← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరమ హంసః parama haṃsaḥ

Original — తెలుగు
  1. యతీశ్వరుడు.

  2. పరమహంసాశ్రమమును స్వీకరించిన సన్యాసి, ఉత్తమపదమును పొందిన సన్యాసి.

  3. విషయ విరక్తాః; జ్ఞానినః

(విషయములందు - విషయభోగములందు విరక్తి చెందినవారు, జ్ఞానులు - బ్రహ్మజ్ఞానము కలవారు).

  1. ఆత్మానాత్మ వివేకినః .

(ఆత్మ ఏదో అనాత్మ ఏదో విచక్షణగా తెలిసినవారు).

  1. “శిఖా యజ్ఞోపవీత రహితః పంచ గృహేషు కరపాత్ర ఏక కౌపీనధారీ శాటీ మేకాం ఏకం వైణవం దండమేశా టీ ధరోవా, భస్మోద్ధూళపరః సర్వ త్యాగీ”. (సన్యాసోపనిషత్)

(పరమహంస యనగా - శిఖా యజ్ఞోపవీతములు లేనివాడునూ, ఒక కరపాత్ర ఒక కౌపీనము, ఒక దండమును ధరించి, శరీరమును భస్మముతో పూసికొనినవాడునూ, అన్నింటినీ విడిచిపెట్టినవాడు పరమ హంస).

  1. “తత్ర పరమహంసో నామ సంవర్తకారుణి స్వేత కేతు. దుర్వాస, ఋభు, నిదాఘ, జడభరత, దత్తాత్రేయ,రైవతక ప్రభృతయః, అవ్యక్త లింగాః, అవ్యక్తాచారాః, అనున్మత్తా, ఉన్మత్తవదా చరంతః; త్రిదండం, కమండలుం శిక్యం పాత్రం, జలపవిత్రం, శిఖాం యజ్ఞోపవీతాం చేత్యేతత్ సర్వం భూః స్వాహేత్యప్సు పరిత్యజ్య ఆత్మాన మన్విచ్ఛేత్. యదా జాత రూపధరో నిర్ద్వింద్వో నిష్పరిగ్రహః తత్వ బ్రహ్మమార్గే సమ్యక్ సంపన్నః, శుద్ధమానసః ప్రాణ సంధారణార్థం యధోక్త కాలే విముక్తః (లజ్జయా) బైక్షమాచరన్ ఉదరపాత్రేణ లాభాలాభే సమోభూత్వా శూన్యా గారదేవగృహ, తృణకూట వల్మీక వృక్షమూల కులాలశాలాగ్నిహోత్ర నదీ పులిన గిరి కుహర కంధర కోటర నీడ రస్థాందిలేషు, అనికేత వాస్య ప్రయత్నః, నిర్మ మమ శుక్ల ధ్యాన పరాయణో (అ)ధ్యాత్మనిష్టః, శుభా శుభ కర్మ నిర్మూలన పరః, సన్యాసేన దేహ త్యాగం కరోతి స పరమహంసో నామ” ఇతి (జాబాలోపనిషత్)

(పరమహన్స యనగా సంవర్తకారుణి, స్వేతకేతు, దూర్వాసుడు, ఋధుడు, జడభరతుడు, దతాత్రేయుడు, రైవతుడు మొదలగువారు; కనబడని శరీరము గలవారు - కనబడని ఆచారముగలవారు; - కనబడకుండ సంచరించువారు, ఉన్మత్తులు కాని వారైనను ఉన్మత్తులవలె నాచరించువారు, త్రిదండులు; శిఖా యజ్ఞోపవీతములు వదలివేసి, ఆత్మ గుఱించి అన్వేషించువారు; ద్వంద్వములులేక ఎవరేమిచ్చినను పుచ్చుకొనక పరమాత్మ తత్వమైన బ్రహ్మమందు నిష్టకలిగియుండి, చిత్తశుద్ధికలిగి, ప్రాణము నిలుపుకొనుటకు మాత్రము చాలినంత భిక్షచేసి తీసుకొనుచు, లాభాలాభములను సమముగా చూచుచు, శూన్యగృహము, దేవాలయము, గడ్డి పరక, చెట్టు నీడ, పుట్ట, కులాలశాల, అగ్నిహోత్రము, నదులు, చెరువులు, కొండ గుహలు, చెట్టు తొర్రలు మొదలగువాటియందు, ఇల్లు వాకిలి లేనివానివలె తిరుగుచు, మమకారము లేక, - దేనియందును ’ నాది ’ యను భావములేక - ధ్యానము చేయుచు, అధ్యాత్మమందు నిష్తకలిగి యుండి, శుభాశుభ కర్మలను వదలినవాడు).

