(అన్నింటికన్న ఉత్కృష్టమైనది - అన్నింటికన్న గొప్పది; శ్రేష్టమైనది).
(అన్నింటికన్న ఉత్తమమైనది; అన్నింటికంటె శ్రేష్టమైనది; మిక్కిలి ఉత్తమమైనది; అత్యుత్తమము).
(చతుర్ముఖ బ్రహ్మ, రుద్రుడు మొదలగువారందఱికన్న ఉత్కృష్టమైనది).
(ప్రకృతి కంటె ఉత్కృష్టమైనది; ప్రకృతికి సంబంధిచినదికాదు).
(మాయ మొదలగువాటికన్న ఉత్కృష్టమైనది, మాయతో కలియనిది; మాయా సంపర్కము లేనిది. అందుచేత శుద్ధమైనది, నిష్కల్మషమైనది. ‘తత్’ పదముచే చెప్పబడు బ్రహ్మ).
(సమస్త భూతములకన్న ఉత్కృష్టమైనది - పరబ్రహ్మ).
(దేహములు మొదలగువాటికన్న, అన్నమయకోశము మొదలగువాటికన్న ఉత్కృష్టమైనది, వాటికన్న వేరైనది).
(పరమాత్మ తత్వము - పరబ్రహ్మము)
పరమార్థతత్వం - మోక్షం -.
(పరమార్థ తత్వము - మోక్షము).
( పరబ్రహ్మయగు నారాయణుని స్థానము, పరమపదమని చెప్పబడునది, వైకుంఠము, పరమగతి - “తద్విష్ణోః పరమం పదం సదాపశ్యంతి సూరయః”.
(పరబ్రహ్మయగు విష్ణుని యొక్క సర్వోత్కృష్టమైన పదమును - స్థానమును ఎల్లపుడు సూరిజనులు (బ్రహ్మజ్ఞానులు) చూచుచున్నారు -
(ప్రకృతికన్న, జీవుడుకన్న వేరైన లక్షణములు గలవాడు).
(ఇంతకంటె ఉత్కృష్టమైన పరమానంద రూపములేని మోక్షము).
(ఓం, తత్ సత్ అను మూడున్నూ భగవంతుని వాచకములు - భగవంతుని నిర్దేశించునవి. అట్టి ‘తత్’ అను చెప్పబడు పరబ్రహ్మరూపం).
పరం అనగా పరబ్రహ్మ యని, అతని స్థానమైన పరమపదమని అర్థమగుచున్నది - ఎట్లనగా -
(సర్వజ్ఞుడు, పరుడు అయిన పరమేశ్వరునకు నమస్కారము).
అయత్నసిద్ధా పరమా ముక్తిస్తేషాం న సంశయః |
నిర్వికల్పం పరం నామ తత్వం సాక్షాచ్ఛివః పరం ||“. (స్కాందే)
(నిర్వికల్పమైన పరతత్వమందు ఎవరికి శ్రద్ధ కలుగునో వారికి ప్రయత్నము చేయుకుండగనే పరమముక్తి (అత్యుత్తమమైన మోక్షరూపమైన సుఖము) సిద్ధించును - ఇందుకు సందేహము లేదు. నిర్వికల్పమైన పరతత్వము సాక్షాత్పరమ శివుడే).
(పరమాత్మ తత్వమనగా పరబ్రహ్మయే).
(సత్ అనగా ఆత్మ, అసత్ అనగా ఆత్మకానిది. ఈ రెండింటికన్న ఉత్కృష్టమైన పరబ్రహ్మము నీవే).
స బ్రహ్మపారః పరపార భూతః పరః పరాణామపి పారపారః ||“.
