(ఈ ప్రపంచము యొక్క సృష్టిస్థితి లయములకు కారణమైన నారాయణుడే పరతత్వము. జాగ్రత్స్వప్న సుషుప్తులందు బ్రహ్మముగనుండునది పరతత్వము - దేహమును, ఇంద్రియములను, మనస్సును ఏది జీవింపచేయునో, మఱియును వాటిని వాటి వాటి విషయములందు ప్రవర్తింపచేయునో, అదే పరమాత్మ, అదే పరతత్వము. ఈ ప్రకారముగా అనేక విధములుగా ప్రకాశమగుచున్నను పరతత్వమనునది ఒకటే).
షడ్విం శకమితి ఖ్యాతం యత్ పరాత్పర మక్షయం |
స ఏవ భగవాన్ దేవః సర్వ తత్వాది రవ్య యః |
సర్వ తత్వ విధాన జ్ఞః ప్రధాన పురుషే శ్వరః ||“. (మహాభారతే - అనుశాసనిక పర్వే)
(పరాత్పరమైనది, సనాతనమైనది, అక్షయమైనదిన్నీ, తత్వములన్నింటికి మూలమైనదిన్నీ, అవ్యయమైనదిన్నీ ప్రధానపురుషుడు అయిన భగవంతుడే పరతత్వము).
(దీనినే పరతత్వమని విద్వాంసులు ధ్యానించుచున్నారు).
అయత్న సిద్ధా పరమాముక్తిః తేషాం న సంశయః ||
నిర్వికల్పం పరం నామ తత్వం సాక్షాచ్ఛివః పరం ||“. (స్కాందే)
(నిర్వికల్పమైన పరతత్వమందు ఎవరికి శ్రద్ధ కలుగునో వారికి ప్రయత్నము లేకనే పరమ ముక్తి చేకూరును. ఇందుకు సందేహము లేదు. నిర్వికల్పమైన పరతత్వము సాక్షాత్తు పరమ శివుడే).
తల్లక్షణం, మహాప్రాజ్ఞ, శ్రుతిషు శ్రూయతే సదా |
సత్యం జ్ఞానం సదానందం జగత్సర్గాది కారణం |.
(శివుడే పరతత్వము. అతనికంటె అధికమైనది లేదు. పరతత్వమైన ఆ శివుని లక్షణము శ్ర్తుతులలో చెప్పబడు చున్నది - సత్యము, జ్ఞానము, సదానందము, (సచ్చిదానందములు) అనిన్నీ, జగత్తు యొక్క సృష్టిస్థితి లయములకు కారణమైనది పరతత్వమని దాని లక్షణములు చెప్పబడినవి).
సమాసేన ప్రవక్ష్యామి శ్రుణుత శ్రద్ధయా సహ |
దృశ్యం జగదిదం సర్వం శుక్తి తా రజతాదివత్ |
అజ్ఞానేనైవ కస్మింశ్చిత్ కల్పితం నైవ వస్తుతః |
కల్పితస్య సమస్తస్య యదధిష్టాన మాక్తికాః |
తత్ కల్పిత పదార్థేన భిన్నలక్షణమేవహి |
అధిష్టాన మసత్యస్య సత్యమేవ న సంశయః |
శుక్తికా వ్యవహరేతు సతీ న రజతోపమా |
కేవలం సత్యతా శుక్తౌ దృష్టాంతత్వేన గృహ్యతే |
న వ్యావహారి కత్వంచ సత్యత్వం తస్య హేతుజం |
సర్వసాక్షి స్వరూపస్య ప్రాగభావాద్య సంభవాత్ |
జన్మ నాశాద్యభావేన సదా సత్యం పరం పదం |
కల్పితస్య సమస్తస్య భాసకత్వాత్ స్వయం ప్రభం |
స్వయం ప్రకాశ చైతన్యం తద్ధి సర్వావ భాసకం |
యస్య శేషతయా సర్వమిదం ప్రేమాస్పదం భవేత్ |
శేషిరూపం తు తత్ సాక్షాత్ సుఖం తత్సుఖమేవహి |
బ్రహ్మణశ్శేష భూతం హి జగత్ సర్వ చరాచరం |
అతః శేషిపరం తత్వం పరమానంద లక్షణం |
సత్తయా చ ప్రకాశేన ప్రియేణ చ పరం పదం |
సత్యం జ్ఞానం సుఖం చాపి స్వరూపం పరవస్తునః
- - - సత్య చిదానందాః గుణాః న పరవస్తు నః |
స్వరూపమేవ - - - || (పరాశరోపపురాణే)
