(పరము - ఉత్కృష్టమైనదానికంటె ఉత్కృష్టమైనవాడు కనుక పరాత్పరుడు).
(ఉత్కృష్టమైన హిరణ్యగర్భుడు - చతుర్ముఖబ్రహ్మ మొదలగు వారికంటె మిక్కిలి ఉత్కృష్టమైనవాడు).
(పరం అనగా ప్రకాశించునది, ప్రకాశింపచేయునది - ప్రకాశింపచేయు చక్షువు మొదలగువాటికంటె ప్రకాశించునది. ” కంటికి కన్నువంటిది ” అని శ్రుతి చెప్పుచున్నది).
(నశించు ప్రపంచముకన్న ఉత్కౄష్టమైనది, నశించనిది ఈశ్వరుడు - ఈశ్వరుడు కంటె పరమైనది, ప్రకృష్టమైనది - పరబ్రహ్మ - అందుచేత పరబ్రహ్మ పరాత్పరుడు).
(ఉత్కృష్టమైన జగత్కారణమైన అవ్యక్తము కన్న - ప్రకృతికంటె - ఉత్కృష్టమైనవాడు, పూర్ణుడు - ప్రపంచమంతటిలోను, ప్రపంచములోని ప్రతి వస్తువులోను, ప్రకృతిలోకూడ, పూర్తిగానిండియున్నవాడు, స్వయముగా ప్రకాశించువాడు - చైతన్యరూపుడైనవాడు - ఆనందమయుడు - పరమానందమైన మోక్షరూపుడైనవాడు - పరబ్రహ్మ).
స్రష్టా భర్తా భర్తాచ సంహర్తా జగతస్యాఖిలస్యచ |
తత్సమో నాధికశ్చాస్తి చేతనః న పరాత్పరం ||“. (పరాశరోప పురాణము)
(సమస్తమైన జంతువులకు, జగత్తు అంతటికీ మహాదేవుడయిన మహేశ్వరుడు సృష్టి స్థితిలయములు చేయువాడు, అతనితో సమానమైనవాడు కాని అధికుడు కాని లేడు. అతనే చేతనుడు, అతనే పరాత్పరుడు - ఉత్కృష్టమైన వాటి అన్నింటికంటెను ఉత్కృష్టుడు).
పరాత్పరతరం బాహుః పరాత్పరతరం శివం |
బ్రహ్మణో జనకం విష్ణోః వహ్నేర్వా యో స్సదాశివం ||“. (పద్మ పురాణము)
(ఎవనిని వాయువని, రుద్రుడని, శాశ్వతుడైన పరమేశ్వరుడని, బ్రహ్మ విష్ణువులను పుట్టించినవాడు, అగ్నిని, వాయువును పుట్టించినవాడు సదాశివుడని చెప్పుచున్నారో అతనే పరాత్పరుడు).
(నీవు పురుషులలో మొదటివాడవు - ప్రకృతి యను పురములో ప్రవేశించిన పరబ్రహ్మ రూపములలో మొదటివాడవు - సాక్షాదీశ్వరుడవు, పరము అని చెప్పబడు ప్రకృతి కంటె పరుడవు - పరాత్పరుడవు).
“సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు, ప్రభుడవాద్య |
పురుషుండవు - - - || ” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 7 - 110)
(అక్షరమనగా అవ్యక్తము - ప్రకృతి - అది పరము - ప్రకృష్టమైనది - దానికంటె ఉత్కృష్టమైనవాడు -భగవంతుడు - తాను జడమైన ప్రకృతిలో ప్రవేశించి దానికి చైతన్యము కలిగించి ప్రపంచమును సృష్టి చేయునట్లు చేయుటవల్ల దానికంటె ఉత్కృష్టమైన వాడు పరబ్రహ్మ).
