(ప్రత్యగాత్మకన్న వేఱుకాని బ్రహ్మ స్వరూపము).
యద్యత్ శరీరమాదత్తే తేన తేన స యుజ్యతే ||“. (శ్వేతాశ్వతరోపనిషత్)
(స్త్రీ కాదు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు ఏ యే శరీరములనంగీకరించునో ఆ యా శరీరముల యొక్క లింగముతో వ్యవహరింపబడును).
“స్త్రీ పుం రూపధరం విలాస సదనం రామం భజే తారకం ||”. (శ్రీరామకర్ణామృతం - 2 - 102)
“మయ్యేవ సకలం జాతం మ యి సర్వం ప్రతిష్టితం |
మ యి సర్వం లయం యా తి తద్బ్రహ్మాద్వయ మస్మ్యహం ||
అణోరణీయాన హమేవ తద్వన్మహా నహం విశ్వమహం విచిత్రం |
పురాతనో హం పురుషోహమీశో హిరణ్మయోహం శివరూపమస్మి ||
అపాణి పాదో(అ)హమచింత్య శక్తిః, పశ్యామ్య చక్షుః సు శ్రుణోమ్యకర్ణః |
అహం విజానామ వివిక్తరూపో న చాస్తి వేత్తా మమ చిత్సదాహం ||
న భూమి రాపో న చ వహ్నిరస్తి న చానిలోమే (అ)స్తి న చాంబరంచ |
ఏవం విదిత్వా పరమాత్మ రూపం గుహాశయం నిష్కలమద్వితీయం |
సమస్త సాక్షి సదసద్విహీనం ప్రయాతి శుద్ధం పరమాత్మ రూపం ||“. (కైవల్యోపనిషత్)
(నాలో నుండే ఈ ప్రపంచమంతయు పుట్టినది, నాలోనే ప్రతిష్టింపబడి యున్నది, నాలోనే లయమును పొందుచున్నది. అటువంటి అద్వయుడగు బ్రహ్మను నేను. సూక్ష్మాతి సూక్ష్మమైన అణువుకన్న సూక్ష్ముడను. అట్లే పెద్దవాటికన్న పెద్దదైన మహత్తత్వము నేనే - (మహత్తత్త్వముకంటె పెద్దదైనవాడను నేనే. ఈ చిత్ర విచిత్ర మైన ప్రపంచము నేనే - ఈ ప్రపంచము నా ఆకారమే. నేను పురాతనుడను - ప్రపంచము పుట్టకముందునుండి యున్నవాడను. పురమను ప్రతి వస్తువులో నుండుటవలన పురుషుడు అని చెప్పబడినవాడను నేనే, ఈ ప్రపంచమునంతను శాసించువాడగు, హిరణ్మయుడగు శివుని రూపముతో నున్నవాడను నేనే, నేను చేతులు, కాళ్ళు లేనివాడను, చింతించుటకు వీలులేనంత శక్తి గలవాడను, నేత్రములు లేనప్పటికి చూడగలను, చెవులు లేనివాడనైనను బాగుగా వినగలవాడను, నేను అన్నింటిని తెలిసినవాడను, కాని నన్ను తెలిసినవాడేవడు లేడు - ఎల్లపుడు నేను చైతన్యమాత్రుడనే, నాకు భూమికాని, జలముకాని, అగ్నికాని, వాయువుకాని, ఆకాశముకాని లేదు. గుహలో నున్నట్లు ఎవరికిని కనబడకుండునట్లు, తెలియనట్లు ఉన్నటువంటిన్నీ, కళలు లేనటువంటిన్నీ, అద్వితీయు డైనటు వంటిన్నీ, అన్నింటికి సాక్షి అయిననటువంటిన్నీ, ‘సత్’ కాని, ‘అసత్’ అని కాని చెప్ప శక్యముకానటువంటి, శుద్ధమైనటువంటిన్నీ (నిష్కల్మషమైనటువంటిన్నీ) అయిన ఇట్టి నా పరమాత్మ రూపమును తెలుసుకొని పరమాత్మరూపమును పొందును).
పరమానంద మ యోహం పరమ శివోహం భవానాంద పూర్ణః |
జాగ్రత్యుద్భుత బాహ్యేంద్రియ విషయ సమ శివోహం |
స్వప్నే దృష్టః ప్రతి ఫలన మహా మోహ సాక్షి శివోహం ||
అచ్యుతోహ మనం తోహం గోవిందోహ మహం హరిః |
ఆనందోహమ శేషోహ మజోహ మమృతోస్మ్యిహం |
నిత్యోహం నిర్వికల్పోహం నిరాకారో హ మ వ్యయం |
సచ్చిదానంద రూపోహం పరిపూర్ణోస్మి సర్వదా ||.
(నేను జడముకాను, క్షీణించి నశించువాడనుకాను - నాశము లేనివాడను - ప్రాజ్ఞుడను, ప్రత్యగాత్మను, పరమానందమయుడను, పరమశివుడను, భవుడను, ఆనందముతో పూర్తిగా నిండినవాడను - ఆనందమే, పరమ సుఖమే రూపముగా గలవాడను. జాగ్రదవస్థలో బాహ్యేంద్రియ విష య సమ శివుడను, స్వప్నావస్థలో మోహముచే చూచినవాటికి సాక్షి అయినవాడను, ఆనందమయమగు తురీయావస్థలో ఏ విధమైన మలములు లేనివాటికి సాక్షి అయినవాడను, నేనే అచ్యుతడను, అనంతడను నేనే, గోవిందుడను నేనే, హరియు నేనే, ఆనందము నేనే, ఏమియును మిగలకయున్నట్లు అంతయు నేనే, అజుడను - జన్మ లేనివాడను, నేనే. అమృతుడను - మృతి లేనివాడను - మోక్ష రూపుడను - నేనే. నిత్యము - ఎల్లకాలమందుండువాడను నేనే. నిర్వికల్పుడను, నిరాకారుడను, అవ్యయుడను, సత్, చిత్, ఆనందములు - అను మూడు కలిసిన రూపముగలవాడను, ఎల్లపుడు పరిపూర్ణుడను - అవయవములు లేనివాడను, ప్రపంచమంతటిలోను, ప్రపంచములోనిఅన్నివస్తువులలోను పూర్తిగా వ్యాపించి వాటిలో నిండుగ నుండువాడను - నేనే).
శిష్యతే పరమం బ్రహ్మ వర్ణ్యతే తదిదం శ్రుణు |
సద్రూపం యదనా ఖ్యేయం తద్రూపం తస్య వస్తునః |
చిన్మాత్రం నిర్మలం శాంతం తద్రూపం పరమాత్మనః ||” (వాసిష్టే)
(మహాప్రళయము సంభవించినప్పుడు సమస్తకారణ వస్తువులకు కారణమైన పరమాత్మ మిగిలియుండును - అప్పటి అతని రూపము - సన్మాత్రము, పేరు లేనిది, (నామరూపములు లేనిది). చైతన్యమాత్రము (చిన్మాత్రము), ఏ విధమైన మలము (దోషములేక) శుద్ధమైనది, శాంతమైనది).
హర రూపంబు దలంచి. యే గుణ గణధ్యానంబు గావింతుర
ప్పురుష శ్రేష్ట పరిగ్రహంబునకునై పొల్పార దద్ధ్యానగో
చర మూర్తిన్ ధరియింతురుగాదె పరమోత్సాహుండవైమాధవా ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 9 - 298)
(pratyagātmakanna vēṟukāni brahma svarūpamu).
yadyat śarīramādattē tēna tēna sa yujyatē ||“. (śvētāśvatarōpaniṣat)
(strī kādu, puruṣuḍu kāḍu, napuṃsakuḍu kāḍu ē yē śarīramulanaṃgīkariṃcunō ā yā śarīramula yokka liṃgamutō vyavahariṃpabaḍunu).
“strī puṃ rūpadharaṃ vilāsa sadanaṃ rāmaṃ bhajē tārakaṃ ||”. (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 102)
“mayyēva sakalaṃ jātaṃ ma yi sarvaṃ pratiṣṭitaṃ |
ma yi sarvaṃ layaṃ yā ti tadbrahmādvaya masmyahaṃ ||
aṇōraṇīyāna hamēva tadvanmahā nahaṃ viśvamahaṃ vicitraṃ |
purātanō haṃ puruṣōhamīśō hiraṇmayōhaṃ śivarūpamasmi ||
apāṇi pādō(a)hamaciṃtya śaktiḥ, paśyāmya cakṣuḥ su śruṇōmyakarṇaḥ |
ahaṃ vijānāma viviktarūpō na cāsti vēttā mama citsadāhaṃ ||
na bhūmi rāpō na ca vahnirasti na cānilōmē (a)sti na cāṃbaraṃca |
ēvaṃ viditvā paramātma rūpaṃ guhāśayaṃ niṣkalamadvitīyaṃ |
samasta sākṣi sadasadvihīnaṃ prayāti śuddhaṃ paramātma rūpaṃ ||“. (kaivalyōpaniṣat)
(nālō nuṃḍē ī prapaṃcamaṃtayu puṭṭinadi, nālōnē pratiṣṭiṃpabaḍi yunnadi, nālōnē layamunu poṃducunnadi. aṭuvaṃṭi advayuḍagu brahmanu nēnu. sūkṣmāti sūkṣmamaina aṇuvukanna sūkṣmuḍanu. aṭlē peddavāṭikanna peddadaina mahattatvamu nēnē - (mahattattvamukaṃṭe peddadainavāḍanu nēnē. ī citra vicitra maina prapaṃcamu nēnē - ī prapaṃcamu nā ākāramē. nēnu purātanuḍanu - prapaṃcamu puṭṭakamuṃdunuṃḍi yunnavāḍanu. puramanu prati vastuvulō