← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పశుపతి paśupati

Original — తెలుగు
  1. పశూనాం పతిః, భూతనాథః, శివః.

(పశువులకు పతి అయినవాడు - భూతములకు నాధుడు శివుడు).

“సమస్త భూతాధి పతిః” (సమస్త భూతములకు నాధుడైనవాడు).

  1. పశూనాం సంసార బద్ధానాం పతిః బంధ విమోచకః -

(పశువులు అనగా సంసారముచేత బంధింపబడినవారు - అట్టి వారికి పతి అయినవాడు - సంసారమను బంధమునుండి విముక్తి చేయువాడు).

  1. బ్రహ్మాదిలోకానాం పతిః, పాలకః పాశవిమోచనః ఇత్యర్థః; పశూనాం జీవానాం పతిత్వాత్ పశుపతిః.

(బ్రహ్మ లోకము మొదలగు లోకములకు పతి అయినవాడు - పాలకుడు, వాటిని పాలించువాడు, శాసించువాడు - ఆ లోకములలోని జీవులను బంధించి యుండు పాశములనుండి (త్రాడువలె బంధించు వాటినుండి) విముక్తి చేయువాడు - విడిపించువాడు - మోక్షమిచ్చువాడు).

  1. గవాదీనాం బ్రహ్మాది దేవానాం చ పతిః.

(గోవులు మొదలగువాటికిన్నీ, బ్రహ్మ మొదలగు దేవతులకు పతి అయినవాడు).

  1. “సర్వే దేవాః పశపతామవా పుః. స్వయం తస్మాత్ పశుపతిర్బ భూవ”. (శరభోపనిషత్)

(దేవతులందరు పశుత్వమును పొందిరి. అందుచేత శివుడు పశుపతి ఆయెను).

  1. అహంకారావిష్ట స్సంసారీ జీవస్స ఏవ పశుః |

సర్వజ్ఞ పంచకృత్య సంపన్నః సర్వేశ్వరః ఈశః పశుపతిః.

(అహంకారముచేత ఆవేశించబడిన సంసారియగు జీవుడే పశువు. పంచకృత్యలతోను కూడి సరజ్ఞుడైన సర్వేశ్వరుడే పశుపతి).

  1. “స్వాజ్ఞాన పాశేన బద్యంతే ఇతి పశవః; తేషాం పతిః స్వామీ పశుపతిః పరమేశ్వరః - నారావృతా జడక్రియా జ్ఞానేచ్ఛా సంపన్నోపి స్వాజ్ఞ వికల్పితా హారాధిష్టః ఇవా విష్టో యః సంసారీ జీవ ఇతి విఖ్యాతః స ఏవ పశురుచ్యతే”.

(భగవత్ జ్ఞానము లేకుండుట అను అజ్ఞానముచే బంధింపబడు చున్నారు కనుక పశువులు అని చెప్పబడుచున్నారు - అట్టి పశువుల పతి అయినవాడు పశుపతి. అతనే పరమేశ్వరుడు. ఇచ్ఛా, జ్ఞానక్రియా శక్తులు కలిగియున్నవాడైనను అజ్ఞానమను ఆవరణచే కప్పబడినవాడైన సంసారి - జననమరణ రూపమగు సంసారములో పడి కొట్టుకొనుచుండు వాడు అయిన జీవుడే పశువు అని చెప్పబబడుచున్నాడు).

  1. “సర్వదాయత్పశూన్ పాతి తైశ్చైవ రమతే పునః |

తేషాం పతిశ్చ యస్తస్మాత్ రుద్రః పశుపతిః స్మృతః “. (ఇతి మహాభారతే)

(ఎల్లపుడు పశువులను రక్షించుచుండుటచేతను, వాటితోనే రమించుచుండుటచేతను - జీవులతో లీలగా క్రీడ సలుపుటచేతను వాటికి పతి యగుటచేతను రుద్రుడు పశుపతియని చెప్పబడుచున్నాడు).

  1. “పశవో వయం సర్వే సదేవాసుర మానవాః |

పతిస్త్వమేవ సర్వేషాం పశూనాం పతిరీశ్వరః ||“. (ఈశాన సంహితాయాం (శివం ప్రతి రో విష్ణుః)

(దేవతులు, అసురులు, మానవులు నేను - మేమందరము పశువులము - పశువులందఱికి పతి అయిన ఈశ్వరుడవు నీవే).

