ఓం; ఓంకారము.
ఏకాక్షరం (‘ఓం’ అను ఒకే అక్షరము గలది).
తారకం
(తరింప చేయునది. ‘ఓం’ అని ఉచ్ఛారణ చేయుటవలన సంసారమను మహాసముద్రమును దాటించునది - జననమరణములు లేకుండ చేయునది).
(శబ్ద రూపమైన పరబ్రహ్మము - ఓంకారము పరబ్రహ్మమే యని ఉపాసించవలెను - అందుచేత దానిని ఉచ్ఛరించుటవలన కలుగు శబ్దము బ్రహ్మమే కనుక అది శబ్దబ్రహ్మ - శబ్దరూప బ్రహ్మము).
(సమస్త ప్రాణములను పరమాత్మయందు చేర్చునది, పరమాత్మతో ఐక్యము చేయునది). - దీనిని ఉచ్ఛరించుటవలన ముక్తి నిచ్చునది - తారకము. కనుక ప్రణవమని చెప్పబడినది. అకారము, ఉకారము, మకారము, అర్థమాత్ర అను నాలుగు పాదములు కలది. ఇది దేవతులందఱకు, వేదములకు యోని (పుట్టుచోటు). సృష్టిలో శబ్దముతో నుచ్చరించబడు సమస్త వస్తువులు ప్రణవాత్మకమే - ప్రణవమే.
(సమస్త ప్రాణములను పరమాత్మయందు ఉత్కౄష్టమైన రీతిగా ఐక్యము చేయునది. ఈ కారణమువలన ప్రణవము అని చెప్పబడుచున్నది).
(‘ఓం’ అని ఉచ్ఛరించుచు నమస్కారము చేయుట - నమస్కరింపబడువాడు - పరమాత్మ).
(దేవతులచే నమస్కరింపబడుచుండువాడు - అందుచేత ప్రణవమని చెప్పబడుచున్నాడు - అని సనత్కుమారుడు చెప్పెను).
(ప్రణవము పరమాత్మ వాచకము - పరమాత్మను చెప్పు శబ్దము - మాట) ఓంకారము పరమాత్మతో భేదము లేనిది కనుక పరమాత్మయే, పరమాత్మ వాచకమని చెప్పబడినది).
(ఆ పరబ్రహ్మను చెప్పునది ప్రణవము కనుక అది పరబ్రహ్మ వాచకము).
(ఓంకారమే ప్రణవము, ప్రణవమే అన్నింటిలోను వ్యాపించియున్నది - అని శ్రుతి చెప్పుచున్నది).
(అధర్వశిఖోపనిషత్)
“యజ్ఞే ఋగాది వేద చతుష్టయం బ్రహ్మ బ్రాహ్మణేభ్యః ప్రణామ యతి వేద ఋత్విగ్నిర్వర్త్య యజ్ఞస్య నిష్కామధియా చిత్త శుద్ధిప్రాప్యజ్ఞానద్వారా బ్రాహ్మణ్య పదప్రమాణ హేతుత్వాత్ -”.
(యజ్ఞము చేయునపుడు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము చదివెదరు - అది బ్రహ్మమే - దానిని బ్రాహ్మణులు నమస్కరించుదురు - అట్లు అది బ్రహ్మయే యని బుద్ధితో నిష్కామముగా చేయుటవలన చిత్త శుద్ధి కలిగి జ్ఞానము ద్వారా బ్రహ్మపదమును పొందుదురు - అందుచేత ప్రణవము).
