← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరమాణువు paramāṇuvu

Original — తెలుగు
  1. “సతః కార్య రూపస్య పదార్థస్య ప్రపంచస్య విశేషాణాం అంశానాం యశ్చరమో అంత్యో అంశో అస్తి, యో అంత్యం శస్సన్ పునర్విభాగం కర్తుం అశక్యో వర్తతే, యస్య తు పునరం శో నాస్తీతి భావః”.

(‘సత్’ రూపుడైన భగవంతుని యొక్క కార్యమైన (అతనిచేత సృష్టించబడిన) వస్తువు అగు ప్రపంచముయొక్క విశేషణములు - మార్పుచెందిన వస్తువులలో ఏవి ఆఖరి అంశ యగునో - ఏ వస్తువు నైననువిభాగించుచు వెళ్ళగా, ఆఖరిభాగము ఏది కలదో - మఱియు ఆఖరి అంశ అయినది, ఇంకను విభజింపనలవికాదో, అట్టి దేనికి అంశలు (భాగములు) మఱిలేవో, అది పరమాణువు).

  1. సూక్ష్మం, మూల కారణం.

(సూక్ష్మమైనది - సూక్ష్మవస్తువులన్నింటికంటె సూక్ష్మమైనది, ప్రపంచమంతటికి కారణమైనది. దీనిలోనుండియే ప్రపంచములోనున్న ప్రతి వస్తువు పుట్టినది - ఒకదానిలో నుండి ఒకటిగా పుట్టినది. వస్తువులన్నింటికీ మొదటి కారణము, - ఆది కారణము -).

  1. “జాల సూర్య మరీచి సంగత గగనస్థమగు త్రసరేణుషడం శమరయ పరమాణువయ్యె”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 10 - 345). (త్రసరేణు షడన్శము = నలుసులో పదునాఱవ వంతు)

  2. “పరమాణు ద్వయం బొక్క యణువగు” “రెండు పరమాణువులు కలిసిన వస్తువు ద్వ్యణుకము. దీనిని”అణువు” హ్రస్వము అందురు. మూడు ద్వ్యణుకములు కలిసిన వస్తువును త్య్రణుకము అందురు. దీనిని దీర్ఘమని చెప్పుదురు” ఈ ప్రకారముగా కొన్ని అణువులు కలిసి ఒక వస్తువగుచున్నది. ఇట్టివి అనేక వస్తువులు కలిసి ప్రపంచకమైనది - ఒక అణువులోనుండి ఇంకొక అణువు, ఆ రెండింటిలో ప్రతి ఒక్క అణువునుండి మఱియొక అణువు పుట్టుచున్నది - ఈ ప్రకారముగా ప్రపంచకములోని వస్తువులన్నియు ఒకదానిలోనుండి ఒకటి పుట్టుచున్నవి. ఈ కారణమువలన కొందఱు (వైశేషుకులు?) పరమాణువులేసృష్టికి కారణమని యనుచున్నారు. ఒక అణువులోనుండి ఇంకొక అణువు పుట్టుటకు - అట్లే ఒక వస్తువులోనుండి ఇంకొక వస్తువు పుట్టుటకు, పరమాణువులు కలిసి ఒక వస్తువు అగుటకు కారణము ప్రతి పరమాణువు లోను భగవంతుని శక్తి యుండుటయే. భగవంతుని శక్తులలో ఆకర్షణ శక్తి యొకటి - ఒక అణువును ఇంకొక అణువుచేత ఆకర్షింపచేయుట, ఒక వస్తువుచేత ఇంకొక వస్తువును ఆకర్షింపచేయుట - అందుచేతనే భగవంతుని ‘సంకర్షణుడు’ అని అన్నారు - ‘సమ్యక్ కర్షతి ఆకర్షతి ఇతి ఆకర్షతి ఇతి సంకర్షణః’ - (బాగుగా ఆకర్షింప చేయువాడు) - ఇంతేకాక ఒక వస్తువులోనుండి ఇంకొక వస్తువును ఆవిర్భవింప చేయువాడు - పుట్టునట్లు చేయువాడు; అందుచేతనే ‘ఆత్మ’ అని చెప్పబడుచున్నాడు - “కారణాత్ కార్యమార్భావ యతి” (కారణవస్తువులోనుండి ఇంకొక వస్తువును - కార్య వస్తువును - ఆవిర్భవింప చేయువాడు). (compare - life cell). అందుచేత సృష్టికికారణము - ప్రపంచమునకు కారణము భగవంతుడే - కేవలము పరమాణువులుకావు). (“Every particle of matter contains Energy” - “Every particle of matter attracts every other particle”). (“కారణేన వినా కార్యం నాస్తి” - కారణ వస్తువు లేనిదే కార్య వస్తువు కలుగదు).

