(పరమనగా సంబంధించినది, ప్రకృతికి అతీతమైనది, నిత్యమైనది, అత్యంత మంగళమునకు - శుభమునకు నిలయమైనది, విష్ణువునకు సంబంధించినది యగు పదము. పదము అనగా పొందతగిన స్థానము - అందుచేత భక్తులు పొందతగిన భగవంతుని రూపము - భగవంతుడే ఆ పొంద తగిన స్థానము. ఆ పదమునకు, భగవంతునికి తేడా లేదు - అదియే ఇతడు, ఇతడే అది).
(బ్రహ్మ జ్ఞానులు పొందునట్టి భగవంతుని రూపము ఘనీభవించిన సచ్చిదానందము, భగవంతుని యొక్క పరమ పదమని చెప్పబడు వైష్ణవ పదము, విష్ణుసాన్నిధ్యము, వైకుంఠము).
(అన్నింటికంటె ఉత్కృష్టమైన స్థానము).
(ప్రాణములు ఇంద్రియములు, అంతఃకరణము, త్రిగుణములు మొదలగువాటికన్న శ్రేష్టతరమైన - ఉత్కృష్టమై సచ్చిదానందమయమున్నూ, నిత్య ముక్తమున్నూ అయిన పరబ్రహ్మ స్థానము పరమ పదము). (పరబ్రహ్మకు స్థానము అనునది ప్రత్యేకముగా లేదు - అది యేపదార్థములోనుండిన అదే అతని స్థానము -
“ఏ తావున రా నిలకడ నీకు?” (త్యాగరాజు). అందుచేత పరబ్రహ్మమే పరమ పదమను స్థానము
(ఉత్కృష్టమైన స్థానము - తత్వము అని అర్థము). (పరమాత్మ తత్వము)
(ఉత్కృష్టమైన పొందతగినవస్తువు. పరమాత్మ యొక్క స్వరూపము – రూపము లేని పరమాత్మకు భక్తుల ఉపాసనకు వీలగునట్లు కల్పింపబడిన రూపము - పదము అనగా విష్ణువు యొక్క మోక్షమను పదము - “తద్విష్ణోః పరమం పదం” ఇతి శ్రుతిః - ‘తత్’ అనగా పరబ్రహ్మ అయిన విష్ణువు - అతని యొక్క ఉత్కృష్ట మైన పదము - “సూరిభిః దృశ్యం చ వైష్ణవం పదమేవ” సూరిజనులచేత (బ్రహ్మ జ్ఞానులచేత, మహాభక్తులచేత, చూడనలవి యగునది -చూడబడునది).
(ఉత్కృష్టమై పొందతగినదగు భగవంతుని రూపము, భక్తికి ఆశ్రయమైనది - వైకుంఠము అని చెప్పబడు - విష్ణుని స్థానము - భగవంతుని యొక్క దివ్యమైన రూపము అదియే).
(మరణము లేనిస్థానము, మోక్షస్థానము).
(నిత్యము ఆనందము గొల్పునది, - సుఖము నిచ్చునది - యగు మోక్షమగుటచేత ’ పరమం ’ అని చెప్పబడినది; ఏ విధమైన కర్మలుగాని వాటి ఫలములుగాని లేనందున పరమం అని చెప్పబడినది. అట్టి ఉత్కృష్టమైన పదము మోక్షము కోరువారిచేత తెలియ తగినది - నిర్విశేషరూపమైన నిర్గుణ పరబ్రహ్మ).
యదా యత్యున్మనీ భావః తదా తత్పరమం పదం ||“. (పైంగళోపనిషత్)
“నిరస్త విషయా సంగం సం నిరుద్ధ మనోహృది |
యథా యత్యున్మనీ భావం తదా తత్పరమం పదం ||“. (బ్రహ్మబందూపనిషత్)
(మనసు ఉన్మనీ భావమును పొందినప్పుడు ద్వైతమనునది ఉండదు - అంతా భగవంతుడే కాని రెండవ వస్తువు లేదని భావించును - అట్టి ఉన్మనీ భావము కలుగుటే పరమపదము). (విషయముల సంగము వదలి మనస్సు హృదయములో నిరోధించియుంచి ఉన్మనీ భావమెప్పుడు కలుగునో అదే (అప్పుడే) పరమపదము).