  1. “క్రమేణ జాగ్రదాద్యవస్థా త్రయం హ త్వా తుర్యపదం గచ్చతీతి హంసః. వ్యష్టితుర్యే (అ)పి ప్రత్యగాత్మా, స ఏవ పరమః, సర్వోత్కృష్టః సమష్ట్య వస్థా త్రయం హత్వా, తత్తుర్యపదం గచ్చతీతి పరమ హంసః”.

(జాగ్రదవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ యను మూడు అవస్థలను క్రమముగా - ఒకదాని తర్వాత నొకటిని - వాటి, తురీయపదమును - తురీయావస్థను - పొందినవాడు పరమహంస, వ్యష్టి తుర్యావస్థలో ప్రత్యగాత్మయే పరమ హంస. సమష్టిలో ఈ మూడు అవస్థలను దాటి తుర్య పదమును పొందినవాడు పరమ హంస).

  1. “హినస్తి కర్మాఖ్యం పుణాపుణ్యరూపం మలమాశ్రితేషు స్వస్మింశ్చ ఇతి హంసః, అపహత పాప్మానః ఇత్యర్థః.

( తనను ఆశ్రయించుకొనిన వారిలో పుణ్యపాపరూపమైన కర్మఫలమును నిర్మూలనమొనరించువాడు - భగవంతుడు).

  1. పాలలోని పాలను, నీరును వేరు చేయు శక్తి గలది హంస ఆ ప్రకారముగానే అసత్తునుండి సత్తును -ప్రపంచమునుండి పరమాత్మను వేరుచేసి చూడగలవాడు హంసుడు - పరతత్వము నెఱింగినవాడు). (చూడుము - హంసః).
Transliteration
  1. yatīśvaruḍu.

  2. paramahaṃsāśramamunu svīkariṃcina sanyāsi, uttamapadamunu poṃdina sanyāsi.

  3. viṣaya viraktāḥ; jñāninaḥ

(viṣayamulaṃdu - viṣayabhōgamulaṃdu virakti ceṃdinavāru, jñānulu - brahmajñānamu kalavāru).

  1. ātmānātma vivēkinaḥ .

(ātma ēdō anātma ēdō vicakṣaṇagā telisinavāru).

  1. “śikhā yajñōpavīta rahitaḥ paṃca gṛhēṣu karapātra ēka kaupīnadhārī śāṭī mēkāṃ ēkaṃ vaiṇavaṃ daṃḍamēśā ṭī dharōvā, bhasmōddhūḷaparaḥ sarva tyāgī”. (sanyāsōpaniṣat)

(paramahaṃsa yanagā - śikhā yajñōpavītamulu lēnivāḍunū, oka karapātra oka kaupīnamu, oka daṃḍamunu dhariṃci, śarīramunu bhasmamutō pūsikoninavāḍunū, anniṃṭinī viḍicipeṭṭinavāḍu parama haṃsa).

