పరబ్రహ్మ; ప్రధాన పురుషుడు.
దేవానామపి శ్రేష్ట పురుషః
(దేవతులలో కూడ శ్రేష్టుడైన పురుషుడు).
(ఈశ్వరునికన్న, ఈశ్వరునికంటె - శ్రేష్టమైన ఇతర తత్వములేదు)
“సకల పురుషాంతర్యామి రూపత్వంబువలన పరమ పురుషుండవయ్యును” (శ్రీమధాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 682)
“ఇంద్రుయేభ్యః పరాహ్యర్థాః అర్థేభ్యశ్చ పరం మనః |
మననస్తు పరాబుద్ధిః బుద్ధేరాత్మా మహాన్ పరః |
మహతః పరమవ్యక్తం అవ్యక్తాత్పురుషః పరః |
పురుషాన్నపరం, కించిత్ సాకాష్టా సా పరగతిః ||’ (కఠోపనిషత్ - 1 - 3 - 10)
(ఇంద్రియములు, అర్థములు, మనస్సు, బుద్ధి, మహత్తత్వము, అవ్యక్తము - ఇవి ఒకదానికంటె సూక్ష్మము, ఉత్కృష్టమైనది. అవ్యక్తముకంటె పరుడు - ఉత్కృష్టమైనవాడు - పురుషుడు - పురుషుని కంటె ఉత్కృష్టమైనదిలేదు - అదే అన్నింటికంటె ఉత్కృష్టమైనది. అందుచేత అదియే పరాగతి, - పరమగతి, పరమ పదము - పురుషుడు అనగా - పురిశయనాత్ పురుషః - పురమందు శయనించువాడు కనుక పురుషుడు - భగవంతుడు ప్రకృతిలో, జడమైన ప్రకృతిలో ప్రవేశించి దానికి చైతన్యము కలుగచేయుటవలన దానిలోనుండి పరంపరగా సృష్టిలోనున్న వస్తువులన్నియు పుట్టినవి. అట్లు పుట్టిన ప్రతివస్తువులోను భగవంతుడు ప్రవేశించియున్నాడు.” తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశత్ ” (దానిని సృష్టించి దానిలోనే ప్రవేశించెను). అట్లు అతను ప్రవేశించిన ప్రతి వస్తువు అతనికి పురము - పురములో నుండువాడు కనుక పురుషుడు - సృష్టి ప్రారంభములో ప్రకృతిలో ప్రవేశించిన పురుషుడు పరమ పురుషుడు, ఉత్తమ పురుషుడు, పురుషోత్తముడు).
యః స సర్వేషు భూతేషు నశ్యత్సున వినశ్యతి |
అవ్యక్తో(అ)క్షర ఇత్యుక్తస్తమాహుః పరమాం గతిం |
యం ప్రాప్య న నివర్తంతే తద్ఠామపరమం మమ ||
పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా |
యస్యాంతస్థాని భూతాని యేన సర్వమిదం తతం ||. (శ్రీమద్భగవద్గీత - 8 - 20 to 22)
(ప్రళయకాలమందు సమస్త ప్రాణములు సూక్ష్మరూపములో వాటి వాటి నామ రూపములు విడిచి పెట్టి, అన్నియు కలిసి ఒకే పదార్థముగా ఉన్న ప్రకృతి యొక్క స్థితి అవ్యక్తము అని చెప్పబడుచున్నది - అట్టి అవ్యక్తముకంటె సూక్ష్మ మైనది, అవ్యక్తమైనది - దానికంటె ప్రకృష్టమైనది, దానికంటె ముందునుండి ఉన్నదిన్నీ, సమస్త భూతములు నశించినప్పటికీ తాను నశించనదీ, అక్షరమైనది యున్నది - దానిని పరమగతి - పరమ ధామము అని చెప్పుడురు. అక్కడికి వెళ్ళినవారు మరల జన్మము పొందరు. అతనినే పురుషుడందురు. అటువంటి పురుషుడు - పరమపురుషుడు అనన్యభక్తివలననే పొందగలుగుతాడు. అతనిలోనే సమస్త భూతములున్నవి - ఈ సమస్త ప్రపంచములోను అతను పూర్తిగా వ్యాపించియున్నాడు - అనగా, వాటి అన్నింటిలోను - ఉన్నదంతా అతనే - అవన్నీ అతనే అందుచేత అతను పరమ పురుషుడు). (‘పురుషుడు’ అనగా చూడుము - 5). (పరమగతి యనినను, పరమ ధామమనినను, పరమ పదమనినను భగవంతుడే).
parabrahma; pradhāna puruṣuḍu.
dēvānāmapi śrēṣṭa puruṣaḥ
(dēvatulalō kūḍa śrēṣṭuḍaina puruṣuḍu).
