(పురాతనుడు, సనాతనుడు, పూర్వకాలమునుండి యున్న వాడు; చిరకాలమునుండి యున్నవాడు, ప్రాచీనుడు, పాతకాలమునుండి యున్నవాడు, ఆది (జన్మ) లేనివాడు; సృష్టికిముందునుండి యున్నవాడు).
(పురాతనుడైనను సరికొత్తగా నుండువాడు - ఎప్పటికప్పుడే సరికొత్తగానుండువాడు).
(చిరకాలమునుండి యున్నవాడైనను కొత్తవాడే అయినవాడు - ఎల్లపుడు కొత్తవాడుగనే యుండువాడు - ఎవనికి అవయవములు పెరుగునో అట్టివాడు ఇప్పటి కాలపువాడు - మార్పులు కలవాడు ఇప్పటివాడు. అట్లుకానివాడు - వృద్ధిపొందుటలేనివాడు పురాతనుడు - అదే ఆత్మ).
(అవయవములు లేకుండుటవలన వృద్ధిలేనివాడు - శిశువు మొదలగువాటికి మొదట లేకపోయినను తర్వాత అవయవములు పెరుగును - ఇట్టిమార్పు లేనివాడు - మొదట యెట్లుండెనో ఎల్లపుడు నట్లే - ఏ విధమైన మార్పులేక నుండువాడు).
(ఎవరికి అవయవములు కలుగునో వాడు వృద్ధిపొందుచున్నాడని చెప్పబడుచున్నాడు; అట్టివాడు అభినవుడు, కొత్తగా మారినవాడు - ఆత్మకు అవయవములు లేకుండుటచేత ఇప్పుడు క్రొత్తగా మారినదికాదు; ఇదివరకునుండి - మొదటినుండి, పూర్వమునుండి, ఒకే రీతిగా, కొత్తగానే ఉండువాడు).
(పూర్వమునుండి నవకముగా నుండువాడు, మొదటినుండి ఒకే రూపముతో నుండువాడు. ఎవడు కొంచెమైనను ఉపచయములు - అవయవములను పెంచుకొనుట - కలిగియుండునో అట్టివాడు వృద్ధిని పొందు చున్నాడు అని ఈ లోకములో చెప్పబడును - ఈ ఆత్మ ఎల్లపుడు - పూర్వము, ఇప్పుడు కూడా ఒకే రూపముగలవాడు, అపచయములుగాని, ఉపచయములుగాని లేనివాడు; అందుచేత పురాణుడు).
(పురాణుడు అని చెప్పుటచేత పరిణామము - మార్పు లేనివాడు అని నిషేధింపబడినది.పూర్వమునుండి క్రొత్తగా నుండువాడే. అతనిలో పరిణామము కలుగుటచేత మఱియొక రూపము కలుగుటవలన నవత్వము పొందిన వాడుకాడు అని అర్థము. ఇంతకంటె అధికుడుగా నగువాడు కాడు - అనగా, వృద్ధిని పొందువాడు కాడు కనుక పరిణామము లేనివాడు).
(జననము ముదలగు ఆరు విధముల వికారములు - మార్పులు - లేనివాడు అని చెప్పుటకు పురాణుడు అని చెప్ప బడెను).
(తానున్న ఉపాధి యను శరీరము నశించినను తాను నశింపనివాడు).
(పూర్వమునుండియు - అకాశము మొదలగువాటి సృష్టికి పూర్వమునుండియు క్రొత్తగానే యుండువాడు).
(భగవంతుడు జన్మ లేనివాడు, శాశ్వతముగా నుండువాడు, పూర్వమునుండి యున్నవాడు అని శ్రుతి వాక్యము).
సర్వస్య ధాతారమ చింత్యరూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ||“. (శ్రీమద్భగవద్గీత - 8 - 9)
(సర్వజ్ఞుడు, పూర్వమునుండియున్నవాడు, అన్నింటిని శాసించువాడు, సూక్ష్మమైన పరమాణువుకంటె సూక్ష్మమైనవాడు, అందఱికి కర్మ ఫలమందచేయువాడు - అనుభవింపచేయువాడు - ఊహించుటకు అలవికానిరూపముగలవాడు, సూర్యునివంటి తజోరూపముగలవాడు, తమస్సుకంటె - అజ్ఞానముకంటె ఉత్కృష్టుడైనవాడు భగవంతుడు - ఇట్టి భగవంతుని అవసానకాలమున స్మరించువాడు భగవంతుని పొందును).
స ఏవ సర్వం న చ తస్య వేత్తా తమాహు రాగ్యం పురుషం పురాణం ||“. (ఈశ్వరగీతాయాం)
(బంధము, బంధమును కలిగించువాడు, అతనే భగవంతుడు; పశువులను - అజ్ఞానులను బంధించువాడు, వాటిని బంధించుపాశము అతనే. అన్నియు అతనే, అతనిని తెలుసుకొనువారు - అతని తత్వమును తెలిసినవారు - లేరు - అతనే ఆది పురుషుడని, పురాణ పురుషుడని చెప్పుదురు).
