← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరావిద్య parāvidya

Original — తెలుగు
  1. పరమాత్మ విద్యా -

(పరమాత్మగుఱించి చెప్పిన విద్య - “చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు” - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 5 - 16)

  1. ఋగాద్యా అపరావిద్యా యదా విష్ణోర్న వాచకాః |

తా ఏవ పరమా విద్యా యదా విష్ణోస్తు వాచకాః ||.

(ఋక్కులు మొదలగునవి విష్ణువు గుఱించి చెప్పనివి అపరావిద్య, అవియే విష్ణువు గుఱించి చెప్పినవి పరావిద్య).

  1. ఋగాది రూపా ఏకైక విద్యా, సన్యా యైః ప్రమిత బ్రహ్మ విష యక శక్తి తాత్పర్యోపాధినా పరా, మోక్ష సాధన ప్రమా హేతుత్వాత్, అన్యధాతు అపరా, తద హేతుత్వాత్ |.

(ఋక్కులు - ఋగ్వేదము - ఒకటే విద్య - అవి బ్రహ్మ విషయమైన శక్తి గుఱించి చెప్పినవి కనుక. మిగిలినవి అపరా విద్య - మోక్షమును గుఱించి చెప్పినవి కనుక).

  1. కర్మ విద్యా రూపాపర విద్యోక్త్య నంతరం య యా నిర్గుణం జ్ఞాయతే పరాసా ఉచ్యతే - “అధి పరాయ యా తదక్షరమధి గమ్యతే యత్తద ద్రేశ్యమగ్రాహ్య మగోత్ర మవర్ణ మచక్షుః శ్రోత్రం, తదిపాణిపాదం, నిత్యం విభుం, సర్వగతం, సుసూక్ష్మం, తదవ్యయం యద్భూత యోనిం పరిపశ్యంతి ధీరాః” (ముండకోపనిషత్)

అద్రేశ్యం అదృశ్యం, జ్ఞానేంద్రియైః; అగ్రాహ్యం కర్మేద్రియైః; గోత్రం వంశం; వర్ణో బ్రాహ్మణత్వాది జాతిః -; అచక్షు శ్రోత్రం చక్షుశ్రోత్రిశూన్యం అపాణి పాదం పాణి పాద శూన్యం; జ్ఞానేంద్రియ కర్మేంద్రియ వికలం; విభుం ప్రభుం; నిత్యం నాశరహితం; అవ్యయం అపక్షయ రహితం; భూతానాం యోనిం భూత యోనిం; తదక్షరం.

(కర్మ విద్యారూపమైన అపరవిద్యను చెప్పిన తర్వాత నిర్గుణ బ్రహ్మ గుఱించి చెప్పునట్టి పరావిద్య చెప్పబడినది. జ్ఞానేంద్రియములకు గోచరము కానిదిన్నీ, కర్మేంద్రియములచే గ్రహించబడనిదిన్నీ, వంశముగాని, బ్రాహ్మణాదివర్ణముగాని, చక్షువులుగాని,, శ్రోత్రములుగాని, చేతులుగాని పాదములుగాని లేనిదిన్నీ, అనగా, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అను కళలు లేనిదిన్నీ, శాశ్వతముగానుండునదిన్నీ - అనగా, నాశము లేనిదిన్నీ, ప్రభువైనదిన్నీ, భూతములకు జన్మస్థానమైనదిన్నీ అన్నింటికన్న సూక్ష్మమైనదిన్నీ, అప క్షయము లేనిదిన్నీ, అగు అక్షరబ్రహ్మ, నిరాకార, నిర్విశేష నిర్గుణ పరబ్రహ్మ గుఱించి చెప్పునది పరావిద్యా)

  1. “య యా తదక్షరం పురుషాఖ్యం సత్యం అధిగమ్యతే యధ ధిగమే హృదయగ్రంధ్యాదేః సంసారకారణస్యా త్యంతిక వినాశస్యాత్, తత్”.

(శ్రీశంకరః)

(మూడుకాలములందుండువాడు, నాశములేనివాడు అయిన పురుషుడు (పరమపురుషుడు) యే విద్యచేత చెప్పబడుచున్నాడో - పొందబడుచున్నాడో, అట్లు పొందిన తర్వాత హృదయగ్రంధులు వీడి - సంశయములు తీరిపోయి - జననమరణ రూపమైన సంసారము నశించునో ఆ విద్య పరావిద్య).

