పాత్రుడు, యోగ్యుడు - అర్హుడు; తగినవాడు.
తారతమ్యేన తిర్యగాదిభ్యః పురుషే యస్మాత్ ఆధిక్యేన వర్తతే తస్మాత్ పురుషః పాత్రం; తత్రాపి యాదానాత్మ జ్ఞానాంశః యథా, తథా తప ఆది యోగేన యత్ర యత్ర ప్రతీయతే తథా తథా అసౌపాత్రం ఇత్యర్థః.
శ్లో|| ’తేష్వీశో భగవాన్ రాజన్ తారతమ్యేన వర్తతే |
తస్మాత్ పాత్రం హి పురుషం యావాన్ ఆత్మాయధీయతే ||“. (భాగవతం)
శ్లో||. పురుషేష్వపి రాజేంద్ర, సుపాత్రం బ్రాహ్మణం విదుః |
తపసా విద్యయా తుష్ట్యా ధత్తే వేదం హలేస్తనుం ||“. (శ్రీమద్భాగవతం)
“చరాచరంబయిన విశ్వమంతయు విష్ణుమయంబగుటం జేసి పాత్ర నిర్ణయ నిపుణులైన విద్వాంసులు నారాయణుండు ముఖ్యపాత్రంబని పలుకుదురు - అనేక జంతు సంఘాత సంకీర్ణంబైన బ్రహ్మాండ పాదపంబునకు నారాయణుండు మూలంబు. తన్నిమిత్తంబున నారాయణ సంతర్పణంబు సకలజంతు సంతర్పణంబని యెఱుంగుము. ఋషి, నర, తిర్యగమర శరీరంబులు పురంబులు. వారియందు తారతమ్యంబులతోడ జీవరూపంబున భగవంతుడైన హరి వర్తించుటంజేసి పురుషుండిల ప్రసిద్ధుండయ్యె. అందు తిర్యగ్జాతులకంటె నధికత్వంబు పురుషునియందు విలసిల్లుటంజేసి పురుషుండు పాత్రంబు. పురుషులలోన హరితనువైన వేదంబును ధరించుచు, సంతోష విద్యా తపో గరిష్టుండైన బ్రాహ్మణుండు పాత్రంబు. బ్రాహ్మణులలోన ఆత్మజ్ఞాన పరిపూర్ణుండైన యోగి ముఖ్యపాత్రంబని పలుకుదురు. పరస్పర పాత్రంబులకు సహింపని మనుష్యులకు పూజనార్థంబుగా త్రేతాయుగంబునందు హరి ప్రతిమలు గల్పింపబడియె. కొందఱు ప్రతిమార్చనంబు చేయుదురు. పాత్ర పురుష ద్వేషులైన వారలకు నట్టి ప్రతిమార్చనంబు ముఖ్యార్థప్రదంబు గాదు. మందాధికారులకు ప్రతిమార్చనంబు పురుషార్థప్రదంబగు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 14 - 453)
pātruḍu, yōgyuḍu - arhuḍu; taginavāḍu.
tāratamyēna tiryagādibhyaḥ puruṣē yasmāt ādhikyēna vartatē tasmāt puruṣaḥ pātraṃ; tatrāpi yādānātma jñānāṃśaḥ yathā, tathā tapa ādi yōgēna yatra yatra pratīyatē tathā tathā asaupātraṃ ityarthaḥ.
ślō|| ’tēṣvīśō bhagavān rājan tāratamyēna vartatē |
tasmāt pātraṃ hi puruṣaṃ yāvān ātmāyadhīyatē ||“. (bhāgavataṃ)
ślō||. puruṣēṣvapi rājēṃdra, supātraṃ brāhmaṇaṃ viduḥ |
tapasā vidyayā tuṣṭyā dhattē vēdaṃ halēstanuṃ ||“. (śrīmadbhāgavataṃ)
“carācaraṃbayina viśvamaṃtayu viṣṇumayaṃbaguṭaṃ jēsi pātra nirṇaya nipuṇulaina vidvāṃsulu nārāyaṇuṃḍu mukhyapātraṃbani palukuduru - anēka jaṃtu saṃghāta saṃkīrṇaṃbaina brahmāṃḍa pādapaṃbunaku nārāyaṇuṃḍu mūlaṃbu. tannimittaṃbuna nārāyaṇa saṃtarpaṇaṃbu sakalajaṃtu saṃtarpaṇaṃbani yeṟuṃgumu. ṛṣi, nara, tiryagamara śarīraṃbulu puraṃbulu. vāriyaṃdu tāratamyaṃbulatōḍa jīvarūpaṃbuna bhagavaṃtuḍaina hari vartiṃcuṭaṃjēsi puruṣuṃḍila prasiddhuṃḍayye. aṃdu tiryagjātulakaṃṭe nadhikatvaṃbu puruṣuniyaṃdu vilasilluṭaṃjēsi puruṣuṃḍu pātraṃbu. puruṣulalōna haritanuvaina vēdaṃbunu dhariṃcucu, saṃtōṣa vidyā tapō gariṣṭuṃḍaina brāhmaṇuṃḍu pātraṃbu. brāhmaṇulalōna ātmajñāna paripūrṇuṃḍaina yōgi mukhyapātraṃbani palukuduru. paraspara pātraṃbulaku sahiṃpani manuṣyulaku pūjanārthaṃbugā trētāyugaṃbunaṃdu hari pratimalu galpiṃpabaḍiye. koṃdaṟu pratimārcanaṃbu cēyuduru. pātra puruṣa dvēṣulaina vāralaku naṭṭi pratimārcanaṃbu mukhyārthapradaṃbu gādu. maṃdādhikārulaku pratimārcanaṃbu puruṣārthapradaṃbagu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 14 - 453)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.