మకారో భగవాన్ రుద్రో అప్యర్థ మాత్రా మహేశ్వరీ ||
ఉత్తరోత్తర భావే నాప్యుత్తమత్వం స్మృతం బుధైః |
అతః సర్షేషు శాస్త్రేషు దేవీ సర్వోత్తమా స్మృతా ||“. (దేవీ భాగవతం)
(అకారము, ఉకారము, మకారము కలిసి ‘ఓం’ అయినది - ఓంకారములోని ‘అ’ కారము బ్రహ్మ, ఉకారం విష్ణువు, మకారము రుద్రుడు - అర్థమాత్ర (విసర్గ) మహేశ్వరి. ఓంకారమే ప్రణవము - ముందు చెప్పిన దాని కంటె తరువాత, తరువాత చెప్పినది ఒకదానికంటె ఒకటి ఉత్తమమైనది అని బుధులు చెప్పెదురు - అందుచేత ఆఖరున చెప్పబడిన దేవి ఆ త్రిమూర్తులకంటె ఉత్తమమైనది అని అన్ని శాస్త్రములలోను చెప్పబడినది).
(ప్రణవము నాలుగు భాగములు గలది - అకార, ఉకార, మకారములు, అర్థమాత్ర. బ్రహ్మ దేహములో కూడ నాలుగు భాగములున్నవి. అవి బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, పరబ్రహ్మ అని తాపనీయోపనిషత్తు మొదలగు వాటిలోచెప్పబడియున్నవి. పైన చెప్పబడిన నాలుగు భాగములలో ముందు చెప్పబడినదానికంటె తర్వాతచెప్పబడినది - అనగా బ్రహ్మకంటె విష్ణువు, విష్ణువుకంటె రుద్రుడు, అతనికంటె చైతన్యరూపిణియగు భగవతి ఉత్తమోత్తమము -
పరః పరతరం బ్రహ్మ ప్రజ్ఞానందాది లక్షణం |
ప్రకర్షేణ నీవం యస్మాత్ పరబ్రహ్మ స్వభావతః ||“. (సూతసంహితాయాం)
“సత్యజ్ఞానందైకరసం, మాయా తత్కార్యౌ సంస్పృష్టం యత్ పరమ శివస్య రూపం స పరః ప్రణవః. కస్మాత్? యస్మాత్ పరశివ స్వరూపం కారణాంతరమనపేక్ష్య ప్రకర్షేణ నవం. అశేష విక్రియారహితం కూటస్థ నిత్యం సత్ పరమానంద ప్రకాశనాత్ యథావిధి స్వరూపం ప్రణవ శబ్దాభిధేయం ఇత్యర్థః”.
“అపరః ప్రణవస్సక్షాత్ శబ్దరూపస్సు నిర్మలః |
ప్రకర్షేణ నవత్వస్య హేతుత్వాత్ ప్రణవస్స్మృతః |
పరమ ప్రణవప్రాప్తి హేతుత్వాత్ ప్రణవో(అ)థవా ||.
“అనేన మంత్రేణ యధోక్త పరశి స్వరూపం స్వాత్మతయా విదుషః పుంసో అభినవప్రాప్తి హేతుత్వాత్ ప్రకర్షేణనవో నవో భవత్యనేనేతి వ్యుత్పత్యా ప్రణవః; యద్వా యః ప్రాగుక్తం ప్రణవః పరమః తద్వాచకత్వేన తత్ప్రాప్త్యుపాయత్వాత్ శబ్దాత్మకస్యాస్య ప్రణవాభి ధేయతే ||” - (ప్రణవము పరమని, అపరమని రెండు విధములు - “సత్యజ్ఞానానందం బ్రహ్మ” అని చెప్పబడినట్లు జ్ఞానానంద లక్షణములు గలది పరప్రణవము - అత్యుత్కృష్టమైనది - ఎందుచేతననగా - అది సత్యజ్ఞానానందములే అను ఒకే రసము - తత్వము, రూపము - కలది, మాయతోగాని, దాని కార్యములతోగాని కూడనిది - అదియే పరశివస్వరూపము - తనుకాని ఇతర కారణము నపేక్షించకుండునది. ఎల్లపుడు నవము - క్రొత్తగానే - యుండునది, ఏ విధమైన మార్పులు చెందనిది, కూటమువలె స్థిరముగా నుండునది, సత్పదార్థమైనది – మూడు కాలములందుండునది, పరమానందమైన మోక్షము అయినది - ఇట్లు శివుని యొక్క యధావిధ స్వరూపము - యధార్థస్వరూపము - స్వస్వరూపము - ఇట్టిది ప్రణవమని చెప్పబడినది - అపరప్రణవమనునది సాక్షాత్ శబ్రరూపము, నిర్మలమైనది - నవము అగుటచేత ప్రణవమనిచెప్పబడుచున్నది - లేక పరమ ప్రణవము ప్రాప్తించుటకు కారణమైనదగుటచేత ప్రణవము అని చెప్పబడుచున్నది).