విష్ణువు అన్నింటికన్న ఉత్కృష్టమైనవాడు - అతనికంటె ఉత్కృష్టమైన వస్తువు లేదు - అన్నియు అతను చేసినవే కనుక అతనే ఈ సృష్టికి సంసారమునకు అవధి. అతనిలోనే యీ సృష్టిలోని వస్తువులన్నియు లీనమై పోవును. (సృష్టికి విష్ణువు పారము - అవతలి ఒడ్డు. అంతులేని ఈ సృష్టికిని, కాలమునకును ఇతనే అవధి - ఉత్కృష్టమైన వాటికన్న ఉత్కృష్టమైనవాడు. అతనే పరమార్థమైన మోక్షము. వేదములో చెప్పబడిన పరతత్వము అతనే - పరాప్రకృతి, అపరాప్రకృతి తానే అయినవాడు. భగవంతుని యొక్కపరాశక్తి (చిచ్ఛక్తి లేక చైతన్యశక్తి), అపరాశక్తి (ప్రకృతి) ఈ రెండును తానే అయినవాడు) –
“ఇతీయం మేభిన్నా ప్రకృతిరష్టథా |
అపరేయం ఇతస్త్వన్యాం ప్రకృతిః విద్ధమే పరాం ||“. (శ్రీమద్భగవద్గీత - 7 - 65)
(ఉత్కృష్టములు, శ్రేష్టములు అయిన వస్తువులకన్న శ్రేష్టమైన అవ్యక్తముకన్న (ప్రకృతికన్న) ఉత్కృష్టమైనది (పరాత్పరం) పరమాత్మ).
(శ్రీకృష్ణుడే పరబ్రహ్మమని, పరమధామమైన వైకుంఠమని, పరపపావనుడని అర్జునుడు స్తోత్రము చేసెను - అతనికన్న ఉత్కృష్టమైన బ్రహ్మకాని, ఉత్కృష్టమైన స్థానముకాని, ఉత్కృష్టమైనదియు, పవిత్రము చేయు వస్తువుగాని మఱిలేదు - అతని అభిప్రాయము).
యత్తద్విద్ధిపరం రూపం జీవస్యేదం తురీయకం ||“.
(ఆద్యంతములు - జననమరణములు లేనటువంటిన్నీ, సత్యమైనటువంటిన్నీ, నిర్వికల్పకమైనటువంటిన్నీ అయినది ఏది కలదో అదియే జీవుని యొక్క పరం రూపము - ఇదియే తురీయము).
అప్రత్యక్షం = (కంటికి కనబడనిది).
“నిర్ముక్త బంధః ఆత్మా” (శ్రీమాన్ రామానుజః )
కారణం ( సృష్టికి కారణమైఅనది - పరమాత్మ - “సర్వకారణరూపం యన్నిత్యం” (గీతాభావప్రకాశము - 7 -
పరుడు, పరబ్రహ్మ - “మత్తః పరతరం కించిన్నాన్య దస్తి ధనంజయ” (శ్రీమద్భగవద్గీత - 7 - 7)
(నా కంటె పరతరమైనది - నా కంటె ఉత్కృష్టమైనద్సి వేరు వస్తువు లేదు);
“మోహితం నాభి జానాతిమామేభ్యః పరమవ్యయం ||” (శ్రీమద్భగవద్గీత - 7 - 13)
వీటికంటె, అవ్యయుడనైన వాడు, పరముడు అయిన నన్ను మోహముచేత తెలియ లేకున్నాడు.
“ధీ శుద్ధ్యా జ్ఞాన సంప్రాప్తి ద్వారేణ పరమం పదం |
పురుషో మోక్షమాప్నోతి స ఏవ పురుషో మతః ||“. (గీతాభావప్రకాశము - 3 - 133 - 136)
(ఫలాసక్తి లేక చిత్త శుద్ధితో ఈశ్వరారాధనము అయిన కర్మచేయుచు ఆత్మజ్ఞానము కలుగుటచేత పరము అని చెప్పబడు మోక్షమును పురుషుడు పొందును - ఆ మోక్షమే పరమ పురుషుడు).
