(ఇంద్రియములను పాశములచేత - త్రాళ్ళచేత - బంధింపబడి (కట్టబడి) యుండు నరులు - ఇంద్రియముల ప్రేరణకు లోనై యుండువారు).
పశవః పరికీర్త్యంతే సమస్తాః పశువృత్తయః ||’
(చతుర్ముఖబ్రహ్మ మొదలు స్థావరములవరకు గలవన్నియు దేవదేవు డయిన శివుని పశువులని చెప్పబడుచున్నవి - ఇవన్నియు పశువృత్తిగలవియే).
“బ్రహ్మాద్యాః స్థావరంతాశ్చ పశవః పరికీర్తితాః |
తేషాం పతిరహః, దేవి, స్నృతః పశుపతిర్బుధైః |
మాయాపాశేన బద్నామి పశూనేతాన్, సరస్వతి |
తేషాం పశూనాం సర్వేషాం మోచకో (అ)హం, సులోచనే |
మామేవ మోచకం ప్రాహుశ్రుతిః, సాధ్వీ సనాతనీ ||“. (ముక్తి ఖండే). (శివమాహత్మ్యే)
(చతుర్ముఖబ్రహ్మ మొదలు స్థావరములవరకు గలవన్నియు పశువులని చెప్పబడుచున్నవి. దేవ దేవుడైన శివిని పశువులని చెప్పబడుచున్నవి - వాటికి నేను పతిని, అగుటచేత జ్ఞానులు నన్ను పశుపతియని చెప్పు చు న్నారు - ఈ పశువులను మాయాపాశములచేత - మాయ యనెడి పాశముల చేత - బంధించుచున్నాను - వారినందఱిని ఈ బంధమునుండి విడిపించు వాడను నేనే - శ్రుతులు ఈ ప్రకారముగానె చెప్పుచున్నవి).
(ఇతర పశువులు - మానవపశువులుగానివి - పశువృత్తిగలవి – అన్నపానాదు లందే - తిండి తిని, నీళ్ళు త్రాగుటయందే తెలివిగలవి; విజ్ఞానమందుకాని; తెలుసుకోవలసిన విషయములందుకాని, లోకాలోకములందుకాని తెలివిలేనివారు - తెలియనివారు).
తతః పాప సమాచారే ప్రవృత్తాః స్యుర్నరాధిమాః |
తతో మాయాహృత జ్ఞానాః శాస్త్రేప్యనధికారిణః |
తతస్తేహ్యాసురం భావం ప్రాప్తాః పశ్యాదిభిః సమాః ||“. (గీతాభావప్రకాశము -1 - 92 to 94)
(నా స్వరూపమును - (భగవంతుని స్వరూపమును) బాగుగా తెలుసుకొనలేకుండుటచేత మూఢులయి పాపములు చేసి, మాయవలన జ్ఞానము కోల్పోయినందున, శాస్త్రాభ్యాసము నదధికారులు కానందున అసురభావము కలిగియుండునట్టి నరాధములు పశువులతో సమానులు).
తే. కాయమందాత్మ బుద్ధియు గామినీ కు
మారులందు స్వకీయాభిమానములును
దివిరి జలమున దీర్థబుద్ధియును జేయు
నట్టి మూఢుండు పశుమార్గుడనగ బరగు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. - 1121)
అజ్ఞః (జ్ఞానము లేనివాదు - తెలివిలేనివాడు)
జంగమాని (జంతువులు).
కర్మజడాః, పశుప్రాయాః; జ్ఞానహీనాః -
(కర్మచేయుటవలన జడులు అయినవారు - పశువుతో సమానులైనవారు - జ్ఞానము లేనివారు).
(iṃdriyamulanu pāśamulacēta - trāḷḷacēta - baṃdhiṃpabaḍi (kaṭṭabaḍi) yuṃḍu narulu - iṃdriyamula prēraṇaku lōnai yuṃḍuvāru).
paśavaḥ parikīrtyaṃtē samastāḥ paśuvṛttayaḥ ||’
(caturmukhabrahma modalu sthāvaramulavaraku galavanniyu dēvadēvu ḍayina śivuni paśuvulani ceppabaḍucunnavi - ivanniyu paśuvṛttigalaviyē).
“brahmādyāḥ sthāvaraṃtāśca paśavaḥ parikīrtitāḥ |
tēṣāṃ patirahaḥ, dēvi, snṛtaḥ paśupatirbudhaiḥ |
māyāpāśēna badnāmi paśūnētān, sarasvati |
tēṣāṃ paśūnāṃ sarvēṣāṃ mōcakō (a)haṃ, sulōcanē |
māmēva mōcakaṃ prāhuśrutiḥ, sādhvī sanātanī ||“. (mukti khaṃḍē). (śivamāhatmyē)
(caturmukhabrahma modalu sthāvaramulavaraku galavanniyu paśuvulani ceppabaḍucunnavi. dēva dēvuḍaina śivini paśuvulani ceppabaḍucunnavi - vāṭiki nēnu patini, aguṭacēta jñānulu nannu paśupatiyani ceppu cu nnāru - ī paśuvulanu māyāpāśamulacēta - māya yaneḍi pāśamula cēta - baṃdhiṃcucunnānu - vārinaṃdaṟini ī baṃdhamunuṃḍi viḍipiṃcu vāḍanu nēnē - śrutulu ī prakāramugāne ceppucunnavi).
(itara paśuvulu - mānavapaśuvulugānivi - paśuvṛttigalavi – annapānādu laṃdē - tiṃḍi tini, nīḷḷu trāguṭayaṃdē telivigalavi; vijñānamaṃdukāni; telusukōvalasina viṣayamulaṃdukāni, lōkālōkamulaṃdukāni telivilēnivāru - teliyanivāru).
tataḥ pāpa samācārē pravṛttāḥ syurnarādhimāḥ |
tatō māyāhṛta jñānāḥ śāstrēpyanadhikāriṇaḥ |
tatastēhyāsuraṃ bhāvaṃ prāptāḥ paśyādibhiḥ samāḥ ||“. (gītābhāvaprakāśamu -1 - 92 to 94)
(nā svarūpamunu - (bhagavaṃtuni svarūpamunu) bāgugā telusukonalēkuṃḍuṭacēta mūḍhulayi pāpamulu cēsi, māyavalana jñānamu kōlpōyinaṃduna, śāstrābhyāsamu nadadhikārulu kānaṃduna asurabhāvamu kaligiyuṃḍunaṭṭi narādhamulu paśuvulatō samānulu).
tē. kāyamaṃdātma buddhiyu gāminī ku
mārulaṃdu svakīyābhimānamulunu
diviri jalamuna dīrthabuddhiyunu jēyu
naṭṭi mūḍhuṃḍu paśumārguḍanaga baragu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. - 1121)
ajñaḥ (jñānamu lēnivādu - telivilēnivāḍu)
jaṃgamāni (jaṃtuvulu).
karmajaḍāḥ, paśuprāyāḥ; jñānahīnāḥ -
(karmacēyuṭavalana jaḍulu ayinavāru - paśuvutō samānulainavāru - jñānamu lēnivāru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.