జగచ్చయో యత్ర చౌదం యస్మిన్ విలయ మేష్యతి |
తద్బ్రహ్మ పరమంథామ సదసత్పరమం పదం ||“. (విష్ణుపురాణము)
(ఈ జగత్తు పరబ్రహ్మ అయిన విష్ణుని వలన పుట్టి, విష్ణునిచే పోషింపబడి విష్ణునిలోనే లయమగుచున్నది. అందుచేత ఆ పరబ్రహ్మ అయిన విష్ణువే పరమథామము, పరమపదము).
శాంతా సత్యా సదానందా పరమ పదమితి శ్రుతః |
అస్యాః సర్వమిదం జాతమత్రైవ లయ మేష్యతి |
యేషైవ సర్వభూతానాం గతీనాముత్తమాగతిః ||“. (కూర్మపురాణము)
(నిరంజనా, శాంతా, సత్యా, సదానందా అయిన నా శక్తి యైన - పరమేశ్వరుని శక్తి అయిన మహేశ్వరియే పరమ పదమని శ్రుతి చెప్పుచున్నది. ఈమె నుండియే ఈ జగత్తు అంతయు పుట్టినది, యీమె యందే లయమగుచున్నది. సమస్త భూతములకు ఈమె యే ఉత్తమగతి, అందుచేత ఈమె యే పరమపదము).
పరమం పదమద్వైతం సశివస్సాంబ విగ్రహః |
బ్రహ్మవిష్ణు ప్రజేశానాం అన్యే షామపి దేహినాం |
ఋతే సాంబం మహాదేవం కిం భవేత్ పరమ పదం ||“. (బ్రహ్మగీతాయాం)
“అస్యార్థః :- యత్ర నాన్యత్ పశ్యతి, నాన్యత్ శ్రుణోతి ఇత్యేవం త్రిపుటీహీనం యదద్వయం తత్వం, తదేవాఖిల దేహినాం దేవ మనుష్యాదీనాం సర్వేషాం పరమం పదం. నిరతిశయానందతయా సర్వైరభిలషతత్వాత్ ఈ దృగ్విదం పరమం పదమేవ లీలయా అర్థనారీశ్వర విగ్రహ శ్శివస్సంపన్నం ఏతి దేవ సచ్చిదానందైకరసం పరశివ స్వరూపం రుద్ర విష్ణ్వాదీనాం గుణమూర్తీనాం అన్యేషామింద్రాదీనాం చ పరమ పదం భవతీత్యర్థః”.
(“దేనిని పొందిన ఇతరమేదియు లేనిదే యగునో, ఇతరమేమియు వినబడదో” అని శ్రుతిలో చెప్పినప్రకారము (చూచువాడు, చూడబడునది, చూచుట యను) త్రిపుటి యనునది లేదో, తను కాక మఱియొక వస్తువేదియు లేనటువంటి తత్వమేదికలదో అదియే సమస్త దేహులకు, దేవతులకు, మనుష్యులకు అందఱకూ, పరమపదము - ఉత్కృష్టమైన స్థానము - అత్యంతానందము కలుగచేయు మోక్షమగుటవలనను, అందరు కోరునది అదియే యగుటచేతను. ఇటువంటి పరమపదమే అర్థనారీ శ్వరరూపమైన శివుడు సచ్చిదానందములు కలిగియున్న పరమ శివస్వరూపము - రుద్రుడు, విష్ణువు మొదలగువారికి - త్రిగుణములు మూర్తీభవించిన రూపముగలవారికి, ఇంద్రుడు మొదలగు ఇతరులకు పరమ పదమగు చున్నది - పరమ శివుడే పరమపదము).
