← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పితృభక్తి pitṛbhakti

Original — తెలుగు
  1. “అహం హి వచనార్రాజ్ఞః పతేయమపి పాపకే |

భక్షయేయం విషం తీక్ష్ణం పతే యమపి చార్ణపే ||“. (శ్రీమద్రామాయణము -)

(నేను తండ్రియాజ్ఞ అయినచో మంటలో దూకుదును, విషమైనను భక్షించెదను, సముద్రములో నైననుదూకెదను).

  1. “క. ముని వృత్తి డయ్యెనేటికి

జనపాలక, సుగతిగోరు సత్పురుషులకున్

దనగన్న తండ్రి సెప్పిన

పని సేసిన సుగతిగలుగు పసిడియకాదే ?“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 9 - 18 - 557)

  1. “శ్లో|. మాతాపితృ సమం దైవం సర్వేషాం నహి విద్యతే |

తస్మాత్ సమర్చయేన్నిత్యం పితరౌ దేవరూపిణౌ ||“.

ఇత్యాది వచనైః సర్వేశ్వరారాధన కల్పతయా బహు ఫలదాయ కత్వేన పితృ సేవా కర్తవ్యా.

(సమస్తమైనవారికి తలిదండ్రులతో సమానమైన దైవము లేదు - అందుచేత దేవతా స్వరూపులైన తలిదండ్రులను ఎల్లపుడు పూజింపవలెను - ఇట్లు చెప్పబడి యుండుటచేత భగవంతుని ఆరాధించిన విధము గనే తలిదండ్రుల సేవ చేయవలెను).

  1. “చ. మునుకొని తండ్రి యాజ్ఞదలమోచి నిజోచిత కౄత్యమేమి వం

చిన దన శక్తి యుక్తి నెడ సేయక చేయుట పుండరీక లో

చన పదసేవ సేయుట ప్రజా పరిపాలన శాలి యౌటయున్

జనకునకున్ సుతుండు పరిచర్యలొనర్చుట సువ్వె పుత్రకా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 13 - 398)

Transliteration
  1. “ahaṃ hi vacanārrājñaḥ patēyamapi pāpakē |

bhakṣayēyaṃ viṣaṃ tīkṣṇaṃ patē yamapi cārṇapē ||“. (śrīmadrāmāyaṇamu -)

(nēnu taṃḍriyājña ayinacō maṃṭalō dūkudunu, viṣamainanu bhakṣiṃcedanu, samudramulō nainanudūkedanu).

  1. “ka. muni vṛtti ḍayyenēṭiki

janapālaka, sugatigōru satpuruṣulakun

danaganna taṃḍri seppina

pani sēsina sugatigalugu pasiḍiyakādē ?“. (śrīmadāṃdhramahābhāgavatamu - 9 - 18 - 557)

  1. “ślō|. mātāpitṛ samaṃ daivaṃ sarvēṣāṃ nahi vidyatē |

tasmāt samarcayēnnityaṃ pitarau dēvarūpiṇau ||“.

ityādi vacanaiḥ sarvēśvarārādhana kalpatayā bahu phaladāya katvēna pitṛ sēvā kartavyā.

(samastamainavāriki talidaṃḍrulatō samānamaina daivamu lēdu - aṃducēta dēvatā svarūpulaina talidaṃḍrulanu ellapuḍu pūjiṃpavalenu - iṭlu ceppabaḍi yuṃḍuṭacēta bhagavaṃtuni ārādhiṃcina vidhamu ganē talidaṃḍrula sēva cēyavalenu).

  1. “ca. munukoni taṃḍri yājñadalamōci nijōcita kṝtyamēmi vaṃ

cina dana śakti yukti neḍa sēyaka cēyuṭa puṃḍarīka lō

cana padasēva sēyuṭa prajā paripālana śāli yauṭayun

janakunakun sutuṃḍu paricaryalonarcuṭa suvve putrakā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 13 - 398)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.