(ప్రణవములోని - ఓంకారములోని - అకారము విష్ణువును నిర్దేశించును, ఉకారము మహేశ్వరు నిర్దే శించును, ‘మ’ కారము బ్రహ్మను నిర్దేశించును - ఈ ప్రకారము ప్రణవము త్రయాత్మకము - త్రిమూర్తుల నిర్దేశించును - “అకారాది త్రివర్ణకలితంబై బ్రహ్మ బీజంబైన ప్రణవంబు - - -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 1 - 12)
ప్రయోగాదేవ సర్వత్ర సర్వార్థశ్శివ ఏవహి |
తస్మాచ్ఛిదస్య పూర్ణస్య ప్రణవో వాచకః స్మృతః |
వాచ్య వాచక భావస్య లక్ష్య లక్షణ తాపి చ |
అన్యోన్యతాపి నాస్త్యేవ పరమార్థ నిరూపణే ||“. (సూతసంహితాయాం)
(ఓంకార శబ్దము సర్వార్థములకు వాచకకము - అన్నింటిని ‘ఓం’ అని చెప్పుటవలన అన్నియు శివుని నామ ములే. ప్రపంచమంతటను పూర్తిగా నిండియున్నందున శివుని వాచకము ప్రణవము - పరమార్థమును నిరూపించు విషయములో ఇది లక్ష్యమని, ఇది లక్షణమని, ఇది వాచ్యమని, ఇది వాచకమని బేధముండదు - వాచ్యమైన శివుడు అతనికి వాచకమైన ప్రణవము ఒకటే).
(అన్నింటిలోనున్న శివుడు ‘ఓం’ అను ఒకే అక్షరముతో కూడిన మంత్రమందున్నాడు).
వాచ్యా వాచకయోర్భేదో నాత్యంతం విద్యతే యతః ||“. (వాయవీయ సంహిత)
(శివుడే ప్రణవము, ప్రణవమే శివుడు. శివుడు వాచ్యము, ప్రణవము అతని వాచకము - వాచ్యమునకు వాచకమునకు అత్యంత భేదములేదు కనుక).
ఇతి మానవ స్మరణాత్ వేదాద్యంతే చ ప్రతిష్టితః స్వరః ప్రణః ప్రణవః. తస్య ప్రకృతిః ‘అ’ కారః - సమస్త శబ్ద మూలత్వాత్ అకారస్య
(శ్రీరంగరామా నుజః)
(వేదము చదువునపుడు, మొదట, చివరను ’ ఓం ’ అను ప్రణవము నుచ్చరించవలెను - అని మనువు చెప్పియుండుటచేత అట్లు చేయబడుచున్నది. దానివలన మొదట పుట్టిన శబ్దము అకారము; అకారము అన్ని శబ్దములకు మూలము).
(వేదములన్నింటికి ప్రణవము బీజమగుటవలన వాటిలో అది ప్రథానమైనది).
(నీటిలోని రసము - సారము - నేనే (భగవంతుడే) - ఆ ప్రకారముగానే వేదములన్నింటిలోను ప్రణవము నేనే అని శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు చెప్పెను).
