← Back to త · Booklets 21–30 (digitized file 3)

తైజసుడు taijasuḍu

Original — తెలుగు
  1. “జీవునికి విశ్వ తైజస ప్రాజ్ఞులనెడి త్రివిధనామంబులు - - - సూక్ష్మశరీర వ్యష్ట్యభిమాని, ప్రాభాసికుడు, స్వప్నకల్పితుండు, మొదలైనవి తైజస పర్యాయ నామంబులు”. (వివేక చింతామణి - పరమానంద తీర్థ)

  2. “తను త్రయాభిమాని జీవుండు. ఆ జీవుండే రజోగుణయుక్తుండై తైజసాహంకారమువల్ల వర్తన వికృతి గలవాడై, మనోవ్యాపారియై, లింగశరీరాభిమానియై స్వప్నావస్థయందు తైజసుండనిపించుకొనును”. (బ్రహ్మవిద్యాసుధావర్ణము - 2)

  3. “స్థూలశరీరం యొక్క వాసనావశమైన సూక్ష్మ శరీరం లింగదేహము అష్ట పురాలతో గూడింది, జ్ఞానేంద్రియాలు, శబ్దాదివిషయాలు, కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, కరణ చతుష్టయం, కర్మ కామమవిద్య - యీ యెనిమిదింటి గూడింది లింగదేహము - అభిమాని తైజసుడు”. (బ్రహ్మవిద్యాసుధావర్ణము - 6)

  4. ఈశాజ్ఞయా సూత్రాత్మావ్యష్టి సూక్ష్మ శరీరం ప్రవిశ్యమున అధిష్టాయ, తైజసత్వమగమత్ - తైజసః, ప్రాతి భాసికః, స్వప్న కల్పితః, ఇతి తైజసస్యనామాది భవంతి“. (పైంగలోపనిషత్)

(సూత్రాత్మ వ్యష్టి సూక్ష్మ శరీరమును ప్రవేశించి, మనస్సును అధిష్టించి యుండుటవలన తైజసుడనిపించుకొనెను. తైజసుడు, ప్రాతిభాసికుడు, స్వప్నకల్పితుడు అని తైజసుని నామములు).

  1. వ్యష్టి లింగ దేహాభిమానీ.

(వ్యష్టి - వేరు వేరుగా ఉన్నా లింగదేహాభిమాని - ఒక్కొక్కటీ వేరు వేరుగా నుండు సూక్ష్మదేహము నభిమానించు ఆత్మ తత్వము - ఆత్మ రూపము) (వ్యష్టి లింగశరీరమందుండు చైతన్యము).

  1. “అంతః ప్రజ్ఞస్తు తైజసః” (గౌడపాదకారికా -). (సూక్ష్మ ప్రపంచమును తెలిసినవాడు).

  2. “మనస్యంతస్తు తైజసః” (గౌడపాదకారికా ).

(మనసులోపల - అంతః కరణములోపలనుండువాడు తైజసుడు).

(తేజోరూపమగు నంతఃకరణమున ప్రతిబింబించియుండువాడు).

  1. “తైజస శబ్దవాచ్యాంతః కరణోపహితః ప్రాణేంద్రియ అధ్యక్షః, స్వప్నాభిమానీ జీవః తైజసః ఇత్యభిధీయతే”

(తేజస శబ్దముచేత చెప్పబడు అంతఃకరణముతోనూ, ప్రాణేంద్రియములతోను గూడియుండు స్వప్నాభిమానియైన జీవుడు తైజసుడని చెప్పబడుచున్నాడు)..

  1. “తేజోమయ చిత్తస్థతయా చిత్తసంబంధిత్వేన తైజసనామా - ఆత్మనః ద్వితీయః, పాదః, ద్వితీయరూప మిత్యర్ధః”. (శ్రీకూరనారాయణః)

(తేజోమయమగు చిత్తమందుండుటచేత - చిత్తముతో సంబంధము కలిగియుండుటచేత తైజశుడని పేరు. ఆత్మ యొక్కనాలుగు పాదములలోను రెండవది. అనగా ఆత్మయొక్క రూపములలో రెండవది).

