← Back to త · Booklets 21–30 (digitized file 3)

తద్విష్ణోః పరమం పదం tadviṣṇōḥ paramaṃ padaṃ

Original — తెలుగు

తత్ నిష్ప్రతియోగిక వ్యాపన శీలస్య విష్ణోః స్వరూపస్య సర్వాపహ్నవ సిద్ధ స్వమాత్ర సిద్దేః పరమత్వేన స్వావ శేషధియా పద్యతి ఇతి పరమం పదం తదేవ ఇత్యర్థః -(తత్ అనగా పరబ్రహ్మ – “ఓం తత్సత్ ఇతి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః” (శ్రీమద్భగవద్గీత - 17 - 23)

విష్ణువు అనగా వ్యాపనశీలుడు. ఆ వ్యాపనశీలుడగు పరబ్రహ్మ అయిన విష్ణువుయొక్క స్వరూపము అనే సిద్ధిని, పరమ ఉత్కృష్టమైనదగుటచేత అన్నియు లయమైపోగా మిగిలియుండునదగుటచేతను, భక్తుల చేత పొందబడుచున్నది - భక్తులు పొందు స్థానము - పరమపదమనినను, వైకుంఠమనినను, వైష్ణవ పదమనినను, అత్యంత సుఖస్థానమనినను ఒకటే -). “తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః” (సూరి జనులు - భక్తులు, బ్రహ్మజ్ఞానులు ఆ పరబ్రహ్మ అయిన విష్ణువు యొక్కస్థానమును ఎల్లపుడు చూచుచుందురు).

Transliteration

tat niṣpratiyōgika vyāpana śīlasya viṣṇōḥ svarūpasya sarvāpahnava siddha svamātra siddēḥ paramatvēna svāva śēṣadhiyā padyati iti paramaṃ padaṃ tadēva ityarthaḥ -(tat anagā parabrahma – “ōṃ tatsat iti nirdēśō brahmaṇastrividhaḥ smṛtaḥ” (śrīmadbhagavadgīta - 17 - 23)

viṣṇuvu anagā vyāpanaśīluḍu. ā vyāpanaśīluḍagu parabrahma ayina viṣṇuvuyokka svarūpamu anē siddhini, parama utkṛṣṭamainadaguṭacēta anniyu layamaipōgā migiliyuṃḍunadaguṭacētanu, bhaktula cēta poṃdabaḍucunnadi - bhaktulu poṃdu sthānamu - paramapadamaninanu, vaikuṃṭhamaninanu, vaiṣṇava padamaninanu, atyaṃta sukhasthānamaninanu okaṭē -). “tadviṣṇōḥ paramaṃ padaṃ sadā paśyaṃti sūrayaḥ” (sūri janulu - bhaktulu, brahmajñānulu ā parabrahma ayina viṣṇuvu yokkasthānamunu ellapuḍu cūcucuṃduru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.