← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పురుషార్థము puruṣārthamu

Original — తెలుగు
  1. పురుషస్య అర్థో భోగోపవర్గ రూపం.

(పురుషుడు అర్థించవలసినవి- కోరవలసిన విషయములు, అనుభవించవలసినవి).

  1. పురుషాణాం అర్థనీయ భోగ్య భోగోపకరణ భోగస్థాన రూపం జగత్.

(పురుషులు అర్థించి సాధించవలసినవి - భోగ్యములు, భోగ్యములకుపకరణములు - భోగస్థానములుగల - జగత్).

  1. శాస్త్రస్య పరమ ప్రయోజన భిధానం.

(శాస్త్రము యొక్క పరమ ప్రయోజనము యొక్క పేరు పురుషార్థము).

  1. “అఖండ నిరతిశయానందా వాప్తి లక్షణత్వేన అభ్యర్థితత్వాత్ ముఖ్యో మోక్ల్షః పురుషార్థ ఇతి సకలమత సిద్ధాంతః. ప్రసూతి భాజోపి విశ్వస్య స్త్రీ పుంసా భామేవ నిష్పన్నత్వాత్ కామస్య పితృ ఋణ విమోచన హేతు భూత తయా సతతం మహాపురుష పరిగ్రహాత్ పురుషార్థత్వమితి నందికేశ్వర, శ్వేతకేతు, పాంచాల వాత్సాయనాది పూర్వ సిద్ధాంతః - ఏవం చ సతి పూర్వలాభే పరః ఇతి న్యాయాత్ ముఖ్యలాభే అనుకల్పస్యాపి విహితత్వాత్ మోక్ష పురుషార్థసాధన ప్రవృత్యలాభే కామ పురుషార్థ సాధనేషు వా అవశ్యం ప్రవృత్తిః కర్తవ్యా”.

(అఖండము, అన్నింటికంటె ఉత్తమమైన ఆనందలక్షణము గలది – పరమా నందమైనది - మోక్షము దానికి మించిన ఆనందము లేదు - అందుచేత ఆనంద లక్షణమే అయిన మోక్షమే పురుషార్థమని అన్ని మతముల సిద్ధాంతమై యున్నది. అయినను ఈ ప్రపంచము - సృష్టి - స్త్రీ పురుషుల సం యోగమువలననే కలుగుచున్నది కనుకను, పితృ ఋణము తీర్చుటకు కామకామముకూడ పురుషా ర్థమే అని నందికేశ్వరుడు, శేతకేతువు,వాత్సాయనుడు మొదలగువారి పూర్వ సిద్ధాంతము. మొదటి ముఖ్యమైనది సాధించని పక్షములో తర్వాత దానిని సాధించవలెనను న్యాయము ప్రకారము ముఖ్య పురుషార్థమగు మోక్షము సాధించలేని పక్షములో కామమును, దాని కనుగుణ్యమైన ధర్మార్థముల నైనను సాధించవలెను).

  1. “పురుషార్థములు నాలుగు విధములు - ధర్మము, అర్థము, కామము, మోక్షము - పురుషుడవశ్యముసాధించవలసినవి ధర్మము, మోక్షము. వీటిని సాధించుటలో మధ్యను అవాంతరముగా కలుగునది అర్థకామములు. ధర్మార్థకామములు మూడును మోక్షము కలుగుటకే సాధించవలసినవి. మోక్షమునకు కానిధర్మార్థకామములు అవాంఛనీయములు. వీటిని విడిచి యైన మోక్షమును సాధించవలెను).

  2. “సీ. - - - ఆ ధర్మాదులందు త్రివర్గంబు సంతరోధ్ర

భయకారియగుటను బరమమోక్షంబె ముఖ్యార్థమై విలసిల్లు నండ్రు బుధులు

భువి గుణవ్యతకరమున బుట్టినట్టి

యబ్జజాతాదులకు నన్మదాదులకును

గాల విధ్వంసితాఖిల క్రమము గల్గు

గలుగదెన్నడు సేమంబు; గాన వినుము -

వ. మోక్షంబె పురుషార్థంబు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 626 )