  1. “స్వప్నావస్థానో అంతః ప్రజ్ఞః, సప్తాంగః, ఏకో నవింసతిముఖః, ప్రవివిక్తభుక్, తైజసః ద్వితీయః పాదః”.

(స్వప్నావస్థలోనుండువాడు, అంతః ప్రజ్ఞుడు, ఆత్మయొక్క రెండవపాదము తైజసుడు). (అంతః ప్రజ్ఞుడు అనగా సూక్ష్మప్రపంచమును తెలిసినవాడు), (చూడుము - 6).

  1. ద్వితీయ మాత్రా ఆత్మనః, ద్వితీయాంసః (పాదః) తైజసః, ఓంకారస్య ద్వితీయమాత్రా ఉకారః “.

(“జాగ్రద్దశాయాం విద్యమాన దేహాభిమానం త్యాజ యిత్వా స్వప్నమండలే జీవం కర్షతి. ఇత్కుత్కర్షణాత్ హేతోర్వా, బాహ్యజ్ఞప్తిరూప నిద్రాం వాసనామయ విషయానుభవం చ ప్రయచ్ఛతి. ఇత్య భయహేతుత్వాత్ వా, ‘ఉ’ ఇత్యుచ్యతే తైజసః ఇత్యర్థః -”

(శ్రీకూరనారాయణః)

(ఆత్మయొక్క రెండవ పాదము, (మాత్ర), (అంస), తైజసుడని చెప్పబడుచున్నాడు. ఓంకారములోని ‘అ, ఉ, మ’ అను మూడక్షరములలోను రెండవమాత్ర ‘ఉ’ కారమే తైజసుడు).

(జాగ్రద్దశయందు కలుగు దేహాభిమానమును వదలి స్వప్నావస్థ జీవుని ఆకర్షించును - (తన అంసలోనుండి ఉద్భవించునట్లు చేయును - తానే జీవునిగా మారును), లేక, బ్రహ్మజ్ఞానరూపమైన వాసనలతో కూడియున్న విషయానుభవమును కలుగచేయును - అను ఈ రెండుకారణములవల్ల ఓంకారములోని ‘ఉ’ అనితైజశుడు చెప్పబడుచున్నాడు).

  1. “విశ్వాపేక్షయా తైజసస్య ఉత్కృష్ట త్వాత్ వా, తత్సమానయోః ప్రాజ్ఞ తైజసయోః ద్వితీయత్వాత్ వా తైజసస్య ఉకారరూపత్వం”.

(శ్రీరంగరామానుజః)

(విశ్వుడు - జీవుడు - కన్న ఉత్కృష్టుడగుటవలన, లేక, సమానమైన ప్రాజ్ఞుడు తైజసుడు అను ఇద్దరిలోను రెండవ వాడగుటచేత ‘ఓం’ యొక్క ‘అ ఉ మ’ అను మూడు అక్షరములలోను రెండవదియైన ‘ఉ’ కారము తైజసుడు, ఆత్మ రెండవరూపము, రెండవపాదము).

  1. “ఇతరానిదితానాం అతి సూక్ష్మాణాం స్వాప్న పదార్ధానాం తేజోవద్భాసకత్వాత్ ప్రద్యుమ్నస్య స్వప్నాధి ష్ఠాతుః తైజస త్యోక్తిః”

(శ్రీరంగరామానుజః)

(మిక్కిలి సూక్ష్మమైనటువంటిన్నీ, అందుచేతనే ఇతరులకు కనబడునటువంటిన్నీ, స్వప్నములో కనబడు పదార్ధములకు తేజస్సువలె ప్రకాశించుటచేతనున్నూ, స్వప్న అధిష్టాత అయినటువంటిన్నీ, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్దులు అను నాలుగువ్యూహములలోను ప్రద్యుమ్నుడు (ప్రద్యుమ్న వ్యూహము) తైజసుడని చెప్పబడుచున్నాడు).

