“ధ్యాయతో విషయాన్ పుంసస్సంగస్తేషూప జాయతే |
సంగాత్సంజాయతే కామః కమాత్క్రోధోభి జాయతే |
క్రోధాద్భవతి సం మోహః సం మ్మోహా త్స్మృతి విభ్రమః |
స్మృతిభ్రంశాద్భుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి ||. (శ్రీమద్భగవద్గీత - 2 - 62 - 63)
(ప్రణాశము కలుగు విధము ఇట్లు చెప్పబడునది - :
(విషయములను గుఱించి ఆలోచించిన కొలది వాటియందు అనురాగము - అభిలాష - కలుగును. అభిలాషకలిగినవాటిని పొందవలెనను కామము కలుగును. ఆ కామము (కోరిక) తీరకున్నయడల - దానికి అడ్డు తగిలియున్న యడల - కోపము కలుగును - కోపమువలన సం మోహము (అవివేకము) కలుగును; దానివలన శాస్త్రములో చెప్పినవాటిని, గురుడు బోధించినవాటిని మఱచి పోవును. ఇట్లు స్మృతి చెడిన బుద్ధి నశించును - బుద్ధి నశించిన ప్రణాశము కలుగును - అన్నివిధముల చెడిపోవును - పరమ పురుషార్థమైన మోక్షము కలుగకపోవును).
“dhyāyatō viṣayān puṃsassaṃgastēṣūpa jāyatē |
saṃgātsaṃjāyatē kāmaḥ kamātkrōdhōbhi jāyatē |
krōdhādbhavati saṃ mōhaḥ saṃ mmōhā tsmṛti vibhramaḥ |
smṛtibhraṃśādbhuddhināśō buddhināśātpraṇaśyati ||. (śrīmadbhagavadgīta - 2 - 62 - 63)
(praṇāśamu kalugu vidhamu iṭlu ceppabaḍunadi - :
(viṣayamulanu guṟiṃci ālōciṃcina koladi vāṭiyaṃdu anurāgamu - abhilāṣa - kalugunu. abhilāṣakaliginavāṭini poṃdavalenanu kāmamu kalugunu. ā kāmamu (kōrika) tīrakunnayaḍala - dāniki aḍḍu tagiliyunna yaḍala - kōpamu kalugunu - kōpamuvalana saṃ mōhamu (avivēkamu) kalugunu; dānivalana śāstramulō ceppinavāṭini, guruḍu bōdhiṃcinavāṭini maṟaci pōvunu. iṭlu smṛti ceḍina buddhi naśiṃcunu - buddhi naśiṃcina praṇāśamu kalugunu - annividhamula ceḍipōvunu - parama puruṣārthamaina mōkṣamu kalugakapōvunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.