మనసస్తు పరాబుద్ధిః బుద్ధేరాత్మా మహాన్ పరః |
మహతః పరమవ్యక్తం అవ్యక్తా త్పురుషః పరః |
పురుషాన్నపరం కించిత్ సాకాష్టా సాపరాగతిః ||” ఇతి శ్రుతిః. (కాఠకే)
“క్షేత్రాదీని జ్ఞానేంద్రియాణి పంచ స్థూలం జడం పరిచ్ఛిన్నం బాహ్యం చ దేహమపేక్ష్య పరాణి సూక్ష్మ త్వాత్ ప్రకాశకత్వాత్, అంతస్థత్వాత్ చ ప్రకృష్టాని ఆహుః పండితాః శ్రుతయో వా. తథా ఇంద్రియేభ్యః పరం మనః సంకల్ప వికల్పాత్మకం తత్ప్రవర్తకత్వాత్. తథా మనసస్తు పరా బుద్ధిః అధ్యవసాయాత్మికా. అధ్యవసా యోహి నిశ్చయః తత్పూర్వక ఏవ సంకల్పాదిః మనో ధర్మః. యస్తు బుద్ధేః పరతః తద్బాసకత్వేన అవస్థితః యం దేహినం ఇంద్రియాదిభిః ఆశ్రయైః యుక్తః కామో జ్ఞానావరణద్వారా మోహయతి ఇత్యుక్తం నబుద్ధేః ద్రష్టా పర ఆత్మా.” (మధుసూదనీ వ్యాఖ్యా)
(స్థూలము, జడము, పరిచ్ఛిన్నము, బాహ్యము అయిన క్షేత్రమగు దేహము కంటె సూక్ష్మములగుటవలననూ, ప్రకాశింపచేయునవగుటవలనను, శరీరము లోపలనుండునగుటవలనను జ్ఞానేంద్రియములు పరములు - ప్రకృష్టములు, శ్రేష్టములు - అని పండితులు - జ్ఞానులు, చెప్పుదురు. శ్రుతులు కూడ నిట్లే చెప్పు చున్నవి. జ్ఞానేంద్రియములను వాటి వాటి పనులలో (విషయముల యడల) వ్యాపింపచేయునది (ప్రవర్తింప చేయునది) అగుటవలన. సంకల్ప వికల్పములు చేయు మనస్సు ఇంద్రియములకన్న ఉత్కృష్టమైనది, శ్రేష్టమైనది. మనస్సు యొక్క సంకల్ప వికల్పములకు కారణమై నిశ్చయము చేయుట బుద్ధి ధర్మము కనుక బుద్ధి మనస్సుకంటె ప్రకృష్ట మైనది. బుద్ధిని ప్రకాశింప చేయునది, దానికి సాక్షి అయినది కనుక బుద్ధి కంటె పరమమైనది, ఉత్కృష్టమైనది ఆత్మ. ఈ ప్రకారము ఒకదాని కంటె ఒకటి పరము, ఉత్కృష్టము - అన్నింటి కంటె పరము, ఉత్కృష్టమైనది ఆత్మ (భగవంతుడు). అందుచేత భగవంతుడు పరాత్పరుడు).
(పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు - ఇవి ప్రకాశములు, అంతరములు, సూక్ష్మములు, ప్రవర్తకములు, వ్యాపకములు, కారణములు అగుటవలన, జడము బాహ్యము, స్థూలము, ప్రవర్త్త్యము, వ్యాప్యము, కార్యము అగు శరీరముకంటె ఉత్కృష్టములు - దేనిచే నేది ప్రకాశింపబడుచున్నదో అట్టి ప్రకాశికము ప్రకాశితము కంటె వ్యాపకము, సూక్ష్మము, ఉత్కృష్టము అగును - ఇనుప గుండు అగ్నిచే ప్రకాశింపబడునట్లు - సూక్ష్మత్వము, అంతరత్వము, వ్యాపకత్వము, కారణత్వము, ప్రవర్తకత్వము, ప్రకాశకత్వము అనెడి ధర్మములచే ఎవడు స్వయముగ సర్వమును వ్యాపించి బుద్ధ్యాది స్థూల పర్యంతమగు కార్యకారణ సంఘాతమును తన సన్నిధి మాత్రముచేత ప్రవర్తింప చేయుచు బుద్ధ్యాది స్థూలపర్యంతమగు ధర్మములను, వాని కర్మములను, వాని గుణములను, వాని వికారములను, సర్వమును తానవికారియై సాక్షాత్కరింప చేసుకొనుచుండునో అట్టి ఆత్మ నిత్యమగుటవలన, సర్వజ్ఞుడగుటవలన, సర్వప్రకాశకుడగుటవలన, సర్వసాక్షియగుటవలనను, బుద్ధికంటెను సర్వముకంటెను ఉత్కృష్టమైనది .