  3. కంటికి కనబడు వస్తువులన్నియు అణువుకంటె పెద్దవి. అన్నింటికంటె చిన్నది - అణువు కంటె చిన్నది - పరమాణువు - పరమాణువులో కూడ భగవంతుడు - తన చైతన్య శక్తిరూపములో - ఉన్నాడు కనుక పరమాణువుకంటె చిన్నవాడు - అందుచేతనే అతనిని “అణోరణీయాన్” (చిన్న వస్తువుకంటె చిన్నవాడు - సూక్ష్మవస్తువు కంటె సూక్ష్మమైనవాడు -) అని చెప్పుచున్నారు.

  4. “యత్సర్వాత్మనా విభాగ యోగ్యం వస్తు న పరమాణురితి యద్యుచ్యేత తర్హి బ్రహ్మణః ఏవ పరమాణు సంజ్ఞా కృతస్యాత్, తదన్యస్య అల్పస్య దిగ్విభాగార్హత్వేన, అవయవ విభాగా వశ్యం భావాత్; యది పృధివ్యాధి జాతీ యాల్ప పరిమాణ విశ్రాంతి భూమిర్యస్స పరమాణురిత్యుచ్యేత, తర్హి తస్య నమూలకారణత్వం,వినాశిత్వాత్, ఘటవత్; న చ హేత్వ సిద్ధిః - అణవో వినాశినః, పృధివ్యాది జాతీయత్వాత్,ఘటవ దితి”.

“కిం పునః పరమాణు సద్భావే ప్రమాణం? - ఉచ్యతే - జాల సూర్య మరీచిస్థం సర్వతస్సూక్ష్మ తమం, యద్ద్రవ్య ముపలభ్యతే తత్సావయవం, చాక్ష సద్రవ్యతాత్ ఘటవత్ త్త్ర్వణుకావయవోపి సావయవః, మహదారంభకత్వాత్ - తంతువత్ యో ద్వ్యణుకావయవః స పరమాణుః, స చ నిత్యః, కార్యత్వే అనవస్థా ప్రసంగాత్”. (తర్కసంగ్రహ దీపికా)

