సర్వోత్కృష్టమైన స్థానము.
“పరస్తస్మాత్తు భావో(అన్యో(అ)వ్యక్తో(అ)వ్యక్తాత్సనాతనః
యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి|
అవ్యక్తో(అ)క్షర ఇత్యుక్తస్తమాహుః పరమాంగతిం |
యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ |
పురుషః స పరః పార్థ భక్త్యాలభ్యస్త్వనన్యయా |
యస్యాంతస్థాని భూతాని యేన సర్వమిదం తతం |
వేదేషు యజ్ఞేషు తపస్సుచైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం |
అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం ||“. (శ్రీమద్భగవద్గీత - 8 - 20 to 22, 28)
(సూక్ష్మమగుట వలన అవ్యక్తము - కంటికి కనబడనిది - అని చెప్పబడు ప్రకృతి, లేక, చతుర్ముఖబ్రహ్మకంటె అవ్యక్తుడు, మిక్కిలి సూక్ష్ముడు, ఉత్కృష్టుడు, సనాతనుడు, సర్వభూతములు నశించినను తాను నశించనివాడు, అక్షరుడని చెప్పబడుచున్నాడు - అతనే పరమగతి, అత్యుత్తమమైనగతి - అతనిని పొందినవారు మరల జన్మము పొందరు - అదియే నా పరమ ధామము అని చెప్పబడుచున్నది. ఆ పరమ పురుషుడు - పరంధాముడు - అనన్యభక్తి చేతనే లభ్యమగును. అతనిలోపల భూతములున్నవి. అతను ఈ సర్వ ప్రపంచమును పూర్తిగా లోపల బైట వ్యాపించియున్నాడు - వేదములలో, యజ్ఞములలో, తపస్సులో - ఏ పుణ్య ఫలము చెప్పబడినదో - వేదాధ్యయనము చేయుటవలనను, యజ్ఞములు, తపస్సు చేయుటవలనను ఏ పుణ్యఫలము లభించునని చెప్పబడియున్నదో - దానికంటె మించిన ఫలము అగు ‘పరం స్థానము’ (పరంధామము, పరం పదం) - సృష్టికి మొదలు అయిన స్థానము - ఈ పైన చెప్పిన దానిని తెలుసుకొనిన యోగి పొందగలడు) (చూడుము - పరం పదం - పరం ధామం).
sarvōtkṛṣṭamaina sthānamu.
“parastasmāttu bhāvō(anyō(a)vyaktō(a)vyaktātsanātanaḥ
yaḥ sa sarvēṣu bhūtēṣu naśyatsu na vinaśyati|
avyaktō(a)kṣara ityuktastamāhuḥ paramāṃgatiṃ |
yaṃ prāpya na nivartaṃtē taddhāma paramaṃ mama |
puruṣaḥ sa paraḥ pārtha bhaktyālabhyastvananyayā |
yasyāṃtasthāni bhūtāni yēna sarvamidaṃ tataṃ |
vēdēṣu yajñēṣu tapassucaiva dānēṣu yatpuṇyaphalaṃ pradiṣṭaṃ |
atyēti tatsarvamidaṃ viditvā yōgī paraṃ sthānamupaiti cādyaṃ ||“. (śrīmadbhagavadgīta - 8 - 20 to 22, 28)
(sūkṣmamaguṭa valana avyaktamu - kaṃṭiki kanabaḍanidi - ani ceppabaḍu prakṛti, lēka, caturmukhabrahmakaṃṭe avyaktuḍu, mikkili sūkṣmuḍu, utkṛṣṭuḍu, sanātanuḍu, sarvabhūtamulu naśiṃcinanu tānu naśiṃcanivāḍu, akṣaruḍani ceppabaḍucunnāḍu - atanē paramagati, atyuttamamainagati - atanini poṃdinavāru marala janmamu poṃdaru - adiyē nā parama dhāmamu ani ceppabaḍucunnadi. ā parama puruṣuḍu - paraṃdhāmuḍu - ananyabhakti cētanē labhyamagunu. atanilōpala bhūtamulunnavi. atanu ī sarva prapaṃcamunu pūrtigā lōpala baiṭa vyāpiṃciyunnāḍu - vēdamulalō, yajñamulalō, tapassulō - ē puṇya phalamu ceppabaḍinadō - vēdādhyayanamu cēyuṭavalananu, yajñamulu, tapassu cēyuṭavalananu ē puṇyaphalamu labhiṃcunani ceppabaḍiyunnadō - dānikaṃṭe miṃcina phalamu agu ‘paraṃ sthānamu’ (paraṃdhāmamu, paraṃ padaṃ) - sṛṣṭiki modalu ayina sthānamu - ī paina ceppina dānini telusukonina yōgi poṃdagalaḍu) (cūḍumu - paraṃ padaṃ - paraṃ dhāmaṃ).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.