పురుషేషు శ్రేష్టః (పురుషులలో శ్రేష్టుడు - శ్రీమహావిష్ణువు).
పురుషాణాం ఉత్తమః పురుషోత్తమః - ఉత్తమ పురుషః హరిః - “హరిర్య ధైకః పురుషోత్తమ స్స్మృతః” - (హరివంశము)
(పురుషులలో ఉత్తముడు - ఉత్తమపురుషుడు - హరి, విష్ణువు. విష్ణువొక్కడే పురుషోత్తముడని చెప్పబడుచున్నాడు).
(నశించు స్వభావముగల కార్యముకంటె, నశించనట్టి స్వభావముగల కారణముకంటె, ఉత్తముడైనవాడు పురుషులు అని చెప్పబడు క్షరాక్షరముల కంటె ఉత్తముడు - లేక, కార్య కారణ రూపమైన జగత్తుకంటెను ప్రకృతికంటెను - ఉత్కృషమైనవాడు.
(జీవులను పురుషులందు వ్యాపించుటవలన భగవంతుడు పురుషుడు, ఉత్తముడు కూడ - అందుచేత పురుషోత్తముడు).
సర్వాణి భూతాని, కూటస్థో అక్షర ఉచ్యతే |
ఉత్తమః పురుషస్త్వన్యః పరమా త్మేత్యుదా హృతః |
యో లోకత్రయమావిశ్య భిభర్త్యవ్యయ ఈశ్వరః |
యస్మాత్ క్షరమతీతో హయక్షరాదపి చోత్తమః |
యతో అస్మిన్ లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః ||“. (శ్రీమద్భగవద్గీత - 15 - 16, 17, 18)
(లోకములో పురుషులు రెండు విధములుగా నున్నారు - క్షరపురుషుడు, అక్షరపురుషుడు,. సమస్త భూతములు క్షరము - కూటస్థుడు అక్షరపురుషుడు - వీరిద్దరికంటె వరైనవాడు ఉత్తమ పురుషుడు - అతనే పరమాత్మయని చెప్పబడుచున్నాడు. అతనే మూడు లోకములనావేశించియుండి వాటిని భరించుచున్నాడు. క్షరపురుషునికంటె అతీతుడును, అక్షరపురుషుని కంటె ఉత్తముడు. అందుచేత ఈ లోకములోను వేదములోను పురుషోత్తముడని నేను చెప్పబడుచున్నాను).
(తేజో మూర్తియు, నిరాకారుడు, అక్షరమైన ప్రకౄతి కంటె ప్రకృష్టమైనవాడు పురుషుడు, - పరాత్పరుడు పురుషోత్తముడు).
(ఛాందోగ్యోపనిషత్- 8 - 12 - 3)
(ఈ జీవుడే - శరీరములోనుండు పురుషుడే - ఈ శరీరమును విడిచిపెట్టి పరంజ్యోతి స్వరూపమును - పొంది - తన స్వస్వరూపముతో వెలుగొందును - అతనే ఉత్తమ పురుషుడు).
(క్షరమనగా అశ్వత్థమనుపేరుగల మాయ యను సంసారము - సంసారమను మాయా వృక్షమునకు బీజమైన అక్షరముకంటె నేను (భగవంతుడు) ఉత్తమమైనవాడను, మిక్కిలి ఉత్కృష్టమైనవాడను, ఉత్కృష్టమైనవాటీన్నింటికంటెను ఉత్కృష్టమైనవాడను. అందుచేత, క్షరముకంటె, అక్షరము కంటె ఉత్కృష్టమైనవాడను కనుక లోకమందు వేదములందు నేను ఉత్కృష్టమైనవాడనని ప్రసిద్ధిపొందియున్నాను).