(ఏ వస్తువునైనను ఏ విధముగా నైనను విభజించుటకు వీలగునది అయిన ఎడల అది పరమాణువు కాదు - అని చెప్పినట్లయితే పరబ్రహ్మ పరమాణువని చెప్పుటకు వీలగును - పరబ్రహ్మకాని వస్తువు ఎంత చిన్నదైనను రెండుగా అవయవవిభాగము చేయుటకు వీలగుచున్నది. భూమిలోని అతి సూక్ష్మమైనభాగము - విభజించుటకు వీలుకాని అంశ - పరమాణువు అని చెప్పిన యడల - అది నశించు స్వభావము కలది కనుక, మూలకారణమని చెప్పుటకు వీలుకాదు - అణువులు పృధివి మొదలగువాటి వంటివి,వాటికి సంబంధించినవి, కనుక, నశించునవి అని చెప్పబడియున్నది. ఇట్లు అయిన యడల పరమాణువు సత్పదార్థము అని చెప్పుటకు ప్రమాణమేది? ఇంటి కిటికీలోనుండి వచ్చు సూర్యకిరణములోనుండునదిన్నీ, అన్నింటికంటె సూక్ష్మ మైనదిన్నీ అయిన వస్తువు ఏది కలదో అది అవయవములు కలది - కంటికి కనబడునది కనుక - అది, రెండు మూడు అగుచూ మహత్తత్త్వమునకు ఆరంభమగునది కనుక - ఇట్లు ప్రతి కార్యవస్తువునకు కారణవస్తువు ఉండవలెను - “కారణేన వినా కార్యం నాస్తి” (కారణములేని కార్యము కలుగదు). ఇట్లు ప్రతికార్యవస్తువునకు కారణము వెతుకుచూ వెనక్కిపోయిన యడల, మొదటి వస్తువు ఏదో మొదటి కారణమేదో తేలదు - ఇట్లు వెతుకుట అనంతము - (అనవస్థాన్యాయము) - అందుచేత పరమాణువులు ఆత్మకాదు - మూలకారణముకాదు, వాటికి కూడ కారణమున్నది కనుక - భగవంతునికి కారణము లేదు, జన్మలేదు - ఇంకొక వస్తువునుండి పుట్టినది కాదు. అందుచేత అతను నిత్యుడు, అవయవవిభాగము చేయుటకు వీలుకానివాడు - అందుచేత భగవంతుడే జగత్తునకు కారణము - పరమాణువులు కావు). ప్రతి పరమాణువులోను భగవంతుడున్నాడు కనుక అతని అతను ఆ పరమాణువులను ఒకదానిచే ఇంకొక దానిని ఆకర్షింపచేసి, వాటినివస్తువుగా చేయుటచేత ప్రపంచములోని వస్తువు లన్నియు కలిగి ప్రపంచమైనది. అందుచేత భగవంతుడే ప్రపంచమునకు కారణము - పరమాణువులు కావు).

  1. కొందఱు శాస్త్రజ్ఞులు పరమాణువు ‘ATOM’ అని చెప్పుచున్నారు. Greek (గ్రీసు) భాషలోని ‘A TOMOS’ అను మాట English భాషలోనికి వచ్చి ‘ఆటోం’ గా మారినది. గ్రీసు భాషలోని ‘A ToMos’ అను మాటకు అర్థము - A = not, ToMos = cut” అ-విభాజ్యము - అనగా ‘That which cannot be cut’ - విభజించుటకు వీలు కానిది. సృష్టిలోని వస్తువులన్నియు కొన్ని అణువులు కలిసియేకదా అయినవి. అవి అన్నియు విభజించుటకు వీలయినవే - ప్రకృతిలో వస్తువులన్నింటినీ భేదించుచు (విభాగించుచు) వెళ్ళగా ఆఖరున మఱి విభజించుటకు వీలులేని అంశ పరమాణువు అని వారి అర్థము - కాని సృష్టిలో ప్రతి వస్తువును విభజించుచుపోగా భేదించబడకుండ నుండునది దానిలోనున్న భగవంతుడే- అతనే అచ్ఛేద్యుడు - “అచ్ఛేద్యోయం, అదాహ్యాయం” (శ్రీమద్భగవద్గీత-2- 24)

అందుచేత ‘A ToMoS’ అని గ్రీకు భాషలోను “Atom” అని ‘English’ భాషలోను చెప్పబడినది భగవంతుడే - సర్వ శక్తులు గల భగవంతుడే - అందుచేత ప్రహ్లాదుని శరీరమంతయు - అణువణువు - భగవన్మయమే అయి యుండుటచేత తన తండ్రి చేసిన మారణ క్రియలకు వధ్యుడు కాలేదు).

