← Back to ప · Booklets 21–30 (digitized file 3)

ప్రత్యగాత్మ pratyagātma

Original — తెలుగు
  1. జీవః ; ద్రష్టా; భోక్తా -

(జీవుడు - అన్నింటికీ సాక్షి అయినవాడు, కర్మఫలము ననుభవించువాడు).

  1. అంతర్యామి కావున ప్రత్యగాత్మ.

  2. క్షేత్రజ్ఞుడు, అంతర్యామి, కూటస్థుడు, సాక్షి, ద్రష్ట, ఉపద్రష్ట. తురీయుడు -

“ఆత్మప్రకాశమున్నూ, అంతఃకరణాలు స్వచ్ఛమై యుండగా అక్కడ ప్రతిబింబించిన చిదబాస తేజస్సు అంతఃకరణోపాధిం బట్టి వ్యవహరించును కనుక జీవుడని చెప్పుదురు. క్షేత్రజ్ఞ, సాక్షి, కూటస్థుడు, అంతర్యామి, మహాప్రాణ, ప్రత్య్తగాత్మ, అని తమతమ మతాలయందు చెప్పుచుందురు”. (బ్రహ్మవిద్యాసుధార్ణవము - 2)

  1. “సీ. - - - ఈ దృశ్యరూపంబగు సుమహితవిశ్వంబు జూచు ప్రత్య

గాత్మభూతుండవైనట్టి నీవు న సత్ప్రకాశరూపంబులై కలుగు మామ

కేంద్రియంబులచేత నీశ్వర నీ మాయ నొందించి పంచభూతోపలక్షి

తంబగుదేహి విధంబున గానంబడుదువు గాని యేర్పడిన శుద్ధ

తే. సత్వగుణయుక్తమైన భాస్వత్స్వరూప

ధరుడవై కానబడవుగా పరమపురుష

- - -“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 7 - 191)

  1. దేహము, ఇంద్రియములు, మొదలగువాటిలోనుండి వాటి సంపర్కములేక వేరుగనుండుటచేత ఆత్మ ప్రత్యగాత్మయని చెప్పబడినది,
Transliteration
  1. jīvaḥ ; draṣṭā; bhōktā -

(jīvuḍu - anniṃṭikī sākṣi ayinavāḍu, karmaphalamu nanubhaviṃcuvāḍu).

  1. aṃtaryāmi kāvuna pratyagātma.

  2. kṣētrajñuḍu, aṃtaryāmi, kūṭasthuḍu, sākṣi, draṣṭa, upadraṣṭa. turīyuḍu -

“ātmaprakāśamunnū, aṃtaḥkaraṇālu svacchamai yuṃḍagā akkaḍa pratibiṃbiṃcina cidabāsa tējassu aṃtaḥkaraṇōpādhiṃ baṭṭi vyavahariṃcunu kanuka jīvuḍani ceppuduru. kṣētrajña, sākṣi, kūṭasthuḍu, aṃtaryāmi, mahāprāṇa, pratytagātma, ani tamatama matālayaṃdu ceppucuṃduru”. (brahmavidyāsudhārṇavamu - 2)

  1. “sī. - - - ī dṛśyarūpaṃbagu sumahitaviśvaṃbu jūcu pratya

gātmabhūtuṃḍavainaṭṭi nīvu na satprakāśarūpaṃbulai kalugu māma

kēṃdriyaṃbulacēta nīśvara nī māya noṃdiṃci paṃcabhūtōpalakṣi

taṃbagudēhi vidhaṃbuna gānaṃbaḍuduvu gāni yērpaḍina śuddha

tē. satvaguṇayuktamaina bhāsvatsvarūpa

dharuḍavai kānabaḍavugā paramapuruṣa

- - -“. (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 7 - 191)

  1. dēhamu, iṃdriyamulu, modalaguvāṭilōnuṃḍi vāṭi saṃparkamulēka vēruganuṃḍuṭacēta ātma pratyagātmayani ceppabaḍinadi,
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.