(purātanuḍu, sanātanuḍu, pūrvakālamunuṃḍi yunna vāḍu; cirakālamunuṃḍi yunnavāḍu, prācīnuḍu, pātakālamunuṃḍi yunnavāḍu, ādi (janma) lēnivāḍu; sṛṣṭikimuṃdunuṃḍi yunnavāḍu).
(purātanuḍainanu sarikottagā nuṃḍuvāḍu - eppaṭikappuḍē sarikottagānuṃḍuvāḍu).
(cirakālamunuṃḍi yunnavāḍainanu kottavāḍē ayinavāḍu - ellapuḍu kottavāḍuganē yuṃḍuvāḍu - evaniki avayavamulu perugunō aṭṭivāḍu ippaṭi kālapuvāḍu - mārpulu kalavāḍu ippaṭivāḍu. aṭlukānivāḍu - vṛddhipoṃduṭalēnivāḍu purātanuḍu - adē ātma).
(avayavamulu lēkuṃḍuṭavalana vṛddhilēnivāḍu - śiśuvu modalaguvāṭiki modaṭa lēkapōyinanu tarvāta avayavamulu perugunu - iṭṭimārpu lēnivāḍu - modaṭa yeṭluṃḍenō ellapuḍu naṭlē - ē vidhamaina mārpulēka nuṃḍuvāḍu).
(evariki avayavamulu kalugunō vāḍu vṛddhipoṃducunnāḍani ceppabaḍucunnāḍu; aṭṭivāḍu abhinavuḍu, kottagā mārinavāḍu - ātmaku avayavamulu lēkuṃḍuṭacēta ippuḍu krottagā mārinadikādu; idivarakunuṃḍi - modaṭinuṃḍi, pūrvamunuṃḍi, okē rītigā, kottagānē uṃḍuvāḍu).
(pūrvamunuṃḍi navakamugā nuṃḍuvāḍu, modaṭinuṃḍi okē rūpamutō nuṃḍuvāḍu. evaḍu koṃcemainanu upacayamulu - avayavamulanu peṃcukonuṭa - kaligiyuṃḍunō aṭṭivāḍu vṛddhini poṃdu cunnāḍu ani ī lōkamulō ceppabaḍunu - ī ātma ellapuḍu - pūrvamu, ippuḍu kūḍā okē rūpamugalavāḍu, apacayamulugāni, upacayamulugāni lēnivāḍu; aṃducēta purāṇuḍu).
(purāṇuḍu ani ceppuṭacēta pariṇāmamu - mārpu lēnivāḍu ani niṣēdhiṃpabaḍinadi.pūrvamunuṃḍi krottagā nuṃḍuvāḍē. atanilō pariṇāmamu kaluguṭacēta maṟiyoka rūpamu kaluguṭavalana navatvamu poṃdina vāḍukāḍu ani arthamu. iṃtakaṃṭe adhikuḍugā naguvāḍu kāḍu - anagā, vṛddhini poṃduvāḍu kāḍu kanuka pariṇāmamu lēnivāḍu).
(jananamu mudalagu āru vidhamula vikāramulu - mārpulu - lēnivāḍu ani ceppuṭaku purāṇuḍu ani ceppa baḍenu).
(tānunna upādhi yanu śarīramu naśiṃcinanu tānu naśiṃpanivāḍu).
(pūrvamunuṃḍiyu - akāśamu modalaguvāṭi sṛṣṭiki pūrvamunuṃḍiyu krottagānē yuṃḍuvāḍu).
(bhagavaṃtuḍu janma lēnivāḍu, śāśvatamugā nuṃḍuvāḍu, pūrvamunuṃḍi yunnavāḍu ani śruti vākyamu).
sarvasya dhātārama ciṃtyarūpaṃ ādityavarṇaṃ tamasaḥ parastāt ||“. (śrīmadbhagavadgīta - 8 - 9)
(sarvajñuḍu, pūrvamunuṃḍiyunnavāḍu, anniṃṭini śāsiṃcuvāḍu, sūkṣmamaina paramāṇuvukaṃṭe sūkṣmamainavāḍu, aṃdaṟiki karma phalamaṃdacēyuvāḍu - anubhaviṃpacēyuvāḍu - ūhiṃcuṭaku alavikānirūpamugalavāḍu, sūryunivaṃṭi tajōrūpamugalavāḍu, tamassukaṃṭe - ajñānamukaṃṭe utkṛṣṭuḍainavāḍu bhagavaṃtuḍu - iṭṭi bhagavaṃtuni avasānakālamuna smariṃcuvāḍu bhagavaṃtuni poṃdunu).
sa ēva sarvaṃ na ca tasya vēttā tamāhu rāgyaṃ puruṣaṃ purāṇaṃ ||“. (īśvaragītāyāṃ)
(baṃdhamu, baṃdhamunu kaligiṃcuvāḍu, atanē bhagavaṃtuḍu; paśuvulanu - ajñānulanu baṃdhiṃcuvāḍu, vāṭini baṃdhiṃcupāśamu atanē. anniyu atanē, atanini telusukonuvāru - atani tatvamunu telisinavāru - lēru - atanē ādi puruṣuḍani, purāṇa puruṣuḍani ceppuduru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.