  1. “బ్రహ్మాద్యాః స్థావరాం తాశ్చ దేవ దేవస్య శూలినః |

పశవః పరికీర్త్యం తే సంసారవర్తినః |

తేషాం పతిత్వాద్దేవేశః శివః పశుపతిః స్మృతః |

శూలమాయాదిభిః పాశైః స బద్నాతి పశూన్ పతిః |

స ఏవ మోచకస్తే షాం భక్త్యా సమ్యగపాసితః |

చతుర్వింశతి తత్వాని మాయా మాయాకర్మగుణా అపి |

విషయా ఇతి కధ్యంతే పాశాః జీవ నిబంధనాః |

బ్రహ్మాదిస్తంబ పర్యంతాన్ పశూన్ బద్ధ్వామహేశ్వరః |

పాశై రేతైః పతిర్దేవో కార్యం కారయతి స్వయం ||“. (వాయవీయ సంహితాయాం)

(చతుర్ముఖబ్రహ్మ మొదలు స్థావరములవరకు గలవన్నియు సంసారములో పడి కొట్టుకొనుచున్నవనియు, దేవ దేవుడైన శివుని యొక్క పశువులని చెప్పబడుచున్నవి - వాటికి పతియగుటవలన దేవదేవుడైన శివుడు పశుపతియని చెప్పబడుచున్నాడు. శూలమను మాయ మొదలగు పాశములచేత నీ పశువులను ఆ శివుడు బంధించుచున్నాడు. కాని ఆ పశువులే తనను భక్తితో ఉపాసించినయడల వాటిని అతను బంధమునుండు విముక్తులచేయును - వారికి మోక్షమునిచ్చును -)

  1. “అస్తి కశ్చత్ స్వతస్థిః సత్య జ్ఞాన సుఖాద్వయః |

విశ్వస్య జగతః కర్తా పశుపాశ విలక్షణః |

ఆకాశాదీని భూతాని పంచతేషాం ప్రకీర్తితాః |

గుణాశ్శబ్దాదయః పంచ పంచ కర్మేంద్రియాణి చ |

జ్ఞానేంద్రియాణి పంచైవ ప్రాణాద్యా దశ వాయవః |

మనో బుద్ధిరహంకారశ్చిత్తం చేతి చతుష్టయం |

తేషాం కారణ భూతైకా (అ)విద్యా షట్త్రింశకః పశుః |

విశ్వస్య జగతః కర్తా పశోరన్యః పరశ్శివః |

ఆత్మానః పశవః ప్రోక్తాః సర్వే అజ్ఞాని నస్సదా |

అజ్ఞానమాత్మవా మేషా పునా ద్యేవ స్వభావతః |

జ్ఞానాత్తస్య నివృత్తి స్యాత్ ప్రకాశాత్తమసో యథా ||“. (సూతసంహితా యాం)

(స్వతసిద్ధుడు - స్వయంభవుడు - సత్యజ్ఞానందమయుడు, సమస్త ప్రపంచమునకు కర్త అయినవాడు, పశువులకంటె, వాటిని బంధించు పాశములకంటె వేరగు లక్షణములు కలవాడు అగు పరబ్రహ్మ ఒకడు కలడు. ఆకాశము మొదలగు అయిదు భూతములు, శబ్దముమొదలగు అయిదు విషయములు, అయిదు కర్మేం ద్రియములు, జ్ఞానేంద్రియములు అయిదు, ప్రాణము మొదలగు నవి పది, (అయిదు ప్రాణములు, అయిదు ఉపప్రాణములు), మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, అనునవి నాలుగు, వీటి అన్నింటికీ ఒకే కారణమైన అవిద్య - ఇవన్నియు కలిసి ముప్పదియారు పశువులు అని చెప్పబడుచున్నవి. ఈ సమస్త జగత్తునకు కర్త అయినవాడు పశువులకంటె వేరైన లక్షణములు కలవాడు పరమశివుడు - అజ్ఞానులయిన ఆత్మలన్నియు పశువులని చెప్పబడుచున్నవి. ఈ పశువుల అజ్ఞానము అనాది కాలమునుండి స్వభావముచేత వచ్చుచున్నది. వెలుతురువలన చీకటి పోవునట్లు ఈ పశువుల అజ్ఞానము జ్ఞానము వలన - బ్రహ్మజ్ఞానమువలన, స్వస్వరూప జ్ఞానమువలన - తనే పరబ్రహ్మయని తెలుసుకొనుటవలన - నివృత్తి యగును).