  1. “tatra paramahaṃsō nāma saṃvartakāruṇi svēta kētu. durvāsa, ṛbhu, nidāgha, jaḍabharata, dattātrēya,raivataka prabhṛtayaḥ, avyakta liṃgāḥ, avyaktācārāḥ, anunmattā, unmattavadā caraṃtaḥ; tridaṃḍaṃ, kamaṃḍaluṃ śikyaṃ pātraṃ, jalapavitraṃ, śikhāṃ yajñōpavītāṃ cētyētat sarvaṃ bhūḥ svāhētyapsu parityajya ātmāna manvicchēt. yadā jāta rūpadharō nirdviṃdvō niṣparigrahaḥ tatva brahmamārgē samyak saṃpannaḥ, śuddhamānasaḥ prāṇa saṃdhāraṇārthaṃ yadhōkta kālē vimuktaḥ (lajjayā) baikṣamācaran udarapātrēṇa lābhālābhē samōbhūtvā śūnyā gāradēvagṛha, tṛṇakūṭa valmīka vṛkṣamūla kulālaśālāgnihōtra nadī pulina giri kuhara kaṃdhara kōṭara nīḍa rasthāṃdilēṣu, anikēta vāsya prayatnaḥ, nirma mama śukla dhyāna parāyaṇō (a)dhyātmaniṣṭaḥ, śubhā śubha karma nirmūlana paraḥ, sanyāsēna dēha tyāgaṃ karōti sa paramahaṃsō nāma” iti (jābālōpaniṣat)

(paramahansa yanagā saṃvartakāruṇi, svētakētu, dūrvāsuḍu, ṛdhuḍu, jaḍabharatuḍu, datātrēyuḍu, raivatuḍu modalaguvāru; kanabaḍani śarīramu galavāru - kanabaḍani ācāramugalavāru; - kanabaḍakuṃḍa saṃcariṃcuvāru, unmattulu kāni vārainanu unmattulavale nācariṃcuvāru, tridaṃḍulu; śikhā yajñōpavītamulu vadalivēsi, ātma guṟiṃci anvēṣiṃcuvāru; dvaṃdvamululēka evarēmiccinanu puccukonaka paramātma tatvamaina brahmamaṃdu niṣṭakaligiyuṃḍi, cittaśuddhikaligi, prāṇamu nilupukonuṭaku mātramu cālinaṃta bhikṣacēsi tīsukonucu, lābhālābhamulanu samamugā cūcucu, śūnyagṛhamu, dēvālayamu, gaḍḍi paraka, ceṭṭu nīḍa, puṭṭa, kulālaśāla, agnihōtramu, nadulu, ceruvulu, koṃḍa guhalu, ceṭṭu torralu modalaguvāṭiyaṃdu, illu vākili lēnivānivale tirugucu, mamakāramu lēka, - dēniyaṃdunu ’ nādi ’ yanu bhāvamulēka - dhyānamu cēyucu, adhyātmamaṃdu niṣtakaligi yuṃḍi, śubhāśubha karmalanu vadalinavāḍu).

  1. “kramēṇa jāgradādyavasthā trayaṃ ha tvā turyapadaṃ gaccatīti haṃsaḥ. vyaṣṭituryē (a)pi pratyagātmā, sa ēva paramaḥ, sarvōtkṛṣṭaḥ samaṣṭya vasthā trayaṃ hatvā, tatturyapadaṃ gaccatīti parama haṃsaḥ”.

(jāgradavastha, svapnāvastha, suṣuptyavastha yanu mūḍu avasthalanu kramamugā - okadāni tarvāta nokaṭini - vāṭi, turīyapadamunu - turīyāvasthanu - poṃdinavāḍu paramahaṃsa, vyaṣṭi turyāvasthalō pratyagātmayē parama haṃsa. samaṣṭilō ī mūḍu avasthalanu dāṭi turya padamunu poṃdinavāḍu parama haṃsa).

  1. “hinasti karmākhyaṃ puṇāpuṇyarūpaṃ malamāśritēṣu svasmiṃśca iti haṃsaḥ, apahata pāpmānaḥ ityarthaḥ.

( tananu āśrayiṃcukonina vārilō puṇyapāparūpamaina karmaphalamunu nirmūlanamonariṃcuvāḍu - bhagavaṃtuḍu).

  1. pālalōni pālanu, nīrunu vēru cēyu śakti galadi haṃsa ā prakāramugānē asattunuṃḍi sattunu -prapaṃcamunuṃḍi paramātmanu vērucēsi cūḍagalavāḍu haṃsuḍu - paratatvamu neṟiṃginavāḍu). (cūḍumu - haṃsaḥ).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.