Transliteration
  1. paramātma vidyā -

(paramātmaguṟiṃci ceppina vidya - “cakrahastuni prakaṭiṃcu caduvu caduvu” - (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 5 - 16)

  1. ṛgādyā aparāvidyā yadā viṣṇōrna vācakāḥ |

tā ēva paramā vidyā yadā viṣṇōstu vācakāḥ ||.

(ṛkkulu modalagunavi viṣṇuvu guṟiṃci ceppanivi aparāvidya, aviyē viṣṇuvu guṟiṃci ceppinavi parāvidya).

  1. ṛgādi rūpā ēkaika vidyā, sanyā yaiḥ pramita brahma viṣa yaka śakti tātparyōpādhinā parā, mōkṣa sādhana pramā hētutvāt, anyadhātu aparā, tada hētutvāt |.

(ṛkkulu - ṛgvēdamu - okaṭē vidya - avi brahma viṣayamaina śakti guṟiṃci ceppinavi kanuka. migilinavi aparā vidya - mōkṣamunu guṟiṃci ceppinavi kanuka).

  1. karma vidyā rūpāpara vidyōktya naṃtaraṃ ya yā nirguṇaṃ jñāyatē parāsā ucyatē - “adhi parāya yā tadakṣaramadhi gamyatē yattada drēśyamagrāhya magōtra mavarṇa macakṣuḥ śrōtraṃ, tadipāṇipādaṃ, nityaṃ vibhuṃ, sarvagataṃ, susūkṣmaṃ, tadavyayaṃ yadbhūta yōniṃ paripaśyaṃti dhīrāḥ” (muṃḍakōpaniṣat)

adrēśyaṃ adṛśyaṃ, jñānēṃdriyaiḥ; agrāhyaṃ karmēdriyaiḥ; gōtraṃ vaṃśaṃ; varṇō brāhmaṇatvādi jātiḥ -; acakṣu śrōtraṃ cakṣuśrōtriśūnyaṃ apāṇi pādaṃ pāṇi pāda śūnyaṃ; jñānēṃdriya karmēṃdriya vikalaṃ; vibhuṃ prabhuṃ; nityaṃ nāśarahitaṃ; avyayaṃ apakṣaya rahitaṃ; bhūtānāṃ yōniṃ bhūta yōniṃ; tadakṣaraṃ.

(karma vidyārūpamaina aparavidyanu ceppina tarvāta nirguṇa brahma guṟiṃci ceppunaṭṭi parāvidya ceppabaḍinadi. jñānēṃdriyamulaku gōcaramu kānidinnī, karmēṃdriyamulacē grahiṃcabaḍanidinnī, vaṃśamugāni, brāhmaṇādivarṇamugāni, cakṣuvulugāni,, śrōtramulugāni, cētulugāni pādamulugāni lēnidinnī, anagā, jñānēṃdriyamulu, karmēṃdriyamulu anu kaḷalu lēnidinnī, śāśvatamugānuṃḍunadinnī - anagā, nāśamu lēnidinnī, prabhuvainadinnī, bhūtamulaku janmasthānamainadinnī anniṃṭikanna sūkṣmamainadinnī, apa kṣayamu lēnidinnī, agu akṣarabrahma, nirākāra, nirviśēṣa nirguṇa parabrahma guṟiṃci ceppunadi parāvidyā)

  1. “ya yā tadakṣaraṃ puruṣākhyaṃ satyaṃ adhigamyatē yadha dhigamē hṛdayagraṃdhyādēḥ saṃsārakāraṇasyā tyaṃtika vināśasyāt, tat”.

(śrīśaṃkaraḥ)

(mūḍukālamulaṃduṃḍuvāḍu, nāśamulēnivāḍu ayina puruṣuḍu (paramapuruṣuḍu) yē vidyacēta ceppabaḍucunnāḍō - poṃdabaḍucunnāḍō, aṭlu poṃdina tarvāta hṛdayagraṃdhulu vīḍi - saṃśayamulu tīripōyi - jananamaraṇa rūpamaina saṃsāramu naśiṃcunō ā vidya parāvidya).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.