కమనీయ శుభమూర్తి గలవాడవై ధర్మసేతువనంగ బ్రఖ్యాతినొంది
విషయ సుఖంబులవిడిచి సంతత నిజానందానుభవ సమున్నతి దనర్తు;
వదిగాన పురుషోత్తమాఖ్య జెన్నొందుదువు“. (శ్రీమదాంధ్రమహా భాగవతము - 3 - 9 - 309)
puruṣēṣu śrēṣṭaḥ (puruṣulalō śrēṣṭuḍu - śrīmahāviṣṇuvu).
puruṣāṇāṃ uttamaḥ puruṣōttamaḥ - uttama puruṣaḥ hariḥ - “harirya dhaikaḥ puruṣōttama ssmṛtaḥ” - (harivaṃśamu)
(puruṣulalō uttamuḍu - uttamapuruṣuḍu - hari, viṣṇuvu. viṣṇuvokkaḍē puruṣōttamuḍani ceppabaḍucunnāḍu).
(naśiṃcu svabhāvamugala kāryamukaṃṭe, naśiṃcanaṭṭi svabhāvamugala kāraṇamukaṃṭe, uttamuḍainavāḍu puruṣulu ani ceppabaḍu kṣarākṣaramula kaṃṭe uttamuḍu - lēka, kārya kāraṇa rūpamaina jagattukaṃṭenu prakṛtikaṃṭenu - utkṛṣamainavāḍu.
(jīvulanu puruṣulaṃdu vyāpiṃcuṭavalana bhagavaṃtuḍu puruṣuḍu, uttamuḍu kūḍa - aṃducēta puruṣōttamuḍu).
sarvāṇi bhūtāni, kūṭasthō akṣara ucyatē |
uttamaḥ puruṣastvanyaḥ paramā tmētyudā hṛtaḥ |
yō lōkatrayamāviśya bhibhartyavyaya īśvaraḥ |
yasmāt kṣaramatītō hayakṣarādapi cōttamaḥ |
yatō asmin lōkē vēdē ca prathitaḥ puruṣōttamaḥ ||“. (śrīmadbhagavadgīta - 15 - 16, 17, 18)
(lōkamulō puruṣulu reṃḍu vidhamulugā nunnāru - kṣarapuruṣuḍu, akṣarapuruṣuḍu,. samasta bhūtamulu kṣaramu - kūṭasthuḍu akṣarapuruṣuḍu - vīriddarikaṃṭe varainavāḍu uttama puruṣuḍu - atanē paramātmayani ceppabaḍucunnāḍu. atanē mūḍu lōkamulanāvēśiṃciyuṃḍi vāṭini bhariṃcucunnāḍu. kṣarapuruṣunikaṃṭe atītuḍunu, akṣarapuruṣuni kaṃṭe uttamuḍu. aṃducēta ī lōkamulōnu vēdamulōnu puruṣōttamuḍani nēnu ceppabaḍucunnānu).
(tējō mūrtiyu, nirākāruḍu, akṣaramaina prakṝti kaṃṭe prakṛṣṭamainavāḍu puruṣuḍu, - parātparuḍu puruṣōttamuḍu).
(chāṃdōgyōpaniṣat- 8 - 12 - 3)
(ī jīvuḍē - śarīramulōnuṃḍu puruṣuḍē - ī śarīramunu viḍicipeṭṭi paraṃjyōti svarūpamunu - poṃdi - tana svasvarūpamutō velugoṃdunu - atanē uttama puruṣuḍu).
(kṣaramanagā aśvatthamanupērugala māya yanu saṃsāramu - saṃsāramanu māyā vṛkṣamunaku bījamaina akṣaramukaṃṭe nēnu (bhagavaṃtuḍu) uttamamainavāḍanu, mikkili utkṛṣṭamainavāḍanu, utkṛṣṭamainavāṭīnniṃṭikaṃṭenu utkṛṣṭamainavāḍanu. aṃducēta, kṣaramukaṃṭe, akṣaramu kaṃṭe utkṛṣṭamainavāḍanu kanuka lōkamaṃdu vēdamulaṃdu nēnu utkṛṣṭamainavāḍanani prasiddhipoṃdiyunnānu).
kamanīya śubhamūrti galavāḍavai dharmasētuvanaṃga brakhyātinoṃdi
viṣaya sukhaṃbulaviḍici saṃtata nijānaṃdānubhava samunnati danartu;
vadigāna puruṣōttamākhya jennoṃduduvu”. (śrīmadāṃdhramahā bhāgavatamu - 3 - 9 - 309)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.