Transliteration
  1. “jīvuniki viśva taijasa prājñulaneḍi trividhanāmaṃbulu - - - sūkṣmaśarīra vyaṣṭyabhimāni, prābhāsikuḍu, svapnakalpituṃḍu, modalainavi taijasa paryāya nāmaṃbulu”. (vivēka ciṃtāmaṇi - paramānaṃda tīrtha)

  2. “tanu trayābhimāni jīvuṃḍu. ā jīvuṃḍē rajōguṇayuktuṃḍai taijasāhaṃkāramuvalla vartana vikṛti galavāḍai, manōvyāpāriyai, liṃgaśarīrābhimāniyai svapnāvasthayaṃdu taijasuṃḍanipiṃcukonunu”. (brahmavidyāsudhāvarṇamu - 2)

  3. “sthūlaśarīraṃ yokka vāsanāvaśamaina sūkṣma śarīraṃ liṃgadēhamu aṣṭa purālatō gūḍiṃdi, jñānēṃdriyālu, śabdādiviṣayālu, karmēṃdriyālu, paṃca prāṇālu, karaṇa catuṣṭayaṃ, karma kāmamavidya - yī yenimidiṃṭi gūḍiṃdi liṃgadēhamu - abhimāni taijasuḍu”. (brahmavidyāsudhāvarṇamu - 6)

  4. īśājñayā sūtrātmāvyaṣṭi sūkṣma śarīraṃ praviśyamuna adhiṣṭāya, taijasatvamagamat - taijasaḥ, prāti bhāsikaḥ, svapna kalpitaḥ, iti taijasasyanāmādi bhavaṃti”. (paiṃgalōpaniṣat)

(sūtrātma vyaṣṭi sūkṣma śarīramunu pravēśiṃci, manassunu adhiṣṭiṃci yuṃḍuṭavalana taijasuḍanipiṃcukonenu. taijasuḍu, prātibhāsikuḍu, svapnakalpituḍu ani taijasuni nāmamulu).

  1. vyaṣṭi liṃga dēhābhimānī.

(vyaṣṭi - vēru vērugā unnā liṃgadēhābhimāni - okkokkaṭī vēru vērugā nuṃḍu sūkṣmadēhamu nabhimāniṃcu ātma tatvamu - ātma rūpamu) (vyaṣṭi liṃgaśarīramaṃduṃḍu caitanyamu).

  1. “aṃtaḥ prajñastu taijasaḥ” (gauḍapādakārikā -). (sūkṣma prapaṃcamunu telisinavāḍu).

  2. “manasyaṃtastu taijasaḥ” (gauḍapādakārikā ).

(manasulōpala - aṃtaḥ karaṇamulōpalanuṃḍuvāḍu taijasuḍu).

(tējōrūpamagu naṃtaḥkaraṇamuna pratibiṃbiṃciyuṃḍuvāḍu).

  1. “taijasa śabdavācyāṃtaḥ karaṇōpahitaḥ prāṇēṃdriya adhyakṣaḥ, svapnābhimānī jīvaḥ taijasaḥ ityabhidhīyatē”

(tējasa śabdamucēta ceppabaḍu aṃtaḥkaraṇamutōnū, prāṇēṃdriyamulatōnu gūḍiyuṃḍu svapnābhimāniyaina jīvuḍu taijasuḍani ceppabaḍucunnāḍu)..

  1. “tējōmaya cittasthatayā cittasaṃbaṃdhitvēna taijasanāmā - ātmanaḥ dvitīyaḥ, pādaḥ, dvitīyarūpa mityardhaḥ”. (śrīkūranārāyaṇaḥ)

(tējōmayamagu cittamaṃduṃḍuṭacēta - cittamutō saṃbaṃdhamu kaligiyuṃḍuṭacēta taijaśuḍani pēru. ātma yokkanālugu pādamulalōnu reṃḍavadi. anagā ātmayokka rūpamulalō reṃḍavadi).

