(పరమాత్మ యొక్క స్వస్వరూపము - ప్రకృతితో కలియని నిష్కలంకమైన స్థితి, సత్తామాత్రము; సర్వోత్కృష్టమైన స్థితి).
పరమాత్మ స్వస్వరూపము - పరమాత్మ యొక్క నిర్గుణ, నిరాకార, నిర్విశేష స్వరూపము.
పరం ప్రకృష్టం భావం, పరమాత్మ తత్వం, ఆకాశాదపి అంతరతమం.
(పరమాత్మ తత్వము - ఆకాశము సూక్ష్మమగుటచేత అన్నింటిలో ప్రవేశించియుండును - ఆకాశముకన్న సూక్ష్మమైనందున దానిలోకూడ నుండు భగవంతుడు).
పరం భావమజానంతోమమావ్యయమనుత్తమం ||“. (శ్రీమద్భగవద్గీత - 7 - 24)
(నేను నాశము లేనివాడను, అవ్యక్తుడను - కంటికి కనబడనివాడను - నా కంటె ఇతరుడు ఉత్తముడు లేనివాడను - అట్టి నా పరంభావమును - నా స్వస్వభావము - పరమాత్మ తత్వమును తెలియలేక కంటికి కనబడుచుండు ఇతరులవలె మూఢులు తలచెదరు).
రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞికే ||
పరస్తస్మాత్తు భావో(అన్యో(అ)వ్యక్తో అవ్యక్తాత్సనాతనః |
యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి ||“. (శ్రీమద్భగవద్గీత - 8 - 18, 20)
(ప్రకృతి, అవ్యక్తము, చతుర్ముఖబ్రహ్మ అను చెప్పబడుచున్నదానినుండి, దానికి పగటికాలములో దానినుండి అన్ని వస్తువులు పుట్టుచుండును - అవ్యక్తముగా దానిలో లీనమైయున్నవి వ్యక్తమగును - సృష్టి జరుగును. వ్యక్తమైన సర్వభూతములు దానికి రాత్రికాలమగునపుడు దానిలోనే లీనమగును - ప్రళయమగుచుండును - ఇట్లు సర్వభూతముల సృష్టి లయములు కలుగచేయుచుండు అవ్యక్తము (లేక చతుర్ముఖ బ్రహ్మ) కంటె అవ్యక్తమై, సూక్ష్మమై, అతనికన్న పరమమై ప్రకృష్టమైన తత్వము గలదు - పరమభావము గలదు. అది శాశ్వతమైనది, చతుర్ముఖునివలె ప్రళయములో నశించునదికాదు, అన్ని భూతములు నశించినను అది నశించదు. అదియే పరతత్వము, అక్షరము, పరమగతి. అదియే నిర్గుణ, నిరాకార, నిర్విశేష పరబ్రహ్మ. అది అట్లుండుటయే పరంభావము).
(paramātma yokka svasvarūpamu - prakṛtitō kaliyani niṣkalaṃkamaina sthiti, sattāmātramu; sarvōtkṛṣṭamaina sthiti).
paramātma svasvarūpamu - paramātma yokka nirguṇa, nirākāra, nirviśēṣa svarūpamu.
paraṃ prakṛṣṭaṃ bhāvaṃ, paramātma tatvaṃ, ākāśādapi aṃtaratamaṃ.
(paramātma tatvamu - ākāśamu sūkṣmamaguṭacēta anniṃṭilō pravēśiṃciyuṃḍunu - ākāśamukanna sūkṣmamainaṃduna dānilōkūḍa nuṃḍu bhagavaṃtuḍu).
paraṃ bhāvamajānaṃtōmamāvyayamanuttamaṃ ||“. (śrīmadbhagavadgīta - 7 - 24)
(nēnu nāśamu lēnivāḍanu, avyaktuḍanu - kaṃṭiki kanabaḍanivāḍanu - nā kaṃṭe itaruḍu uttamuḍu lēnivāḍanu - aṭṭi nā paraṃbhāvamunu - nā svasvabhāvamu - paramātma tatvamunu teliyalēka kaṃṭiki kanabaḍucuṃḍu itarulavale mūḍhulu talacedaru).
rātryāgamē pralīyaṃtē tatraivāvyakta saṃjñikē ||
parastasmāttu bhāvō(anyō(a)vyaktō avyaktātsanātanaḥ |
yaḥ sa sarvēṣu bhūtēṣu naśyatsu na vinaśyati ||“. (śrīmadbhagavadgīta - 8 - 18, 20)
(prakṛti, avyaktamu, caturmukhabrahma anu ceppabaḍucunnadāninuṃḍi, dāniki pagaṭikālamulō dāninuṃḍi anni vastuvulu puṭṭucuṃḍunu - avyaktamugā dānilō līnamaiyunnavi vyaktamagunu - sṛṣṭi jarugunu. vyaktamaina sarvabhūtamulu dāniki rātrikālamagunapuḍu dānilōnē līnamagunu - praḷayamagucuṃḍunu - iṭlu sarvabhūtamula sṛṣṭi layamulu kalugacēyucuṃḍu avyaktamu (lēka caturmukha brahma) kaṃṭe avyaktamai, sūkṣmamai, atanikanna paramamai prakṛṣṭamaina tatvamu galadu - paramabhāvamu galadu. adi śāśvatamainadi, caturmukhunivale praḷayamulō naśiṃcunadikādu, anni bhūtamulu naśiṃcinanu adi naśiṃcadu. adiyē paratatvamu, akṣaramu, paramagati. adiyē nirguṇa, nirākāra, nirviśēṣa parabrahma. adi aṭluṃḍuṭayē paraṃbhāvamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.