  1. “క. పురుషుడు దవిలి చతుర్విధ

పురుషార్థ శ్రేయమాత్మ బొందెద ననినన్

ధర తత్ప్రాప్తికి హేతువు

హరిపదయుగళంబు దక్క నన్యము గలదే|“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 8 - 244)

  1. “వ. - - - నీవు సమస్త పురుషార్థమయుండవనియును, ఫలస్వరూపివనియును - - - సుమతులు భవదీయ దాన సంగంబు గోరుచుందురు -” (శ్రీమదాంధ్రమహా భాగవత్ము - 10 - ఉ. భా. - 249)

  2. “ప్రాప్యస్య బ్రహ్మణోరూపం, ప్రాప్తుశ్చప్రత్యగాత్మనః |

ప్రాప్త్యుపాయం ఫలం ప్రాప్తేః తథా ప్రాప్తి విరోధిచ |

వదంతిసకలా వేదాః సేతి హాస పురాణకాః ||“.

(వేదములోను, పురాణములలోను, ఇతిహాస పురాణములలోను చెప్పబడిన విషయము భగవంతుడే - భగవంతుని ప్రాప్తించుటే - పొందుటే. ఇది అర్థపంచక రూపముగానున్నది - పురుషార్థముల వలె అర్థించవలసినవి అయిదు - ప్రాప్యము, ప్రాప్తుడు, ప్రాప్త్యుపాయము, ప్రాప్తిఫలము, ప్రాప్తివిరోధము).

  1. “రామ చంద్ర చరణారవిందయో |

రంతరంగ చరభృంగలీలయా |

తత్ర సంతి రసాశ్చతుర్విధాః, |

మాకరంద రస ఏవ పంకజే ||“. (శ్రీరామకర్ణామృతం - 3 - 76)

(మనసా!, తేనెటీగవలె శ్రీరామచంద్రుని పాదారవిందములందే సంచరించుము - వాటినే ధ్యానము చేయుము - పద్మమందు తేనెటీగకు ఒకే రసము - తేనె - యున్నది. శ్రీరాముని పాదములను పద్మములందు నాలుగు విధములైన రసములు ధర్మార్థకామ మోక్షములున్నవి. అందుచేత శ్రీరామచంద్రుని పాదముల నాశ్రయించుము - ” మనసా, హరిపాదము లాశ్రయింపుమా ” -

Transliteration
  1. puruṣasya arthō bhōgōpavarga rūpaṃ.

(puruṣuḍu arthiṃcavalasinavi- kōravalasina viṣayamulu, anubhaviṃcavalasinavi).

  1. puruṣāṇāṃ arthanīya bhōgya bhōgōpakaraṇa bhōgasthāna rūpaṃ jagat.

(puruṣulu arthiṃci sādhiṃcavalasinavi - bhōgyamulu, bhōgyamulakupakaraṇamulu - bhōgasthānamulugala - jagat).

  1. śāstrasya parama prayōjana bhidhānaṃ.

(śāstramu yokka parama prayōjanamu yokka pēru puruṣārthamu).

  1. “akhaṃḍa niratiśayānaṃdā vāpti lakṣaṇatvēna abhyarthitatvāt mukhyō mōklṣaḥ puruṣārtha iti sakalamata siddhāṃtaḥ. prasūti bhājōpi viśvasya strī puṃsā bhāmēva niṣpannatvāt kāmasya pitṛ ṛṇa vimōcana hētu bhūta tayā satataṃ mahāpuruṣa parigrahāt puruṣārthatvamiti naṃdikēśvara, śvētakētu, pāṃcāla vātsāyanādi pūrva siddhāṃtaḥ - ēvaṃ ca sati pūrvalābhē paraḥ iti nyāyāt mukhyalābhē anukalpasyāpi vihitatvāt mōkṣa puruṣārthasādhana pravṛtyalābhē kāma puruṣārtha sādhanēṣu vā avaśyaṃ pravṛttiḥ kartavyā”.