మనసస్తు పరాబుద్దిర్యో బుద్ధేః పరతస్తునః ||“. (శ్రీమద్భగవద్గీత - 3 - 42)
“స్థూలం జడం పరిచ్ఛిన్నం బాహ్యం దేహమపేక్ష్యహి |
ప్రకాశకత్వా త్సూక్ష్మతాత్ వ్యాపకత్వాత్ పరాణిచి |
ఇంద్రియాణీంద్రియే భ్యస్తు ప్రేరకత్వాన్మమః పరః |
మనసస్తు పరాబుద్ధిర్నిశ్చ యైక స్వరూపిణీ |
యస్తు బుద్ధేః పరస్తస్యా భాసకత్వేన చిద్వపుః |
యమవిద్యావృతం కామం స్వాశ్రయైర్మోహ యత్యసౌ |
బుద్ధేర్ద్రష్టా పరః సోయమాత్మా సాక్షీతి విచ్యతాం |
అత్రాయమస్తి నిష్కర్షిః సాక్షితత్వ వివచనే ||“. (గీతాభావప్రకాశము - 3 - 351 తొ 354)
(దేహము జడము. స్థూలరూపము గలది. పరిమితి గలది, బాహ్య వస్తువు (పైకి కనబడునది). డీనికన్న వ్యాపించునవి, సూక్ష్మములు ప్రకాశింప చేయునవి అయిన ఇంద్రియములు పరములు (శ్రేష్టములు) ఉత్కృష్టములైనవి. ఇంద్రియములకన్న ప్రేరేపించునదగుటవలన (వాటిని పనులలో నియమించునదగుట వలన) మనస్సు వాటికన్న పరము (ఉత్కృష్టమైనది). మనస్సు కన్న దానిని నిశ్చయించు నదగుట చేత బుద్ధిపరమైనది. బుద్ధికన్న పరమైనది జీవచైతన్యము. అది బుద్ధికి ద్రష్ట - బుద్ధి చేసిన పనులన్నియు దగ్గరగానుండి చూచునది. అందుచేత బుద్ధి కన్న పరమైనది జీవచైతన్యము - ఈ ప్రకారముగా ఒకదాని కన్న ఒకటి పరము (ఉత్కృష్టమైనది) ఈ సృష్టిలో అన్నింటికన్న పరమైనది - పరాత్పరము లేక పరాత్పరతరము - భగవంతుడే).
(ఈ లోకముకన్న వేఱైనది - స్వర్గము మొదలగునవి).
(శ్రీమద్భగవద్గీత - 4 - 40)
(సూర్యుని జన్మ చిరకాలమునాటిది - నీ జన్మ (అర్జనుని జన్మ) తరువాత కాలమునాటిది).
ప్రకాశవంతము; వ్యాపకము -
చతుర్ముఖ బ్రహ్మకు జీవితకాలము ‘పరము’ అని చెప్పుదురు –
“సీ. - - - శతవర్షంబులు జనులకు బరమాయువైనరీతిని బంకజాననునకు
బరమాయువగు శతాబ్దంబులందుల సగమరిగిన నదియ పరార్థమండ్రు
గాన పూర్వార్థంబు గడచుట జేసి ద్వితీయ పరార్థంబు దీని పేరు
- - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 11 - 359)
(anniṃṭikanna utkṛṣṭamainadi - anniṃṭikanna goppadi; śrēṣṭamainadi).
(anniṃṭikanna uttamamainadi; anniṃṭikaṃṭe śrēṣṭamainadi; mikkili uttamamainadi; atyuttamamu).
(caturmukha brahma, rudruḍu modalaguvāraṃdaṟikanna utkṛṣṭamainadi).
(prakṛti kaṃṭe utkṛṣṭamainadi; prakṛtiki saṃbaṃdhicinadikādu).
(māya modalaguvāṭikanna utkṛṣṭamainadi, māyatō kaliyanidi; māyā saṃparkamu lēnidi. aṃducēta śuddhamainadi, niṣkalmaṣamainadi. ‘tat’ padamucē ceppabaḍu brahma).
(samasta bhūtamulakanna utkṛṣṭamainadi - parabrahma).
(dēhamulu modalaguvāṭikanna, annamayakōśamu modalaguvāṭikanna utkṛṣṭamainadi, vāṭikanna vērainadi).
(paramātma tatvamu - parabrahmamu)
paramārthatatvaṃ - mōkṣaṃ -.
(paramārtha tatvamu - mōkṣamu).
( parabrahmayagu nārāyaṇuni sthānamu, paramapadamani ceppabaḍunadi, vaikuṃṭhamu, paramagati - “tadviṣṇōḥ paramaṃ padaṃ sadāpaśyaṃti sūrayaḥ”.