(సమస్త జగత్తునకు ఆశ్రయమైన పరతత్వము గుఱించి సంక్షేమముగా చెప్పుచున్నాను - శ్రద్ధతో వినుము - ఈ జగత్తు అంతయూ - ముత్యపు చిప్పను చూచి అది వెండియని కల్పించుకొనినట్లే - అజ్ఞానము చేత కల్పించబడినది - అది యధార్థముగా జగత్తు అని వేరుగా లేదు - కల్పించబడిన వస్తువుయొక్క అధిష్టానము కల్పిత పదార్థముకంటె వేరు లక్షణములు కలది. అసత్ యొక్క అధిష్టానము - అసత్తును అధిష్టించియున్నది సత్తే, సంశయములేదు - ముత్యపుచిప్ప విషయము దృష్టాంతము కొఱకే చెప్పబడినది. సర్వ సాక్షి స్వరూపుడగు పరబ్రహ్మకు జననమరణములు లేనందున ఎల్లపుడూ ఉండువాడే - అతనే పరమపదము - కల్పించబడిన సమస్తమును ప్రకాశింపచేయునది కనుకనూ, తాను స్యయముగా ప్రకాశించునది కనుకను, చైతన్యమాత్రము కనుకను, ప్రళయకాలమందు తాను ఒక్కడే మిగిలి యుండువాడు కనుకను, ఆ మిగిలియుండు తత్వము పరమానంద లక్షణము - అది సత్ అగుటచేతను, (అన్ని కాలములందుండున దగుటచేతను) స్వయం ప్రకాశమగుటచేతను, ప్రేమాస్పదమగుటచేతను అదియే పరమ పదము - (పరమప్రాప్తి స్థానము). సత్యం, జ్ఞానము, సుఖము (సత్, చిత్, ఆనందములు) పరుడైన భగవంతుని యొక్క స్వరూపము - ఈ సచ్చిదానందము పరమాత్మ యొక్క గుణములు కావు - అవి అతని రూపము - అట్టి భగవంతుడే పరతత్వము).
బరతత్వమనంగ, బరమపదమనగను, నీ
శ్వరుడన, కృష్ణుడన, జగ
ద్భరితుడు నారాయణుండు దా వెలుగొందున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 51)
తేషాం త్రయాణామధికః సర్వ కారణ మీశ్వరః ||“. (సూత సంహిత)
(చతుర్ముఖబ్రహ్మ, విష్ణువు, రుద్రుడు - ఈ ముగ్గురు పరతత్వము యొక్క విభూతులు (రూపములు) - పరతత్వమే యీ ముగ్గురి రూపములుగా మారినది. ఈ ముగ్గురులో అధికుడు, అన్నింటికి కారణమైనవాడు, పరమేశ్వరుడే) - “శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివః” (శివుని హృదయము విష్జ్ణువు, విష్ణుని హృదయము శివుడు; “శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణువే” (విష్ణురూపుడగు శివునికి, శివరూపుడగు విష్ణువునకు నమస్కారము). ఈ రెండింటివలన తెలియునదేమనగా, శివునకు విష్ణువునకు భేదము లేదని, ఇద్దరూ ఒకటే యని - ఒకటే పరతత్వమని -).
నుప్పు లవణమన్న నొకటిగాదె
భాషలిట్లు వేరు పరతత్వమొక్కటే
విశ్వదాభిరామ వినురవేమ”. (వేమన)
“వ. కృష్ణానుచరులైన యదువృష్ణి కుమారులమ్మహనీయమూర్తిం దమకు నగ్రేసరుండని కాని లీలామానుష విగ్రహుండైన పరమాత్ముండని యెఱుంగక, హరిమాయా జనితంబగు నసద్భావంబునం జేసి భోజన శయనాసనాను గమనంబులం జేరి సహోదరాది భావంబులం గూడి చరియింతురు. అద్దేవుని మాయా పయోధి నిమగ్నులు గాకుండ నబ్జభవాదులకైనం దీఱదు - సర్వగుణ గరిష్టులును, సత్పురుష శ్రేష్టులును నగు పరమ భాగవతులకుం దక్క దక్కిన వారలకుం జెప్పనేల అదియునుం గాక అభిజనవిద్యాధన బల గర్వమదాంధీ భూత చేతస్కులైన శిశుపాలాది భూపాలకులమ్మహాత్మునిం బరతత్వంబని యెఱుంగక నిందించు దుర్భాషలు దలచి మనస్తాపంబునొందుచుండుదును.” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 2 - 87)