(akhaṃḍamu, anniṃṭikaṃṭe uttamamaina ānaṃdalakṣaṇamu galadi – paramā naṃdamainadi - mōkṣamu dāniki miṃcina ānaṃdamu lēdu - aṃducēta ānaṃda lakṣaṇamē ayina mōkṣamē puruṣārthamani anni matamula siddhāṃtamai yunnadi. ayinanu ī prapaṃcamu - sṛṣṭi - strī puruṣula saṃ yōgamuvalananē kalugucunnadi kanukanu, pitṛ ṛṇamu tīrcuṭaku kāmakāmamukūḍa puruṣā rthamē ani naṃdikēśvaruḍu, śētakētuvu,vātsāyanuḍu modalaguvāri pūrva siddhāṃtamu. modaṭi mukhyamainadi sādhiṃcani pakṣamulō tarvāta dānini sādhiṃcavalenanu nyāyamu prakāramu mukhya puruṣārthamagu mōkṣamu sādhiṃcalēni pakṣamulō kāmamunu, dāni kanuguṇyamaina dharmārthamula nainanu sādhiṃcavalenu).

  1. “puruṣārthamulu nālugu vidhamulu - dharmamu, arthamu, kāmamu, mōkṣamu - puruṣuḍavaśyamusādhiṃcavalasinavi dharmamu, mōkṣamu. vīṭini sādhiṃcuṭalō madhyanu avāṃtaramugā kalugunadi arthakāmamulu. dharmārthakāmamulu mūḍunu mōkṣamu kaluguṭakē sādhiṃcavalasinavi. mōkṣamunaku kānidharmārthakāmamulu avāṃchanīyamulu. vīṭini viḍici yaina mōkṣamunu sādhiṃcavalenu).

  2. “sī. - - - ā dharmādulaṃdu trivargaṃbu saṃtarōdhra

bhayakāriyaguṭanu baramamōkṣaṃbe mukhyārthamai vilasillu naṃḍru budhulu

bhuvi guṇavyatakaramuna buṭṭinaṭṭi

yabjajātādulaku nanmadādulakunu

gāla vidhvaṃsitākhila kramamu galgu

galugadennaḍu sēmaṃbu; gāna vinumu -

va. mōkṣaṃbe puruṣārthaṃbu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 626 )

  1. “ka. puruṣuḍu davili caturvidha

puruṣārtha śrēyamātma boṃdeda naninan

dhara tatprāptiki hētuvu

haripadayugaḷaṃbu dakka nanyamu galadē|“. (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 8 - 244)

  1. “va. - - - nīvu samasta puruṣārthamayuṃḍavaniyunu, phalasvarūpivaniyunu - - - sumatulu bhavadīya dāna saṃgaṃbu gōrucuṃduru -” (śrīmadāṃdhramahā bhāgavatmu - 10 - u. bhā. - 249)

  2. “prāpyasya brahmaṇōrūpaṃ, prāptuścapratyagātmanaḥ |

prāptyupāyaṃ phalaṃ prāptēḥ tathā prāpti virōdhica |

vadaṃtisakalā vēdāḥ sēti hāsa purāṇakāḥ ||“.

(vēdamulōnu, purāṇamulalōnu, itihāsa purāṇamulalōnu ceppabaḍina viṣayamu bhagavaṃtuḍē - bhagavaṃtuni prāptiṃcuṭē - poṃduṭē. idi arthapaṃcaka rūpamugānunnadi - puruṣārthamula vale arthiṃcavalasinavi ayidu - prāpyamu, prāptuḍu, prāptyupāyamu, prāptiphalamu, prāptivirōdhamu).

  1. “rāma caṃdra caraṇāraviṃdayō |

raṃtaraṃga carabhṛṃgalīlayā |

tatra saṃti rasāścaturvidhāḥ, |

mākaraṃda rasa ēva paṃkajē ||“. (śrīrāmakarṇāmṛtaṃ - 3 - 76)

(manasā!, tēneṭīgavale śrīrāmacaṃdruni pādāraviṃdamulaṃdē saṃcariṃcumu - vāṭinē dhyānamu cēyumu - padmamaṃdu tēneṭīgaku okē rasamu - tēne - yunnadi. śrīrāmuni pādamulanu padmamulaṃdu nālugu vidhamulaina rasamulu dharmārthakāma mōkṣamulunnavi. aṃducēta śrīrāmacaṃdruni pādamula nāśrayiṃcumu - ” manasā, haripādamu lāśrayiṃpumā ” -

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.