“క. హరిమయము విశ్వమంతయు

హరి విశ్వమయుండు సంశయము పనిలేదా

హరిమయము కాని ద్రవ్యము

పరమాణువు లేదు, వంశపావన వింటే“, (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 -1 -17)

Transliteration
  1. “sataḥ kārya rūpasya padārthasya prapaṃcasya viśēṣāṇāṃ aṃśānāṃ yaścaramō aṃtyō aṃśō asti, yō aṃtyaṃ śassan punarvibhāgaṃ kartuṃ aśakyō vartatē, yasya tu punaraṃ śō nāstīti bhāvaḥ”.

(‘sat’ rūpuḍaina bhagavaṃtuni yokka kāryamaina (atanicēta sṛṣṭiṃcabaḍina) vastuvu agu prapaṃcamuyokka viśēṣaṇamulu - mārpuceṃdina vastuvulalō ēvi ākhari aṃśa yagunō - ē vastuvu nainanuvibhāgiṃcucu veḷḷagā, ākharibhāgamu ēdi kaladō - maṟiyu ākhari aṃśa ayinadi, iṃkanu vibhajiṃpanalavikādō, aṭṭi dēniki aṃśalu (bhāgamulu) maṟilēvō, adi paramāṇuvu).

  1. sūkṣmaṃ, mūla kāraṇaṃ.

(sūkṣmamainadi - sūkṣmavastuvulanniṃṭikaṃṭe sūkṣmamainadi, prapaṃcamaṃtaṭiki kāraṇamainadi. dīnilōnuṃḍiyē prapaṃcamulōnunna prati vastuvu puṭṭinadi - okadānilō nuṃḍi okaṭigā puṭṭinadi. vastuvulanniṃṭikī modaṭi kāraṇamu, - ādi kāraṇamu -).

  1. “jāla sūrya marīci saṃgata gaganasthamagu trasarēṇuṣaḍaṃ śamaraya paramāṇuvayye”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 10 - 345). (trasarēṇu ṣaḍanśamu = nalusulō padunāṟava vaṃtu)

  2. “paramāṇu dvayaṃ bokka yaṇuvagu” “reṃḍu paramāṇuvulu kalisina vastuvu dvyaṇukamu. dīnini”aṇuvu” hrasvamu aṃduru. mūḍu dvyaṇukamulu kalisina vastuvunu tyraṇukamu aṃduru. dīnini dīrghamani ceppuduru” ī prakāramugā konni aṇuvulu kalisi oka vastuvagucunnadi. iṭṭivi anēka vastuvulu kalisi prapaṃcakamainadi - oka aṇuvulōnuṃḍi iṃkoka aṇuvu, ā reṃḍiṃṭilō prati okka aṇuvunuṃḍi maṟiyoka aṇuvu puṭṭucunnadi - ī prakāramugā prapaṃcakamulōni vastuvulanniyu okadānilōnuṃḍi okaṭi puṭṭucunnavi. ī kāraṇamuvalana koṃdaṟu (vaiśēṣukulu?) paramāṇuvulēsṛṣṭiki kāraṇamani yanucunnāru. oka aṇuvulōnuṃḍi iṃkoka aṇuvu puṭṭuṭaku - aṭlē oka vastuvulōnuṃḍi iṃkoka vastuvu puṭṭuṭaku, paramāṇuvulu kalisi oka vastuvu aguṭaku kāraṇamu prati paramāṇuvu lōnu bhagavaṃtuni śakti yuṃḍuṭayē. bhagavaṃtuni śaktulalō ākarṣaṇa śakti yokaṭi - oka aṇuvunu iṃkoka aṇuvucēta ākarṣiṃpacēyuṭa, oka vastuvucēta iṃkoka vastuvunu ākarṣiṃpacēyuṭa - aṃducētanē bhagavaṃtuni ‘saṃkarṣaṇuḍu’ ani annāru - ‘samyak karṣati ākarṣati iti ākarṣati iti saṃkarṣaṇaḥ’ - (bāgugā ākarṣiṃpa cēyuvāḍu) - iṃtēkāka oka vastuvulōnuṃḍi iṃkoka vastuvunu āvirbhaviṃpa cēyuvāḍu - puṭṭunaṭlu cēyuvāḍu; aṃducētanē ‘ātma’ ani ceppabaḍucunnāḍu - “kāraṇāt kāryamārbhāva yati” (kāraṇavastuvulōnuṃḍi iṃkoka vastuvunu - kārya vastuvunu - āvirbhaviṃpa cēyuvāḍu). (compare - life cell). aṃducēta sṛṣṭikikāraṇamu - prapaṃcamunaku kāraṇamu bhagavaṃtuḍē - kēvalamu paramāṇuvulukāvu). (“Every particle of matter contains Energy” - “Every particle of matter attracts every other particle”). (“kāraṇēna vinā kāryaṃ nāsti” - kāraṇa vastuvu lēnidē kārya vastuvu kalugadu).