(ఋగ్వేదులకు ఏది ప్రణవమో, సామవేదులకు అదియే ఉద్గీథము అని ఛాందోగ్యోపనిషత్తులో ధ్యానముచేయుటలో ప్రణవమునకు ఉద్గీథమునకు ఐక్యము చెప్పబడినది).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 12 - 388)
ఓంకారము (అ + ఉ + మ) లోని అకారము పరమాత్మ వాచకము, ‘మ’ కారము జీవ వాచకము - ఈ రెండింటిని కలుపునది ‘ఉ’ కారము - ప్రణవమే శేషి యగు పరమాత్మకి శేష భూతుడు జీవుడు.
“ప్రణవోహ్య పరంబ్రహ్మ ప్రణవశ్చ పరం స్మృతః |
అపూర్వో (అ)నంతరో (అ)భాహ్యో (అ)న పరః ప్రణవో అవ్యయః |“.
“ప్రణవం హశ్వరం విద్యాత్ సర్వస్య హృది సంస్థితం |
సర్వ వ్యాపిన మోకారం మత్వా ధీరో నశోచాః | (గౌడపాదకారికా - 24 - 29)
(ప్రణవమే అపరం బ్రహ్మ, ప్రణవమే పరబ్రహ్మ - పరబ్రహ్మవలె దానికి ముందు - దానికి కారణమైనది ఏదియును లేదు ; - దానిలోన ఏదియును లేదు - అంతా అదే - దానికి పైన ఏమియు లేదు - దానికంటె ఉత్కృష్టమైనది లేదు - అది శాశ్వతమైనది. అన్నింటికి ఆది మధ్యాంతములు ప్రణవమే - అన్నింటిలోను ఉన్న ఈశ్వరుడు ప్రణవము అని తెలుసుకొనవలెను).
(సమస్త పురుషార్థములను - ధర్మార్థకామమోక్షములను నాలుగు విధములైన పురుషార్థములను - చేకూర్చునది కనుక ప్రణవము).
(పుష్కలమైన స్తోత్రము - దీనిచే బ్రహ్మ స్థోత్రము చేయబడుచున్నాడు గావున ఇది ప్రణవము).
(అన్నియు తానే అయినట్టియు, తనవంటి వస్తువు మఱియొకటి లేనిదియు, ప్రత్యక్ కంటె వేరుకానిదియు నైన బ్రహ్మ ప్రణవము అను దాని వాక్యార్థము. ఇది అన్ని మహావాక్యములకు ఉపలక్షణము).
ōṃ; ōṃkāramu.
ēkākṣaraṃ (‘ōṃ’ anu okē akṣaramu galadi).
tārakaṃ
(tariṃpa cēyunadi. ‘ōṃ’ ani ucchāraṇa cēyuṭavalana saṃsāramanu mahāsamudramunu dāṭiṃcunadi - jananamaraṇamulu lēkuṃḍa cēyunadi).
(śabda rūpamaina parabrahmamu - ōṃkāramu parabrahmamē yani upāsiṃcavalenu - aṃducēta dānini ucchariṃcuṭavalana kalugu śabdamu brahmamē kanuka adi śabdabrahma - śabdarūpa brahmamu).
(samasta prāṇamulanu paramātmayaṃdu cērcunadi, paramātmatō aikyamu cēyunadi). - dīnini ucchariṃcuṭavalana mukti niccunadi - tārakamu. kanuka praṇavamani ceppabaḍinadi. akāramu, ukāramu, makāramu, arthamātra anu nālugu pādamulu kaladi. idi dēvatulaṃdaṟaku, vēdamulaku yōni (puṭṭucōṭu). sṛṣṭilō śabdamutō nuccariṃcabaḍu samasta vastuvulu praṇavātmakamē - praṇavamē.