Transliteration
  1. paśūnāṃ patiḥ, bhūtanāthaḥ, śivaḥ.

(paśuvulaku pati ayinavāḍu - bhūtamulaku nādhuḍu śivuḍu).

“samasta bhūtādhi patiḥ” (samasta bhūtamulaku nādhuḍainavāḍu).

  1. paśūnāṃ saṃsāra baddhānāṃ patiḥ baṃdha vimōcakaḥ -

(paśuvulu anagā saṃsāramucēta baṃdhiṃpabaḍinavāru - aṭṭi vāriki pati ayinavāḍu - saṃsāramanu baṃdhamunuṃḍi vimukti cēyuvāḍu).

  1. brahmādilōkānāṃ patiḥ, pālakaḥ pāśavimōcanaḥ ityarthaḥ; paśūnāṃ jīvānāṃ patitvāt paśupatiḥ.

(brahma lōkamu modalagu lōkamulaku pati ayinavāḍu - pālakuḍu, vāṭini pāliṃcuvāḍu, śāsiṃcuvāḍu - ā lōkamulalōni jīvulanu baṃdhiṃci yuṃḍu pāśamulanuṃḍi (trāḍuvale baṃdhiṃcu vāṭinuṃḍi) vimukti cēyuvāḍu - viḍipiṃcuvāḍu - mōkṣamiccuvāḍu).

  1. gavādīnāṃ brahmādi dēvānāṃ ca patiḥ.

(gōvulu modalaguvāṭikinnī, brahma modalagu dēvatulaku pati ayinavāḍu).

  1. “sarvē dēvāḥ paśapatāmavā puḥ. svayaṃ tasmāt paśupatirba bhūva”. (śarabhōpaniṣat)

(dēvatulaṃdaru paśutvamunu poṃdiri. aṃducēta śivuḍu paśupati āyenu).

  1. ahaṃkārāviṣṭa ssaṃsārī jīvassa ēva paśuḥ |

sarvajña paṃcakṛtya saṃpannaḥ sarvēśvaraḥ īśaḥ paśupatiḥ.

(ahaṃkāramucēta āvēśiṃcabaḍina saṃsāriyagu jīvuḍē paśuvu. paṃcakṛtyalatōnu kūḍi sarajñuḍaina sarvēśvaruḍē paśupati).

  1. “svājñāna pāśēna badyaṃtē iti paśavaḥ; tēṣāṃ patiḥ svāmī paśupatiḥ paramēśvaraḥ - nārāvṛtā jaḍakriyā jñānēcchā saṃpannōpi svājña vikalpitā hārādhiṣṭaḥ ivā viṣṭō yaḥ saṃsārī jīva iti vikhyātaḥ sa ēva paśurucyatē”.

(bhagavat jñānamu lēkuṃḍuṭa anu ajñānamucē baṃdhiṃpabaḍu cunnāru kanuka paśuvulu ani ceppabaḍucunnāru - aṭṭi paśuvula pati ayinavāḍu paśupati. atanē paramēśvaruḍu. icchā, jñānakriyā śaktulu kaligiyunnavāḍainanu ajñānamanu āvaraṇacē kappabaḍinavāḍaina saṃsāri - jananamaraṇa rūpamagu saṃsāramulō paḍi koṭṭukonucuṃḍu vāḍu ayina jīvuḍē paśuvu ani ceppababaḍucunnāḍu).

  1. “sarvadāyatpaśūn pāti taiścaiva ramatē punaḥ |

tēṣāṃ patiśca yastasmāt rudraḥ paśupatiḥ smṛtaḥ “. (iti mahābhāratē)

(ellapuḍu paśuvulanu rakṣiṃcucuṃḍuṭacētanu, vāṭitōnē ramiṃcucuṃḍuṭacētanu - jīvulatō līlagā krīḍa salupuṭacētanu vāṭiki pati yaguṭacētanu rudruḍu paśupatiyani ceppabaḍucunnāḍu).

  1. “paśavō vayaṃ sarvē sadēvāsura mānavāḥ |

patistvamēva sarvēṣāṃ paśūnāṃ patirīśvaraḥ ||“. (īśāna saṃhitāyāṃ (śivaṃ prati rō viṣṇuḥ)

(dēvatulu, asurulu, mānavulu nēnu - mēmaṃdaramu paśuvulamu - paśuvulaṃdaṟiki pati ayina īśvaruḍavu nīvē).