“అరిషడ్వర్గంబును జయించి బరతత్వంబు నెఱింగిన నీశ్వరుండగు. చిత్తంబెంతకాలంబు విషయాసక్తంబగునంత తడవు సంసారచక్రంబునందు సంచరించుంగావున మహావీరుండైనను దనకు శత్రువైన మనంబున ప్రమత్తుండై యిచ్ఛా విహారంబున జరగనీక పరమగురుండైన శ్రీహరి చరణోపాసనాస్త్రంబునం జిత్తంబు గెలిచినం బరతత్వంబునొందు _”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 1 - )
“ఆత్మ మంత్ర సదాభ్యాసాత్ పరతత్వం ప్రకాశతే |
తదభివ్యక్తి చిహ్నాని సిద్ధి ద్వారాణిమే శ్రుణు|
దీపజ్వాలేందు ఖద్యోత విద్యున్నక్షత్ర భాస్వరాః |
దృశ్యంతే సూక్ష్మరూపేణ సదా యుక్తస్య యోగినః ||“. (యోగశిఖోపనిషత్)
(ఆత్మ మంత్రము నెల్లపుడు నభ్యసించుటచేత పరతత్వము ప్రకాశించును - అది యెట్లు అభివ్యక్తమగును, దాని చిహ్నలు ఎట్టివి, అది సిద్ధించు ద్వారములు ఏవి? - అనగా - దీపము, జ్వాల, చంద్రుడు. మెరుపు, నక్షత్రములు ప్రకాశించునవి. ఇవి యోగి యైన వానికి సూక్ష్మరూపములో కనబడును).
(నారాయణుడే పరబ్రహ్మ, నారాయణుడే పరతత్వం).
అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః ||“. (మంత్రపుష్పం)
(ఈ సృష్టిలో ఏ కొంచెము మనకు కనబడుచున్నదో, ఇంకా ఉన్నదని ఇతరులు చెప్పగావినబడుచున్నదో. - కంటికి, చెవికి గోచరమగుచున్నదో, ఇది కాక యింకను ఎంత ఉన్నదో దానినంతటిని పూర్తిగా లోపల, బైట నారాయణుడు వ్యాపించియున్నాడు - అణుమాత్రమైనను విడువకుండ వ్యాపించియున్నాడు - “ఆ హరిమయముగాని ద్రవ్యము పరమాణువు లేదు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - ). కనుక నారాయణుడే, పరమాత్మ, పరబ్రహ్మ అని చెప్పబడుచున్నావాడే పరతత్వము).
(ī prapaṃcamu yokka sṛṣṭisthiti layamulaku kāraṇamaina nārāyaṇuḍē paratatvamu. jāgratsvapna suṣuptulaṃdu brahmamuganuṃḍunadi paratatvamu - dēhamunu, iṃdriyamulanu, manassunu ēdi jīviṃpacēyunō, maṟiyunu vāṭini vāṭi vāṭi viṣayamulaṃdu pravartiṃpacēyunō, adē paramātma, adē paratatvamu. ī prakāramugā anēka vidhamulugā prakāśamagucunnanu paratatvamanunadi okaṭē).
ṣaḍviṃ śakamiti khyātaṃ yat parātpara makṣayaṃ |
sa ēva bhagavān dēvaḥ sarva tatvādi ravya yaḥ |
sarva tatva vidhāna jñaḥ pradhāna puruṣē śvaraḥ ||“. (mahābhāratē - anuśāsanika parvē)
(parātparamainadi, sanātanamainadi, akṣayamainadinnī, tatvamulanniṃṭiki mūlamainadinnī, avyayamainadinnī pradhānapuruṣuḍu ayina bhagavaṃtuḍē paratatvamu).
(dīninē paratatvamani vidvāṃsulu dhyāniṃcucunnāru).
ayatna siddhā paramāmuktiḥ tēṣāṃ na saṃśayaḥ ||
nirvikalpaṃ paraṃ nāma tatvaṃ sākṣācchivaḥ paraṃ ||“. (skāṃdē)
(nirvikalpamaina paratatvamaṃdu evariki śraddha kalugunō vāriki prayatnamu lēkanē parama mukti cēkūrunu. iṃduku saṃdēhamu lēdu. nirvikalpamaina paratatvamu sākṣāttu parama śivuḍē).
tallakṣaṇaṃ, mahāprājña, śrutiṣu śrūyatē sadā |
satyaṃ jñānaṃ sadānaṃdaṃ jagatsargādi kāraṇaṃ |.
