(అన్నింటికంటె హెచ్చు అయిన సుఖము).
బ్రహ్మానందం. (బ్రహ్మమే యగు ఆనందము - బ్రహ్మను పొందుటే ఆనందమైనది - మోక్షసుఖము).
ఆనందఘనత్వాత్ పరమానందః.
(ఘనీభవించిన ఆనందము - ఆనందమ యుడగుటవలన పరమానందుడు - అతనిలోనున్నదంతా ఆనందమే - మోక్షరూపుడగుటవలన).
(దేవలోకమునగల సుఖమును కూడ మించిన సుఖము - మోక్షము - అన్నింటికంటె ఉత్కృష్టమైన ఆనంద రసము).
(సముద్రములోని నీరు వేరు వేరుగా నదులవలె విడిపోయి మరల సముద్రములోనే కలియుచున్నట్లు భగవంతుని సృష్టిలో అతని వలననే కలుగు అన్ని విధములైన ఆనందములు భగవంతునిలోనే ఏకమై పోవుచున్నవి. కనుక భగవతుడు పరమానందము).
(విజ్ఞానమయుడగు భగవంతుని యొక్క ఉత్కృష్టమైనస్థానము - పరమగతి - పరమానందరూపమైనది. దేహమునకు సంబంధించిన లక్షణములుగలవిన్నీ, చతుర్ముఖబ్రహ్మ మొదలు స్తంబమువరకుగల గతులన్నియు అవిద్యచేత కల్పించబడినవి, అందుచేత అపరములు. కర్మచేతను, జ్ఞానముచేతను సాధించబడునది పరమగతి. అందఱి ఆత్మ తానే అయినవాడు, ఎవరిని పొందిన మఱి చూడవలసినదేదియు నుండదో, ఇంక వినతగినది ఉండదో అదియే పరమ సంపద. సమస్తమైనవారి యొక్క సంపదలుకంటె ఇది ఉత్కృష్టమైనది, మిగిలిన సంపదలు కృతకములు - ఒకరు చేసినవి, ఒకరిచే కల్పింప బడినవి. ఇంద్రియములు విషయములతో సంబంధముగలవి. అట్టి విషయములవలన కలుగు ఆనందముకంటె భగవంతుడు - ఆనందస్వరూపుడు - ఇచ్చు ఆనందము (మోక్షము) నిత్యమైనదగుటవలన, ఉత్కృష్టమైనది. ఏది ’ భూమా ’ యో అదియే సుఖమని శ్రుతి చెప్పుచున్నది. ఎక్కడ (బ్రహ్మము కాక) ఇతర వస్తువును చూచునో - ఇతర వస్తువు ఉన్నట్లు తలచునో అది అల్పము - నశించునది, ముఖ్యము గాని సుఖము - ఇది పరమానందము).
(anniṃṭikaṃṭe heccu ayina sukhamu).
brahmānaṃdaṃ. (brahmamē yagu ānaṃdamu - brahmanu poṃduṭē ānaṃdamainadi - mōkṣasukhamu).
ānaṃdaghanatvāt paramānaṃdaḥ.
(ghanībhaviṃcina ānaṃdamu - ānaṃdama yuḍaguṭavalana paramānaṃduḍu - atanilōnunnadaṃtā ānaṃdamē - mōkṣarūpuḍaguṭavalana).
(dēvalōkamunagala sukhamunu kūḍa miṃcina sukhamu - mōkṣamu - anniṃṭikaṃṭe utkṛṣṭamaina ānaṃda rasamu).
(samudramulōni nīru vēru vērugā nadulavale viḍipōyi marala samudramulōnē kaliyucunnaṭlu bhagavaṃtuni sṛṣṭilō atani valananē kalugu anni vidhamulaina ānaṃdamulu bhagavaṃtunilōnē ēkamai pōvucunnavi. kanuka bhagavatuḍu paramānaṃdamu).
(vijñānamayuḍagu bhagavaṃtuni yokka utkṛṣṭamainasthānamu - paramagati - paramānaṃdarūpamainadi. dēhamunaku saṃbaṃdhiṃcina lakṣaṇamulugalavinnī, caturmukhabrahma modalu staṃbamuvarakugala gatulanniyu avidyacēta kalpiṃcabaḍinavi, aṃducēta aparamulu. karmacētanu, jñānamucētanu sādhiṃcabaḍunadi paramagati. aṃdaṟi ātma tānē ayinavāḍu, evarini poṃdina maṟi cūḍavalasinadēdiyu nuṃḍadō, iṃka vinataginadi uṃḍadō adiyē parama saṃpada. samastamainavāri yokka saṃpadalukaṃṭe idi utkṛṣṭamainadi, migilina saṃpadalu kṛtakamulu - okaru cēsinavi, okaricē kalpiṃpa baḍinavi. iṃdriyamulu viṣayamulatō saṃbaṃdhamugalavi. aṭṭi viṣayamulavalana kalugu ānaṃdamukaṃṭe bhagavaṃtuḍu - ānaṃdasvarūpuḍu - iccu ānaṃdamu (mōkṣamu) nityamainadaguṭavalana, utkṛṣṭamainadi. ēdi ’ bhūmā ’ yō adiyē sukhamani śruti ceppucunnadi. ekkaḍa (brahmamu kāka) itara vastuvunu cūcunō - itara vastuvu unnaṭlu talacunō adi alpamu - naśiṃcunadi, mukhyamu gāni sukhamu - idi paramānaṃdamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.