బ్రహ్మచర్యం యదిచ్ఛంతశ్చరంతి శివ ఏవ సః ||“. (బ్రహ్మగీతాయాం)
(వేదములు దేనిని పరమ పదమని చెప్పుచున్నవో, తపస్సు దేనిని గుఱించి చేయబడుచున్నదో, దేనిని కోరి బ్రహ్మచర్యము నవలంభించుచున్నారో - ఆ పరమ పదమనునది సాక్షాత్ శివుడే).
(శ్రీరామ కన్న పరమ పదమనునది వేరేలేదు. శ్రీరాముడే పొందతగిన మోక్షస్థానము, మోక్ష రూపుడు).
పశ్యంతి ప్రణవే చింత్యం తద్విష్ణోః పరమం పదం ||“. (విష్ణుపురాణము)
(పుణ్యపాపములు క్షీణించిన యోగులు ఉద్రుక్తులై ఎల్లపుడు పాపనాశనము కొఱకు ఓంకారమందు చూచునది ఆ విష్ణునియొక్క పరమ పదమే).
త్రయోగ్న యశ్చ త్రిగుణాః స్థితాః సర్వేత్రయాక్షరే |
త్రియాణామక్షరాణాంచ యో(అ)ధీతేప్యర్థమక్షరం |
తేన సర్వమిదం ప్రోతం తత్సత్యం తత్పరం పదం ||“. (యోగతత్వోపనిషత్)
(వేదములు మూడు, లోకములు మూడు, స్వరములు మూడు, అగ్నులు మూడు, గుణములు మూడు - ఇవన్నియు ఒంకార మందున్నవి. ఆ ఓంకారమందున్న అక్షర రూపమైన పరబ్రహ్మ ఈ సమస్త జగత్తులోను వ్యాపించియున్నాడు - అదియే సత్యము - మూడుకాలములందుండునది - పరమ పదము).
బరతత్వమనంగ బరమ పదమనగను నీ
శ్వరుడన, కృష్ణుడన, జగ
ద్భరితుడు నారాయణుండు దా వెలుగొందున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 51)
“వైష్ణవంబయిన పరమపదంబు సర్వోత్తమంబని సత్పురుషులు తెలియుదురు (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 2 - )
“విజ్ఞాన సారధిర్యస్తు మనః ప్రగ్రహవాన్నరః |
సో(అ)ధ్యనః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదం ||“. (కఠోపనిషత్తు - 1 - 3 - 9);
“త్రిపాదస్యామృతం దివి” (ఛాందోగ్యోపనిషత్)
“అధ యదతః పరో దివో జ్యోతిర్దీప్యతే విశ్వతః పృహ్టేషు, సర్వతః పృష్టేషు అనుత్తమేషు లోకేషు” (ఛాందోగ్యోపనిషత్ - 11 - 13 - 7)
“ఇతి విశ్వతః ప్రాకృతాత్ స్థానాత్ పరం విష్ణోః పరమం స్థానమేవహి, సంసారాధ్వనః పారభూతం ముముక్షుభిః ప్రాప్యం”.
