← Back to ప · Booklets 21–30 (digitized file 3)

ప్రకృతి పురుషులు prakṛti puruṣulu

Original — తెలుగు

ఉభావప్యనాదీ, ఉభావప్య నంతౌ ఉభావప్యలింగౌ, ఉభావప్యపరౌ, ఉభేచ సర్వగాతావితి. ప్రకృతిరచేతనా, త్రిగుణా, బీజధర్మిణీ, ప్రసవ ధర్మణీ.

(ప్రకృతి పురుషులు రెండునూ అనాదులు (ఎప్పటినుండియో తెలియదు), అనంతములు (కొంతకాలమువఱకు నుండి తరువాత లేకుండపోవునవికావు). ఈ రెండును రూపము లేనివి (నిరాకారములు, శరీరము లేనివి), ఎల్లపుడు ఉండునవి; రెండునూ వాటికంటె ఉత్కృష్టమైనవి, రెండును అన్ని వస్తువులలోను వ్యాపించియుండునవి. కాని, ప్రకృతి అచేతనము, సత్వరజస్తమోగుణములు గలది; ప్రపంచమును తనలోనుండి సృష్టించుటచే దానికి బీజము (విత్తనము) వంటిది, తనలోనుండి ప్రపంచమును పుట్టుంచునది).

Transliteration

ubhāvapyanādī, ubhāvapya naṃtau ubhāvapyaliṃgau, ubhāvapyaparau, ubhēca sarvagātāviti. prakṛtiracētanā, triguṇā, bījadharmiṇī, prasava dharmaṇī.

(prakṛti puruṣulu reṃḍunū anādulu (eppaṭinuṃḍiyō teliyadu), anaṃtamulu (koṃtakālamuvaṟaku nuṃḍi taruvāta lēkuṃḍapōvunavikāvu). ī reṃḍunu rūpamu lēnivi (nirākāramulu, śarīramu lēnivi), ellapuḍu uṃḍunavi; reṃḍunū vāṭikaṃṭe utkṛṣṭamainavi, reṃḍunu anni vastuvulalōnu vyāpiṃciyuṃḍunavi. kāni, prakṛti acētanamu, satvarajastamōguṇamulu galadi; prapaṃcamunu tanalōnuṃḍi sṛṣṭiṃcuṭacē dāniki bījamu (vittanamu) vaṃṭidi, tanalōnuṃḍi prapaṃcamunu puṭṭuṃcunadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.