nuṃḍuṭavalana puruṣuḍu ani ceppabaḍinavāḍanu nēnē, ī prapaṃcamunaṃtanu śāsiṃcuvāḍagu, hiraṇmayuḍagu śivuni rūpamutō nunnavāḍanu nēnē, nēnu cētulu, kāḷḷu lēnivāḍanu, ciṃtiṃcuṭaku vīlulēnaṃta śakti galavāḍanu, nētramulu lēnappaṭiki cūḍagalanu, cevulu lēnivāḍanainanu bāgugā vinagalavāḍanu, nēnu anniṃṭini telisinavāḍanu, kāni nannu telisinavāḍēvaḍu lēḍu - ellapuḍu nēnu caitanyamātruḍanē, nāku bhūmikāni, jalamukāni, agnikāni, vāyuvukāni, ākāśamukāni lēdu. guhalō nunnaṭlu evarikini kanabaḍakuṃḍunaṭlu, teliyanaṭlu unnaṭuvaṃṭinnī, kaḷalu lēnaṭuvaṃṭinnī, advitīyu ḍainaṭu vaṃṭinnī, anniṃṭiki sākṣi ayinanaṭuvaṃṭinnī, ‘sat’ kāni, ‘asat’ ani kāni ceppa śakyamukānaṭuvaṃṭi, śuddhamainaṭuvaṃṭinnī (niṣkalmaṣamainaṭuvaṃṭinnī) ayina iṭṭi nā paramātma rūpamunu telusukoni paramātmarūpamunu poṃdunu).
paramānaṃda ma yōhaṃ parama śivōhaṃ bhavānāṃda pūrṇaḥ |
jāgratyudbhuta bāhyēṃdriya viṣaya sama śivōhaṃ |
svapnē dṛṣṭaḥ prati phalana mahā mōha sākṣi śivōhaṃ ||
acyutōha manaṃ tōhaṃ gōviṃdōha mahaṃ hariḥ |
ānaṃdōhama śēṣōha majōha mamṛtōsmyihaṃ |
nityōhaṃ nirvikalpōhaṃ nirākārō ha ma vyayaṃ |
saccidānaṃda rūpōhaṃ paripūrṇōsmi sarvadā ||.
(nēnu jaḍamukānu, kṣīṇiṃci naśiṃcuvāḍanukānu - nāśamu lēnivāḍanu - prājñuḍanu, pratyagātmanu, paramānaṃdamayuḍanu, paramaśivuḍanu, bhavuḍanu, ānaṃdamutō pūrtigā niṃḍinavāḍanu - ānaṃdamē, parama sukhamē rūpamugā galavāḍanu. jāgradavasthalō bāhyēṃdriya viṣa ya sama śivuḍanu, svapnāvasthalō mōhamucē cūcinavāṭiki sākṣi ayinavāḍanu, ānaṃdamayamagu turīyāvasthalō ē vidhamaina malamulu lēnivāṭiki sākṣi ayinavāḍanu, nēnē acyutaḍanu, anaṃtaḍanu nēnē, gōviṃduḍanu nēnē, hariyu nēnē, ānaṃdamu nēnē, ēmiyunu migalakayunnaṭlu aṃtayu nēnē, ajuḍanu - janma lēnivāḍanu, nēnē. amṛtuḍanu - mṛti lēnivāḍanu - mōkṣa rūpuḍanu - nēnē. nityamu - ellakālamaṃduṃḍuvāḍanu nēnē. nirvikalpuḍanu, nirākāruḍanu, avyayuḍanu, sat, cit, ānaṃdamulu - anu mūḍu kalisina rūpamugalavāḍanu, ellapuḍu paripūrṇuḍanu - avayavamulu lēnivāḍanu, prapaṃcamaṃtaṭilōnu, prapaṃcamulōniannivastuvulalōnu pūrtigā vyāpiṃci vāṭilō niṃḍuga nuṃḍuvāḍanu - nēnē).
śiṣyatē paramaṃ brahma varṇyatē tadidaṃ śruṇu |
sadrūpaṃ yadanā khyēyaṃ tadrūpaṃ tasya vastunaḥ |
cinmātraṃ nirmalaṃ śāṃtaṃ tadrūpaṃ paramātmanaḥ ||” (vāsiṣṭē)
(mahāpraḷayamu saṃbhaviṃcinappuḍu samastakāraṇa vastuvulaku kāraṇamaina paramātma migiliyuṃḍunu - appaṭi atani rūpamu - sanmātramu, pēru lēnidi, (nāmarūpamulu lēnidi). caitanyamātramu (cinmātramu), ē vidhamaina malamu (dōṣamulēka) śuddhamainadi, śāṃtamainadi).
hara rūpaṃbu dalaṃci. yē guṇa gaṇadhyānaṃbu gāviṃtura
ppuruṣa śrēṣṭa parigrahaṃbunakunai polpāra daddhyānagō
cara mūrtin dhariyiṃturugāde paramōtsāhuṃḍavaimādhavā ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 9 - 298)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.