← Back to త · Booklets 21–30 (digitized file 3)

తామసకర్తా tāmasakartā

Original — తెలుగు

“శ్లో|| అయుక్తః, ప్రాకౄతః, స్తబ్దః, శఠో, నైష్కృతికో అలసః |

విషాదీ దీర్ఘ సూత్రీచకర్తా తామస ఉచ్యతే || (శ్రీమద్భగవద్గీత 18 - 28)

“అయుక్తః శాస్త్రీ కర్మా యోగ్యః ; ప్రాకృతః అత్యంతా సంస్కృత బుద్ధిః, బాలసమః, స్తబ్దః అనారంభశీలః; శఠః అభిచారాదికర్మ రుచిః, మాయావీ శక్తి గూహనకారీ వంచన పరః పరవిభేదన పరః, అలసః ఆరబ్ధేష్వపి కర్మసు మంద ప్రవౄత్తిః, విషాదీ సర్వదా అవసన్న స్వభావః, దీర్ఘ సూత్రీ పరకృతం దోషం దీర్ఘకాలకృతమపి అనుచితం యః సూచయతి, యశ్చ యేవ భూతః సః కర్తా తామసః ఉచ్యతే -”

(ఏవిధమైన యోగమునభ్యసించకపోవుటవలన శాస్త్రములో చెప్పిన యే విధమైన కర్మ అయినను చేయుటకు యోగ్యతలేనివాడు - తగనివాడు. ఏకొంచెమైనను సంస్కృతిలేని బుద్ధి గలవాడు, అనగా బాలునితో సమానమైనవాడు, ఏపనినైనను చేయుటకు మొదలు పెట్టనివాడు, అభిచారాది కర్మలందు ఆసక్తికలవాడు, మోసగాడు, ఇతరులను వంచించువాడు, ఆరంభించిన పనులనైనను పూర్తి చేయనివాడు, ఆలస్యము చేయువాడు, ఎల్లపుడు ఆపద కలుగునేమోయని భయపడుచుండువాడు, ఇతరులు చేసిన దోషములు ఎంతకాలముక్రింద చేసినవైనను వాటిని మఱచిపోక వాటిని మరల మరల జ్ఞాపకము చేసి చెప్పుచుండువాడు - ఇట్టి కర్మలు చేయువాడు తామసకర్త.

Transliteration

“ślō|| ayuktaḥ, prākṝtaḥ, stabdaḥ, śaṭhō, naiṣkṛtikō alasaḥ |

viṣādī dīrgha sūtrīcakartā tāmasa ucyatē || (śrīmadbhagavadgīta 18 - 28)

“ayuktaḥ śāstrī karmā yōgyaḥ ; prākṛtaḥ atyaṃtā saṃskṛta buddhiḥ, bālasamaḥ, stabdaḥ anāraṃbhaśīlaḥ; śaṭhaḥ abhicārādikarma ruciḥ, māyāvī śakti gūhanakārī vaṃcana paraḥ paravibhēdana paraḥ, alasaḥ ārabdhēṣvapi karmasu maṃda pravṝttiḥ, viṣādī sarvadā avasanna svabhāvaḥ, dīrgha sūtrī parakṛtaṃ dōṣaṃ dīrghakālakṛtamapi anucitaṃ yaḥ sūcayati, yaśca yēva bhūtaḥ saḥ kartā tāmasaḥ ucyatē -”

(ēvidhamaina yōgamunabhyasiṃcakapōvuṭavalana śāstramulō ceppina yē vidhamaina karma ayinanu cēyuṭaku yōgyatalēnivāḍu - taganivāḍu. ēkoṃcemainanu saṃskṛtilēni buddhi galavāḍu, anagā bālunitō samānamainavāḍu, ēpaninainanu cēyuṭaku modalu peṭṭanivāḍu, abhicārādi karmalaṃdu āsaktikalavāḍu, mōsagāḍu, itarulanu vaṃciṃcuvāḍu, āraṃbhiṃcina panulanainanu pūrti cēyanivāḍu, ālasyamu cēyuvāḍu, ellapuḍu āpada kalugunēmōyani bhayapaḍucuṃḍuvāḍu, itarulu cēsina dōṣamulu eṃtakālamukriṃda cēsinavainanu vāṭini maṟacipōka vāṭini marala marala jñāpakamu cēsi ceppucuṃḍuvāḍu - iṭṭi karmalu cēyuvāḍu tāmasakarta.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.