(అర్పించుట, ఆరాధించుట; అర్ఘ్యము మొదలగు వాటిని సమర్పించుట - “హస్తయోః అర్ఘ్యం సమర్పయామి” - “పాదయో పాద్యం సమర్పయామి”).
పరిచర్య; సపర్య.
“మోక్షంబు నపేక్షించువాడు విధి చోదిత మార్గంబున హరిం బూజింపవలయు నట్టి పూజా ప్రకారంబెట్లనిన బవిత్రగాత్రుండయి జనార్థను సన్నింధిం బూతచిత్తుండై షోడశోపచారముల జక్రధరు నారాధించి, గంధపుష్ప ధూప దీప నైవేద్యంబులు సమర్పించి, సాష్టాంగ దండప్రమాణంబులాచరించి, భక్తి భావనా విశేషుండగు నతండు హరిం జేరును -”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - )
“నేను సర్వ వర్ణంబులకు సమంబైన పూజా ప్రకారం బెరింగించెద నాచారంబునం జేసి యొకటి బాషాణ మృణ్మయ గారువులం గల్పించి నా రూపంబుగా నిల్పుకొని కొందఱు పూజింతురు. కాంస్య (కంచు) త్రపు (సీసము). రజత (వెండి), కాంచన (బంగారము) ప్రతిమా విశేషంబు లుత్తమంబులు. ఇట్లు నా ప్రతిమా రూపంబులందు మద్భావంబుంచి కొల్చినవారికి నే బ్రసన్నుండ నగుదు. కావునం బ్రతిమా విశేషంబులనేకంబులుగలవు. వానియందు సౌందర్య సారంబులు, మనోహరంబులునైన రూపంబులం మనః ప్రసన్నుండనై యేనుండుదు గావున, దుగ్థార్ణవశాయిగా భావించి, థౌతాంబరాభరణమాల్యాను లేపనంబులను, దివ్యాన్నపానంబులను షోడశోక్త ప్రకారంబుల రాజోపచారంబుల బాహ్య పూజావిధానంబుల నాచరించి, మనస్సంకల్పితం బులైన పదార్థంబులు సమర్పించి నిత్యంబును నాభ్యంతర పూజా విధానం బులం బరితుష్టినింజేసి, దివ్యాంబరాభరణ మాల్య సేవితుండును, శంఖ చక్ర కిరీటాద్యలంకార భూషితుండును, దివ్యమంగళవిగ్రహుండునుగా దలచి ధ్యానపరవశుండైన యతండు నాయందు గలయు -”. (శ్రీమదాంధ్ర మహా భాగవతము - 11 - 115)
” - - - ప్రణవ యుక్తంబగు ద్వాదశాక్షర కలితంబును, దేశకాల విభాగవేదియునగు బుధానుష్టితంబు నయిన (ఓం నమో భగవతే వాసుదేవాయ) మంత్రంబునం జేసి -
“సీ. దూర్వాంకురంబుల దూర్వాంకరశ్యాము, జలజంబులను జారుజలన యను
దుళసీదళంబుల తులసికాదాముని, మాల్యంబులను సునైర్మల్య చరితు
బత్రంబులను బక్షిపుత్రుని, గడు వన్యమూలంబులను నాది మూలఘనుని
నంచిత భూర్జత్వగాది నిర్మిత వివిదాంబరులను బీతాంబరధరు
తే. దనరు భక్తిని మృచ్ఛిలాదారు రచిత
రూపముల యందుగాని, నిరూఢమైన
సలిలముల యందుగాని సుస్థలములందు
గాని, పూజింపవలయు నక్కమలనాభు ||“.- - -
“వ. ఉత్తమశ్లోకుండగు పుండరీకాక్షుండు నిజమాయా స్వేచ్ఛావతార చరితంబులచేత నచింత్యముగా నెద్దిసేయు నద్ది హృదయ గతంబుగా ధ్యానంబు సేయందగు - మఱియు గార్య బుద్ధింజేసి చేయంబడు పూజా విశేషంబులు వాసుదేవమంత్రంబున సర్వేశ్వరునికి సమర్పింపవలయు. ఇట్లు మనోవాక్కాయ కర్మంబులచేత మనోగతంబగునట్లుగా భక్తియుక్తంబులయిన పూజలచేత బూజింపబడి సర్వేశ్వరుండు మాయాభి భూతులు గాక సేవించు పురుషులకు ధర్మాది పురుషార్థంబులలోన నభిమతార్థంబునిచ్చు”.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 8 - 253 to 256)
ఇందు హరిగలడందు లేడనేటి |
నిందకు బాయుటె నీపూజ |
కొందఱు చుట్టాలు కొండఱుపగ, నేనందరకు సమాను నదియ నీపూజ |
తిట్టులుగొన్నని దీవెన గొంతని |
నెట్టుకోనిదే నీ పూజ |
పెట్టిన బంగారు పెంకును నినుమును అట్టె సరియనుటదియ నీపూజ |
సర్వము నీవని స్వతంత్రముడిగి |
నిర్వహించుట నీపూజ |
పర్వి శ్రీవేకటపతి నీదాసుల పూర్వమనియెడు బుద్ధి నీపూజ ||“. (అన్నమాచార్యులు)
హింసాది రహితః కాయః కేశవారాధినం త్రయం ||“.
(రాగద్వేషములు లేని హృదయము, సత్యము, ప్రియముకలవాక్కు, పరహింస చేయని శరీరకర్మ - అను మనోవాక్కాయకర్మల శుద్ధియే భగవంతుని పూజ).