(samasta prāṇamulanu paramātmayaṃdu utkṝṣṭamaina rītigā aikyamu cēyunadi. ī kāraṇamuvalana praṇavamu ani ceppabaḍucunnadi).
(‘ōṃ’ ani ucchariṃcucu namaskāramu cēyuṭa - namaskariṃpabaḍuvāḍu - paramātma).
(dēvatulacē namaskariṃpabaḍucuṃḍuvāḍu - aṃducēta praṇavamani ceppabaḍucunnāḍu - ani sanatkumāruḍu ceppenu).
(praṇavamu paramātma vācakamu - paramātmanu ceppu śabdamu - māṭa) ōṃkāramu paramātmatō bhēdamu lēnidi kanuka paramātmayē, paramātma vācakamani ceppabaḍinadi).
(ā parabrahmanu ceppunadi praṇavamu kanuka adi parabrahma vācakamu).
(ōṃkāramē praṇavamu, praṇavamē anniṃṭilōnu vyāpiṃciyunnadi - ani śruti ceppucunnadi).
(adharvaśikhōpaniṣat)
“yajñē ṛgādi vēda catuṣṭayaṃ brahma brāhmaṇēbhyaḥ praṇāma yati vēda ṛtvignirvartya yajñasya niṣkāmadhiyā citta śuddhiprāpyajñānadvārā brāhmaṇya padapramāṇa hētutvāt -”.
(yajñamu cēyunapuḍu ṛgvēdamu, yajurvēdamu, sāmavēdamu, adharvaṇavēdamu cadivedaru - adi brahmamē - dānini brāhmaṇulu namaskariṃcuduru - aṭlu adi brahmayē yani buddhitō niṣkāmamugā cēyuṭavalana citta śuddhi kaligi jñānamu dvārā brahmapadamunu poṃduduru - aṃducēta praṇavamu).
makārō bhagavān rudrō apyartha mātrā mahēśvarī ||
uttarōttara bhāvē nāpyuttamatvaṃ smṛtaṃ budhaiḥ |
ataḥ sarṣēṣu śāstrēṣu dēvī sarvōttamā smṛtā ||“. (dēvī bhāgavataṃ)
(akāramu, ukāramu, makāramu kalisi ‘ōṃ’ ayinadi - ōṃkāramulōni ‘a’ kāramu brahma, ukāraṃ viṣṇuvu, makāramu rudruḍu - arthamātra (visarga) mahēśvari. ōṃkāramē praṇavamu - muṃdu ceppina dāni kaṃṭe taruvāta, taruvāta ceppinadi okadānikaṃṭe okaṭi uttamamainadi ani budhulu ceppeduru - aṃducēta ākharuna ceppabaḍina dēvi ā trimūrtulakaṃṭe uttamamainadi ani anni śāstramulalōnu ceppabaḍinadi).
(praṇavamu nālugu bhāgamulu galadi - akāra, ukāra, makāramulu, arthamātra. brahma dēhamulō kūḍa nālugu bhāgamulunnavi. avi brahma, viṣṇuvu, rudruḍu, parabrahma ani tāpanīyōpaniṣattu modalagu vāṭilōceppabaḍiyunnavi. paina ceppabaḍina nālugu bhāgamulalō muṃdu ceppabaḍinadānikaṃṭe tarvātaceppabaḍinadi - anagā brahmakaṃṭe viṣṇuvu, viṣṇuvukaṃṭe rudruḍu, atanikaṃṭe caitanyarūpiṇiyagu bhagavati uttamōttamamu -
paraḥ parataraṃ brahma prajñānaṃdādi lakṣaṇaṃ |
prakarṣēṇa nīvaṃ yasmāt parabrahma svabhāvataḥ ||“. (sūtasaṃhitāyāṃ)
“satyajñānaṃdaikarasaṃ, māyā tatkāryau saṃspṛṣṭaṃ yat parama śivasya rūpaṃ sa paraḥ praṇavaḥ. kasmāt? yasmāt paraśiva svarūpaṃ kāraṇāṃtaramanapēkṣya prakarṣēṇa navaṃ. aśēṣa vikriyārahitaṃ kūṭastha nityaṃ sat paramānaṃda prakāśanāt yathāvidhi svarūpaṃ praṇava śabdābhidhēyaṃ ityarthaḥ”.