(శ్రీమాన్ రామానుజః)
“తద్విష్ణో పరమంపదం” (తైత్తిరీయోపనిషత్ - 1 - 3 - 6)
“తదక్షరే పరమే వ్యోమన్” (తైత్తిరీయోపనిషత్ - 4 - 1 - 1 )
“విశ్వం పురాణం తమసః పరస్తాత్” ఇత్యాది సకలోపనిషత్ ప్రసిద్ధం. (శ్రీమాన్ రామానుజః)
(సమాహిత చిత్తుడయి నేర్పుగల సారధిగల జీవుడు సంసారము యొక్క అవతల ఒడ్డును చేరును. అదియే శ్రీమహావిష్ణువు యొక్క పరమ పదమని చెప్పబడు వైకుంఠము, లేక, మోక్షము అని కఠోపనిషత్తు చెప్పుచున్నది. ఆత్మ యొక్క ఒక్క పాదము ఈ జగత్తు, మిగిలిన మూడు పాదములు ద్యులోకముందున్నవి - అని ఛాందోగ్యోపనిషత్తు చెప్పుచున్నది. ప్రపంచమునకు మీదను, అన్నింటికీ మీదను ఉన్నవాటిలోను ఉత్తమమైన. ఉత్తమకానివి అయిన లోకములలోను ఉన్నవాటికంటె పరమ ప్రకృష్టమై ప్రకాశరూపమై వెలుగు చున్నది అని ఛాందోగ్యోపనిషత్తు చెప్పుచున్నది. ప్రకృతి సంబంధమైన ప్రపంచముకన్న ప్రకృష్టమైన స్థానము విష్ణుని పరమ పదము - ఇదియే సంసారమవతలి ఒడ్డు, మోక్షము కోరువారిచేత పొందబడుస్థానము - శ్రుతులు ఇట్లే చెప్పుచున్నవి).
(పరబ్రహ్మ ‘పరమం’ అను ఒకానొక (పదము) స్థానవిశేషమందుండునని చెప్పుటచేత ఒక ప్రదేశముననే ఉండువాడు అని అర్థము స్ఫురించుటచేత అతనిని దేశకాలవస్తు పరిచ్ఛేదరహితుడు అని చెప్పుటకుగాని, అతనిని అనంతుడని చెప్పుటకుగాని విరోధము కలుగదు - పరమపదమందుండు వాడు అని ఒక ఒకధామము - (నివాస స్థానము) - కలవాడు అని దేశపరిచ్ఛేదము చెప్పుటవలనకాని, విరోధము లేదు - కాని “గుహయందు - హృదయ మందు - ఉండువానిని ఎవరు తెలియుదురో” అనిన్నీ, “జనులందరిలో ప్రవేశించి వారిని శాసించుచు అందరికి ఆత్మ అయినవాడు” అనిన్నీ; “నిత్యుడు, విభుడు, అన్నింటిలోనుండువాడు” అనిన్నీ; “ఈ ఆత్మ సమస్త భూతములలోను ఉన్నది” అనిన్నీ; “విష్ణువు అన్నింటిలోను ప్రవేశించి యున్నాడు” అనిన్నీ - ఇట్లు అనేక ప్రమాణ వచనములుండుటచేతనున్నూ, పరమాత్మ సర్వాంతరాత్మగా - (అన్నింటిలోను ఆత్మగా) యుండుటచేతను, అతను దివ్యమంగళవిగ్రహము కలిగినవాడని చెప్పబడియుండుట చేతను, నిత్య విభూతి కలిగి యుండుటచేతను, - అనేక రూపములుగా మారి యుండుటచేతను - ఒక విశేషమైన స్థానమందు - పరమ పదమందు - ఉండును అని మేముకూడ చెప్పుచున్నాము - అట్లు చెప్పుటవలన దోషము లేదు - “ఆ విష్ణువు యొక్క పరమ పదము” అనిమొదలగు వాక్యములు గల శ్రుతులు బ్రహ్మస్థాన విశేషమందుండునట్లు చెప్పుచున్నవి).
తద్విదామప్యనిర్దేశ్యం తచ్ఛాంతం పరమం పదం ||“. (యోగవాసిష్టము - 64 - 5)
(ఉపాది రహితమును, పరిపూర్ణమును, సత్వమయమును అగు దీని స్థితిని పండితులు కూడ నిర్దేశింపజాలరు. దీనిని శాంతమయమగు పరమపదమందురు).
మాత్రా తృతీయా చిచ్ఛక్తిః అర్థమాత్రా పరమం పదం ||’. (మార్కండేయ పురాణము)
(ఓం కారము యొక్క ప్రథమ మాత్ర వ్యక్తము, రెండవ మాత్ర అవ్యక్తము, మూడవమాత్ర చిచ్ఛక్తి, అర్థమాత్ర పరమ పదము).
