“శబ్ద బ్రహ్మంబు కార బింద్వాత్మకంబై బిందు నిష్యందత్వం బున పురుషచ్ఛాయా ప్రయత్నంబున మూలాధారావస్థిత పవన సంధు క్షణంబునం జేసి యభివ్యక్తంబై పరావాక్కనంబడు”. (శ్రీనాధుడు - కాశీఖండము)
“పరిపక్వ కర్మకార పరిణత మాయావిశిష్టం బిందుః. తదిదమ విభాగావస్థ మవ్యక్త ముచ్యతే. న ఏవ జగదంకురా కారః, అధ్యాత్మం చ ఆధారా దానాభి వ్యజ్య మానః కుండల్యాది శబ్దై రుచ్యతే. (కుండలినీ శక్తిః) -”కాలేన భిద్య మానస్తు స బిందుర్భవతి త్రిథా - స్థూల సూక్ష్మ, పరత్వేన తస్య త్రైవిధ్య మిష్యతే. స బిందునాద బీజత్వశబ్దేన చ నిగద్యతే” - అచిదం శః స్థూలో బీజం, చిదచిన్మిశ్రః సూక్ష్మోనాదః, స ఏవ పురుషః. చిదంశః పరోబిందుః - స ఏవేశ్వరః - “బిందోస్తస్తాత్ భిద్యమానాత్ రవో అవ్యక్తాత్మకో భవేత్ సరవః శ్రుతి సంపన్నైః శబ్ద బ్రహ్మేతి గీయతే. సతు సర్వత్ర సంస్యూతో జాతే భూతాకారేపునః ఆవిర్భవతి దేహేషు”. స ఏవ శబ్ద బ్రహ్మాత్మ రో రవః జగదుపాదాన బిందు తాదాత్మ్యేన సర్వగతోపి ప్రాణినాం మూలాధారే అభివ్యజ్యతే. మూలాధారస్థః పవనః సంస్కృతః తేన పవనేన సర్వత్ర స్థితం శబ్దబ్రహ్మ తత్రాభివ్యజ్యతే. తదభివ్యకం శబ్దబ్రహ్మకారణ బింద్వాత్మకం స్వప్రవిష్టతయా నిష్పందం సత్ పరావాగిత్యుచ్యతే. తదేవ నాభి పర్యంతమాగతా, తేన వాయునా అభివ్యక్తం విమర్శరూపేణ మనసా యుక్తం సామాన్య స్పంద ప్రకాశరూపిణీ, కార్య బిందు తత్వాత్మకా అధిదైవ మీశ్వర రూపా పశ్యంతీ వాగి త్యుచ్యతే” –
“మూలా ధారాన్ప్రధమ ముదితో యస్తు భావః పరాఖ్యం |
పశ్చాత్పశ్యం త్యధి హృదయగో బుద్ధియుఙ్మధ్య మాఖ్యః “. (వేదాంతనామ రత్న సహస్రం)
(ఫలమునిచ్చుటకు పరిపక్వమైన కర్మవలన పరిణమించినదే మాయావిశిష్టమైన బిందువు. అది విభక్తముకాక - వేఱు వేఱు వస్తురూపముగా విడిపోని అవస్థయే అవ్యక్తమని చెప్పబడుచున్నది. అదియే జగత్తు పుట్టుటకు అంకురము (మొలక). ఆధ్యాత్మము, భూతముల శరీరములలో మూలాధారము మొదలునాభివరకు వ్యాపించియున్న కుండలి అను మొదలగు పేర్లతో చెప్పబడుచున్నది. (కుండలినీ శక్తి) - “కాలము గడుచినకొలది అది (ఆ బిందువు) మూడువిధములుగా అగుచున్నది - స్థూలము, సూక్ష్మము, పరము అని చెప్పబడుచున్నది - అదియే బిందువు | నాదము, బీజము అని చెప్పబడు చున్నది.” దానిలోని అచిత్ అంశ (చిత్ కాని భాగము) స్థూలము బీజము. చిత్, అచిత్ కలిసిన భాగము సూక్ష్మమైనది నాదము. అదియే పురుషుడు. అందులోని చిత్ అంశ పరము - బిందువు. అదియే ఈశ్వరుడు. “ఆ బిందువు పగిలి బ్రద్దలై దానివలన అవ్యక్తమైన ఒక రవము (శబ్దము) పుట్టును - ఆ రవము శ్రుతిల తాత్పర్యము తెలిసినవారిచే శబ్ద బ్రహ్మ అని చెప్పబడుచున్నది. అది (ఆ రవము) అంతట వ్యాపించి భూతాకారము చెందిన దేహములందు ఆవిర్భ వించును”. శబ్ద బ్రహ్మ అని చెప్పబడు ఆ రవము (శబ్దము) జగత్తుకు ఉపాదానబిందు తాదాత్మ్యమువలన అన్నింటిలోను వ్యాపించి యున్నప్పటికీ ప్రాణుల శరీరములో మూలాధారములో నుండును - మూలాధారమునందున్న వాయువు సంస్కృతమై యుండును - ఆ వాయువుచేత అన్నింటిలోను వ్యాపించియున్న శబ్ద బ్రహ్మ మూలాధారమందు అభివ్యజ్యమగుచున్నది - అక్కడ అభివ్యక్తమైన శబ్దబ్రహ్మ కారణమైన బిందువే పరావాక్కని చెప్పబడుచున్నది, అదియే మూలాధారమునుండి నాభివరకు వచ్చిన వాయువువలన అభివ్యక్తమై విమర్శరూపమైన మనస్సుతో కలిసి కార్యబిందువైన, అధిదైవము ఈశ్వరరూపము అగు పశ్యంతీ వాక్కు అని చెప్పబడినది –
“మూలాధారాన్ప్రథమముదితో యస్తు భావః పరాభ్యిః |
పశ్చా త్పశ్యం త్యధ హృదయ గో బుద్ధియు ఙ్మ ధ్య మాఖ్యః ||“.
(మూలాధారమందు మొదటపుట్టి పరావాక్ అని పేరుపొంది, తరువాత హృదయముచేరి పశ్యంతీవాక్కు అని, బుద్ధితో కలిసి మధ్యమా వాక్కు అని చెప్పబడినది).
“śabda brahmaṃbu kāra biṃdvātmakaṃbai biṃdu niṣyaṃdatvaṃ buna puruṣacchāyā prayatnaṃbuna mūlādhārāvasthita pavana saṃdhu kṣaṇaṃbunaṃ jēsi yabhivyaktaṃbai parāvākkanaṃbaḍu”. (śrīnādhuḍu - kāśīkhaṃḍamu)
“paripakva karmakāra pariṇata māyāviśiṣṭaṃ biṃduḥ. tadidama vibhāgāvastha mavyakta mucyatē. na ēva jagadaṃkurā kāraḥ, adhyātmaṃ ca ādhārā dānābhi vyajya mānaḥ kuṃḍalyādi śabdai rucyatē. (kuṃḍalinī śaktiḥ) -”kālēna bhidya mānastu sa biṃdurbhavati trithā - sthūla sūkṣma, paratvēna tasya traividhya miṣyatē. sa biṃdunāda bījatvaśabdēna ca nigadyatē” - acidaṃ śaḥ sthūlō bījaṃ, cidacinmiśraḥ sūkṣmōnādaḥ, sa ēva puruṣaḥ. cidaṃśaḥ parōbiṃduḥ - sa ēvēśvaraḥ - “biṃdōstastāt bhidyamānāt ravō avyaktātmakō bhavēt saravaḥ śruti saṃpannaiḥ śabda brahmēti gīyatē. satu sarvatra saṃsyūtō jātē bhūtākārēpunaḥ āvirbhavati dēhēṣu”. sa ēva śabda brahmātma rō ravaḥ jagadupādāna biṃdu tādātmyēna sarvagatōpi prāṇināṃ mūlādhārē abhivyajyatē. mūlādhārasthaḥ pavanaḥ saṃskṛtaḥ tēna pavanēna sarvatra sthitaṃ śabdabrahma tatrābhivyajyatē. tadabhivyakaṃ śabdabrahmakāraṇa biṃdvātmakaṃ svapraviṣṭatayā niṣpaṃdaṃ sat parāvāgityucyatē. tadēva nābhi paryaṃtamāgatā, tēna vāyunā abhivyaktaṃ vimarśarūpēṇa manasā yuktaṃ sāmānya spaṃda prakāśarūpiṇī, kārya biṃdu tatvātmakā adhidaiva mīśvara rūpā paśyaṃtī vāgi tyucyatē” –
