← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరమార్థము paramārthamu

Original — తెలుగు
  1. పరమశ్చా సావార్థశ్చ పరమార్థః, - భగవాన్ -

(ఉత్తమమైన అర్థము - భగవంతుడు).

  1. యథార్థము; వాస్తవార్థము; వాస్తవము; వాస్తవస్థితి; స్వర్గము, ఆనందము -

  2. తవైష మహిమా యేన వ్యాప్యమేతచ్చరాచరం “ఇతి యేన త్వయా ఇదం చరాచరం వ్యాప్తం; అతః త్వదాత్మకమే వేదం సర్వమితి త్వదన్యః కోపి నాస్తి. అతః సర్వాత్మతయా త్వమేవైకః పరమార్థః”. (శ్రీరామాన్ రామానుజః)

(ఈ చరాచరరూపమైన జగత్తు అంతయు నీ చేతనే వ్యాపించబడియున్నది. ఇది నీ మహిమయే. ఈ ప్రపంచమంతటను నీవే వ్యాపించియుండుటచేత ఇదంతయు నీవే). నీవు కానిది మఱియొకటి లేదు. అందుచేత నీవే పరమార్థము)

  1. అర్థనా నాత్వస్య భ్రాంతి సిద్ధత్వాత్ ఏక ఏవ పరమార్థతః.

(అర్థములు భ్రాంతివలన అనేకములు; అయిన పరమార్థదృష్టిలో అవన్నియు ఒక్కటే).

  1. “భూతాని శంభుర్భువనాని శంభుః వనాని శంభుర్గిరయశ్చ శంభుః |

స ఏవ సర్వం న తతో(అ)తిరిక్తం తతః స ఏకః పరమార్థమేతత్ ||“. (సూతసంహితాయాం)

(భూతములు, లోకములు, వనములు, కొండలు, అన్నీ శివుడే, అతను కానిది లేదు. ఉన్నదంతయు అతనొక్కడే - ఇది పరమార్థము - తెలియ తగిన నిజము).

  1. “పరమార్థస్య కిం రూపం తస్యా నష్ట చిదాకృతేః |

పునరేతన్మమా చక్ష్వ నిపుణం బోధ వృద్థయే ||“.

“మహా ప్రలయ సంపత్తౌ సర్వకారణ కారణం |

శిష్యతే తత్పరం బ్రహ్మ తది దం వర్ణ్యతే శ్రుణు |

నాశయిత్వా స్యమాత్మానం మనసో వృత్తి సంక్షయే |

సద్రూపం యదనాభ్యేయం తద్రూపం తస్య వస్తునః |

అంగలగ్నే (అ)పి వాతాదౌ స్పర్శాద్యనుభవం వినా |

జీవతశ్చే తసోరూపం యత్తత్పరమాత్మనః || “. (వాసిష్టే)

(పరమార్థమనగా ఏమిటి? - దానిని గుఱించి చెప్పుము - “మహా ప్రళయము సంభవించినపుడు - అన్నియు నశించిపోగా వాటి అన్నింటికీ కారణమైనవాడు (కారణములకు కూడా కారణమైనవాడు) అయిన పరబ్రహ్మయే మిగిలి యుండును. దానిని వర్ణించి చెప్పెదను వినుము - మనో వృత్తులను నశింపచేసి సత్తామాత్రుడుగా నుండునదే - చెప్పలేనిదే - ఆ రూపము. గాలి శరీరమునకు తగులట అను అనుభవము వలననే కాని ప్రత్యక్షముగా తెలియబడదు - రూపము లేదు కనుక. అట్టిదే అప్పటి పరమాత్మ రూపము - అదియే పరమార్థము”).

  1. “స్వప్నమాయే యధాదృష్టే గంధర్వం నగరం యథా |

తథా విశ్వమిదం దృష్టం వేదాంతేషు విచక్షణైః |

న నిరోధో నచోత్పత్తి ర్నబద్ధో నచ సాధకః |

న ముముక్షుర్నవై ముక్త ఇత్యేషా పరమార్థతా ||“. (గౌడపాదకారికా - 31, 32)

(స్వప్నమందు - మాయగా - గంధర్వనగరము - లేనివస్తువు - ఎట్లు కనబడునో అట్లే విచక్షుణులైనవారికి ఉపనిషత్తులలో ప్రపంచము తోచును - లేనట్లే తోచును - అంతా మాయగనే వారికి తోచును - నిరోధముగాని, ఉత్పత్తిగాని లేదు, బద్దుడు గాని, సాధకుడుగాని లేడు, మోక్షము లేదు, మోక్షము కోరువాడులేడు - ఇవన్నియు ఉన్నవి అనుకొనుట కలవంటిది - మాయయే - ఇదియే పరమార్థము - ఉన్నదంతా పరమాత్మయే - ఇదియే యదాథము, నిజ స్థితి).

