← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పుణ్యతీర్థములు puṇyatīrthamulu

Original — తెలుగు
  1. యథా శరీరస్థో దేశాః కే చిన్మధ్య తరా యథా |

తథాపి పృధివీ దేశాః కే చిత్పుణ్యతమాస్స్మృతాః |

ప్రభావాత్ అద్భుతాత్ భూమేః సలిలస్యచ తేజసా |

పరిగ్రహాన్మునీ నాం చ తీర్థానాం పుణ్యతా స్మృతాః ||“,

(శరీరములోని భాగములు కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి ఉన్నటులే భూమిమీద కొన్ని దేశములు పుణ్యతమములు - హెచ్చుగా పుణ్యవంతములైనవి. ఆయా ప్రదేశములు అద్భుతమైన ప్రభావము కలిగి యుండుటచేతను, నీటిలోని తేజస్సువలనను మునులు వాటిని పుణ్యవంతములుగా పరిగ్రహించినందువలనను ఆ తీర్థములు పుణ్యతీర్థములని చెప్పబడుచున్నవి).

  1. నదీనాం జాహ్నవీ శ్రేష్టా, యమునాచ సరస్వతీ |

నర్మదా గండకీ, సింధుర్గోమతీ తమసా తథా |

కావేరీ భాగా చ పుణ్యా నేత్రివతీ శుభా |

చర్మణ్వతీ చ సరయూస్తాపీ సాభమతీ తథా |

వెతాశ్చ కధితా రాజనన్యాశ్చ శతసః పునః |

తాసాం సముద్రగాః పుణ్యాః స్వల్ప పుణ్యాః అసముద్రగాః ||“.

(నదులలో గంగానది, యమునా, సరస్వతి, నర్మద, గండకీ, సింధు, గోమతీ, తమసా, కావేరీ, చంద్రభాగా, నేత్రవతీ, చర్మణ్వతీ, సరయూ, తాపీ శ్రేష్టమైనవి. ఇంకను ఎన్నియో వందలకొలది యున్నవి. వీటిలో సముద్రములో కలియునవి పుణ్యనదులని, సముద్రములో కలియనివి స్వల్పముగా పుణ్యమునిచ్చునవి).

  1. “భగవంతుని యందలి శ్రద్ధయు, నపవర్గదంబగు తత్కథా శ్రవణాదులయం దత్యంతాసక్తియు, బుణ్య తీర్థావగాహన మహత్సేవాదులచే సిద్ధించు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 2 - 21)
Transliteration
  1. yathā śarīrasthō dēśāḥ kē cinmadhya tarā yathā |

tathāpi pṛdhivī dēśāḥ kē citpuṇyatamāssmṛtāḥ |

prabhāvāt adbhutāt bhūmēḥ salilasyaca tējasā |

parigrahānmunī nāṃ ca tīrthānāṃ puṇyatā smṛtāḥ ||“,

(śarīramulōni bhāgamulu konni maṃcivi, konni ceḍḍavi unnaṭulē bhūmimīda konni dēśamulu puṇyatamamulu - heccugā puṇyavaṃtamulainavi. āyā pradēśamulu adbhutamaina prabhāvamu kaligi yuṃḍuṭacētanu, nīṭilōni tējassuvalananu munulu vāṭini puṇyavaṃtamulugā parigrahiṃcinaṃduvalananu ā tīrthamulu puṇyatīrthamulani ceppabaḍucunnavi).

  1. nadīnāṃ jāhnavī śrēṣṭā, yamunāca sarasvatī |

narmadā gaṃḍakī, siṃdhurgōmatī tamasā tathā |

kāvērī bhāgā ca puṇyā nētrivatī śubhā |

carmaṇvatī ca sarayūstāpī sābhamatī tathā |

vetāśca kadhitā rājananyāśca śatasaḥ punaḥ |

tāsāṃ samudragāḥ puṇyāḥ svalpa puṇyāḥ asamudragāḥ ||“.

(nadulalō gaṃgānadi, yamunā, sarasvati, narmada, gaṃḍakī, siṃdhu, gōmatī, tamasā, kāvērī, caṃdrabhāgā, nētravatī, carmaṇvatī, sarayū, tāpī śrēṣṭamainavi. iṃkanu enniyō vaṃdalakoladi yunnavi. vīṭilō samudramulō kaliyunavi puṇyanadulani, samudramulō kaliyanivi svalpamugā puṇyamuniccunavi).

  1. “bhagavaṃtuni yaṃdali śraddhayu, napavargadaṃbagu tatkathā śravaṇādulayaṃ datyaṃtāsaktiyu, buṇya tīrthāvagāhana mahatsēvādulacē siddhiṃcu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 2 - 21)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.