(భగవంతుని విరోధించువారు, భగవంతుని శత్రువునిగా చూచువారు - వీరు రెండు విధములుగా ఉన్నారు - శివపాషండులు, విష్ణు పాషండులు).
(శ్రుతి స్మృతులలో చెప్పబడిన వాటికి విరుద్ధముగా నడచువారు - వేద బాహ్యర్థక్రియలందు నిష్టకలవారు,శ్రౌత స్మార్త క్రియా రహితులు).
(వేదమును దూషించువారు, వేదమునుండి, శాస్త్రమునుండి భ్రష్టులైనవారు - అనగా వేదములోను, శాస్త్రములోను చెప్పబడిన కర్మలను చేయక భ్రష్టులైనవారు).
వారికనుకూలులగుదురెవ్వారు, వారు
నట్టి సచ్ఛాస్త్ర పరిపంధులైనవారు
నవని బాషండులయ్యెదరని శపించె.
సీ. సకల వర్ణాశ్రమాచారహేతువు లోకమునకు మంగళమార్గమును, సనాత
నము, బూర్వము ఋషి సమ్మతము, జనార్దన మూలమును, నిత్యమును, శుద్ధమును; శివంబు
నార్యపథానుగంబగు వేదమును విప్రగణము నిందించిన కారణమున
నే శివ దీక్షయందేని మద్ధ్యాన పూజ్యుడై భూతపతి దైవమగుచునుండు
తే. నందు మీరలు భస్మ జటాస్థిధార
ణముల దగి మూఢబుద్ధులు, నష్ట శౌచు
లై నశింతురు పాషండులగుచు” ననుచు
శాపమొనరించె నా ద్విజసత్తముండు. - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 2 - 50)
(bhagavaṃtuni virōdhiṃcuvāru, bhagavaṃtuni śatruvunigā cūcuvāru - vīru reṃḍu vidhamulugā unnāru - śivapāṣaṃḍulu, viṣṇu pāṣaṃḍulu).
(śruti smṛtulalō ceppabaḍina vāṭiki viruddhamugā naḍacuvāru - vēda bāhyarthakriyalaṃdu niṣṭakalavāru,śrauta smārta kriyā rahitulu).
(vēdamunu dūṣiṃcuvāru, vēdamunuṃḍi, śāstramunuṃḍi bhraṣṭulainavāru - anagā vēdamulōnu, śāstramulōnu ceppabaḍina karmalanu cēyaka bhraṣṭulainavāru).
vārikanukūlulagudurevvāru, vāru
naṭṭi sacchāstra paripaṃdhulainavāru
navani bāṣaṃḍulayyedarani śapiṃce.
sī. sakala varṇāśramācārahētuvu lōkamunaku maṃgaḷamārgamunu, sanāta
namu, būrvamu ṛṣi sammatamu, janārdana mūlamunu, nityamunu, śuddhamunu; śivaṃbu
nāryapathānugaṃbagu vēdamunu vipragaṇamu niṃdiṃcina kāraṇamuna
nē śiva dīkṣayaṃdēni maddhyāna pūjyuḍai bhūtapati daivamagucunuṃḍu
tē. naṃdu mīralu bhasma jaṭāsthidhāra
ṇamula dagi mūḍhabuddhulu, naṣṭa śaucu
lai naśiṃturu pāṣaṃḍulagucu” nanucu
śāpamonariṃce nā dvijasattamuṃḍu. - (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 2 - 50)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.