← Back to ప · Booklets 21–30 (digitized file 3)

ప్రత్యక్షం బ్రహ్మ pratyakṣaṃ brahma

Original — తెలుగు
  1. “ఖం బ్రహ్మ, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మసి.

(ఆకాశము బ్రహ్మము - బ్రహ్మరూపము - నీవే కంటికి ఎదురుగా కనబడు బ్రహ్మరూపుడవు). (పరబ్రహ్మ ఇంద్రియములకు, మనసునకు గోచరము కానివాడు - తెలియనివాడు. కాని, సృష్టిలోనున్న వస్తువులన్నియు అతని రూపములే - అందుచేత అవన్నియు కంటికి కనబడు బ్రహ్మమే).

  1. “శ్రోతస్య శ్రోతం” ఇత్యాది శ్రుతిసిద్ధ ప్రత్యక్ష ప్రవృత్తి నిమిత్తైశ్వర్యాత్మనా ప్రత్యక్షం బ్రహ్మ.

(శ్రోత్రమునకు శ్రోత్రమైనవాడు - అనగా శ్రోత్రములోనుండి దానికి తన చైతన్య శక్తినిచ్చి దాని వృత్తిని దానిచేత చేయించువాడు. ఈ ప్రకారముగా ప్రతివస్తువులోను పరబ్రహ్మ యుండి వాటిచే ప్రవృత్తి నివృత్తి కార్యములను చేయించుచుండుటచే పరబ్రహ్మ ఎక్కడపడితే అక్కడ, దేనిలో పడితే దానిలో ఉన్నాడు కనుక ఎల్లపుడు ప్రత్యక్షముగానే, మనదగ్గఱే, మనలోనే ఎల్లపుడు నుండువాడు కనుక ప్రత్యక్షబ్రహ్మ - “యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవవా - తత్తదేవావగచ్ఛ త్వం మమతేజోంశ సంభవం” (శ్రీమద్భగవద్గీత - 10 - 41)

Transliteration
  1. “khaṃ brahma, tvamēva pratyakṣaṃ brahmasi.

(ākāśamu brahmamu - brahmarūpamu - nīvē kaṃṭiki edurugā kanabaḍu brahmarūpuḍavu). (parabrahma iṃdriyamulaku, manasunaku gōcaramu kānivāḍu - teliyanivāḍu. kāni, sṛṣṭilōnunna vastuvulanniyu atani rūpamulē - aṃducēta avanniyu kaṃṭiki kanabaḍu brahmamē).

  1. “śrōtasya śrōtaṃ” ityādi śrutisiddha pratyakṣa pravṛtti nimittaiśvaryātmanā pratyakṣaṃ brahma.

(śrōtramunaku śrōtramainavāḍu - anagā śrōtramulōnuṃḍi dāniki tana caitanya śaktinicci dāni vṛttini dānicēta cēyiṃcuvāḍu. ī prakāramugā prativastuvulōnu parabrahma yuṃḍi vāṭicē pravṛtti nivṛtti kāryamulanu cēyiṃcucuṃḍuṭacē parabrahma ekkaḍapaḍitē akkaḍa, dēnilō paḍitē dānilō unnāḍu kanuka ellapuḍu pratyakṣamugānē, manadaggaṟē, manalōnē ellapuḍu nuṃḍuvāḍu kanuka pratyakṣabrahma - “yadyadvibhūti matsatvaṃ śrīmadūrjitamēvavā - tattadēvāvagaccha tvaṃ mamatējōṃśa saṃbhavaṃ” (śrīmadbhagavadgīta - 10 - 41)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.