← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరతరం parataraṃ

Original — తెలుగు
  1. “మత్తః పరతరం కించిన్నాన్యదస్తి ధనంజయ |

మ యి సర్వమిదం ప్రోతం సూత్రే మణి గణా ఇవ ||“. (శ్రీమద్భగవద్గీత - 7 - 7)

(నా కంటె పరతరమైనది ఇంకొకటి లేదు - ఈ సమస్తమైన జగత్తు, దారమందు మణులువలె, నా యందు ప్రోతమై యున్నవి. దారము మణులకు ఆధారమైనట్లు నేను ఈ జగత్తునకు అంతటికీ ఆధారమై యున్నాను).

“సర్వకారణస్యాపి ప్రకృతిద్వయస్య కారణత్వేన సర్వా చేతనవస్తు శేషిణః, చేతనస్యాపి శేషిత్వేన కారణతయా అహం పరతరః.తధా జ్ఞాన శక్తి బలాది గుణయోగేన చ అహమేవ పరతరః”.

(సమస్తమైనవాటికి కారణమైన పరాప్రకృతికి అపరాప్రకృతికి కూడా కారణమగుటవలన, సమస్త చేతన వస్తువులకు (చైతన్యము గల వస్తువులకు) కారణమగుటవలనను - అవన్నియు లయము పొందగా శేషించియుండుటవలనను, (మిగిలియుండుటవలనను), నేనే (శ్రీకృష్ణభగవానుడే) పరతరము - పరము కంటె పరము (ఉత్కృష్టమైనదానికంటె ఉత్కృష్టమైనది) - అవ్యక్తమని చెప్పబడు ప్రకృతిపరము, దానికంటె పరము - పరాత్పరము లేక పరతరము. జ్ఞాన శక్తి, బలము మొదలగు ఆరు గుణములు (షడ్విధైశ్వర్యములు) కలిగి యుండుటచేత కూడ భగవంతుడు పరము కంటె పరము - పరాత్పరుడు - పరతరము).

  1. “చేతనా చేతనాత్మకం కౄత్స్నం జగత్ మదీయం, కాలే కాలే మత్త ఏవ ఉత్పద్యతే, మ యి చ ప్రలీయతే, మ యి ఏవ అవస్థితం, మచ్ఛరీర భూతం, మదాత్మకంచ, ఇత్యహమేవ కారణావస్థాయాం కార్యావస్థా యాంచ సర్వ శరీరతయా సర్వ ప్రకారః అవస్థితః - అతః కారణత్వేన శేషిత్వేన చ జ్ఞానాద్య సంఖ్యేయ కల్యాణ గుణగణైశ్చ అహమేవ సర్వైప్రకారైః పరతరః. మత్తో అన్యత్ కేనాపి కల్యాణ గుణ గణేన పరతరం న విద్యతే”. (శ్రీరామాన్ రామానుజః)

(చేతనా చేతన రూపమైన జగత్తు అంతయు నాదే. కాలానుసారముగా జగత్తు నానుండి పుట్టుచున్నది, నాలోనే లీనమగుచున్నది - స్థితికాలములో నాలోనే ఉంటున్నది. ఈ జగత్తు నా శరీరమే. దీనిలోని కారణ వస్తువులు నేనే, కార్య వస్తువులు నేనే. అందుచేత, అన్నింటికి కారణమగుటచేత, అన్నియు నశించిపోగా శేషించి (మిగిలి) యుండుటచేత, జ్ఞానము, బలము మొదలగు అనేక కల్యాణగుణములు కలిగియుండుటచేత, అన్ని విధములను నేనే పరతరము - అన్నిటికంటె పరము (ఉత్కృష్టము) అయినవాడను. కల్యాణగుణములు కలిగి నాకంటె పరమైన (ఉత్కృష్టమైనది) మఱేదియు లేదు -).

  1. “ఇంద్రియేభ్యః పరాహ్యార్థాః అర్థేభ్యశ్చ పరం మనః |

మనసస్య పరాబుద్ధిః బుద్ధేః పరతరం మహః |

మహతః పరమవ్యక్తం అవ్యక్తాత్పురుషః పరః |

పురుషాన్నపరం కించిత్ సాకాష్ఠా సా పరగతిః ||“. (శ్రీమద్భగవద్గీత - )

(చూడుము - ‘పరతః పరః’).

