← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరీక్షిత్ parīkṣit

Original — తెలుగు
  1. “పరిక్షీణేషు జాతో యస్మాత్ వరస్సుతః |

తస్మాత్ పరీక్షితో నామ విఖ్యాతః పృధివీతలే ||“. (శ్రీదేవీ భాగవతము)

(పాండవ వంశము క్షీణించిపోవు సమయమున వంశోద్ధారకుడుగా పుట్టినవాడు కనుక పరీక్షిత్తు అని భూమి మీద పేరు పొందెను).

  1. “సయేషు లోకేషు విఖ్యాతః పరీక్షిదితి యత్ప్రభుః |

గర్భ దృష్టం అభిధ్యాయన్ పరీక్షేత సరేష్విహ ||’. (శ్రీమద్భాగవతం - 1 - 12 - 30)

“గర్భే దృష్టం పురుషం అభిధ్యాయన్ ఇహ దృశ్య మానేషు నరేషు మధ్యే సర్వమపి నరం పరిక్షేత అయం అసౌ భవేన్నవా ఇతి విచారయేత్, అతాః పరిక్షిత్ ఇతి విఖ్యాతః” -

(తన తల్లి కడుపులోపలనున్నపుడు తనను రక్షించుటకు గదాధరుడైన చిన్నరూపములో తనకు కనబడిన పురుషుడు తను జన్మించిన తర్వాత తనకు కనబడుచున్న నరులందరిలోను ఇతను అపురుషుడు అగునా, కాడా అని పరిక్షించినవాడు కనుక పరిక్షిత్ అని పేరు పొందెను).

“క. తన తల్లి కడుపులోపల

మును సూచిన విభుడు విశ్వమునెల్ల గలం

డనుచు పరీక్షింపగ జను

లనఘ పరీక్షన్నరేంద్రుడండ్రు, మునీంద్రా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 12 - 259)

Transliteration
  1. “parikṣīṇēṣu jātō yasmāt varassutaḥ |

tasmāt parīkṣitō nāma vikhyātaḥ pṛdhivītalē ||“. (śrīdēvī bhāgavatamu)

(pāṃḍava vaṃśamu kṣīṇiṃcipōvu samayamuna vaṃśōddhārakuḍugā puṭṭinavāḍu kanuka parīkṣittu ani bhūmi mīda pēru poṃdenu).

  1. “sayēṣu lōkēṣu vikhyātaḥ parīkṣiditi yatprabhuḥ |

garbha dṛṣṭaṃ abhidhyāyan parīkṣēta sarēṣviha ||’. (śrīmadbhāgavataṃ - 1 - 12 - 30)

“garbhē dṛṣṭaṃ puruṣaṃ abhidhyāyan iha dṛśya mānēṣu narēṣu madhyē sarvamapi naraṃ parikṣēta ayaṃ asau bhavēnnavā iti vicārayēt, atāḥ parikṣit iti vikhyātaḥ” -

(tana talli kaḍupulōpalanunnapuḍu tananu rakṣiṃcuṭaku gadādharuḍaina cinnarūpamulō tanaku kanabaḍina puruṣuḍu tanu janmiṃcina tarvāta tanaku kanabaḍucunna narulaṃdarilōnu itanu apuruṣuḍu agunā, kāḍā ani parikṣiṃcinavāḍu kanuka parikṣit ani pēru poṃdenu).

“ka. tana talli kaḍupulōpala

munu sūcina vibhuḍu viśvamunella galaṃ

ḍanucu parīkṣiṃpaga janu

lanagha parīkṣannarēṃdruḍaṃḍru, munīṃdrā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 12 - 259)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.