(īśvarunikanna, īśvarunikaṃṭe - śrēṣṭamaina itara tatvamulēdu)
“sakala puruṣāṃtaryāmi rūpatvaṃbuvalana parama puruṣuṃḍavayyunu” (śrīmadhāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 682)
“iṃdruyēbhyaḥ parāhyarthāḥ arthēbhyaśca paraṃ manaḥ |
mananastu parābuddhiḥ buddhērātmā mahān paraḥ |
mahataḥ paramavyaktaṃ avyaktātpuruṣaḥ paraḥ |
puruṣānnaparaṃ, kiṃcit sākāṣṭā sā paragatiḥ ||’ (kaṭhōpaniṣat - 1 - 3 - 10)
(iṃdriyamulu, arthamulu, manassu, buddhi, mahattatvamu, avyaktamu - ivi okadānikaṃṭe sūkṣmamu, utkṛṣṭamainadi. avyaktamukaṃṭe paruḍu - utkṛṣṭamainavāḍu - puruṣuḍu - puruṣuni kaṃṭe utkṛṣṭamainadilēdu - adē anniṃṭikaṃṭe utkṛṣṭamainadi. aṃducēta adiyē parāgati, - paramagati, parama padamu - puruṣuḍu anagā - puriśayanāt puruṣaḥ - puramaṃdu śayaniṃcuvāḍu kanuka puruṣuḍu - bhagavaṃtuḍu prakṛtilō, jaḍamaina prakṛtilō pravēśiṃci dāniki caitanyamu kalugacēyuṭavalana dānilōnuṃḍi paraṃparagā sṛṣṭilōnunna vastuvulanniyu puṭṭinavi. aṭlu puṭṭina prativastuvulōnu bhagavaṃtuḍu pravēśiṃciyunnāḍu.” tat sṛṣṭvā tadēvānu prāviśat ” (dānini sṛṣṭiṃci dānilōnē pravēśiṃcenu). aṭlu atanu pravēśiṃcina prati vastuvu ataniki puramu - puramulō nuṃḍuvāḍu kanuka puruṣuḍu - sṛṣṭi prāraṃbhamulō prakṛtilō pravēśiṃcina puruṣuḍu parama puruṣuḍu, uttama puruṣuḍu, puruṣōttamuḍu).
yaḥ sa sarvēṣu bhūtēṣu naśyatsuna vinaśyati |
avyaktō(a)kṣara ityuktastamāhuḥ paramāṃ gatiṃ |
yaṃ prāpya na nivartaṃtē tadṭhāmaparamaṃ mama ||
puruṣaḥ sa paraḥ pārtha bhaktyā labhyastvananyayā |
yasyāṃtasthāni bhūtāni yēna sarvamidaṃ tataṃ ||. (śrīmadbhagavadgīta - 8 - 20 to 22)
(praḷayakālamaṃdu samasta prāṇamulu sūkṣmarūpamulō vāṭi vāṭi nāma rūpamulu viḍici peṭṭi, anniyu kalisi okē padārthamugā unna prakṛti yokka sthiti avyaktamu ani ceppabaḍucunnadi - aṭṭi avyaktamukaṃṭe sūkṣma mainadi, avyaktamainadi - dānikaṃṭe prakṛṣṭamainadi, dānikaṃṭe muṃdunuṃḍi unnadinnī, samasta bhūtamulu naśiṃcinappaṭikī tānu naśiṃcanadī, akṣaramainadi yunnadi - dānini paramagati - parama dhāmamu ani ceppuḍuru. akkaḍiki veḷḷinavāru marala janmamu poṃdaru. ataninē puruṣuḍaṃduru. aṭuvaṃṭi puruṣuḍu - paramapuruṣuḍu ananyabhaktivalananē poṃdagalugutāḍu. atanilōnē samasta bhūtamulunnavi - ī samasta prapaṃcamulōnu atanu pūrtigā vyāpiṃciyunnāḍu - anagā, vāṭi anniṃṭilōnu - unnadaṃtā atanē - avannī atanē aṃducēta atanu parama puruṣuḍu). (‘puruṣuḍu’ anagā cūḍumu - 5). (paramagati yaninanu, parama dhāmamaninanu, parama padamaninanu bhagavaṃtuḍē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.