  1. “brahmādyāḥ sthāvarāṃ tāśca dēva dēvasya śūlinaḥ |

paśavaḥ parikīrtyaṃ tē saṃsāravartinaḥ |

tēṣāṃ patitvāddēvēśaḥ śivaḥ paśupatiḥ smṛtaḥ |

śūlamāyādibhiḥ pāśaiḥ sa badnāti paśūn patiḥ |

sa ēva mōcakastē ṣāṃ bhaktyā samyagapāsitaḥ |

caturviṃśati tatvāni māyā māyākarmaguṇā api |

viṣayā iti kadhyaṃtē pāśāḥ jīva nibaṃdhanāḥ |

brahmādistaṃba paryaṃtān paśūn baddhvāmahēśvaraḥ |

pāśai rētaiḥ patirdēvō kāryaṃ kārayati svayaṃ ||“. (vāyavīya saṃhitāyāṃ)

(caturmukhabrahma modalu sthāvaramulavaraku galavanniyu saṃsāramulō paḍi koṭṭukonucunnavaniyu, dēva dēvuḍaina śivuni yokka paśuvulani ceppabaḍucunnavi - vāṭiki patiyaguṭavalana dēvadēvuḍaina śivuḍu paśupatiyani ceppabaḍucunnāḍu. śūlamanu māya modalagu pāśamulacēta nī paśuvulanu ā śivuḍu baṃdhiṃcucunnāḍu. kāni ā paśuvulē tananu bhaktitō upāsiṃcinayaḍala vāṭini atanu baṃdhamunuṃḍu vimuktulacēyunu - vāriki mōkṣamuniccunu -)

  1. “asti kaścat svatasthiḥ satya jñāna sukhādvayaḥ |

viśvasya jagataḥ kartā paśupāśa vilakṣaṇaḥ |

ākāśādīni bhūtāni paṃcatēṣāṃ prakīrtitāḥ |

guṇāśśabdādayaḥ paṃca paṃca karmēṃdriyāṇi ca |

jñānēṃdriyāṇi paṃcaiva prāṇādyā daśa vāyavaḥ |

manō buddhirahaṃkāraścittaṃ cēti catuṣṭayaṃ |

tēṣāṃ kāraṇa bhūtaikā (a)vidyā ṣaṭtriṃśakaḥ paśuḥ |

viśvasya jagataḥ kartā paśōranyaḥ paraśśivaḥ |

ātmānaḥ paśavaḥ prōktāḥ sarvē ajñāni nassadā |

ajñānamātmavā mēṣā punā dyēva svabhāvataḥ |

jñānāttasya nivṛtti syāt prakāśāttamasō yathā ||“. (sūtasaṃhitā yāṃ)

(svatasiddhuḍu - svayaṃbhavuḍu - satyajñānaṃdamayuḍu, samasta prapaṃcamunaku karta ayinavāḍu, paśuvulakaṃṭe, vāṭini baṃdhiṃcu pāśamulakaṃṭe vēragu lakṣaṇamulu kalavāḍu agu parabrahma okaḍu kalaḍu. ākāśamu modalagu ayidu bhūtamulu, śabdamumodalagu ayidu viṣayamulu, ayidu karmēṃ driyamulu, jñānēṃdriyamulu ayidu, prāṇamu modalagu navi padi, (ayidu prāṇamulu, ayidu upaprāṇamulu), manassu, buddhi, cittamu, ahaṃkāramu, anunavi nālugu, vīṭi anniṃṭikī okē kāraṇamaina avidya - ivanniyu kalisi muppadiyāru paśuvulu ani ceppabaḍucunnavi. ī samasta jagattunaku karta ayinavāḍu paśuvulakaṃṭe vēraina lakṣaṇamulu kalavāḍu paramaśivuḍu - ajñānulayina ātmalanniyu paśuvulani ceppabaḍucunnavi. ī paśuvula ajñānamu anādi kālamunuṃḍi svabhāvamucēta vaccucunnadi. veluturuvalana cīkaṭi pōvunaṭlu ī paśuvula ajñānamu jñānamu valana - brahmajñānamuvalana, svasvarūpa jñānamuvalana - tanē parabrahmayani telusukonuṭavalana - nivṛtti yagunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.