  3. kaṃṭiki kanabaḍu vastuvulanniyu aṇuvukaṃṭe peddavi. anniṃṭikaṃṭe cinnadi - aṇuvu kaṃṭe cinnadi - paramāṇuvu - paramāṇuvulō kūḍa bhagavaṃtuḍu - tana caitanya śaktirūpamulō - unnāḍu kanuka paramāṇuvukaṃṭe cinnavāḍu - aṃducētanē atanini “aṇōraṇīyān” (cinna vastuvukaṃṭe cinnavāḍu - sūkṣmavastuvu kaṃṭe sūkṣmamainavāḍu -) ani ceppucunnāru.

  4. “yatsarvātmanā vibhāga yōgyaṃ vastu na paramāṇuriti yadyucyēta tarhi brahmaṇaḥ ēva paramāṇu saṃjñā kṛtasyāt, tadanyasya alpasya digvibhāgārhatvēna, avayava vibhāgā vaśyaṃ bhāvāt; yadi pṛdhivyādhi jātī yālpa parimāṇa viśrāṃti bhūmiryassa paramāṇurityucyēta, tarhi tasya namūlakāraṇatvaṃ,vināśitvāt, ghaṭavat; na ca hētva siddhiḥ - aṇavō vināśinaḥ, pṛdhivyādi jātīyatvāt,ghaṭava diti”.

“kiṃ punaḥ paramāṇu sadbhāvē pramāṇaṃ? - ucyatē - jāla sūrya marīcisthaṃ sarvatassūkṣma tamaṃ, yaddravya mupalabhyatē tatsāvayavaṃ, cākṣa sadravyatāt ghaṭavat ttrvaṇukāvayavōpi sāvayavaḥ, mahadāraṃbhakatvāt - taṃtuvat yō dvyaṇukāvayavaḥ sa paramāṇuḥ, sa ca nityaḥ, kāryatvē anavasthā prasaṃgāt”. (tarkasaṃgraha dīpikā)