Transliteration
  1. paramaścā sāvārthaśca paramārthaḥ, - bhagavān -

(uttamamaina arthamu - bhagavaṃtuḍu).

  1. yathārthamu; vāstavārthamu; vāstavamu; vāstavasthiti; svargamu, ānaṃdamu -

  2. tavaiṣa mahimā yēna vyāpyamētaccarācaraṃ “iti yēna tvayā idaṃ carācaraṃ vyāptaṃ; ataḥ tvadātmakamē vēdaṃ sarvamiti tvadanyaḥ kōpi nāsti. ataḥ sarvātmatayā tvamēvaikaḥ paramārthaḥ”. (śrīrāmān rāmānujaḥ)

(ī carācararūpamaina jagattu aṃtayu nī cētanē vyāpiṃcabaḍiyunnadi. idi nī mahimayē. ī prapaṃcamaṃtaṭanu nīvē vyāpiṃciyuṃḍuṭacēta idaṃtayu nīvē). nīvu kānidi maṟiyokaṭi lēdu. aṃducēta nīvē paramārthamu)

  1. arthanā nātvasya bhrāṃti siddhatvāt ēka ēva paramārthataḥ.

(arthamulu bhrāṃtivalana anēkamulu; ayina paramārthadṛṣṭilō avanniyu okkaṭē).

  1. “bhūtāni śaṃbhurbhuvanāni śaṃbhuḥ vanāni śaṃbhurgirayaśca śaṃbhuḥ |

sa ēva sarvaṃ na tatō(a)tiriktaṃ tataḥ sa ēkaḥ paramārthamētat ||“. (sūtasaṃhitāyāṃ)

(bhūtamulu, lōkamulu, vanamulu, koṃḍalu, annī śivuḍē, atanu kānidi lēdu. unnadaṃtayu atanokkaḍē - idi paramārthamu - teliya tagina nijamu).

  1. “paramārthasya kiṃ rūpaṃ tasyā naṣṭa cidākṛtēḥ |

punarētanmamā cakṣva nipuṇaṃ bōdha vṛdthayē ||“.

“mahā pralaya saṃpattau sarvakāraṇa kāraṇaṃ |

śiṣyatē tatparaṃ brahma tadi daṃ varṇyatē śruṇu |

nāśayitvā syamātmānaṃ manasō vṛtti saṃkṣayē |

sadrūpaṃ yadanābhyēyaṃ tadrūpaṃ tasya vastunaḥ |

aṃgalagnē (a)pi vātādau sparśādyanubhavaṃ vinā |

jīvataścē tasōrūpaṃ yattatparamātmanaḥ || “. (vāsiṣṭē)

(paramārthamanagā ēmiṭi? - dānini guṟiṃci ceppumu - “mahā praḷayamu saṃbhaviṃcinapuḍu - anniyu naśiṃcipōgā vāṭi anniṃṭikī kāraṇamainavāḍu (kāraṇamulaku kūḍā kāraṇamainavāḍu) ayina parabrahmayē migili yuṃḍunu. dānini varṇiṃci ceppedanu vinumu - manō vṛttulanu naśiṃpacēsi sattāmātruḍugā nuṃḍunadē - ceppalēnidē - ā rūpamu. gāli śarīramunaku tagulaṭa anu anubhavamu valananē kāni pratyakṣamugā teliyabaḍadu - rūpamu lēdu kanuka. aṭṭidē appaṭi paramātma rūpamu - adiyē paramārthamu”).

  1. “svapnamāyē yadhādṛṣṭē gaṃdharvaṃ nagaraṃ yathā |

tathā viśvamidaṃ dṛṣṭaṃ vēdāṃtēṣu vicakṣaṇaiḥ |

na nirōdhō nacōtpatti rnabaddhō naca sādhakaḥ |

na mumukṣurnavai mukta ityēṣā paramārthatā ||“. (gauḍapādakārikā - 31, 32)

(svapnamaṃdu - māyagā - gaṃdharvanagaramu - lēnivastuvu - eṭlu kanabaḍunō aṭlē vicakṣuṇulainavāriki upaniṣattulalō prapaṃcamu tōcunu - lēnaṭlē tōcunu - aṃtā māyaganē vāriki tōcunu - nirōdhamugāni, utpattigāni lēdu, badduḍu gāni, sādhakuḍugāni lēḍu, mōkṣamu lēdu, mōkṣamu kōruvāḍulēḍu - ivanniyu unnavi anukonuṭa kalavaṃṭidi - māyayē - idiyē paramārthamu - unnadaṃtā paramātmayē - idiyē yadāthamu, nija sthiti).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.