(అన్నింటికంటె ఉత్కృష్టమైనదిన్నీ, ప్రసిద్ధమైనదిన్నీ అయిన విష్ణుని యొక్క పదము - వైకుంఠము)
(ఆ పరబ్రహ్మ అయిన విష్ణుని యొక్క పరమ పదము శూరి జనులు - బ్రహ్మజ్ఞానము గలవారు - ఎల్లపుడు చూచు చుందురు. వారికి ఎప్పుడునూ కనబడుచునే యుండును).
(paramanagā saṃbaṃdhiṃcinadi, prakṛtiki atītamainadi, nityamainadi, atyaṃta maṃgaḷamunaku - śubhamunaku nilayamainadi, viṣṇuvunaku saṃbaṃdhiṃcinadi yagu padamu. padamu anagā poṃdatagina sthānamu - aṃducēta bhaktulu poṃdatagina bhagavaṃtuni rūpamu - bhagavaṃtuḍē ā poṃda tagina sthānamu. ā padamunaku, bhagavaṃtuniki tēḍā lēdu - adiyē itaḍu, itaḍē adi).
(brahma jñānulu poṃdunaṭṭi bhagavaṃtuni rūpamu ghanībhaviṃcina saccidānaṃdamu, bhagavaṃtuni yokka parama padamani ceppabaḍu vaiṣṇava padamu, viṣṇusānnidhyamu, vaikuṃṭhamu).
(anniṃṭikaṃṭe utkṛṣṭamaina sthānamu).
(prāṇamulu iṃdriyamulu, aṃtaḥkaraṇamu, triguṇamulu modalaguvāṭikanna śrēṣṭataramaina - utkṛṣṭamai saccidānaṃdamayamunnū, nitya muktamunnū ayina parabrahma sthānamu parama padamu). (parabrahmaku sthānamu anunadi pratyēkamugā lēdu - adi yēpadārthamulōnuṃḍina adē atani sthānamu -
“ē tāvuna rā nilakaḍa nīku?” (tyāgarāju). aṃducēta parabrahmamē parama padamanu sthānamu
(utkṛṣṭamaina sthānamu - tatvamu ani arthamu). (paramātma tatvamu)
(utkṛṣṭamaina poṃdataginavastuvu. paramātma yokka svarūpamu – rūpamu lēni paramātmaku bhaktula upāsanaku vīlagunaṭlu kalpiṃpabaḍina rūpamu - padamu anagā viṣṇuvu yokka mōkṣamanu padamu - “tadviṣṇōḥ paramaṃ padaṃ” iti śrutiḥ - ‘tat’ anagā parabrahma ayina viṣṇuvu - atani yokka utkṛṣṭa maina padamu - “sūribhiḥ dṛśyaṃ ca vaiṣṇavaṃ padamēva” sūrijanulacēta (brahma jñānulacēta, mahābhaktulacēta, cūḍanalavi yagunadi -cūḍabaḍunadi).
(utkṛṣṭamai poṃdataginadagu bhagavaṃtuni rūpamu, bhaktiki āśrayamainadi - vaikuṃṭhamu ani ceppabaḍu - viṣṇuni sthānamu - bhagavaṃtuni yokka divyamaina rūpamu adiyē).
(maraṇamu lēnisthānamu, mōkṣasthānamu).
(nityamu ānaṃdamu golpunadi, - sukhamu niccunadi - yagu mōkṣamaguṭacēta ’ paramaṃ ’ ani ceppabaḍinadi; ē vidhamaina karmalugāni vāṭi phalamulugāni lēnaṃduna paramaṃ ani ceppabaḍinadi. aṭṭi utkṛṣṭamaina padamu mōkṣamu kōruvāricēta teliya taginadi - nirviśēṣarūpamaina nirguṇa parabrahma).