“ఇంద్రియేభ్యః పరాహి అర్థాః” - తత్ర రధత్వరూపిత శరీరే హయత్వేన రూపితేభ్యః ఇంద్రియేభ్యః గోచరత్వేన రూపిత శబ్దాది విషయాః వశీకార్యత్వే పరాః, వశ్యేంద్రియస్యాపి విషయ సన్నిధౌ ఇంద్రియాణాం దుర్నిగ్రహత్వాత్. “అర్థేభ్యశ్చ పరం మనః” - విషయేభ్యోపి పరం ప్రగ్రహరూపితం మనః మన సి విషయ ప్రవణే విషయా సన్నిధానస్యాపి అనించిత్కరత్వాత్. “మనశ్చ పరా బుద్ధిః” - మనసోపిసారధిత్వ రూపితా బుద్ధిః పరా అధ్యవసాయా భావే మనసః అపి అకించిత్కరత్వాత్ . “బుద్ధేః ఆత్మా మహానోపరః” బుద్ధేరపి రధిత్వ రూపిత ఆత్మా కర్తృత్వేన ప్రాథాన్యాత్ పరః - సర్వస్య అస్య ఆత్మేచ్ఛాయతత్వాత్ ఆత్మైవ మహాన్ ఇతి చ విశిష్యతే - “మహతః పరమ వ్యక్తం” -
తస్మాదపి రధరూపితం శరీరం పరం తదాయత్తత్వాత్ జీవాత్మనః సకల పురుషార్థ సాధన ప్రవృత్తీనాం “అవ్యక్తాత్ పురుషః పరః” - శరీరాదపి పరః సర్వాంతరాత్మ భూతో అంతర్యామీ అధ్వనః పారభూతః పరమపురుషః యధోక్తస్య ఆత్మ పర్యంతస్య సమస్తస్య తత్సంకల్పా యత్త ప్రకృతిత్వాత్ నఖల్వం తర్యామి యోపాసనస్యాపి నిర్వర్తకః. వశీకార్యోపాసన నివృత్యుదాయ కాష్టా భూతః పరమ ప్రాప్యశ్చ తదిదం ఉచ్యతే - “పురుషాన్నపరం ఇతి”. (శ్రీకూరనారాయణః).
(శరీరము రధముతో పోల్చబడినది. అట్టి రధమునకు కట్టిన గుఱ్ఱములు ఇంద్రియములు. ఇంద్రియములకు గోచరములగుటవలన శబ్దము మొదలగు విషయములు వశీకరించుటలో ఇంద్రియములకంటె పరములు - ఉత్కృష్టమైనవి - తత్వరీత్యా గొప్పవి. ఇంద్రియములను నిగ్రహించినవానికైనను విషయములు దగ్గరగానున్నపుడు వాటిని నిగ్రహించుట కష్టము కనుక “విషయములకంటె మనస్సు ఉత్కృష్టమైనది” అని చెప్పబడినది. విషయములు దగ్గరగా లేకుండినను మనస్సు వాటిని తలచుకొనుచునే యుండును కనుక విషయములకంటె మనస్సు ఉత్కృష్టమైనదని చెప్పబడినది. “మనసు కంటె బుద్ధి ఉత్కృష్టమైనది” అని చెప్పబడినది. మనసుకంటె సారధిగా నుండు బుద్ధి ఉత్కృష్టమైనది. “బుద్ధికంటె ఆత్మ ఉత్కృష్టమైనది. రధికుడైన ఆత్మ కర్త యగుటవలన బుద్ధికంటె ఆత్మ ఉత్కృష్టమైనది. అన్నింటి ఇచ్ఛకు కారణమగుటవలన ఆత్మకంటె - మహత్తత్వముకంటె - ఉత్కృష్టమైనది.”