← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరమధర్మము paramadharmamu

Original — తెలుగు
  1. కేవలం ఈశ్వరారాధన లక్షణో ధర్మః -

(ఈశ్వరుని ఆరాధించుటయే లక్షణముగా గలది పరమ ధర్మము).

  1. “జపస్తు సర్వ ధర్మేభ్యః పరమో ధర్మ ఉచ్యతే |

అహింసయా చ భూతానాం జప యజ్ఞః ప్రవర్తతే ||“. ఇతి మహాభారతే.

(సమస్త ధర్మములకంటెను జపమే పరమ ధర్మమని చెప్పబడు చున్నది. జపయజ్ఞము చేయుటలో జీవ హింసలేదు).

  1. “సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరథో క్షజే |

అహైతుక్య ప్రతిహతా యయా ఆత్మా సంప్రసీదతి ||“. (శ్రీమద్భాగవతం - 1 - 2 - 6)

(దేనివలన భగవంతునియందు నిర్హేతుకమైనదిన్నీ, అంతులేనిదిన్నీ అయిన భక్తి కలుగునో అదియే పరమ ధర్మము. “పురుషులకు పరమ ధర్మంబగు వాసుదేవునియందు బ్రయోగింపబడిన భక్తి యోగంబు వైరాగ్య విజ్ఞానంబుల బుట్టించు”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 2 - 21)

  1. “అహింసా పరమో ధర్మః”, “అహింసా ప్రాణినాం ధర్మః ప్రకృష్టః ప్రాణి రక్షణాత్” (గీతభావప్రకాశము - 1 - 262)

(అహింస ఉత్కృష్టమైన ధర్మము - దాని కన్న మించిన ధర్మము లేదు - ప్రాణులను రక్షించుటకంటెకూడ ప్రాణులను హింసించుకుండుటయే గొప్ప ధర్మము. ప్రతి జీవిలోను భగవంతుని అంశ యున్నది కనుకను, తనకు చేయబడిన హింస తనకు ఎంత బాధకరమో ఇతరులకు చేసిన హింసవారికి అంత బాధకరముగా నుండును కనుక).

  1. పరః పరమాత్మా మీయతే అనేన ఇత్యేతదభిప్రాయేణ పరమః ఇత్యభిధాయి, పరః శత్రుః సంసారః మీయతే అత్రలీయతే ఇతివా. యతః అధికతమః సుఖహేతుః న భవతి స పరమో ధర్మః - స చ భక్తి యోగలక్షణ ఏవ.

(పరమ శత్రువైన సంసారము ఎందు లయించునో - క్షీణించునో - అది పరమ ధర్మము . దేనికన్న హెచ్చుగ సుఖమును కలుగచేయు కారణము మఱి లేదో అది పరమ ధర్మము - అది భక్తి యోగమే లక్షణముగా గలది).

  1. “క. పరహితము సేయు నెవ్వడు

పరమ హితుండగును భూత పంచకమునకున్

బరహితమె పరమ ధర్మము

పరహితునకు నెదురు లేదు సర్వేందు ముఖీ“. (శ్రీ మదాంధ్రమహాభాగవతము - 8 - 7 - 235)

(లోకములకు హితము చేయుటయే పరమ ధర్మమని శివుడు విషమును మ్రింగెను).

Transliteration
  1. kēvalaṃ īśvarārādhana lakṣaṇō dharmaḥ -

(īśvaruni ārādhiṃcuṭayē lakṣaṇamugā galadi parama dharmamu).

  1. “japastu sarva dharmēbhyaḥ paramō dharma ucyatē |

ahiṃsayā ca bhūtānāṃ japa yajñaḥ pravartatē ||“. iti mahābhāratē.

(samasta dharmamulakaṃṭenu japamē parama dharmamani ceppabaḍu cunnadi. japayajñamu cēyuṭalō jīva hiṃsalēdu).

  1. “savai puṃsāṃ parō dharmō yatō bhaktirathō kṣajē |

ahaitukya pratihatā yayā ātmā saṃprasīdati ||“. (śrīmadbhāgavataṃ - 1 - 2 - 6)

(dēnivalana bhagavaṃtuniyaṃdu nirhētukamainadinnī, aṃtulēnidinnī ayina bhakti kalugunō adiyē parama dharmamu. “puruṣulaku parama dharmaṃbagu vāsudēvuniyaṃdu brayōgiṃpabaḍina bhakti yōgaṃbu vairāgya vijñānaṃbula buṭṭiṃcu”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 2 - 21)

  1. “ahiṃsā paramō dharmaḥ”, “ahiṃsā prāṇināṃ dharmaḥ prakṛṣṭaḥ prāṇi rakṣaṇāt” (gītabhāvaprakāśamu - 1 - 262)

(ahiṃsa utkṛṣṭamaina dharmamu - dāni kanna miṃcina dharmamu lēdu - prāṇulanu rakṣiṃcuṭakaṃṭekūḍa prāṇulanu hiṃsiṃcukuṃḍuṭayē goppa dharmamu. prati jīvilōnu bhagavaṃtuni aṃśa yunnadi kanukanu, tanaku cēyabaḍina hiṃsa tanaku eṃta bādhakaramō itarulaku cēsina hiṃsavāriki aṃta bādhakaramugā nuṃḍunu kanuka).

  1. paraḥ paramātmā mīyatē anēna ityētadabhiprāyēṇa paramaḥ ityabhidhāyi, paraḥ śatruḥ saṃsāraḥ mīyatē atralīyatē itivā. yataḥ adhikatamaḥ sukhahētuḥ na bhavati sa paramō dharmaḥ - sa ca bhakti yōgalakṣaṇa ēva.

(parama śatruvaina saṃsāramu eṃdu layiṃcunō - kṣīṇiṃcunō - adi parama dharmamu . dēnikanna heccuga sukhamunu kalugacēyu kāraṇamu maṟi lēdō adi parama dharmamu - adi bhakti yōgamē lakṣaṇamugā galadi).

  1. “ka. parahitamu sēyu nevvaḍu

parama hituṃḍagunu bhūta paṃcakamunakun

barahitame parama dharmamu

parahitunaku neduru lēdu sarvēṃdu mukhī”. (śrī madāṃdhramahābhāgavatamu - 8 - 7 - 235)

(lōkamulaku hitamu cēyuṭayē parama dharmamani śivuḍu viṣamunu mriṃgenu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.