yadā yatyunmanī bhāvaḥ tadā tatparamaṃ padaṃ ||“. (paiṃgaḷōpaniṣat)
“nirasta viṣayā saṃgaṃ saṃ niruddha manōhṛdi |
yathā yatyunmanī bhāvaṃ tadā tatparamaṃ padaṃ ||“. (brahmabaṃdūpaniṣat)
(manasu unmanī bhāvamunu poṃdinappuḍu dvaitamanunadi uṃḍadu - aṃtā bhagavaṃtuḍē kāni reṃḍava vastuvu lēdani bhāviṃcunu - aṭṭi unmanī bhāvamu kaluguṭē paramapadamu). (viṣayamula saṃgamu vadali manassu hṛdayamulō nirōdhiṃciyuṃci unmanī bhāvameppuḍu kalugunō adē (appuḍē) paramapadamu).
jagaccayō yatra caudaṃ yasmin vilaya mēṣyati |
tadbrahma paramaṃthāma sadasatparamaṃ padaṃ ||“. (viṣṇupurāṇamu)
(ī jagattu parabrahma ayina viṣṇuni valana puṭṭi, viṣṇunicē pōṣiṃpabaḍi viṣṇunilōnē layamagucunnadi. aṃducēta ā parabrahma ayina viṣṇuvē paramathāmamu, paramapadamu).
śāṃtā satyā sadānaṃdā parama padamiti śrutaḥ |
asyāḥ sarvamidaṃ jātamatraiva laya mēṣyati |
yēṣaiva sarvabhūtānāṃ gatīnāmuttamāgatiḥ ||“. (kūrmapurāṇamu)
(niraṃjanā, śāṃtā, satyā, sadānaṃdā ayina nā śakti yaina - paramēśvaruni śakti ayina mahēśvariyē parama padamani śruti ceppucunnadi. īme nuṃḍiyē ī jagattu aṃtayu puṭṭinadi, yīme yaṃdē layamagucunnadi. samasta bhūtamulaku īme yē uttamagati, aṃducēta īme yē paramapadamu).
paramaṃ padamadvaitaṃ saśivassāṃba vigrahaḥ |
brahmaviṣṇu prajēśānāṃ anyē ṣāmapi dēhināṃ |
ṛtē sāṃbaṃ mahādēvaṃ kiṃ bhavēt parama padaṃ ||“. (brahmagītāyāṃ)
“asyārthaḥ :- yatra nānyat paśyati, nānyat śruṇōti ityēvaṃ tripuṭīhīnaṃ yadadvayaṃ tatvaṃ, tadēvākhila dēhināṃ dēva manuṣyādīnāṃ sarvēṣāṃ paramaṃ padaṃ. niratiśayānaṃdatayā sarvairabhilaṣatatvāt ī dṛgvidaṃ paramaṃ padamēva līlayā arthanārīśvara vigraha śśivassaṃpannaṃ ēti dēva saccidānaṃdaikarasaṃ paraśiva svarūpaṃ rudra viṣṇvādīnāṃ guṇamūrtīnāṃ anyēṣāmiṃdrādīnāṃ ca parama padaṃ bhavatītyarthaḥ”.
(“dēnini poṃdina itaramēdiyu lēnidē yagunō, itaramēmiyu vinabaḍadō” ani śrutilō ceppinaprakāramu (cūcuvāḍu, cūḍabaḍunadi, cūcuṭa yanu) tripuṭi yanunadi lēdō, tanu kāka maṟiyoka vastuvēdiyu lēnaṭuvaṃṭi tatvamēdikaladō adiyē samasta dēhulaku, dēvatulaku, manuṣyulaku aṃdaṟakū, paramapadamu - utkṛṣṭamaina sthānamu - atyaṃtānaṃdamu kalugacēyu mōkṣamaguṭavalananu, aṃdaru kōrunadi adiyē yaguṭacētanu. iṭuvaṃṭi paramapadamē arthanārī śvararūpamaina śivuḍu saccidānaṃdamulu kaligiyunna parama śivasvarūpamu - rudruḍu, viṣṇuvu modalaguvāriki - triguṇamulu mūrtībhaviṃcina rūpamugalavāriki, iṃdruḍu modalagu itarulaku parama padamagu cunnadi - parama śivuḍē paramapadamu).
brahmacaryaṃ yadicchaṃtaścaraṃti śiva ēva saḥ ||“. (brahmagītāyāṃ)
(vēdamulu dēnini parama padamani ceppucunnavō, tapassu dēnini guṟiṃci cēyabaḍucunnadō, dēnini kōri brahmacaryamu navalaṃbhiṃcucunnārō - ā parama padamanunadi sākṣāt śivuḍē).