మహత్తత్వముకంటె అవ్యక్తము (ప్రకృతి) ఉత్కృష్టమైనది” అని చెప్పబడినది. మహత్తత్వము కంటె రధముతో పోల్చబడిన శరీరము ఉత్కృష్టమైనది. సమస్తమైన పురుషార్థముల సాధనకు వీలు కలుగచేయునది కనుక శరీరము మహత్తత్వముకంటె ఉత్కృష్టమైనది. అవ్యక్తముకంటె - ప్రకృతికంటె పురుషుడు (పరమ పురుషుడు - జీవుడు) ఉత్కృష్టమైనవాడు. అన్నింటిలోను అంతరాత్మ అయినటువంటిన్నీ, అంతర్యామి (అన్నింటిలోను సంచరించు నది) శరీర యాత్రామార్గమునకు తుది మెట్టు అయినటువంటి పరమపురుషుడు, ఈ పైన చెప్పినవాటి అన్నింటికంటె ప్రవృత్తి కలిగించువాడు, (చైతన్యము కలిగించువాడు) అయినందున అవ్యక్తము కంటె ఉత్కృష్టమైన వాడు. అంతర్యామి యగుటవలన ఆ పరమ పురుషుడు ఉపాసించతగిన వాడు, ఉపాసనచేయు వారిని నిర్వర్తింపచేయువాడు. అందుచేత అన్నింటికంటె (పైన చెప్పిన వాటన్నింటికంటె) ఉత్కృష్టమైనవాడు, పొందతగినవాడు - ఉత్కృష్టమైన గమ్య స్థానమైనవాడు. కనుక పరమ పురుషునికంటె ఉత్కృష్టమైనది లేదని చెప్పబడినది).
మనస శ్చాప్యహం కారోహ్యహంకారాన్ మహాన్ పరః |
మహతః పరమవ్యక్తం అవ్యక్తాత్పురుషః పరః |
పురుషాద్భగవాన్ ప్రాణస్తస్య సర్వమిదం జగత్ |
ప్రాణాత్పరతరం వ్యోమః వ్యోమా తీతోహమీశ్వరః |
నాస్తిమిత్తం పరం భూతం మాం విజ్ఞాయ విముచ్యతే ||“. (కూర్మపురాణము)
(ఇంద్రియములన్నింటికంటె మనస్సు ఉత్కృష్టమైనదని జ్ఞానులు చెప్పుదురు. మనస్సుకంటె అహంకారము ఉత్కృష్ట మైనది. అహంకారముకంటె మహత్త త్వము ఉత్కృష్టమైనది. మహత్తత్వముకంటె అవ్యక్తము ఉత్కృష్టమైనది. అవ్యక్తముకంటె పురుషుడు పరము. పురుషుని కన్న భగవంతుడైన ప్రాణము (వాయువు) పరము. ప్రాణముకంటె ఆకాశము పరము. ఆకాశముకంటె (వ్యోమముకంటె) పరము అయినవాడను నేను. నాకంటె ఉత్కృష్టమైనది లేదు. నన్ను తెలుసుకొనిన (నా గుఱించి అయిన జ్ఞానము కలిగిన) ముక్తిని పొందును).
నామరూపే విహాయ, తథా విద్వాన్ నామ రూపాద్విముక్తః పరాత్పరం పురుషముపైతి దివ్యం“.
“యథా గంగా, యమునా, సరస్వత్యాది నద్యః స్వోత్పత్తి స్థానేభ్యః ప్రకృతాః గంగా యమునాదీని నామాని శుక్ల కృష్ణా దీని చ రూపాణి విహాయ ఏకతాం ఇవ భజంతే | తద్వ దేవ విద్వాన్ బ్రహ్మోపాసకః నామరూప ద్విముక్తః దేవాది భేదక నామరూపాది విముక్తస్సన్, పరాత్పరం (”అక్షరాత్పరతః పరః“) ఇతి నిర్దిష్టం పురుషం పరం బ్రహ్మా ఉపైతి ప్రాప్నో తీత్యర్థః, - - - యథా నదీ సముద్ర జల యోః భేద కాకార ప్రహణమేవ, నతు స్వరూపైక్యం ఇవ ఇహాపి ఇతి వేద్యం”.
