← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పురుషార్థ సిద్ధి puruṣārtha siddhi

Original — తెలుగు

అస్మాత్ వేదాంత విహితాత్, ఆత్మజ్ఞానాత్ స్వతంత్రాత్ పురుషార్థః సిద్ధ్యతి - ఇతి బాదరాయణాచార్యః మన్యతే. “తరతి శోకమాత్మవిత్”. “సయోహవై తత్పరమం బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి” “బ్రహ్మవిదాప్నోతిపరం, ఆచార్యవాన్ పురుషోవేద” తస్య తావదేవచిరం యావన్నిమోక్ష్యే అధి సంత్స్యే ఇతి ఇత్యేవం జాతీయకాః శ్రుతిః కేవలాయాః విద్యా యాః పురుషార్థ హేతుత్వం శ్రావయతి.

“విశుద్ధ చిత్తానాం శ్రవణాద్యుపాయా దేన పురుషార్థ సిద్ధిః; మలిన చిత్తానాం బ్రహ్మోపాసన విశిష్ట షడంగ యోగాభ్యాసద్వారక జ్ఞానేన పురుషార్థ సిద్ధిః, న ప్రణవ జపేనైవ పురుషార్థ సిద్ధిః” తమేవ విదిత్వా (అ)తిమృత్యుమేతి; “తరతిశోకమాత్మవిత్”; “నిచాయ్యతం మృత్యుముఖాత్ప్రముచ్యతే’;”క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే“;”బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి“;”జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కురుతే (అ)ర్జున”;

“నహి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే |”;

బుద్ధి పూర్వ కృతం పాపం కృత్స్నం దహతిబ్రహ్మవిత్ || ;

“సర్వభూతేషు చాత్మానం సర్వ భూతాని చాత్మని |

సం వశ్యన్నాత్మ యా జీవైస్వా రాజ్యమధి గచ్ఛతి“. –

ఇత్యాది శ్రుతి స్మృతేతిహాస పురాణ విరాధాదితి చేన్ - న - ప్రణవస్యైవాత్మ జ్ఞానోపాయత్వాత్“.

(ఉపనిషత్తులలో చెప్పబడిన ప్రకారము ఆత్మజ్ఞానము కలుగుటయను నొక్కదాని వలననే పురుషార్థము - పరమ పురుషార్థము, మోక్షము - సిద్ధించునని బాదరాయణాచార్యుని అభిప్రాయము - “ఆత్మజ్ఞానము కలవాడు - ఆత్మను తెలుసుకొనినవాడు - ఈ సంసారసాగరమును తరించును”. ఎవడు బ్రహ్మను తెలుసుకొనునో - ఎవనికి బ్రహ్మజ్ఞానము కలుగునో వాడు పరబ్రహ్మమే యగును; బ్రహ్మను తెలుసుకొనినవాడు పరమపదమును - బ్రహ్మను - పొందును - “గురువు గలవాడు - గురువు ద్వారా పరబ్రహ్మజ్ఞానమును సంపాదించినవాడు - పరమ పురుషుని చేరును -” అను ఈ విధమైన శ్రుతివాక్యములు కేవలము బ్రహ్మజ్ఞానమే పరమ పురుషార్థమైన మోక్షమునకు కారణమని చెప్పుచున్నది.

(చిత్తశుద్ధి కలవారికి శ్రవణము మొదలగు ఉపాయములవలననే పరమ పురుషార్థము సిద్ధించును – చిత్త శుద్ధిలేనివారికి బ్రహ్మోపాసనతో కూడిన అష్టాంగ యోగాభ్యాసము ద్వారా బ్రహ్మజ్ఞానము కలిగిన పిదప పరమ పురుషార్థ ప్రాప్తియని చెప్పబడినది. ప్రణవజపము - ఒంకారజపము - వలననే పురుషార్థ సిద్ధి కానేరదు - పరమాత్మజ్ఞానము కలిగిననే మోక్షము సిద్ధించును” అనిన్నీ; “ఆత్మజ్ఞానము కలవాడు సంసారమువలన కలుగు దుఃఖములను దాటును” అనిన్నీ; “పరబ్రహ్మ సాక్షాత్కారము కలిగిననే అన్ని విధములైన కర్మలు నశించి పోవును, దానితో సంసారము పోయి మోక్షము కలుగును” అనిన్నీ; “బ్రహ్మజ్ఞానము గలవాడు బ్రహ్మమే యగును” అనిన్నీ; “బ్రహ్మజ్ఞానము అను అగ్ని సమస్త కర్మలను భస్మీభూతము చేయును” అనిన్నీ; “జ్ఞానముతో సమానమైన పవిత్రమగు వస్తువు - పాపములన్నింటినీ పోగొట్టుటచేతపవిత్రము చేయు వస్తువు మఱియొకటి కనబడదనిన్నీ”; “బుద్ధి పూర్వకముగా చేయు పాపములన్నింటినీ బ్రహ్మజ్ఞాని దహింపచేసుకొనును” అనిన్నీ; “సర్వ భూతములందు ఆత్మ - తనలోని ఆత్మవలెనే - ఉన్నదనిన్నీ”; “సర్వభూతములు (ఆత్మ అయిన) తనలోనే యున్నవనిన్నీ; చూచువాడు స్వారాజ్యమును - ఆత్మ యాధాత్మ్య స్థితిని పొందును” అనిన్నీ; ఇన్ని విధములుగా శ్రుతులు, స్మృతులు, పురాణములు, ఇతిహాసములు, చెప్పినను ప్రణవము వలననే పురుషార్థ సిద్ధి - ప్రణవమే పరమపురుషార్థ సిద్ధికి ఉపాయము“.