(śrīrāma kanna parama padamanunadi vērēlēdu. śrīrāmuḍē poṃdatagina mōkṣasthānamu, mōkṣa rūpuḍu).
paśyaṃti praṇavē ciṃtyaṃ tadviṣṇōḥ paramaṃ padaṃ ||“. (viṣṇupurāṇamu)
(puṇyapāpamulu kṣīṇiṃcina yōgulu udruktulai ellapuḍu pāpanāśanamu koṟaku ōṃkāramaṃdu cūcunadi ā viṣṇuniyokka parama padamē).
trayōgna yaśca triguṇāḥ sthitāḥ sarvētrayākṣarē |
triyāṇāmakṣarāṇāṃca yō(a)dhītēpyarthamakṣaraṃ |
tēna sarvamidaṃ prōtaṃ tatsatyaṃ tatparaṃ padaṃ ||“. (yōgatatvōpaniṣat)
(vēdamulu mūḍu, lōkamulu mūḍu, svaramulu mūḍu, agnulu mūḍu, guṇamulu mūḍu - ivanniyu oṃkāra maṃdunnavi. ā ōṃkāramaṃdunna akṣara rūpamaina parabrahma ī samasta jagattulōnu vyāpiṃciyunnāḍu - adiyē satyamu - mūḍukālamulaṃduṃḍunadi - parama padamu).
baratatvamanaṃga barama padamanaganu nī
śvaruḍana, kṛṣṇuḍana, jaga
dbharituḍu nārāyaṇuṃḍu dā velugoṃdun”. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 51)
“vaiṣṇavaṃbayina paramapadaṃbu sarvōttamaṃbani satpuruṣulu teliyuduru (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 2 - )
“vijñāna sāradhiryastu manaḥ pragrahavānnaraḥ |
sō(a)dhyanaḥ pāramāpnōti tadviṣṇōḥ paramaṃ padaṃ ||“. (kaṭhōpaniṣattu - 1 - 3 - 9);
“tripādasyāmṛtaṃ divi” (chāṃdōgyōpaniṣat)
“adha yadataḥ parō divō jyōtirdīpyatē viśvataḥ pṛhṭēṣu, sarvataḥ pṛṣṭēṣu anuttamēṣu lōkēṣu” (chāṃdōgyōpaniṣat - 11 - 13 - 7)
“iti viśvataḥ prākṛtāt sthānāt paraṃ viṣṇōḥ paramaṃ sthānamēvahi, saṃsārādhvanaḥ pārabhūtaṃ mumukṣubhiḥ prāpyaṃ”.
(śrīmān rāmānujaḥ)
“tadviṣṇō paramaṃpadaṃ” (taittirīyōpaniṣat - 1 - 3 - 6)
“tadakṣarē paramē vyōman” (taittirīyōpaniṣat - 4 - 1 - 1 )
“viśvaṃ purāṇaṃ tamasaḥ parastāt” ityādi sakalōpaniṣat prasiddhaṃ. (śrīmān rāmānujaḥ)
(samāhita cittuḍayi nērpugala sāradhigala jīvuḍu saṃsāramu yokka avatala oḍḍunu cērunu. adiyē śrīmahāviṣṇuvu yokka parama padamani ceppabaḍu vaikuṃṭhamu, lēka, mōkṣamu ani kaṭhōpaniṣattu ceppucunnadi. ātma yokka okka pādamu ī jagattu, migilina mūḍu pādamulu dyulōkamuṃdunnavi - ani chāṃdōgyōpaniṣattu ceppucunnadi. prapaṃcamunaku mīdanu, anniṃṭikī mīdanu unnavāṭilōnu uttamamaina. uttamakānivi ayina lōkamulalōnu unnavāṭikaṃṭe parama prakṛṣṭamai prakāśarūpamai velugu cunnadi ani chāṃdōgyōpaniṣattu ceppucunnadi. prakṛti saṃbaṃdhamaina prapaṃcamukanna prakṛṣṭamaina sthānamu viṣṇuni parama padamu - idiyē saṃsāramavatali oḍḍu, mōkṣamu kōruvāricēta poṃdabaḍusthānamu - śrutulu iṭlē ceppucunnavi).
