← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరాపరం parāparaṃ

Original — తెలుగు
  1. పరం సూక్ష్మం, అపరం స్థూలంచ -

(సూక్ష్మ రూపము, స్థూలరూపముగల భగవంతుడు - పరబ్రహ్మ - పరబ్రహ్మకు పరాపరరూపములు రెండునూ కలవు - భక్తులననుగ్రహించుటకు ఎత్తిన రామకృష్ణాది అవతారములు అపరారూపములు; అవ్యక్త, అనంత, సద్ఘన, చిద్ఘన స్వరూపము పరా రూపము. అదియే భగవంతుని వాస్తవరూపము - దృష్టికి పరమై, అవ్యయమై, అపరిచ్ఛిన్నమైన రూపము -).

  1. “యత్ర అవిద్యా కృత నామరూపాది విశేష ప్రతిషేధేన అస్థూలాది శబ్దై ర్బ్రహ్మోప దిశ్యతే తత్పరం - తదేవ యత్ర నామరూపాది విశేషా ణాం కేన చిద్విశిష్టం ఉపాసనాయ ఉపదిశ్యతే -”మనోమయః ప్రాణ శరీరోభా రూపః ” ఇత్యాది శబ్దైః, తదపరం“.

(అవిద్యా కార్యములైన నామరూపములు మొదలగు విశేషములు లేక “అస్థూలము” (స్థూలము కానిది - సూక్ష్మాతి సూక్ష్మమైనది, అందుచేత సాధారణులకు కానరానిది) అను మొదలగు శబ్దములచేత - మాటలచేత చెప్పబడిన బ్రహ్మ పరబ్రహ్మ. నామరూపములు మొదలగు విశేషణము లుతో ఉపదేశింపబడినది - ‘మనోమయము’ అనిన్నీ, ప్రాణము శరీరముగా గలదిన్నీ, ప్రాణమే రూపముగా గలదిన్నీ” అని చెప్పబడు బ్రహ్మ ‘అపరం బ్రహ్మ’).

Transliteration
  1. paraṃ sūkṣmaṃ, aparaṃ sthūlaṃca -

(sūkṣma rūpamu, sthūlarūpamugala bhagavaṃtuḍu - parabrahma - parabrahmaku parāpararūpamulu reṃḍunū kalavu - bhaktulananugrahiṃcuṭaku ettina rāmakṛṣṇādi avatāramulu aparārūpamulu; avyakta, anaṃta, sadghana, cidghana svarūpamu parā rūpamu. adiyē bhagavaṃtuni vāstavarūpamu - dṛṣṭiki paramai, avyayamai, aparicchinnamaina rūpamu -).

  1. “yatra avidyā kṛta nāmarūpādi viśēṣa pratiṣēdhēna asthūlādi śabdai rbrahmōpa diśyatē tatparaṃ - tadēva yatra nāmarūpādi viśēṣā ṇāṃ kēna cidviśiṣṭaṃ upāsanāya upadiśyatē -”manōmayaḥ prāṇa śarīrōbhā rūpaḥ ” ityādi śabdaiḥ, tadaparaṃ”.

(avidyā kāryamulaina nāmarūpamulu modalagu viśēṣamulu lēka “asthūlamu” (sthūlamu kānidi - sūkṣmāti sūkṣmamainadi, aṃducēta sādhāraṇulaku kānarānidi) anu modalagu śabdamulacēta - māṭalacēta ceppabaḍina brahma parabrahma. nāmarūpamulu modalagu viśēṣaṇamu lutō upadēśiṃpabaḍinadi - ‘manōmayamu’ aninnī, prāṇamu śarīramugā galadinnī, prāṇamē rūpamugā galadinnī” ani ceppabaḍu brahma ‘aparaṃ brahma’).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.