(śivuḍē paratatvamu. atanikaṃṭe adhikamainadi lēdu. paratatvamaina ā śivuni lakṣaṇamu śrtutulalō ceppabaḍu cunnadi - satyamu, jñānamu, sadānaṃdamu, (saccidānaṃdamulu) aninnī, jagattu yokka sṛṣṭisthiti layamulaku kāraṇamainadi paratatvamani dāni lakṣaṇamulu ceppabaḍinavi).
samāsēna pravakṣyāmi śruṇuta śraddhayā saha |
dṛśyaṃ jagadidaṃ sarvaṃ śukti tā rajatādivat |
ajñānēnaiva kasmiṃścit kalpitaṃ naiva vastutaḥ |
kalpitasya samastasya yadadhiṣṭāna māktikāḥ |
tat kalpita padārthēna bhinnalakṣaṇamēvahi |
adhiṣṭāna masatyasya satyamēva na saṃśayaḥ |
śuktikā vyavaharētu satī na rajatōpamā |
kēvalaṃ satyatā śuktau dṛṣṭāṃtatvēna gṛhyatē |
na vyāvahāri katvaṃca satyatvaṃ tasya hētujaṃ |
sarvasākṣi svarūpasya prāgabhāvādya saṃbhavāt |
janma nāśādyabhāvēna sadā satyaṃ paraṃ padaṃ |
kalpitasya samastasya bhāsakatvāt svayaṃ prabhaṃ |
svayaṃ prakāśa caitanyaṃ taddhi sarvāva bhāsakaṃ |
yasya śēṣatayā sarvamidaṃ prēmāspadaṃ bhavēt |
śēṣirūpaṃ tu tat sākṣāt sukhaṃ tatsukhamēvahi |
brahmaṇaśśēṣa bhūtaṃ hi jagat sarva carācaraṃ |
ataḥ śēṣiparaṃ tatvaṃ paramānaṃda lakṣaṇaṃ |
sattayā ca prakāśēna priyēṇa ca paraṃ padaṃ |
satyaṃ jñānaṃ sukhaṃ cāpi svarūpaṃ paravastunaḥ
- - - satya cidānaṃdāḥ guṇāḥ na paravastu naḥ |
svarūpamēva - - - || (parāśarōpapurāṇē)
(samasta jagattunaku āśrayamaina paratatvamu guṟiṃci saṃkṣēmamugā ceppucunnānu - śraddhatō vinumu - ī jagattu aṃtayū - mutyapu cippanu cūci adi veṃḍiyani kalpiṃcukoninaṭlē - ajñānamu cēta kalpiṃcabaḍinadi - adi yadhārthamugā jagattu ani vērugā lēdu - kalpiṃcabaḍina vastuvuyokka adhiṣṭānamu kalpita padārthamukaṃṭe vēru lakṣaṇamulu kaladi. asat yokka adhiṣṭānamu - asattunu adhiṣṭiṃciyunnadi sattē, saṃśayamulēdu - mutyapucippa viṣayamu dṛṣṭāṃtamu koṟakē ceppabaḍinadi. sarva sākṣi svarūpuḍagu parabrahmaku jananamaraṇamulu lēnaṃduna ellapuḍū uṃḍuvāḍē - atanē paramapadamu - kalpiṃcabaḍina samastamunu prakāśiṃpacēyunadi kanukanū, tānu syayamugā prakāśiṃcunadi kanukanu, caitanyamātramu kanukanu, praḷayakālamaṃdu tānu okkaḍē migili yuṃḍuvāḍu kanukanu, ā migiliyuṃḍu tatvamu paramānaṃda lakṣaṇamu - adi sat aguṭacētanu, (anni kālamulaṃduṃḍuna daguṭacētanu) svayaṃ prakāśamaguṭacētanu, prēmāspadamaguṭacētanu adiyē parama padamu - (paramaprāpti sthānamu). satyaṃ, jñānamu, sukhamu (sat, cit, ānaṃdamulu) paruḍaina bhagavaṃtuni yokka svarūpamu - ī saccidānaṃdamu paramātma yokka guṇamulu kāvu - avi atani rūpamu - aṭṭi bhagavaṃtuḍē paratatvamu).
