← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పురాణభూషణుడు purāṇabhūṣaṇuḍu

Original — తెలుగు

“సర్వేషాం పురాణానాం భూషణం, ముఖ్యం, దేవీపురాణం - సామ్యావస్థ మాయోపాధిక బ్రహ్మ ప్రతిపాదకత్వాత్ ఏతస్య దేవీ పురాణస్య సర్వపురాణ శ్రేష్టత్వం యుక్తమేవ. అన్య పురాణానాంతు సామ్యావస్థమాయ జన్యైకైక సతాది గుణోపాధి హరిహర బ్రహ్మాది క ప్రతిపాదకత్వాత్ న ముఖ్యం ఇతి భావః -”.

(పురాణములన్నింటిలోను అలంకారమైనది దేవీపురాణము - ముఖ్యమైనది దేవీపురాణము. సత్వరజస్థమములు అను మూడుగుణములు సామ్యావస్థను పొందియున్న మాయ ఉపాధిగాగల పరబ్రహ్మమును ప్రతిపాదించునది కనుక పురాణములన్నింటిలోను దేవీ పురాణము శ్రేష్టమైనది యనుట యుక్తమే. మిగిలిన పురాణములలో సామ్యావస్థను పొందిన మాయవలన కలిగిన సత్వరజస్తమోగుణములలో ఒక్కొక్కటే ఉపాధిగాగల విష్ణువు, బ్రహ్మ, శివుడు మొదలగు వాటిని గుఱించి చెప్పబడినది కనుక ఆ పురాణములు ముఖ్యములుకావు).

(ఏ పురాణములలో ఏ దేవుని గుఱించి చెప్పబడినదో ఆ దేవుడే పరబ్రహ్మయని చెప్పబడుచున్నది. దీనివలన మిగిలిన పురాణములలో చెప్పబడినది పరబ్రహ్మకాదు అని దాని అభిప్రాయము కాదు - “వ్రతానా ముత్తమం వ్రతం” - వ్రతములలో ఉత్తమమైన వ్రతము - అనినట్లే - ఏ వ్రతము చేసిన అదే ఉత్తమమైన వ్రతమని చెప్పినట్లు - ఏ వ్రతము చేయునప్పుడు అదియే ఉత్తమమైన వ్రతమనిన్నీ, ఆ వ్రతములో చేయబడు దైవమే ఉత్కృష్ట దైవమని భావించవలెను - అన్నియు, అందరు దేవతలు పరమాత్మ రూపములేకనుక భావన ముఖ్యము).

Transliteration

“sarvēṣāṃ purāṇānāṃ bhūṣaṇaṃ, mukhyaṃ, dēvīpurāṇaṃ - sāmyāvastha māyōpādhika brahma pratipādakatvāt ētasya dēvī purāṇasya sarvapurāṇa śrēṣṭatvaṃ yuktamēva. anya purāṇānāṃtu sāmyāvasthamāya janyaikaika satādi guṇōpādhi harihara brahmādi ka pratipādakatvāt na mukhyaṃ iti bhāvaḥ -”.

(purāṇamulanniṃṭilōnu alaṃkāramainadi dēvīpurāṇamu - mukhyamainadi dēvīpurāṇamu. satvarajasthamamulu anu mūḍuguṇamulu sāmyāvasthanu poṃdiyunna māya upādhigāgala parabrahmamunu pratipādiṃcunadi kanuka purāṇamulanniṃṭilōnu dēvī purāṇamu śrēṣṭamainadi yanuṭa yuktamē. migilina purāṇamulalō sāmyāvasthanu poṃdina māyavalana kaligina satvarajastamōguṇamulalō okkokkaṭē upādhigāgala viṣṇuvu, brahma, śivuḍu modalagu vāṭini guṟiṃci ceppabaḍinadi kanuka ā purāṇamulu mukhyamulukāvu).

(ē purāṇamulalō ē dēvuni guṟiṃci ceppabaḍinadō ā dēvuḍē parabrahmayani ceppabaḍucunnadi. dīnivalana migilina purāṇamulalō ceppabaḍinadi parabrahmakādu ani dāni abhiprāyamu kādu - “vratānā muttamaṃ vrataṃ” - vratamulalō uttamamaina vratamu - aninaṭlē - ē vratamu cēsina adē uttamamaina vratamani ceppinaṭlu - ē vratamu cēyunappuḍu adiyē uttamamaina vratamaninnī, ā vratamulō cēyabaḍu daivamē utkṛṣṭa daivamani bhāviṃcavalenu - anniyu, aṃdaru dēvatalu paramātma rūpamulēkanuka bhāvana mukhyamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.