(ē vastuvunainanu ē vidhamugā nainanu vibhajiṃcuṭaku vīlagunadi ayina eḍala adi paramāṇuvu kādu - ani ceppinaṭlayitē parabrahma paramāṇuvani ceppuṭaku vīlagunu - parabrahmakāni vastuvu eṃta cinnadainanu reṃḍugā avayavavibhāgamu cēyuṭaku vīlagucunnadi. bhūmilōni ati sūkṣmamainabhāgamu - vibhajiṃcuṭaku vīlukāni aṃśa - paramāṇuvu ani ceppina yaḍala - adi naśiṃcu svabhāvamu kaladi kanuka, mūlakāraṇamani ceppuṭaku vīlukādu - aṇuvulu pṛdhivi modalaguvāṭi vaṃṭivi,vāṭiki saṃbaṃdhiṃcinavi, kanuka, naśiṃcunavi ani ceppabaḍiyunnadi. iṭlu ayina yaḍala paramāṇuvu satpadārthamu ani ceppuṭaku pramāṇamēdi? iṃṭi kiṭikīlōnuṃḍi vaccu sūryakiraṇamulōnuṃḍunadinnī, anniṃṭikaṃṭe sūkṣma mainadinnī ayina vastuvu ēdi kaladō adi avayavamulu kaladi - kaṃṭiki kanabaḍunadi kanuka - adi, reṃḍu mūḍu agucū mahattattvamunaku āraṃbhamagunadi kanuka - iṭlu prati kāryavastuvunaku kāraṇavastuvu uṃḍavalenu - “kāraṇēna vinā kāryaṃ nāsti” (kāraṇamulēni kāryamu kalugadu). iṭlu pratikāryavastuvunaku kāraṇamu vetukucū venakkipōyina yaḍala, modaṭi vastuvu ēdō modaṭi kāraṇamēdō tēladu - iṭlu vetukuṭa anaṃtamu - (anavasthānyāyamu) - aṃducēta paramāṇuvulu ātmakādu - mūlakāraṇamukādu, vāṭiki kūḍa kāraṇamunnadi kanuka - bhagavaṃtuniki kāraṇamu lēdu, janmalēdu - iṃkoka vastuvunuṃḍi puṭṭinadi kādu. aṃducēta atanu nityuḍu, avayavavibhāgamu cēyuṭaku vīlukānivāḍu - aṃducēta bhagavaṃtuḍē jagattunaku kāraṇamu - paramāṇuvulu kāvu). prati paramāṇuvulōnu bhagavaṃtuḍunnāḍu kanuka atani atanu ā paramāṇuvulanu okadānicē iṃkoka dānini ākarṣiṃpacēsi, vāṭinivastuvugā cēyuṭacēta prapaṃcamulōni vastuvu lanniyu kaligi prapaṃcamainadi. aṃducēta bhagavaṃtuḍē prapaṃcamunaku kāraṇamu - paramāṇuvulu kāvu).

  1. koṃdaṟu śāstrajñulu paramāṇuvu ‘ATOM’ ani ceppucunnāru. Greek (grīsu) bhāṣalōni ‘A TOMOS’ anu māṭa English bhāṣalōniki vacci ‘āṭōṃ’ gā mārinadi. grīsu bhāṣalōni ‘A ToMos’ anu māṭaku arthamu - A = not, ToMos = cut” a-vibhājyamu - anagā ‘That which cannot be cut’ - vibhajiṃcuṭaku vīlu kānidi. sṛṣṭilōni vastuvulanniyu konni aṇuvulu kalisiyēkadā ayinavi. avi anniyu vibhajiṃcuṭaku vīlayinavē - prakṛtilō vastuvulanniṃṭinī bhēdiṃcucu (vibhāgiṃcucu) veḷḷagā ākharuna maṟi vibhajiṃcuṭaku vīlulēni aṃśa paramāṇuvu ani vāri arthamu - kāni sṛṣṭilō prati vastuvunu vibhajiṃcucupōgā bhēdiṃcabaḍakuṃḍa nuṃḍunadi dānilōnunna bhagavaṃtuḍē- atanē acchēdyuḍu - “acchēdyōyaṃ, adāhyāyaṃ” (śrīmadbhagavadgīta-2- 24)

aṃducēta ‘A ToMoS’ ani grīku bhāṣalōnu “Atom” ani ‘English’ bhāṣalōnu ceppabaḍinadi bhagavaṃtuḍē - sarva śaktulu gala bhagavaṃtuḍē - aṃducēta prahlāduni śarīramaṃtayu - aṇuvaṇuvu - bhagavanmayamē ayi yuṃḍuṭacēta tana taṃḍri cēsina māraṇa kriyalaku vadhyuḍu kālēdu).

“ka. harimayamu viśvamaṃtayu

hari viśvamayuṃḍu saṃśayamu panilēdā

harimayamu kāni dravyamu

paramāṇuvu lēdu, vaṃśapāvana viṃṭē”, (śrīmadāṃdhramahābhāgavatamu - 2 -1 -17)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.