← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరోక్ల్షజ్ఞానము parōklṣajñānamu

Original — తెలుగు
  1. “అస్తి బ్రహ్మేతి చేద్వేద పరోక్షజ్ఞానమేవ తత్” (వరాహోపనిషత్)

(బ్రహ్మ కలడు అని తెలుసుకొనుట పరోక్షజ్ఞానము).

  1. “అస్తి బ్రహ్మ” ఇతి జ్ఞానం పరోక్షం, అవాంతర వాక్యేన పరోక్ష మేవ జ్ఞానం జాయతే.

(‘బ్రహ్మ కలడు’ అను జ్ఞానము పరోక్ష జ్ఞానము. అవాంతర వాక్యమువలన కలుగు జ్ఞానము పరోక్షజ్ఞానము - ‘అహం బ్రహ్మాస్మి’ (నేను బ్రహ్మను అయితిని) అను మహావా క్యమువలన కలుగు జ్ఞానము అపరోక్షజ్ఞానము, లేక సాక్షాత్ జ్ఞానము.-).

  1. “జ్ఞానం పరోక్ష మిత్యుక్తం శాస్త్రాచార్యోపదేశజం” (గీతాభావప్రకాశము - 3 - 276)

(శాస్త్రమువలనను, గురువు చేసిన ఉపదేశమువలనను కలుగు జ్ఞానము పరోక్ష జ్ఞానము - అట్లు కలిగిన జ్ఞానమును తాను అనుభవించి తెలుసుకొను జ్ఞానము అపరోక్షజ్ఞానము -).

  1. “బ్రహ్మ సత్య జ్ఞానానంత స్వరూపం భవతి” ఇతి జ్ఞానం పరోక్షజ్ఞానం ఇత్యుచ్యతే.

(బ్రహ్మ సత్యజ్ఞానానంత స్వరూపమని తెలుసుకొనుట పరోక్షజ్ఞానము).

  1. “ఆస్తిత్వంబు చెప్పెడి శ్రుత్యాచార్య వాక్య విశ్వాసంబు వలన ప్రత్యగాత్మ కలదని తెలియుటయే అసత్వావరణ నివర్తకంబగు పరోక్షజ్ఞానమనంబడు”. (వివేక చింతామణి - 1)
Transliteration
  1. “asti brahmēti cēdvēda parōkṣajñānamēva tat” (varāhōpaniṣat)

(brahma kalaḍu ani telusukonuṭa parōkṣajñānamu).

  1. “asti brahma” iti jñānaṃ parōkṣaṃ, avāṃtara vākyēna parōkṣa mēva jñānaṃ jāyatē.

(‘brahma kalaḍu’ anu jñānamu parōkṣa jñānamu. avāṃtara vākyamuvalana kalugu jñānamu parōkṣajñānamu - ‘ahaṃ brahmāsmi’ (nēnu brahmanu ayitini) anu mahāvā kyamuvalana kalugu jñānamu aparōkṣajñānamu, lēka sākṣāt jñānamu.-).

  1. “jñānaṃ parōkṣa mityuktaṃ śāstrācāryōpadēśajaṃ” (gītābhāvaprakāśamu - 3 - 276)

(śāstramuvalananu, guruvu cēsina upadēśamuvalananu kalugu jñānamu parōkṣa jñānamu - aṭlu kaligina jñānamunu tānu anubhaviṃci telusukonu jñānamu aparōkṣajñānamu -).

  1. “brahma satya jñānānaṃta svarūpaṃ bhavati” iti jñānaṃ parōkṣajñānaṃ ityucyatē.

(brahma satyajñānānaṃta svarūpamani telusukonuṭa parōkṣajñānamu).

  1. “āstitvaṃbu ceppeḍi śrutyācārya vākya viśvāsaṃbu valana pratyagātma kaladani teliyuṭayē asatvāvaraṇa nivartakaṃbagu parōkṣajñānamanaṃbaḍu”. (vivēka ciṃtāmaṇi - 1)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.