(గంగ, యమున, సరస్వతి మొదలగు నదులు వాటి వాటి ఉత్పత్తిస్థానములనుండి పాఱుచు, వాటి వాటినామములను, తెల్లనవి, నల్లనివి యను రూపములను వదలి సముద్రమందు కలిసి ఏకమై పోవుచున్నవి. ఆ ప్రకారముగానే బ్రహ్మో పాసకుడైన విద్వాంసుడు, దేవతులు, మానవులు అను మొదలగు రూపములను, నామములను వదలి, అక్షరమైన అవ్యక్తము, లేక, ప్రకృతి కంటె ఉత్కృష్ట మైనవాడు అని నిర్దేశింపబడినపరమపురుషుని పరబ్రహ్మమును పొందును - నదీజలములకు, సముద్రజలములకు భేదములేదు, అని చెప్పబడినదికాని స్వరూపము ఒకటే యని కాదు.
(paramu - utkṛṣṭamainadānikaṃṭe utkṛṣṭamainavāḍu kanuka parātparuḍu).
(utkṛṣṭamaina hiraṇyagarbhuḍu - caturmukhabrahma modalagu vārikaṃṭe mikkili utkṛṣṭamainavāḍu).
(paraṃ anagā prakāśiṃcunadi, prakāśiṃpacēyunadi - prakāśiṃpacēyu cakṣuvu modalaguvāṭikaṃṭe prakāśiṃcunadi. ” kaṃṭiki kannuvaṃṭidi ” ani śruti ceppucunnadi).
(naśiṃcu prapaṃcamukanna utkṝṣṭamainadi, naśiṃcanidi īśvaruḍu - īśvaruḍu kaṃṭe paramainadi, prakṛṣṭamainadi - parabrahma - aṃducēta parabrahma parātparuḍu).
(utkṛṣṭamaina jagatkāraṇamaina avyaktamu kanna - prakṛtikaṃṭe - utkṛṣṭamainavāḍu, pūrṇuḍu - prapaṃcamaṃtaṭilōnu, prapaṃcamulōni prati vastuvulōnu, prakṛtilōkūḍa, pūrtigāniṃḍiyunnavāḍu, svayamugā prakāśiṃcuvāḍu - caitanyarūpuḍainavāḍu - ānaṃdamayuḍu - paramānaṃdamaina mōkṣarūpuḍainavāḍu - parabrahma).
sraṣṭā bhartā bhartāca saṃhartā jagatasyākhilasyaca |
tatsamō nādhikaścāsti cētanaḥ na parātparaṃ ||“. (parāśarōpa purāṇamu)
(samastamaina jaṃtuvulaku, jagattu aṃtaṭikī mahādēvuḍayina mahēśvaruḍu sṛṣṭi sthitilayamulu cēyuvāḍu, atanitō samānamainavāḍu kāni adhikuḍu kāni lēḍu. atanē cētanuḍu, atanē parātparuḍu - utkṛṣṭamaina vāṭi anniṃṭikaṃṭenu utkṛṣṭuḍu).
parātparataraṃ bāhuḥ parātparataraṃ śivaṃ |
brahmaṇō janakaṃ viṣṇōḥ vahnērvā yō ssadāśivaṃ ||“. (padma purāṇamu)
(evanini vāyuvani, rudruḍani, śāśvatuḍaina paramēśvaruḍani, brahma viṣṇuvulanu puṭṭiṃcinavāḍu, agnini, vāyuvunu puṭṭiṃcinavāḍu sadāśivuḍani ceppucunnārō atanē parātparuḍu).
(nīvu puruṣulalō modaṭivāḍavu - prakṛti yanu puramulō pravēśiṃcina parabrahma rūpamulalō modaṭivāḍavu - sākṣādīśvaruḍavu, paramu ani ceppabaḍu prakṛti kaṃṭe paruḍavu - parātparuḍavu).
“sākṣātkariṃcina sarvēśvaruṃḍavu, prabhuḍavādya |
puruṣuṃḍavu - - - || ” (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 7 - 110)
(akṣaramanagā avyaktamu - prakṛti - adi paramu - prakṛṣṭamainadi - dānikaṃṭe utkṛṣṭamainavāḍu -bhagavaṃtuḍu - tānu jaḍamaina prakṛtilō pravēśiṃci dāniki caitanyamu kaligiṃci prapaṃcamunu sṛṣṭi cēyunaṭlu cēyuṭavalla dānikaṃṭe utkṛṣṭamaina vāḍu parabrahma).