“aparaḥ praṇavassakṣāt śabdarūpassu nirmalaḥ |
prakarṣēṇa navatvasya hētutvāt praṇavassmṛtaḥ |
parama praṇavaprāpti hētutvāt praṇavō(a)thavā ||.
“anēna maṃtrēṇa yadhōkta paraśi svarūpaṃ svātmatayā viduṣaḥ puṃsō abhinavaprāpti hētutvāt prakarṣēṇanavō navō bhavatyanēnēti vyutpatyā praṇavaḥ; yadvā yaḥ prāguktaṃ praṇavaḥ paramaḥ tadvācakatvēna tatprāptyupāyatvāt śabdātmakasyāsya praṇavābhi dhēyatē ||” - (praṇavamu paramani, aparamani reṃḍu vidhamulu - “satyajñānānaṃdaṃ brahma” ani ceppabaḍinaṭlu jñānānaṃda lakṣaṇamulu galadi parapraṇavamu - atyutkṛṣṭamainadi - eṃducētananagā - adi satyajñānānaṃdamulē anu okē rasamu - tatvamu, rūpamu - kaladi, māyatōgāni, dāni kāryamulatōgāni kūḍanidi - adiyē paraśivasvarūpamu - tanukāni itara kāraṇamu napēkṣiṃcakuṃḍunadi. ellapuḍu navamu - krottagānē - yuṃḍunadi, ē vidhamaina mārpulu ceṃdanidi, kūṭamuvale sthiramugā nuṃḍunadi, satpadārthamainadi – mūḍu kālamulaṃduṃḍunadi, paramānaṃdamaina mōkṣamu ayinadi - iṭlu śivuni yokka yadhāvidha svarūpamu - yadhārthasvarūpamu - svasvarūpamu - iṭṭidi praṇavamani ceppabaḍinadi - aparapraṇavamanunadi sākṣāt śabrarūpamu, nirmalamainadi - navamu aguṭacēta praṇavamaniceppabaḍucunnadi - lēka parama praṇavamu prāptiṃcuṭaku kāraṇamainadaguṭacēta praṇavamu ani ceppabaḍucunnadi).
(praṇavamulōni - ōṃkāramulōni - akāramu viṣṇuvunu nirdēśiṃcunu, ukāramu mahēśvaru nirdē śiṃcunu, ‘ma’ kāramu brahmanu nirdēśiṃcunu - ī prakāramu praṇavamu trayātmakamu - trimūrtula nirdēśiṃcunu - “akārādi trivarṇakalitaṃbai brahma bījaṃbaina praṇavaṃbu - - -” (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 1 - 12)
prayōgādēva sarvatra sarvārthaśśiva ēvahi |
tasmācchidasya pūrṇasya praṇavō vācakaḥ smṛtaḥ |
vācya vācaka bhāvasya lakṣya lakṣaṇa tāpi ca |
anyōnyatāpi nāstyēva paramārtha nirūpaṇē ||“. (sūtasaṃhitāyāṃ)
(ōṃkāra śabdamu sarvārthamulaku vācakakamu - anniṃṭini ‘ōṃ’ ani ceppuṭavalana anniyu śivuni nāma mulē. prapaṃcamaṃtaṭanu pūrtigā niṃḍiyunnaṃduna śivuni vācakamu praṇavamu - paramārthamunu nirūpiṃcu viṣayamulō idi lakṣyamani, idi lakṣaṇamani, idi vācyamani, idi vācakamani bēdhamuṃḍadu - vācyamaina śivuḍu ataniki vācakamaina praṇavamu okaṭē).
