← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పురంజనుడు puraṃjanuḍu

Original — తెలుగు
  1. పురం వ్యనక్తి, జనయితి, నిర్మాపయతి ఇతి పురం జనః, జీవః.

(శరీరమను పురమును తాను నివసించుటకు పుట్టించువాడు, నిర్మించుకొనువాడు - జీవుడు).

  1. నీవు - - - భౌమ భోగరతుండవై పదంబు నిచ్చగించుచు, మహీమండలంబు గలయం గ్రుమ్మరు నప్పు డొక్క కామినీ నిర్మితంబుం బాంచా రామంబు, నవద్వార సమేతంబు, నేకపాలకంబు, ద్రికోష్టంబు, షట్కులంబు, బంచవిపణంబు, బంచప్రకృతియు, స్త్రీనాయకంబు నైన నొక్క పురంబు నొడగంటివి. అది యెట్టిదనినం బాంచారామంబులనం బంచేంద్రియార్థంబులు నవద్వారంబులన నానికాది ద్వారంబులే కపాల కంబనం బ్రాణవాగునంబు త్రికోష్టంబులనం దేజో భిన్నంబులు, షట్కులంబులన నింద్రియ సంగ్రహంబు, విషణంబులన కర్మేంద్రియంబులు, పంచప్రకృతి యనం బంచభూతంబులు, ప్రకృతి యను కామిని యన బుద్ధి. ఇట్టి పురంబునం ప్రవిష్టుండైన పురుషుండంగనా పరతంత్రుడు నజ్ఞుండునైన నీవ యప్పురంబునం గామినీ సంస్పృష్టుండవై రమియించుచు, దత్సంగమంబున నష్టస్మృతివై వెదర్భీజన సంభావిత సుఖాభాసంబులగు దుఃఖంబులచే నిట్టి పాపిష్టంబైన దశంబొందితివి. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 28 - 849)

(శ్రీమదాంధ్రమహాభాగవత చతుర్థ స్కందమందు పురంజనోపాఖ్యానమను ఇతిహాసము కలదు. అందులో పురమను శరీరములో జీవుడు (పరమాత్మ అంశ) ప్రవేశించి ప్రకృతివలన భ్రమచెంది, పురుషుడు లేక పురంజనుడను పేరున జననమరణ క్లేశాదుల ననుభవించునను విషయమును (ఆధ్యాత్మతత్వమును) పురం జనోపాఖ్యానంబను కథామిషంబున చెప్పబడినది).

Transliteration
  1. puraṃ vyanakti, janayiti, nirmāpayati iti puraṃ janaḥ, jīvaḥ.

(śarīramanu puramunu tānu nivasiṃcuṭaku puṭṭiṃcuvāḍu, nirmiṃcukonuvāḍu - jīvuḍu).

  1. nīvu - - - bhauma bhōgaratuṃḍavai padaṃbu niccagiṃcucu, mahīmaṃḍalaṃbu galayaṃ grummaru nappu ḍokka kāminī nirmitaṃbuṃ bāṃcā rāmaṃbu, navadvāra samētaṃbu, nēkapālakaṃbu, drikōṣṭaṃbu, ṣaṭkulaṃbu, baṃcavipaṇaṃbu, baṃcaprakṛtiyu, strīnāyakaṃbu naina nokka puraṃbu noḍagaṃṭivi. adi yeṭṭidaninaṃ bāṃcārāmaṃbulanaṃ baṃcēṃdriyārthaṃbulu navadvāraṃbulana nānikādi dvāraṃbulē kapāla kaṃbanaṃ brāṇavāgunaṃbu trikōṣṭaṃbulanaṃ dējō bhinnaṃbulu, ṣaṭkulaṃbulana niṃdriya saṃgrahaṃbu, viṣaṇaṃbulana karmēṃdriyaṃbulu, paṃcaprakṛti yanaṃ baṃcabhūtaṃbulu, prakṛti yanu kāmini yana buddhi. iṭṭi puraṃbunaṃ praviṣṭuṃḍaina puruṣuṃḍaṃganā parataṃtruḍu najñuṃḍunaina nīva yappuraṃbunaṃ gāminī saṃspṛṣṭuṃḍavai ramiyiṃcucu, datsaṃgamaṃbuna naṣṭasmṛtivai vedarbhījana saṃbhāvita sukhābhāsaṃbulagu duḥkhaṃbulacē niṭṭi pāpiṣṭaṃbaina daśaṃboṃditivi. (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 28 - 849)

(śrīmadāṃdhramahābhāgavata caturtha skaṃdamaṃdu puraṃjanōpākhyānamanu itihāsamu kaladu. aṃdulō puramanu śarīramulō jīvuḍu (paramātma aṃśa) pravēśiṃci prakṛtivalana bhramaceṃdi, puruṣuḍu lēka puraṃjanuḍanu pēruna jananamaraṇa klēśādula nanubhaviṃcunanu viṣayamunu (ādhyātmatatvamunu) puraṃ janōpākhyānaṃbanu kathāmiṣaṃbuna ceppabaḍinadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.