← Back to ప · Booklets 21–30 (digitized file 3)

ప్రతిమార్చన pratimārcana

Original — తెలుగు
  1. “ఆ. రూపులేని నీకు రూఢిగా యోగులు

రూపు నిల్పి నిన్ను రుచిరభక్తి

గొల్చి యుంద్రు; వారి కోర్కుల నిచ్ఛెద

వేమి లాగు నాకు నెఱుగ బలుకు“.

  1. “వ. నేను సర్వ వర్ణంబులకు సమంబైన పూజాప్రకారంబెఱింగించెద - ఆచారంబునం జేసి యొక్క స్వరూపంబను బాషాణ మృణ్మయదారువులం గల్పించి, నా రూపంబుగా నిల్పికొని కొందఱు పూజింతురు, కాంస్య, త్రపు, రజత, కాంచన ప్రతిమా విశేషంబు లుత్తమంబులు. ఇట్లు నా రూపంబులందు మద్భావంబుంచి కొల్చినవారలకు నే బ్రసన్నుండ నగుదును. ఈ లోకంబున మనుషులకు ధ్యానంబు నిలువనేరదు - కావున బ్రతిమా విశేషంబులనే కంబులుగలవు. వానియందు సౌందర్యసారంబులును మనోహరంబులైన రూపంబుల నేనుందు - కావున, దుగ్ధార్ణవ శాయిగా భావించి ధౌతాంబరాభరణమాల్యాను లేవనంబులను, దివ్యాన్న పానంబులను, షోడశోపచార పూజా ప్రకారంబులను, రాజోపచారంబు లను, బాహ్యపూజావిధానంబులను నాచరించి, మనస్సంకల్పితంబులయిన పదార్థంబులు సమర్పించి, నిత్యంబును నాభ్యంతరపూజా విధానంబుల బరితుష్టునింజేసి, దివ్యాంబరాభరణ మాల్యానుశోభితుండును, శంఖ చక్ర కిరీటాద్యలంకార భూషితుండును, దివ్యమంగళవిగ్రహుండునుంగా దలంచి, ధ్యానపరవశుండైన యతండు నాయందులం గలయు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 19 - 115)

  2. “ఋషి నరతిర్యగమర శరీరంబులు పురంబులు. వానియందు తారతమ్యంబులతోడ జీవరూపంబున భగవంతుడైన హరి వర్తించుటం జేసి పురుషుండన ప్రసిద్ధుండయ్యె. అందు తిర్యగ్జాతులకంటె నదికత్వంబు పురుషునియందు విలసిల్లుటంజేసి పురుషుండు పాత్రంబు.పురుషులలోన హరితనువైన వేదంబును ధరించుచు సంతోష విద్యా తపో గరిష్టుండైన బ్రాహ్మణుండు పాత్రంబు. బ్రాహ్మణులలోన నాత్మజ్ఞానపరిపూర్ణుండయిన యోగి ముఖ్యపాత్రంబు అని పలుకుదురు. పరస్పర పాత్రంబులకు సహింపని మనుష్యులకు బూజనార్థంబుగా త్రేతాయుగంబునందు హరి ప్రతిమలు గల్పింప బడియె. కొందఱు ప్రతిమార్చనంబు సేయుదురు, పాత్ర పురుష ద్వేషులయిన వారలకు నట్టి ప్రతిమార్చనంబు ముఖ్యార్థప్రదంబు గాదు. మందాధి కారులకు ప్రతిమార్చనంబు పురుషార్థప్రదంబగును”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 14 - 453)

Transliteration
  1. “ā. rūpulēni nīku rūḍhigā yōgulu

rūpu nilpi ninnu rucirabhakti

golci yuṃdru; vāri kōrkula niccheda

vēmi lāgu nāku neṟuga baluku”.

  1. “va. nēnu sarva varṇaṃbulaku samaṃbaina pūjāprakāraṃbeṟiṃgiṃceda - ācāraṃbunaṃ jēsi yokka svarūpaṃbanu bāṣāṇa mṛṇmayadāruvulaṃ galpiṃci, nā rūpaṃbugā nilpikoni koṃdaṟu pūjiṃturu, kāṃsya, trapu, rajata, kāṃcana pratimā viśēṣaṃbu luttamaṃbulu. iṭlu nā rūpaṃbulaṃdu madbhāvaṃbuṃci kolcinavāralaku nē brasannuṃḍa nagudunu. ī lōkaṃbuna manuṣulaku dhyānaṃbu niluvanēradu - kāvuna bratimā viśēṣaṃbulanē kaṃbulugalavu. vāniyaṃdu sauṃdaryasāraṃbulunu manōharaṃbulaina rūpaṃbula nēnuṃdu - kāvuna, dugdhārṇava śāyigā bhāviṃci dhautāṃbarābharaṇamālyānu lēvanaṃbulanu, divyānna pānaṃbulanu, ṣōḍaśōpacāra pūjā prakāraṃbulanu, rājōpacāraṃbu lanu, bāhyapūjāvidhānaṃbulanu nācariṃci, manassaṃkalpitaṃbulayina padārthaṃbulu samarpiṃci, nityaṃbunu nābhyaṃtarapūjā vidhānaṃbula barituṣṭuniṃjēsi, divyāṃbarābharaṇa mālyānuśōbhituṃḍunu, śaṃkha cakra kirīṭādyalaṃkāra bhūṣituṃḍunu, divyamaṃgaḷavigrahuṃḍunuṃgā dalaṃci, dhyānaparavaśuṃḍaina yataṃḍu nāyaṃdulaṃ galayu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 19 - 115)

  2. “ṛṣi naratiryagamara śarīraṃbulu puraṃbulu. vāniyaṃdu tāratamyaṃbulatōḍa jīvarūpaṃbuna bhagavaṃtuḍaina hari vartiṃcuṭaṃ jēsi puruṣuṃḍana prasiddhuṃḍayye. aṃdu tiryagjātulakaṃṭe nadikatvaṃbu puruṣuniyaṃdu vilasilluṭaṃjēsi puruṣuṃḍu pātraṃbu.puruṣulalōna haritanuvaina vēdaṃbunu dhariṃcucu saṃtōṣa vidyā tapō gariṣṭuṃḍaina brāhmaṇuṃḍu pātraṃbu. brāhmaṇulalōna nātmajñānaparipūrṇuṃḍayina yōgi mukhyapātraṃbu ani palukuduru. paraspara pātraṃbulaku sahiṃpani manuṣyulaku būjanārthaṃbugā trētāyugaṃbunaṃdu hari pratimalu galpiṃpa baḍiye. koṃdaṟu pratimārcanaṃbu sēyuduru, pātra puruṣa dvēṣulayina vāralaku naṭṭi pratimārcanaṃbu mukhyārthapradaṃbu gādu. maṃdādhi kārulaku pratimārcanaṃbu puruṣārthapradaṃbagunu”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 14 - 453)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.