(parabrahmayagu viṣṇuni yokka sarvōtkṛṣṭamaina padamunu - sthānamunu ellapuḍu sūrijanulu (brahmajñānulu) cūcucunnāru -
(prakṛtikanna, jīvuḍukanna vēraina lakṣaṇamulu galavāḍu).
(iṃtakaṃṭe utkṛṣṭamaina paramānaṃda rūpamulēni mōkṣamu).
(ōṃ, tat sat anu mūḍunnū bhagavaṃtuni vācakamulu - bhagavaṃtuni nirdēśiṃcunavi. aṭṭi ‘tat’ anu ceppabaḍu parabrahmarūpaṃ).
paraṃ anagā parabrahma yani, atani sthānamaina paramapadamani arthamagucunnadi - eṭlanagā -
(sarvajñuḍu, paruḍu ayina paramēśvarunaku namaskāramu).
ayatnasiddhā paramā muktistēṣāṃ na saṃśayaḥ |
nirvikalpaṃ paraṃ nāma tatvaṃ sākṣācchivaḥ paraṃ ||“. (skāṃdē)
(nirvikalpamaina paratatvamaṃdu evariki śraddha kalugunō vāriki prayatnamu cēyukuṃḍaganē paramamukti (atyuttamamaina mōkṣarūpamaina sukhamu) siddhiṃcunu - iṃduku saṃdēhamu lēdu. nirvikalpamaina paratatvamu sākṣātparama śivuḍē).
(paramātma tatvamanagā parabrahmayē).
(sat anagā ātma, asat anagā ātmakānidi. ī reṃḍiṃṭikanna utkṛṣṭamaina parabrahmamu nīvē).
sa brahmapāraḥ parapāra bhūtaḥ paraḥ parāṇāmapi pārapāraḥ ||“.
viṣṇuvu anniṃṭikanna utkṛṣṭamainavāḍu - atanikaṃṭe utkṛṣṭamaina vastuvu lēdu - anniyu atanu cēsinavē kanuka atanē ī sṛṣṭiki saṃsāramunaku avadhi. atanilōnē yī sṛṣṭilōni vastuvulanniyu līnamai pōvunu. (sṛṣṭiki viṣṇuvu pāramu - avatali oḍḍu. aṃtulēni ī sṛṣṭikini, kālamunakunu itanē avadhi - utkṛṣṭamaina vāṭikanna utkṛṣṭamainavāḍu. atanē paramārthamaina mōkṣamu. vēdamulō ceppabaḍina paratatvamu atanē - parāprakṛti, aparāprakṛti tānē ayinavāḍu. bhagavaṃtuni yokkaparāśakti (cicchakti lēka caitanyaśakti), aparāśakti (prakṛti) ī reṃḍunu tānē ayinavāḍu) –
“itīyaṃ mēbhinnā prakṛtiraṣṭathā |
aparēyaṃ itastvanyāṃ prakṛtiḥ viddhamē parāṃ ||“. (śrīmadbhagavadgīta - 7 - 65)
(utkṛṣṭamulu, śrēṣṭamulu ayina vastuvulakanna śrēṣṭamaina avyaktamukanna (prakṛtikanna) utkṛṣṭamainadi (parātparaṃ) paramātma).
(śrīkṛṣṇuḍē parabrahmamani, paramadhāmamaina vaikuṃṭhamani, parapapāvanuḍani arjunuḍu stōtramu cēsenu - atanikanna utkṛṣṭamaina brahmakāni, utkṛṣṭamaina sthānamukāni, utkṛṣṭamainadiyu, pavitramu cēyu vastuvugāni maṟilēdu - atani abhiprāyamu).
yattadviddhiparaṃ rūpaṃ jīvasyēdaṃ turīyakaṃ ||“.
(ādyaṃtamulu - jananamaraṇamulu lēnaṭuvaṃṭinnī, satyamainaṭuvaṃṭinnī, nirvikalpakamainaṭuvaṃṭinnī ayinadi ēdi kaladō adiyē jīvuni yokka paraṃ rūpamu - idiyē turīyamu).
apratyakṣaṃ = (kaṃṭiki kanabaḍanidi).