Transliteration

asmāt vēdāṃta vihitāt, ātmajñānāt svataṃtrāt puruṣārthaḥ siddhyati - iti bādarāyaṇācāryaḥ manyatē. “tarati śōkamātmavit”. “sayōhavai tatparamaṃ brahma vēda brahmaiva bhavati” “brahmavidāpnōtiparaṃ, ācāryavān puruṣōvēda” tasya tāvadēvaciraṃ yāvannimōkṣyē adhi saṃtsyē iti ityēvaṃ jātīyakāḥ śrutiḥ kēvalāyāḥ vidyā yāḥ puruṣārtha hētutvaṃ śrāvayati.

“viśuddha cittānāṃ śravaṇādyupāyā dēna puruṣārtha siddhiḥ; malina cittānāṃ brahmōpāsana viśiṣṭa ṣaḍaṃga yōgābhyāsadvāraka jñānēna puruṣārtha siddhiḥ, na praṇava japēnaiva puruṣārtha siddhiḥ” tamēva viditvā (a)timṛtyumēti; “taratiśōkamātmavit”; “nicāyyataṃ mṛtyumukhātpramucyatē’;”kṣīyaṃtē cāsya karmāṇi tasmin dṛṣṭē parāvarē”; “brahmavēda brahmaiva bhavati”; “jñānāgni sarvakarmāṇi bhasmasātkurutē (a)rjuna”;

“nahi jñānēna sadṛśaṃ pavitra miha vidyatē |”;

buddhi pūrva kṛtaṃ pāpaṃ kṛtsnaṃ dahatibrahmavit || ;

“sarvabhūtēṣu cātmānaṃ sarva bhūtāni cātmani |

saṃ vaśyannātma yā jīvaisvā rājyamadhi gacchati”. –

ityādi śruti smṛtētihāsa purāṇa virādhāditi cēn - na - praṇavasyaivātma jñānōpāyatvāt”.

(upaniṣattulalō ceppabaḍina prakāramu ātmajñānamu kaluguṭayanu nokkadāni valananē puruṣārthamu - parama puruṣārthamu, mōkṣamu - siddhiṃcunani bādarāyaṇācāryuni abhiprāyamu - “ātmajñānamu kalavāḍu - ātmanu telusukoninavāḍu - ī saṃsārasāgaramunu tariṃcunu”. evaḍu brahmanu telusukonunō - evaniki brahmajñānamu kalugunō vāḍu parabrahmamē yagunu; brahmanu telusukoninavāḍu paramapadamunu - brahmanu - poṃdunu - “guruvu galavāḍu - guruvu dvārā parabrahmajñānamunu saṃpādiṃcinavāḍu - parama puruṣuni cērunu -” anu ī vidhamaina śrutivākyamulu kēvalamu brahmajñānamē parama puruṣārthamaina mōkṣamunaku kāraṇamani ceppucunnadi.

(cittaśuddhi kalavāriki śravaṇamu modalagu upāyamulavalananē parama puruṣārthamu siddhiṃcunu – citta śuddhilēnivāriki brahmōpāsanatō kūḍina aṣṭāṃga yōgābhyāsamu dvārā brahmajñānamu kaligina pidapa parama puruṣārtha prāptiyani ceppabaḍinadi. praṇavajapamu - oṃkārajapamu - valananē puruṣārtha siddhi kānēradu - paramātmajñānamu kaliginanē mōkṣamu siddhiṃcunu” aninnī; “ātmajñānamu kalavāḍu saṃsāramuvalana kalugu duḥkhamulanu dāṭunu” aninnī; “parabrahma sākṣātkāramu kaliginanē anni vidhamulaina karmalu naśiṃci pōvunu, dānitō saṃsāramu pōyi mōkṣamu kalugunu” aninnī; “brahmajñānamu galavāḍu brahmamē yagunu” aninnī; “brahmajñānamu anu agni samasta karmalanu bhasmībhūtamu cēyunu” aninnī; “jñānamutō samānamaina pavitramagu vastuvu - pāpamulanniṃṭinī pōgoṭṭuṭacētapavitramu cēyu vastuvu maṟiyokaṭi kanabaḍadaninnī”; “buddhi pūrvakamugā cēyu pāpamulanniṃṭinī brahmajñāni dahiṃpacēsukonunu” aninnī; “sarva bhūtamulaṃdu ātma - tanalōni ātmavalenē - unnadaninnī”; “sarvabhūtamulu (ātma ayina) tanalōnē yunnavaninnī; cūcuvāḍu svārājyamunu - ātma yādhātmya sthitini poṃdunu” aninnī; inni vidhamulugā śrutulu, smṛtulu, purāṇamulu, itihāsamulu, ceppinanu praṇavamu valananē puruṣārtha siddhi - praṇavamē paramapuruṣārtha siddhiki upāyamu”.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.