(parabrahma ‘paramaṃ’ anu okānoka (padamu) sthānaviśēṣamaṃduṃḍunani ceppuṭacēta oka pradēśamunanē uṃḍuvāḍu ani arthamu sphuriṃcuṭacēta atanini dēśakālavastu paricchēdarahituḍu ani ceppuṭakugāni, atanini anaṃtuḍani ceppuṭakugāni virōdhamu kalugadu - paramapadamaṃduṃḍu vāḍu ani oka okadhāmamu - (nivāsa sthānamu) - kalavāḍu ani dēśaparicchēdamu ceppuṭavalanakāni, virōdhamu lēdu - kāni “guhayaṃdu - hṛdaya maṃdu - uṃḍuvānini evaru teliyudurō” aninnī, “janulaṃdarilō pravēśiṃci vārini śāsiṃcucu aṃdariki ātma ayinavāḍu” aninnī; “nityuḍu, vibhuḍu, anniṃṭilōnuṃḍuvāḍu” aninnī; “ī ātma samasta bhūtamulalōnu unnadi” aninnī; “viṣṇuvu anniṃṭilōnu pravēśiṃci yunnāḍu” aninnī - iṭlu anēka pramāṇa vacanamuluṃḍuṭacētanunnū, paramātma sarvāṃtarātmagā - (anniṃṭilōnu ātmagā) yuṃḍuṭacētanu, atanu divyamaṃgaḷavigrahamu kaliginavāḍani ceppabaḍiyuṃḍuṭa cētanu, nitya vibhūti kaligi yuṃḍuṭacētanu, - anēka rūpamulugā māri yuṃḍuṭacētanu - oka viśēṣamaina sthānamaṃdu - parama padamaṃdu - uṃḍunu ani mēmukūḍa ceppucunnāmu - aṭlu ceppuṭavalana dōṣamu lēdu - “ā viṣṇuvu yokka parama padamu” animodalagu vākyamulu gala śrutulu brahmasthāna viśēṣamaṃduṃḍunaṭlu ceppucunnavi).
tadvidāmapyanirdēśyaṃ tacchāṃtaṃ paramaṃ padaṃ ||“. (yōgavāsiṣṭamu - 64 - 5)
(upādi rahitamunu, paripūrṇamunu, satvamayamunu agu dīni sthitini paṃḍitulu kūḍa nirdēśiṃpajālaru. dīnini śāṃtamayamagu paramapadamaṃduru).
mātrā tṛtīyā cicchaktiḥ arthamātrā paramaṃ padaṃ ||’. (mārkaṃḍēya purāṇamu)
(ōṃ kāramu yokka prathama mātra vyaktamu, reṃḍava mātra avyaktamu, mūḍavamātra cicchakti, arthamātra parama padamu).
(anniṃṭikaṃṭe utkṛṣṭamainadinnī, prasiddhamainadinnī ayina viṣṇuni yokka padamu - vaikuṃṭhamu)
(ā parabrahma ayina viṣṇuni yokka parama padamu śūri janulu - brahmajñānamu galavāru - ellapuḍu cūcu cuṃduru. vāriki eppuḍunū kanabaḍucunē yuṃḍunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.