“nirmukta baṃdhaḥ ātmā” (śrīmān rāmānujaḥ )
kāraṇaṃ ( sṛṣṭiki kāraṇamaianadi - paramātma - “sarvakāraṇarūpaṃ yannityaṃ” (gītābhāvaprakāśamu - 7 -
paruḍu, parabrahma - “mattaḥ parataraṃ kiṃcinnānya dasti dhanaṃjaya” (śrīmadbhagavadgīta - 7 - 7)
(nā kaṃṭe parataramainadi - nā kaṃṭe utkṛṣṭamainadsi vēru vastuvu lēdu);
“mōhitaṃ nābhi jānātimāmēbhyaḥ paramavyayaṃ ||” (śrīmadbhagavadgīta - 7 - 13)
vīṭikaṃṭe, avyayuḍanaina vāḍu, paramuḍu ayina nannu mōhamucēta teliya lēkunnāḍu.
“dhī śuddhyā jñāna saṃprāpti dvārēṇa paramaṃ padaṃ |
puruṣō mōkṣamāpnōti sa ēva puruṣō mataḥ ||“. (gītābhāvaprakāśamu - 3 - 133 - 136)
(phalāsakti lēka citta śuddhitō īśvarārādhanamu ayina karmacēyucu ātmajñānamu kaluguṭacēta paramu ani ceppabaḍu mōkṣamunu puruṣuḍu poṃdunu - ā mōkṣamē parama puruṣuḍu).
manasastu parābuddiryō buddhēḥ paratastunaḥ ||“. (śrīmadbhagavadgīta - 3 - 42)
“sthūlaṃ jaḍaṃ paricchinnaṃ bāhyaṃ dēhamapēkṣyahi |
prakāśakatvā tsūkṣmatāt vyāpakatvāt parāṇici |
iṃdriyāṇīṃdriyē bhyastu prērakatvānmamaḥ paraḥ |
manasastu parābuddhirniśca yaika svarūpiṇī |
yastu buddhēḥ parastasyā bhāsakatvēna cidvapuḥ |
yamavidyāvṛtaṃ kāmaṃ svāśrayairmōha yatyasau |
buddhērdraṣṭā paraḥ sōyamātmā sākṣīti vicyatāṃ |
atrāyamasti niṣkarṣiḥ sākṣitatva vivacanē ||“. (gītābhāvaprakāśamu - 3 - 351 to 354)
(dēhamu jaḍamu. sthūlarūpamu galadi. parimiti galadi, bāhya vastuvu (paiki kanabaḍunadi). ḍīnikanna vyāpiṃcunavi, sūkṣmamulu prakāśiṃpa cēyunavi ayina iṃdriyamulu paramulu (śrēṣṭamulu) utkṛṣṭamulainavi. iṃdriyamulakanna prērēpiṃcunadaguṭavalana (vāṭini panulalō niyamiṃcunadaguṭa valana) manassu vāṭikanna paramu (utkṛṣṭamainadi). manassu kanna dānini niścayiṃcu nadaguṭa cēta buddhiparamainadi. buddhikanna paramainadi jīvacaitanyamu. adi buddhiki draṣṭa - buddhi cēsina panulanniyu daggaragānuṃḍi cūcunadi. aṃducēta buddhi kanna paramainadi jīvacaitanyamu - ī prakāramugā okadāni kanna okaṭi paramu (utkṛṣṭamainadi) ī sṛṣṭilō anniṃṭikanna paramainadi - parātparamu lēka parātparataramu - bhagavaṃtuḍē).
(ī lōkamukanna vēṟainadi - svargamu modalagunavi).
(śrīmadbhagavadgīta - 4 - 40)
(sūryuni janma cirakālamunāṭidi - nī janma (arjanuni janma) taruvāta kālamunāṭidi).
prakāśavaṃtamu; vyāpakamu -
caturmukha brahmaku jīvitakālamu ‘paramu’ ani ceppuduru –
“sī. - - - śatavarṣaṃbulu janulaku baramāyuvainarītini baṃkajānanunaku
baramāyuvagu śatābdaṃbulaṃdula sagamarigina nadiya parārthamaṃḍru
gāna pūrvārthaṃbu gaḍacuṭa jēsi dvitīya parārthaṃbu dīni pēru
- - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 11 - 359)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.