manasastu parābuddhiḥ buddhērātmā mahān paraḥ |
mahataḥ paramavyaktaṃ avyaktā tpuruṣaḥ paraḥ |
puruṣānnaparaṃ kiṃcit sākāṣṭā sāparāgatiḥ ||” iti śrutiḥ. (kāṭhakē)
“kṣētrādīni jñānēṃdriyāṇi paṃca sthūlaṃ jaḍaṃ paricchinnaṃ bāhyaṃ ca dēhamapēkṣya parāṇi sūkṣma tvāt prakāśakatvāt, aṃtasthatvāt ca prakṛṣṭāni āhuḥ paṃḍitāḥ śrutayō vā. tathā iṃdriyēbhyaḥ paraṃ manaḥ saṃkalpa vikalpātmakaṃ tatpravartakatvāt. tathā manasastu parā buddhiḥ adhyavasāyātmikā. adhyavasā yōhi niścayaḥ tatpūrvaka ēva saṃkalpādiḥ manō dharmaḥ. yastu buddhēḥ parataḥ tadbāsakatvēna avasthitaḥ yaṃ dēhinaṃ iṃdriyādibhiḥ āśrayaiḥ yuktaḥ kāmō jñānāvaraṇadvārā mōhayati ityuktaṃ nabuddhēḥ draṣṭā para ātmā.” (madhusūdanī vyākhyā)
(sthūlamu, jaḍamu, paricchinnamu, bāhyamu ayina kṣētramagu dēhamu kaṃṭe sūkṣmamulaguṭavalananū, prakāśiṃpacēyunavaguṭavalananu, śarīramu lōpalanuṃḍunaguṭavalananu jñānēṃdriyamulu paramulu - prakṛṣṭamulu, śrēṣṭamulu - ani paṃḍitulu - jñānulu, ceppuduru. śrutulu kūḍa niṭlē ceppu cunnavi. jñānēṃdriyamulanu vāṭi vāṭi panulalō (viṣayamula yaḍala) vyāpiṃpacēyunadi (pravartiṃpa cēyunadi) aguṭavalana. saṃkalpa vikalpamulu cēyu manassu iṃdriyamulakanna utkṛṣṭamainadi, śrēṣṭamainadi. manassu yokka saṃkalpa vikalpamulaku kāraṇamai niścayamu cēyuṭa buddhi dharmamu kanuka buddhi manassukaṃṭe prakṛṣṭa mainadi. buddhini prakāśiṃpa cēyunadi, dāniki sākṣi ayinadi kanuka buddhi kaṃṭe paramamainadi, utkṛṣṭamainadi ātma. ī prakāramu okadāni kaṃṭe okaṭi paramu, utkṛṣṭamu - anniṃṭi kaṃṭe paramu, utkṛṣṭamainadi ātma (bhagavaṃtuḍu). aṃducēta bhagavaṃtuḍu parātparuḍu).
(paṃca jñānēṃdriyamulu, paṃca karmēṃdriyamulu - ivi prakāśamulu, aṃtaramulu, sūkṣmamulu, pravartakamulu, vyāpakamulu, kāraṇamulu aguṭavalana, jaḍamu bāhyamu, sthūlamu, pravarttyamu, vyāpyamu, kāryamu agu śarīramukaṃṭe utkṛṣṭamulu - dēnicē nēdi prakāśiṃpabaḍucunnadō aṭṭi prakāśikamu prakāśitamu kaṃṭe vyāpakamu, sūkṣmamu, utkṛṣṭamu agunu - inupa guṃḍu agnicē prakāśiṃpabaḍunaṭlu - sūkṣmatvamu, aṃtaratvamu, vyāpakatvamu, kāraṇatvamu, pravartakatvamu, prakāśakatvamu aneḍi dharmamulacē evaḍu svayamuga sarvamunu vyāpiṃci buddhyādi sthūla paryaṃtamagu kāryakāraṇa saṃghātamunu tana sannidhi mātramucēta pravartiṃpa cēyucu buddhyādi sthūlaparyaṃtamagu dharmamulanu, vāni karmamulanu, vāni guṇamulanu, vāni vikāramulanu, sarvamunu tānavikāriyai sākṣātkariṃpa cēsukonucuṃḍunō aṭṭi ātma nityamaguṭavalana, sarvajñuḍaguṭavalana, sarvaprakāśakuḍaguṭavalana, sarvasākṣiyaguṭavalananu, buddhikaṃṭenu sarvamukaṃṭenu utkṛṣṭamainadi .
