← Back to ప · Booklets 21–30 (digitized file 3)

ప్రజ్ఞా prajñā

Original — తెలుగు
  1. జ్ఞానము, బుద్ధి; సామర్థ్యము.

  2. ప్రజ్ఞం ప్రకర్షేణ జ్ఞాపయతి మానస వాసనామయం ధ్యేయమితి ప్రజ్ఞం.

(బాగుగా జ్ఞాపకము చేయునవి - మనోవాసనలతో నిండియున్నది - ధ్యానించతగిన వస్తువు).

  1. ఆత్మానాత్మ వివేకజ్ఞానం ప్రజ్ఞాం; జ్ఞానం పరోక్ష నిశ్చయం.

(ఉత్కృష్టమగు బ్రహ్మాత్మైక జ్ఞానము - ఆత్మయేదో, అనాత్మయేదో అను వివేకమువలన కలుగు జ్ఞానము - పరోక్షజ్ఞానము).

  1. శాస్త్రాచార్యోపనిష్ట విషయం జ్ఞానం, జిజ్ఞాసా పరిసమాప్తి కరీ.

(శాస్త్రములో చెప్పబడినది, గురువు ఉపదేశించినది అయిన విషయము గుఱించి అయిన జ్ఞానము - దానిని తెలుసుకోవలెనను కోరిక ఫలించుట).

  1. “బ్రహ్మాత్మనోః శోధితయో రేకభావావగాహినీ |

నిర్వికల్పాచ చిన్మాత్రా వృత్తిః ప్రజ్ఞేతి కథ్యతే ||. (అధ్యాత్మోపనిషత్)

(‘తత్’, ‘త్వం’ అను పదముల గుఱించి జీవబ్రహ్మల గుఱించి శాస్త్రమును శోధించుటవలన జీవాత్మైక్యజ్ఞానము కలిగించు అంతఃకరణవృత్తి - చైతన్యము యొక్క రూపమైనది).

  1. “ప్రత్యక్, స్వప్రకాశః, సాక్షీ, చిద్రూపః -

(ప్రత్యక్, స్వప్రకాశము, సాక్షి, చిద్రూపము - చైతన్యరూపము, చైతన్యమే రూపమైనవాడు).

  1. “ఇంద్రియాణాం హి చరతాం యన్మనో(అ)ను విధీయతే |

తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి ||“. (శ్రీమద్భగవద్గీత - 2 - 67)

“స్వైరం ప్రవర్తమానానా మింద్రియాణాం ప్రమాథినాం |

విషయేషు చ తన్మధ్యే యద్యేకమపి హీంద్రియం |

మనోను లక్ష్మీ కృత్యైవ సాధకస్య ప్రవర్తతే |

మనసానుసృతం తచ్చ ప్రజ్ఞామాత్మైక గోచరాం |

సాధకస్యాపనయతి శాస్త్రీయాం విషయావృతం |

యద్యేకమపి తాం ప్రజ్ఞాం విదుషో హరతీంద్రియం |

కిమువాచ్యం తదా సర్వాణీంద్రియాణి హరంతి తాం |

నౌకాహరణ సామర్థ్యయంభస్యేవ నతుక్షితౌ|

వాయోస్తధేంద్రియస్యాపి చాంచల్యే మనసః సం |

ప్రజ్ఞాహరణ సామర్థ్యం మనః స్థైర్యేతు నాస్య తత్ |

ఇతి సూచయితుం ప్రోక్తమం భసీతి పదం త్విహ ||“. (గీతాభావప్రకాశము - 2 - 630 to 635)

(ఇష్టము వచ్చినట్లు విషయములననుభవించుటకు ప్రయత్నించు ఇంద్రియములలో ఏ ఒక్క ఇంద్రియమైనను సాధకుని మనస్సును తనతో త్రిప్పుకొనినచో ఆత్మధ్యానమే లక్ష్యముగా గల అతని యొక్క ప్రజ్ఞను హరించును. ఒక్క ఇంద్రియమే సాధకుని ప్రజ్ఞను పాడుచేయునపుడు ఇంద్రియములన్నియు నిట్లే అయిన యడల ఇక చెప్పనవసరములేదు -నీటిమీదనున్న పడవను వాయువు ముంచివేయుటకు సామర్థ్యము కలిగియుండును - మనసుతో కలిసిన ఇంద్రియముల సామర్థ్యమువలె - ఆ పడవే నేలమీదనున్న యడల వాయువు దానిని ఏమియు చేయనేరదు - ఆ ప్రకారముగానే మనస్సు కలియకపోయిన యడల ఇంద్రియములు సాధకుని ప్రజ్ఞను ఏమియు చేయనేరవు. అందుచేత మనస్సు చంచలముగా నున్నపుడే ఇంద్రియములు ప్రజ్ఞను హరించగలవు. మనస్సు స్థిరముగా నుండిన - మనోజయము కలిగియున్న యడల - ఇంద్రియములు ప్రజ్ఞను ఏమియు చేయనేరవు).