  1. “శివాత్పరతరం నాస్తి”

(శివునికంటె ఉత్కృష్టమైనది లేదు).

Transliteration
  1. “mattaḥ parataraṃ kiṃcinnānyadasti dhanaṃjaya |

ma yi sarvamidaṃ prōtaṃ sūtrē maṇi gaṇā iva ||“. (śrīmadbhagavadgīta - 7 - 7)

(nā kaṃṭe parataramainadi iṃkokaṭi lēdu - ī samastamaina jagattu, dāramaṃdu maṇuluvale, nā yaṃdu prōtamai yunnavi. dāramu maṇulaku ādhāramainaṭlu nēnu ī jagattunaku aṃtaṭikī ādhāramai yunnānu).

“sarvakāraṇasyāpi prakṛtidvayasya kāraṇatvēna sarvā cētanavastu śēṣiṇaḥ, cētanasyāpi śēṣitvēna kāraṇatayā ahaṃ parataraḥ.tadhā jñāna śakti balādi guṇayōgēna ca ahamēva parataraḥ”.

(samastamainavāṭiki kāraṇamaina parāprakṛtiki aparāprakṛtiki kūḍā kāraṇamaguṭavalana, samasta cētana vastuvulaku (caitanyamu gala vastuvulaku) kāraṇamaguṭavalananu - avanniyu layamu poṃdagā śēṣiṃciyuṃḍuṭavalananu, (migiliyuṃḍuṭavalananu), nēnē (śrīkṛṣṇabhagavānuḍē) parataramu - paramu kaṃṭe paramu (utkṛṣṭamainadānikaṃṭe utkṛṣṭamainadi) - avyaktamani ceppabaḍu prakṛtiparamu, dānikaṃṭe paramu - parātparamu lēka parataramu. jñāna śakti, balamu modalagu āru guṇamulu (ṣaḍvidhaiśvaryamulu) kaligi yuṃḍuṭacēta kūḍa bhagavaṃtuḍu paramu kaṃṭe paramu - parātparuḍu - parataramu).

  1. “cētanā cētanātmakaṃ kṝtsnaṃ jagat madīyaṃ, kālē kālē matta ēva utpadyatē, ma yi ca pralīyatē, ma yi ēva avasthitaṃ, maccharīra bhūtaṃ, madātmakaṃca, ityahamēva kāraṇāvasthāyāṃ kāryāvasthā yāṃca sarva śarīratayā sarva prakāraḥ avasthitaḥ - ataḥ kāraṇatvēna śēṣitvēna ca jñānādya saṃkhyēya kalyāṇa guṇagaṇaiśca ahamēva sarvaiprakāraiḥ parataraḥ. mattō anyat kēnāpi kalyāṇa guṇa gaṇēna parataraṃ na vidyatē”. (śrīrāmān rāmānujaḥ)

(cētanā cētana rūpamaina jagattu aṃtayu nādē. kālānusāramugā jagattu nānuṃḍi puṭṭucunnadi, nālōnē līnamagucunnadi - sthitikālamulō nālōnē uṃṭunnadi. ī jagattu nā śarīramē. dīnilōni kāraṇa vastuvulu nēnē, kārya vastuvulu nēnē. aṃducēta, anniṃṭiki kāraṇamaguṭacēta, anniyu naśiṃcipōgā śēṣiṃci (migili) yuṃḍuṭacēta, jñānamu, balamu modalagu anēka kalyāṇaguṇamulu kaligiyuṃḍuṭacēta, anni vidhamulanu nēnē parataramu - anniṭikaṃṭe paramu (utkṛṣṭamu) ayinavāḍanu. kalyāṇaguṇamulu kaligi nākaṃṭe paramaina (utkṛṣṭamainadi) maṟēdiyu lēdu -).

  1. “iṃdriyēbhyaḥ parāhyārthāḥ arthēbhyaśca paraṃ manaḥ |

manasasya parābuddhiḥ buddhēḥ parataraṃ mahaḥ |

mahataḥ paramavyaktaṃ avyaktātpuruṣaḥ paraḥ |

puruṣānnaparaṃ kiṃcit sākāṣṭhā sā paragatiḥ ||“. (śrīmadbhagavadgīta - )

(cūḍumu - ‘parataḥ paraḥ’).

  1. “śivātparataraṃ nāsti”

(śivunikaṃṭe utkṛṣṭamainadi lēdu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.