“iṃdriyēbhyaḥ parāhi arthāḥ” - tatra radhatvarūpita śarīrē hayatvēna rūpitēbhyaḥ iṃdriyēbhyaḥ gōcaratvēna rūpita śabdādi viṣayāḥ vaśīkāryatvē parāḥ, vaśyēṃdriyasyāpi viṣaya sannidhau iṃdriyāṇāṃ durnigrahatvāt. “arthēbhyaśca paraṃ manaḥ” - viṣayēbhyōpi paraṃ pragraharūpitaṃ manaḥ mana si viṣaya pravaṇē viṣayā sannidhānasyāpi aniṃcitkaratvāt. “manaśca parā buddhiḥ” - manasōpisāradhitva rūpitā buddhiḥ parā adhyavasāyā bhāvē manasaḥ api akiṃcitkaratvāt . “buddhēḥ ātmā mahānōparaḥ” buddhērapi radhitva rūpita ātmā kartṛtvēna prāthānyāt paraḥ - sarvasya asya ātmēcchāyatatvāt ātmaiva mahān iti ca viśiṣyatē - “mahataḥ parama vyaktaṃ” -
tasmādapi radharūpitaṃ śarīraṃ paraṃ tadāyattatvāt jīvātmanaḥ sakala puruṣārtha sādhana pravṛttīnāṃ “avyaktāt puruṣaḥ paraḥ” - śarīrādapi paraḥ sarvāṃtarātma bhūtō aṃtaryāmī adhvanaḥ pārabhūtaḥ paramapuruṣaḥ yadhōktasya ātma paryaṃtasya samastasya tatsaṃkalpā yatta prakṛtitvāt nakhalvaṃ taryāmi yōpāsanasyāpi nirvartakaḥ. vaśīkāryōpāsana nivṛtyudāya kāṣṭā bhūtaḥ parama prāpyaśca tadidaṃ ucyatē - “puruṣānnaparaṃ iti”. (śrīkūranārāyaṇaḥ).
(śarīramu radhamutō pōlcabaḍinadi. aṭṭi radhamunaku kaṭṭina guṟṟamulu iṃdriyamulu. iṃdriyamulaku gōcaramulaguṭavalana śabdamu modalagu viṣayamulu vaśīkariṃcuṭalō iṃdriyamulakaṃṭe paramulu - utkṛṣṭamainavi - tatvarītyā goppavi. iṃdriyamulanu nigrahiṃcinavānikainanu viṣayamulu daggaragānunnapuḍu vāṭini nigrahiṃcuṭa kaṣṭamu kanuka “viṣayamulakaṃṭe manassu utkṛṣṭamainadi” ani ceppabaḍinadi. viṣayamulu daggaragā lēkuṃḍinanu manassu vāṭini talacukonucunē yuṃḍunu kanuka viṣayamulakaṃṭe manassu utkṛṣṭamainadani ceppabaḍinadi. “manasu kaṃṭe buddhi utkṛṣṭamainadi” ani ceppabaḍinadi. manasukaṃṭe sāradhigā nuṃḍu buddhi utkṛṣṭamainadi. “buddhikaṃṭe ātma utkṛṣṭamainadi. radhikuḍaina ātma karta yaguṭavalana buddhikaṃṭe ātma utkṛṣṭamainadi. anniṃṭi icchaku kāraṇamaguṭavalana ātmakaṃṭe - mahattatvamukaṃṭe - utkṛṣṭamainadi.”mahattatvamukaṃṭe avyaktamu (prakṛti) utkṛṣṭamainadi” ani ceppabaḍinadi. mahattatvamu kaṃṭe radhamutō pōlcabaḍina śarīramu utkṛṣṭamainadi. samastamaina puruṣārthamula sādhanaku vīlu kalugacēyunadi kanuka śarīramu mahattatvamukaṃṭe utkṛṣṭamainadi. avyaktamukaṃṭe - prakṛtikaṃṭe puruṣuḍu (parama puruṣuḍu - jīvuḍu) utkṛṣṭamainavāḍu. anniṃṭilōnu aṃtarātma ayinaṭuvaṃṭinnī, aṃtaryāmi (anniṃṭilōnu saṃcariṃcu nadi) śarīra yātrāmārgamunaku tudi meṭṭu ayinaṭuvaṃṭi paramapuruṣuḍu, ī paina ceppinavāṭi anniṃṭikaṃṭe pravṛtti kaligiṃcuvāḍu, (caitanyamu kaligiṃcuvāḍu) ayinaṃduna avyaktamu kaṃṭe utkṛṣṭamaina vāḍu. aṃtaryāmi yaguṭavalana ā parama puruṣuḍu upāsiṃcatagina vāḍu, upāsanacēyu vārini nirvartiṃpacēyuvāḍu. aṃducēta anniṃṭikaṃṭe (paina ceppina vāṭanniṃṭikaṃṭe) utkṛṣṭamainavāḍu, poṃdataginavāḍu - utkṛṣṭamaina gamya sthānamainavāḍu. kanuka parama puruṣunikaṃṭe utkṛṣṭamainadi lēdani ceppabaḍinadi).
