibhyaḥ paraṃ satyajñānānaṃtānaṃdādi rūpaṃ. niṣkalaṃ, sarva dṛśya vinirmuktaṃ sarva pratyagrūpaṃ brahma.

(apara brahmayani ceppabaḍu hiraṇyagarbhuḍu modalagu vārikaṃṭe paramainadi ayina satyajñānānaṃtānaṃdarūpamai, niṣkalaṃkamu - (ē vidhamaina dōṣamu lēnidi), pratyagātmarūpamu ayinadi parabrahma, hiraṇyagarbhuḍu anu caturmukhuḍu sṛṣṭi cēyunu kanuka brahmayani ceppabaḍucunnāḍu atani kaṃṭe utkṛṣṭamainavāḍu kanuka ‘paraṃ brahma’ ani paramātma ceppabaḍucunnāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.