“mūlā dhārānpradhama muditō yastu bhāvaḥ parākhyaṃ |
paścātpaśyaṃ tyadhi hṛdayagō buddhiyuṅmadhya mākhyaḥ “. (vēdāṃtanāma ratna sahasraṃ)
(phalamuniccuṭaku paripakvamaina karmavalana pariṇamiṃcinadē māyāviśiṣṭamaina biṃduvu. adi vibhaktamukāka - vēṟu vēṟu vasturūpamugā viḍipōni avasthayē avyaktamani ceppabaḍucunnadi. adiyē jagattu puṭṭuṭaku aṃkuramu (molaka). ādhyātmamu, bhūtamula śarīramulalō mūlādhāramu modalunābhivaraku vyāpiṃciyunna kuṃḍali anu modalagu pērlatō ceppabaḍucunnadi. (kuṃḍalinī śakti) - “kālamu gaḍucinakoladi adi (ā biṃduvu) mūḍuvidhamulugā agucunnadi - sthūlamu, sūkṣmamu, paramu ani ceppabaḍucunnadi - adiyē biṃduvu | nādamu, bījamu ani ceppabaḍu cunnadi.” dānilōni acit aṃśa (cit kāni bhāgamu) sthūlamu bījamu. cit, acit kalisina bhāgamu sūkṣmamainadi nādamu. adiyē puruṣuḍu. aṃdulōni cit aṃśa paramu - biṃduvu. adiyē īśvaruḍu. “ā biṃduvu pagili braddalai dānivalana avyaktamaina oka ravamu (śabdamu) puṭṭunu - ā ravamu śrutila tātparyamu telisinavāricē śabda brahma ani ceppabaḍucunnadi. adi (ā ravamu) aṃtaṭa vyāpiṃci bhūtākāramu ceṃdina dēhamulaṃdu āvirbha viṃcunu”. śabda brahma ani ceppabaḍu ā ravamu (śabdamu) jagattuku upādānabiṃdu tādātmyamuvalana anniṃṭilōnu vyāpiṃci yunnappaṭikī prāṇula śarīramulō mūlādhāramulō nuṃḍunu - mūlādhāramunaṃdunna vāyuvu saṃskṛtamai yuṃḍunu - ā vāyuvucēta anniṃṭilōnu vyāpiṃciyunna śabda brahma mūlādhāramaṃdu abhivyajyamagucunnadi - akkaḍa abhivyaktamaina śabdabrahma kāraṇamaina biṃduvē parāvākkani ceppabaḍucunnadi, adiyē mūlādhāramunuṃḍi nābhivaraku vaccina vāyuvuvalana abhivyaktamai vimarśarūpamaina manassutō kalisi kāryabiṃduvaina, adhidaivamu īśvararūpamu agu paśyaṃtī vākku ani ceppabaḍinadi –
“mūlādhārānprathamamuditō yastu bhāvaḥ parābhyiḥ |
paścā tpaśyaṃ tyadha hṛdaya gō buddhiyu ṅma dhya mākhyaḥ ||“.
(mūlādhāramaṃdu modaṭapuṭṭi parāvāk ani pērupoṃdi, taruvāta hṛdayamucēri paśyaṃtīvākku ani, buddhitō kalisi madhyamā vākku ani ceppabaḍinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.