(arpiṃcuṭa, ārādhiṃcuṭa; arghyamu modalagu vāṭini samarpiṃcuṭa - “hastayōḥ arghyaṃ samarpayāmi” - “pādayō pādyaṃ samarpayāmi”).
paricarya; saparya.
“mōkṣaṃbu napēkṣiṃcuvāḍu vidhi cōdita mārgaṃbuna hariṃ būjiṃpavalayu naṭṭi pūjā prakāraṃbeṭlanina bavitragātruṃḍayi janārthanu sanniṃdhiṃ būtacittuṃḍai ṣōḍaśōpacāramula jakradharu nārādhiṃci, gaṃdhapuṣpa dhūpa dīpa naivēdyaṃbulu samarpiṃci, sāṣṭāṃga daṃḍapramāṇaṃbulācariṃci, bhakti bhāvanā viśēṣuṃḍagu nataṃḍu hariṃ jērunu -”. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - )
“nēnu sarva varṇaṃbulaku samaṃbaina pūjā prakāraṃ beriṃgiṃceda nācāraṃbunaṃ jēsi yokaṭi bāṣāṇa mṛṇmaya gāruvulaṃ galpiṃci nā rūpaṃbugā nilpukoni koṃdaṟu pūjiṃturu. kāṃsya (kaṃcu) trapu (sīsamu). rajata (veṃḍi), kāṃcana (baṃgāramu) pratimā viśēṣaṃbu luttamaṃbulu. iṭlu nā pratimā rūpaṃbulaṃdu madbhāvaṃbuṃci kolcinavāriki nē brasannuṃḍa nagudu. kāvunaṃ bratimā viśēṣaṃbulanēkaṃbulugalavu. vāniyaṃdu sauṃdarya sāraṃbulu, manōharaṃbulunaina rūpaṃbulaṃ manaḥ prasannuṃḍanai yēnuṃḍudu gāvuna, dugthārṇavaśāyigā bhāviṃci, thautāṃbarābharaṇamālyānu lēpanaṃbulanu, divyānnapānaṃbulanu ṣōḍaśōkta prakāraṃbula rājōpacāraṃbula bāhya pūjāvidhānaṃbula nācariṃci, manassaṃkalpitaṃ bulaina padārthaṃbulu samarpiṃci nityaṃbunu nābhyaṃtara pūjā vidhānaṃ bulaṃ barituṣṭiniṃjēsi, divyāṃbarābharaṇa mālya sēvituṃḍunu, śaṃkha cakra kirīṭādyalaṃkāra bhūṣituṃḍunu, divyamaṃgaḷavigrahuṃḍunugā dalaci dhyānaparavaśuṃḍaina yataṃḍu nāyaṃdu galayu -”. (śrīmadāṃdhra mahā bhāgavatamu - 11 - 115)
” - - - praṇava yuktaṃbagu dvādaśākṣara kalitaṃbunu, dēśakāla vibhāgavēdiyunagu budhānuṣṭitaṃbu nayina (ōṃ namō bhagavatē vāsudēvāya) maṃtraṃbunaṃ jēsi -
“sī. dūrvāṃkuraṃbula dūrvāṃkaraśyāmu, jalajaṃbulanu jārujalana yanu
duḷasīdaḷaṃbula tulasikādāmuni, mālyaṃbulanu sunairmalya caritu
batraṃbulanu bakṣiputruni, gaḍu vanyamūlaṃbulanu nādi mūlaghanuni
naṃcita bhūrjatvagādi nirmita vividāṃbarulanu bītāṃbaradharu
tē. danaru bhaktini mṛcchilādāru racita
rūpamula yaṃdugāni, nirūḍhamaina
salilamula yaṃdugāni susthalamulaṃdu
gāni, pūjiṃpavalayu nakkamalanābhu ||“.- - -
“va. uttamaślōkuṃḍagu puṃḍarīkākṣuṃḍu nijamāyā svēcchāvatāra caritaṃbulacēta naciṃtyamugā neddisēyu naddi hṛdaya gataṃbugā dhyānaṃbu sēyaṃdagu - maṟiyu gārya buddhiṃjēsi cēyaṃbaḍu pūjā viśēṣaṃbulu vāsudēvamaṃtraṃbuna sarvēśvaruniki samarpiṃpavalayu. iṭlu manōvākkāya karmaṃbulacēta manōgataṃbagunaṭlugā bhaktiyuktaṃbulayina pūjalacēta būjiṃpabaḍi sarvēśvaruṃḍu māyābhi bhūtulu gāka sēviṃcu puruṣulaku dharmādi puruṣārthaṃbulalōna nabhimatārthaṃbuniccu”.
(śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 8 - 253 to 256)
iṃdu harigalaḍaṃdu lēḍanēṭi |
niṃdaku bāyuṭe nīpūja |
koṃdaṟu cuṭṭālu koṃḍaṟupaga, nēnaṃdaraku samānu nadiya nīpūja |
tiṭṭulugonnani dīvena goṃtani |
neṭṭukōnidē nī pūja |
peṭṭina baṃgāru peṃkunu ninumunu aṭṭe sariyanuṭadiya nīpūja |
sarvamu nīvani svataṃtramuḍigi |
nirvahiṃcuṭa nīpūja |
parvi śrīvēkaṭapati nīdāsula pūrvamaniyeḍu buddhi nīpūja ||“. (annamācāryulu)
hiṃsādi rahitaḥ kāyaḥ kēśavārādhinaṃ trayaṃ ||“.
(rāgadvēṣamulu lēni hṛdayamu, satyamu, priyamukalavākku, parahiṃsa cēyani śarīrakarma - anu manōvākkāyakarmala śuddhiyē bhagavaṃtuni pūja).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.