(anniṃṭilōnunna śivuḍu ‘ōṃ’ anu okē akṣaramutō kūḍina maṃtramaṃdunnāḍu).
vācyā vācakayōrbhēdō nātyaṃtaṃ vidyatē yataḥ ||“. (vāyavīya saṃhita)
(śivuḍē praṇavamu, praṇavamē śivuḍu. śivuḍu vācyamu, praṇavamu atani vācakamu - vācyamunaku vācakamunaku atyaṃta bhēdamulēdu kanuka).
iti mānava smaraṇāt vēdādyaṃtē ca pratiṣṭitaḥ svaraḥ praṇaḥ praṇavaḥ. tasya prakṛtiḥ ‘a’ kāraḥ - samasta śabda mūlatvāt akārasya
(śrīraṃgarāmā nujaḥ)
(vēdamu caduvunapuḍu, modaṭa, civaranu ’ ōṃ ’ anu praṇavamu nuccariṃcavalenu - ani manuvu ceppiyuṃḍuṭacēta aṭlu cēyabaḍucunnadi. dānivalana modaṭa puṭṭina śabdamu akāramu; akāramu anni śabdamulaku mūlamu).
(vēdamulanniṃṭiki praṇavamu bījamaguṭavalana vāṭilō adi prathānamainadi).
(nīṭilōni rasamu - sāramu - nēnē (bhagavaṃtuḍē) - ā prakāramugānē vēdamulanniṃṭilōnu praṇavamu nēnē ani śrīmadbhagavadgītalō śrīkṛṣṇabhagavānuḍu ceppenu).
(ṛgvēdulaku ēdi praṇavamō, sāmavēdulaku adiyē udgīthamu ani chāṃdōgyōpaniṣattulō dhyānamucēyuṭalō praṇavamunaku udgīthamunaku aikyamu ceppabaḍinadi).
(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 12 - 388)
ōṃkāramu (a + u + ma) lōni akāramu paramātma vācakamu, ‘ma’ kāramu jīva vācakamu - ī reṃḍiṃṭini kalupunadi ‘u’ kāramu - praṇavamē śēṣi yagu paramātmaki śēṣa bhūtuḍu jīvuḍu.
“praṇavōhya paraṃbrahma praṇavaśca paraṃ smṛtaḥ |
apūrvō (a)naṃtarō (a)bhāhyō (a)na paraḥ praṇavō avyayaḥ |“.
“praṇavaṃ haśvaraṃ vidyāt sarvasya hṛdi saṃsthitaṃ |
sarva vyāpina mōkāraṃ matvā dhīrō naśōcāḥ | (gauḍapādakārikā - 24 - 29)
(praṇavamē aparaṃ brahma, praṇavamē parabrahma - parabrahmavale dāniki muṃdu - dāniki kāraṇamainadi ēdiyunu lēdu ; - dānilōna ēdiyunu lēdu - aṃtā adē - dāniki paina ēmiyu lēdu - dānikaṃṭe utkṛṣṭamainadi lēdu - adi śāśvatamainadi. anniṃṭiki ādi madhyāṃtamulu praṇavamē - anniṃṭilōnu unna īśvaruḍu praṇavamu ani telusukonavalenu).
(samasta puruṣārthamulanu - dharmārthakāmamōkṣamulanu nālugu vidhamulaina puruṣārthamulanu - cēkūrcunadi kanuka praṇavamu).
(puṣkalamaina stōtramu - dīnicē brahma sthōtramu cēyabaḍucunnāḍu gāvuna idi praṇavamu).
(anniyu tānē ayinaṭṭiyu, tanavaṃṭi vastuvu maṟiyokaṭi lēnidiyu, pratyak kaṃṭe vērukānidiyu naina brahma praṇavamu anu dāni vākyārthamu. idi anni mahāvākyamulaku upalakṣaṇamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.