manasa ścāpyahaṃ kārōhyahaṃkārān mahān paraḥ |
mahataḥ paramavyaktaṃ avyaktātpuruṣaḥ paraḥ |
puruṣādbhagavān prāṇastasya sarvamidaṃ jagat |
prāṇātparataraṃ vyōmaḥ vyōmā tītōhamīśvaraḥ |
nāstimittaṃ paraṃ bhūtaṃ māṃ vijñāya vimucyatē ||“. (kūrmapurāṇamu)
(iṃdriyamulanniṃṭikaṃṭe manassu utkṛṣṭamainadani jñānulu ceppuduru. manassukaṃṭe ahaṃkāramu utkṛṣṭa mainadi. ahaṃkāramukaṃṭe mahatta tvamu utkṛṣṭamainadi. mahattatvamukaṃṭe avyaktamu utkṛṣṭamainadi. avyaktamukaṃṭe puruṣuḍu paramu. puruṣuni kanna bhagavaṃtuḍaina prāṇamu (vāyuvu) paramu. prāṇamukaṃṭe ākāśamu paramu. ākāśamukaṃṭe (vyōmamukaṃṭe) paramu ayinavāḍanu nēnu. nākaṃṭe utkṛṣṭamainadi lēdu. nannu telusukonina (nā guṟiṃci ayina jñānamu kaligina) muktini poṃdunu).
nāmarūpē vihāya, tathā vidvān nāma rūpādvimuktaḥ parātparaṃ puruṣamupaiti divyaṃ”.
“yathā gaṃgā, yamunā, sarasvatyādi nadyaḥ svōtpatti sthānēbhyaḥ prakṛtāḥ gaṃgā yamunādīni nāmāni śukla kṛṣṇā dīni ca rūpāṇi vihāya ēkatāṃ iva bhajaṃtē | tadva dēva vidvān brahmōpāsakaḥ nāmarūpa dvimuktaḥ dēvādi bhēdaka nāmarūpādi vimuktassan, parātparaṃ (”akṣarātparataḥ paraḥ”) iti nirdiṣṭaṃ puruṣaṃ paraṃ brahmā upaiti prāpnō tītyarthaḥ, - - - yathā nadī samudra jala yōḥ bhēda kākāra prahaṇamēva, natu svarūpaikyaṃ iva ihāpi iti vēdyaṃ”.
(gaṃga, yamuna, sarasvati modalagu nadulu vāṭi vāṭi utpattisthānamulanuṃḍi pāṟucu, vāṭi vāṭināmamulanu, tellanavi, nallanivi yanu rūpamulanu vadali samudramaṃdu kalisi ēkamai pōvucunnavi. ā prakāramugānē brahmō pāsakuḍaina vidvāṃsuḍu, dēvatulu, mānavulu anu modalagu rūpamulanu, nāmamulanu vadali, akṣaramaina avyaktamu, lēka, prakṛti kaṃṭe utkṛṣṭa mainavāḍu ani nirdēśiṃpabaḍinaparamapuruṣuni parabrahmamunu poṃdunu - nadījalamulaku, samudrajalamulaku bhēdamulēdu, ani ceppabaḍinadikāni svarūpamu okaṭē yani kādu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.