Transliteration
  1. jñānamu, buddhi; sāmarthyamu.

  2. prajñaṃ prakarṣēṇa jñāpayati mānasa vāsanāmayaṃ dhyēyamiti prajñaṃ.

(bāgugā jñāpakamu cēyunavi - manōvāsanalatō niṃḍiyunnadi - dhyāniṃcatagina vastuvu).

  1. ātmānātma vivēkajñānaṃ prajñāṃ; jñānaṃ parōkṣa niścayaṃ.

(utkṛṣṭamagu brahmātmaika jñānamu - ātmayēdō, anātmayēdō anu vivēkamuvalana kalugu jñānamu - parōkṣajñānamu).

  1. śāstrācāryōpaniṣṭa viṣayaṃ jñānaṃ, jijñāsā parisamāpti karī.

(śāstramulō ceppabaḍinadi, guruvu upadēśiṃcinadi ayina viṣayamu guṟiṃci ayina jñānamu - dānini telusukōvalenanu kōrika phaliṃcuṭa).

  1. “brahmātmanōḥ śōdhitayō rēkabhāvāvagāhinī |

nirvikalpāca cinmātrā vṛttiḥ prajñēti kathyatē ||. (adhyātmōpaniṣat)

(‘tat’, ‘tvaṃ’ anu padamula guṟiṃci jīvabrahmala guṟiṃci śāstramunu śōdhiṃcuṭavalana jīvātmaikyajñānamu kaligiṃcu aṃtaḥkaraṇavṛtti - caitanyamu yokka rūpamainadi).

  1. “pratyak, svaprakāśaḥ, sākṣī, cidrūpaḥ -

(pratyak, svaprakāśamu, sākṣi, cidrūpamu - caitanyarūpamu, caitanyamē rūpamainavāḍu).

  1. “iṃdriyāṇāṃ hi caratāṃ yanmanō(a)nu vidhīyatē |

tadasya harati prajñāṃ vāyurnāvamivāṃbhasi ||“. (śrīmadbhagavadgīta - 2 - 67)

“svairaṃ pravartamānānā miṃdriyāṇāṃ pramāthināṃ |

viṣayēṣu ca tanmadhyē yadyēkamapi hīṃdriyaṃ |

manōnu lakṣmī kṛtyaiva sādhakasya pravartatē |

manasānusṛtaṃ tacca prajñāmātmaika gōcarāṃ |

sādhakasyāpanayati śāstrīyāṃ viṣayāvṛtaṃ |

yadyēkamapi tāṃ prajñāṃ viduṣō haratīṃdriyaṃ |

kimuvācyaṃ tadā sarvāṇīṃdriyāṇi haraṃti tāṃ |

naukāharaṇa sāmarthyayaṃbhasyēva natukṣitau|

vāyōstadhēṃdriyasyāpi cāṃcalyē manasaḥ saṃ |

prajñāharaṇa sāmarthyaṃ manaḥ sthairyētu nāsya tat |

iti sūcayituṃ prōktamaṃ bhasīti padaṃ tviha ||“. (gītābhāvaprakāśamu - 2 - 630 to 635)

(iṣṭamu vaccinaṭlu viṣayamulananubhaviṃcuṭaku prayatniṃcu iṃdriyamulalō ē okka iṃdriyamainanu sādhakuni manassunu tanatō trippukoninacō ātmadhyānamē lakṣyamugā gala atani yokka prajñanu hariṃcunu. okka iṃdriyamē sādhakuni prajñanu pāḍucēyunapuḍu iṃdriyamulanniyu niṭlē ayina yaḍala ika ceppanavasaramulēdu -nīṭimīdanunna paḍavanu vāyuvu muṃcivēyuṭaku sāmarthyamu kaligiyuṃḍunu - manasutō kalisina iṃdriyamula sāmarthyamuvale - ā paḍavē nēlamīdanunna yaḍala vāyuvu dānini ēmiyu cēyanēradu - ā prakāramugānē manassu kaliyakapōyina yaḍala iṃdriyamulu sādhakuni prajñanu ēmiyu cēyanēravu. aṃducēta manassu caṃcalamugā nunnapuḍē iṃdriyamulu prajñanu hariṃcagalavu. manassu sthiramugā nuṃḍina - manōjayamu kaligiyunna yaḍala - iṃdriyamulu prajñanu ēmiyu cēyanēravu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.