  1. “svapnāvasthānō aṃtaḥ prajñaḥ, saptāṃgaḥ, ēkō naviṃsatimukhaḥ, praviviktabhuk, taijasaḥ dvitīyaḥ pādaḥ”.

(svapnāvasthalōnuṃḍuvāḍu, aṃtaḥ prajñuḍu, ātmayokka reṃḍavapādamu taijasuḍu). (aṃtaḥ prajñuḍu anagā sūkṣmaprapaṃcamunu telisinavāḍu), (cūḍumu - 6).

  1. dvitīya mātrā ātmanaḥ, dvitīyāṃsaḥ (pādaḥ) taijasaḥ, ōṃkārasya dvitīyamātrā ukāraḥ “.

(“jāgraddaśāyāṃ vidyamāna dēhābhimānaṃ tyāja yitvā svapnamaṃḍalē jīvaṃ karṣati. itkutkarṣaṇāt hētōrvā, bāhyajñaptirūpa nidrāṃ vāsanāmaya viṣayānubhavaṃ ca prayacchati. itya bhayahētutvāt vā, ‘u’ ityucyatē taijasaḥ ityarthaḥ -”

(śrīkūranārāyaṇaḥ)

(ātmayokka reṃḍava pādamu, (mātra), (aṃsa), taijasuḍani ceppabaḍucunnāḍu. ōṃkāramulōni ‘a, u, ma’ anu mūḍakṣaramulalōnu reṃḍavamātra ‘u’ kāramē taijasuḍu).

(jāgraddaśayaṃdu kalugu dēhābhimānamunu vadali svapnāvastha jīvuni ākarṣiṃcunu - (tana aṃsalōnuṃḍi udbhaviṃcunaṭlu cēyunu - tānē jīvunigā mārunu), lēka, brahmajñānarūpamaina vāsanalatō kūḍiyunna viṣayānubhavamunu kalugacēyunu - anu ī reṃḍukāraṇamulavalla ōṃkāramulōni ‘u’ anitaijaśuḍu ceppabaḍucunnāḍu).

  1. “viśvāpēkṣayā taijasasya utkṛṣṭa tvāt vā, tatsamānayōḥ prājña taijasayōḥ dvitīyatvāt vā taijasasya ukārarūpatvaṃ”.

(śrīraṃgarāmānujaḥ)

(viśvuḍu - jīvuḍu - kanna utkṛṣṭuḍaguṭavalana, lēka, samānamaina prājñuḍu taijasuḍu anu iddarilōnu reṃḍava vāḍaguṭacēta ‘ōṃ’ yokka ‘a u ma’ anu mūḍu akṣaramulalōnu reṃḍavadiyaina ‘u’ kāramu taijasuḍu, ātma reṃḍavarūpamu, reṃḍavapādamu).

  1. “itarāniditānāṃ ati sūkṣmāṇāṃ svāpna padārdhānāṃ tējōvadbhāsakatvāt pradyumnasya svapnādhi ṣṭhātuḥ taijasa tyōktiḥ”

(śrīraṃgarāmānujaḥ)

(mikkili sūkṣmamainaṭuvaṃṭinnī, aṃducētanē itarulaku kanabaḍunaṭuvaṃṭinnī, svapnamulō kanabaḍu padārdhamulaku tējassuvale prakāśiṃcuṭacētanunnū, svapna adhiṣṭāta ayinaṭuvaṃṭinnī, vāsudēva, saṃkarṣaṇa, pradyumna, aniruddulu anu nāluguvyūhamulalōnu pradyumnuḍu (pradyumna vyūhamu) taijasuḍani ceppabaḍucunnāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.