baratatvamanaṃga, baramapadamanaganu, nī
śvaruḍana, kṛṣṇuḍana, jaga
dbharituḍu nārāyaṇuṃḍu dā velugoṃdun”. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 51)
tēṣāṃ trayāṇāmadhikaḥ sarva kāraṇa mīśvaraḥ ||“. (sūta saṃhita)
(caturmukhabrahma, viṣṇuvu, rudruḍu - ī mugguru paratatvamu yokka vibhūtulu (rūpamulu) - paratatvamē yī mugguri rūpamulugā mārinadi. ī muggurulō adhikuḍu, anniṃṭiki kāraṇamainavāḍu, paramēśvaruḍē) - “śivasya hṛdayaṃ viṣṇurviṣṇōśca hṛdayaṃ śivaḥ” (śivuni hṛdayamu viṣjṇuvu, viṣṇuni hṛdayamu śivuḍu; “śivāya viṣṇurūpāya, śivarūpāya viṣṇuvē” (viṣṇurūpuḍagu śivuniki, śivarūpuḍagu viṣṇuvunaku namaskāramu). ī reṃḍiṃṭivalana teliyunadēmanagā, śivunaku viṣṇuvunaku bhēdamu lēdani, iddarū okaṭē yani - okaṭē paratatvamani -).
nuppu lavaṇamanna nokaṭigāde
bhāṣaliṭlu vēru paratatvamokkaṭē
viśvadābhirāma vinuravēma”. (vēmana)
“va. kṛṣṇānucarulaina yaduvṛṣṇi kumārulammahanīyamūrtiṃ damaku nagrēsaruṃḍani kāni līlāmānuṣa vigrahuṃḍaina paramātmuṃḍani yeṟuṃgaka, harimāyā janitaṃbagu nasadbhāvaṃbunaṃ jēsi bhōjana śayanāsanānu gamanaṃbulaṃ jēri sahōdarādi bhāvaṃbulaṃ gūḍi cariyiṃturu. addēvuni māyā payōdhi nimagnulu gākuṃḍa nabjabhavādulakainaṃ dīṟadu - sarvaguṇa gariṣṭulunu, satpuruṣa śrēṣṭulunu nagu parama bhāgavatulakuṃ dakka dakkina vāralakuṃ jeppanēla adiyunuṃ gāka abhijanavidyādhana bala garvamadāṃdhī bhūta cētaskulaina śiśupālādi bhūpālakulammahātmuniṃ baratatvaṃbani yeṟuṃgaka niṃdiṃcu durbhāṣalu dalaci manastāpaṃbunoṃducuṃḍudunu.” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 2 - 87)
“ariṣaḍvargaṃbunu jayiṃci baratatvaṃbu neṟiṃgina nīśvaruṃḍagu. cittaṃbeṃtakālaṃbu viṣayāsaktaṃbagunaṃta taḍavu saṃsāracakraṃbunaṃdu saṃcariṃcuṃgāvuna mahāvīruṃḍainanu danaku śatruvaina manaṃbuna pramattuṃḍai yicchā vihāraṃbuna jaraganīka paramaguruṃḍaina śrīhari caraṇōpāsanāstraṃbunaṃ jittaṃbu gelicinaṃ baratatvaṃbunoṃdu _”. (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 1 - )
“ātma maṃtra sadābhyāsāt paratatvaṃ prakāśatē |
tadabhivyakti cihnāni siddhi dvārāṇimē śruṇu|
dīpajvālēṃdu khadyōta vidyunnakṣatra bhāsvarāḥ |
dṛśyaṃtē sūkṣmarūpēṇa sadā yuktasya yōginaḥ ||“. (yōgaśikhōpaniṣat)
(ātma maṃtramu nellapuḍu nabhyasiṃcuṭacēta paratatvamu prakāśiṃcunu - adi yeṭlu abhivyaktamagunu, dāni cihnalu eṭṭivi, adi siddhiṃcu dvāramulu ēvi? - anagā - dīpamu, jvāla, caṃdruḍu. merupu, nakṣatramulu prakāśiṃcunavi. ivi yōgi yaina vāniki sūkṣmarūpamulō kanabaḍunu).
(nārāyaṇuḍē parabrahma, nārāyaṇuḍē paratatvaṃ).
aṃtarbahiśca tatsarvaṃ vyāpya nārāyaṇaḥ sthitaḥ ||“. (maṃtrapuṣpaṃ)
(ī sṛṣṭilō ē koṃcemu manaku kanabaḍucunnadō, iṃkā unnadani itarulu ceppagāvinabaḍucunnadō. - kaṃṭiki, ceviki gōcaramagucunnadō, idi kāka yiṃkanu eṃta unnadō dāninaṃtaṭini pūrtigā lōpala, baiṭa nārāyaṇuḍu vyāpiṃciyunnāḍu - aṇumātramainanu viḍuvakuṃḍa vyāpiṃciyunnāḍu - “ā harimayamugāni dravyamu paramāṇuvu lēdu” (śrīmadāṃdhramahābhāgavatamu - ). kanuka nārāyaṇuḍē, paramātma, parabrahma ani ceppabaḍucunnāvāḍē paratatvamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.